ప్రేమ పెళ్లి.. పుట్టింటి నుంచి భర్తతో కలిసి వెళ్లి.. | Pregnant Lady Found Mysterious Death Husband Role Suspected Karnataka | Sakshi
Sakshi News home page

Mysterious Death: ప్రేమ పెళ్లి.. పుట్టింటి నుంచి భర్తతో కలిసి వెళ్లి..

Published Tue, Mar 22 2022 6:57 AM | Last Updated on Tue, Mar 22 2022 6:57 AM

Pregnant Lady Found Mysterious Death Husband Role Suspected Karnataka - Sakshi

అశ్విని (ఫైల్‌)

మైసూరు(బెంగళూరు): ఓ వివాహిత మృతదేహం చెరువులో అనుమానాస్పద స్థితిలో బయటపడిన ఘటన మైసూరు నగరంలోని కలకలం రేగింది. వివరాలు...నగరంలోని విజయనగర్‌కు చెందిన అశ్వినీ (23), మైదనహళ్లికి చెందిన ప్రమోద్‌ ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం అశ్వినీ ఏడు నెలల గర్భిణి. కొన్ని రోజులుగా దంపతుల మధ్య  గొడవలు జరుగుతున్నాయి. దీంతో అశ్వినీ పుట్టింటికి వచ్చింది. ఆదివారం ప్రమోద్‌ అత్తింటికి వచ్చి అశ్వినీని తీసుకుని బైక్‌పై వెళ్లాడు. సాయంత్రమైనా వారు రాకపోవడంతో అశ్వినీ తండ్రి కుమార్తెకు, అల్లుడికి ఫోన్‌ చేశాడు. వారు స్పందించలేదు. ఇదిలా ఉంటే సోమవారం ఉదయం బిళికెరె చెరువులో అశ్వినీ మృతదేహం బయటపడింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.  

మరో ఘటనలో..

దోపిడీ దొంగల అరెస్ట్‌   
శివాజీనగర: ఆటోలో తిరుగుతూ దోపీడీలకు పాల్పడుతున్న ఇద్దరిని సంపిగెహళ్లి పోలీసులు అరెస్ట్‌ చేసి రూ.2.15 లక్షలు విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. దోపిడీ దొంగలను శివాజీనగరకు చెందిన మహమ్మద్‌ ఆర్బాజ్, థణిసంద్రకు చెందిన సయ్యద్‌ ఆర్బాజ్‌గా గుర్తించారు. ఈనెల 5న రాత్రి ఆటోలో అమరజ్యోతి లేఔట్‌కు ఆటోల వచ్చిన వీరు ఓ వ్యక్తి మెడలో గొలుసు లాక్కొని ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేయగా వీరిపై వివిధ పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు తేలింది.   
వాహన దొంగలు అరెస్ట్‌: ఇళ్ల ముందు, పార్కింగ్‌ స్థలాల్లో ఆపి ఉంచిన బైక్‌లను ఎత్తుకెళ్తున్న షేక్‌ ముదాసీర్‌ అహమ్మద్, సయ్యద్‌ నాజీమ్‌లను సంపిగెహళ్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి మూడు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement