విషమిచ్చే చంపేశారా? | How Did Bruce Lee Die: Accident Or Murder? | Sakshi
Sakshi News home page

విషమిచ్చే చంపేశారా?

Published Fri, Jan 20 2017 10:33 PM | Last Updated on Wed, Apr 3 2019 9:05 PM

విషమిచ్చే చంపేశారా? - Sakshi

విషమిచ్చే చంపేశారా?

ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్‌ మేన్‌. అతని పంచ్‌ పవర్‌కు కొండలు కూడా పిండి పిండి అవుతాయి. అతని ముందుకు రావాలంటే మరణానికి కూడా చచ్చేంత భయం. అందుకేనేమో చావు అతన్ని దొంగదెబ్బ తీసింది. ఆయన ఎవరో కాదు మార్షల్‌ ఆర్ట్స్‌ మాస్టర్‌ ‘బ్రూస్‌ లీ’. తక్కువ సమయంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించిన వ్యక్తి బ్రూస్‌లీ. అతని గురించి తెలుసుకుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అలాంటి గ్రేట్‌ పర్సన్‌ అర్ధాంతరంగా కన్ను మూశాడు. అతని మరణం వెనుక రహస్యం ఏమిటో ఈరోజు ‘మిస్టరీ’లో తెలుసుకుందాం.   

అది 1970 జూలై 20...‘గేమ్‌ ఆఫ్‌ ది డెత్‌’ సినిమాపై చర్చలు జరపడానికి  డైరెక్టర్‌ రేమండ్‌ చో.. బ్రూస్‌ లీ ఇంటికి వచ్చాడు. సాయంత్రం దాకా చర్చలు జరిగాయి అక్కడి నుండి ఇద్దరూ కలిసి హీరోయిన్‌ ‘బెట్టి టింగ్‌’ ఇంటికి వెళ్ళారు. కొద్ది సేపు స్క్రిప్టు గురించి మాట్లాడుకున్నారు. ఆ తరువాత బ్రూస్‌ లీని బెట్టి ఇంట్లో వదిలేసి రేమండ్‌ చో.. జేమ్స్‌ బాండ్‌ స్టార్‌ జార్జి లాటిన్‌ బీని కలవడానికి వెళ్ళాడు..బ్రూస్‌ లీ ని తరువాత రమ్మనాడు. అప్పుడు సమయం రాత్రి 7:30 తలనొప్పితో బ్రూస్‌ విలవిలలాడుతున్నాడు.

బెట్టి టాబ్లెట్‌ ఇచ్చింది..  
తలనొప్పి తగ్గడానికి బెట్టి టింగ్‌ ఈక్వజేసిక్‌ టాబ్లెట్‌ని ఇచ్చింది. అది వేసుకుని బ్రూస్‌ లీ పడుకున్నాడు. కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్నాడు. సమయం రాత్రి 9 గంటలు బ్రూస్‌ లీ వస్తాడని ఎదురు చూస్తున్న రేమండ్‌ చో.. బెట్టీకి ఫోన్‌ చేసాడు. బ్రూస్‌ ఇంకా ఎందుకు రాలేదు అని అడిగాడు. దీంతో బెట్టి బ్రూస్‌ లీని నిద్రలేపడానికి ప్రయత్నించింది. కానీ బ్రూస్‌ లేవలేదు. బెట్టి రేమండ్‌కి పిరిస్థితిని వివరించింది. అరగంట తరువాత అక్కడికి వచ్చిన రేమండ్‌ బ్రూస్‌ లీని నిద్రలేపడానికి ప్రయత్నించాడు. కానీ అతడు కళ్ళు తెరవలేదు. కాసేపటికే బెట్టి డాక్టర్‌ వచ్చాడు. బ్రూస్‌ కండీషన్‌ చాలా సీరియస్‌గా ఉందని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పాడు. అప్పటికే సమయం రాత్రి 10 దాటింది. కాని రాత్రి సమయంలో నీడ అయినా విడిచిపెట్టి పోతుంది కాని మరణం మాత్రం బ్రూస్‌లీని వెంటాడుతూనే ఉంది.

                                        హీరోయిన్‌ ‘బెట్టి టింగ్‌’                                                  
లెజెండ్‌ను మృత్యువు మింగేసింది..

అపస్మారక స్థితిలో ఉన్న బ్రూస్‌లీని వార్దిదరూ ఆసుపత్రికి తీసుకెళ్లారు. క్వీన్‌ ఎలిజిబెత్‌ ఆసుపత్రిలో అప్పటికే సిద్దంగా ఉన్న డాక్టర్లు బ్రూస్‌కి చికిత్స మొదలు పెట్టారు. బతికించడానికి ఎంతగానో ప్రయత్నించారు. కానీ లాభం లేకపోయింది. రాత్రి 11 గంటలు సమయంలో కోట్లాది అభిమానులు తట్టుకోలేని విషాద వార్తను చెప్పడానికి రేమండ్‌ చో ప్రిపేర్‌ అయ్యాడు. ‘బ్రూస్‌ లీ ఈజ్‌ డెడ్‌’.. అవును హ్యూమన్‌ డ్రాగన్‌ బ్రూస్‌ లీ చనిపోయాడు. లెజండ్‌ని మృత్యువు మింగేసింది.

టాబ్లెట్టే కారణమా?
తలనొప్పిగా ఉన్నప్పుడు హీరోయిన్‌ బెట్టి ఇచ్చిన టాబ్లెట్‌తో బ్రూస్‌లీ చనిపోయాడా? దీనికి సమాధానం మాత్రం ‘కాదు’..అని అనలేం. ఎందుకంటే బ్రూస్‌ వేసుకున్న ఈక్వజేసిక్‌ టాబ్లెట్‌ అతణ్ని చంపేసిందని ప్రాథమికంగా వైద్యులు నిర్ధారించారు. టాబ్లెట్‌ రియాక్షన్‌ అవడంతో మెదడులోకి నీరు చేరింది. సెరెబ్రల్‌ ఎడెమా బ్రూస్‌ లీని బలి తీసుకుంది. కాని ఈ కారణాన్ని మాత్రం చివరి నివేదికలో వైద్యులు వెల్లడించలేదు. దీంతో అభిమానులకు బ్రూస్‌లీ మరణంపై అనుమానాలు మొదలయ్యాయి..

                                                                 బ్రూస్‌లీ ఫ్యామిలీ
ఎవరీ బ్రూస్‌లీ..?
నవంబర్‌ 27, 1940 సాన్‌ ఫ్రాన్సిస్కో అమెరికాలో లీయోచూన్, గ్రేసీలకు బ్రూస్‌ లీ జన్మించాడు. లీయోచూన్‌ చైనీయుడు, హాంకాంగ్‌ లో ఉంటాడు. తల్లి చైనీస్‌ సంతతికి చెందిన జర్మన్‌. వీరిద్దరూ కళాకారులే. ఓ ప్రదర్శన కోసం అమెరికాలో ఉన్నప్పుడు వాళ్లకు బ్రూస్‌ లీ పుట్టాడు. అప్పట్లో హాంకాంగ్‌ బ్రిటీష్‌ పాలనలో ఉండేది. అక్కడ చాలా మంది వలస వచ్చి ఉండేవారు. అక్కడి వారు గ్రూపులు గా చేరి వలస వచ్చిన వారిపై దాడికి దిగేవారు. అయితే ఇటువంటి పరిస్థితే బ్రూస్‌లీ కుటుంబానికి ఎదురైంది. బ్రూస్‌ 13 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు అతనిపై దాడి చేశారు. బ్రూస్‌ తల్లి జర్మన్‌ కావడమే ఇందుకు కారణం. దీంతో ఆత్మరక్షణ కోసం తండ్రి దగ్గర నుంచి ‘థామ్‌ చీ చువాన్‌ ’ అనే యుద్ధ విద్యను నేర్చుకున్నాడు. కొన్ని రోజుల తరువాత సైకో ఇప్‌ మెన్‌ దగ్గర స్టూడెంట్‌గా చేరాడు. కుంఫులో భాగమైన ‘వింగ్‌ చున్‌’ లో ఇప్‌మెన్‌ను ఎదురించే వారే లేరు.

కానీ ఓ జర్మన్‌ జాతీయురాలికి పుట్టిన బ్రూస్‌ లీ కి ‘వింగ్‌ చున్‌’  నేర్చుకోడానికి వీలు లేదంటూ చైనీయులు అభ్యంతరం చెప్పారు. ఇప్‌మెన్‌పై ఒత్తిడి తేవడంతో శిక్షణ ఆగిపోయింది. కాని ఎవ్వరికీ తెలీకుండా బ్రూస్‌కి ఇప్‌ మెన్‌ శిక్షణ ఇచ్చాడు. ఆ తరువాత బాక్సింగ్, డాన్సింగ్, కత్తి సాముల్లో నైపుణ్యం సాధించాడు. ఇవన్నీ 18 సంవత్సరాల వయస్సులోనే నేర్చుకొని కదిలే కత్తిలా మారాడు. 1964లో లిండా ఎమెరీని పెళ్లి చేసుకున్నాడు. అనంతరం 1965లో మార్షల్‌ ఆర్ట్స్‌ అకాడమీని ప్రారంభించి.. జీత్‌ కున్‌ డోను రూపొందించాడు. పసివాడిగా ఉన్నప్పుడే గోల్డెన్‌ గర్ల్‌ సినిమాలో కనిపించాడు. 18 సంవత్సరాల నాటికే 12 సినిమాలు పూర్తి చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాడు.

నిర్మాతలే చంపేశారా?
గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందిన బ్రూస్‌లీ మరణానికి కారణం ఏమిటో ఎవ్వరికీ తెలియలేదు. బెట్టి ఇంట్లోనే మరణించాడు కాబట్టి బెట్టి విషం ఇచ్చి చంపేసిందని కొంతమంది అనుమానం. బ్రూస్‌ మరణం వెనుక హాంకాంగ్‌ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్లు మాఫియాతో చేతులు కలిపి బ్రూస్‌ లీని అంతం చేసారన్నది చాలా మంది నమ్మకం. దీనికి బెట్టి సహాయం చేసిందని కూడా అంటారు. అతని మరణానికి ఈక్వజేసిక్‌ రియాక్షన్‌ కారణం కాదని బ్రూస్‌ పర్సనల్‌ డాక్టర్‌ తెలిపారు. బ్రూస్‌ లీ పై షావోలీన్‌ మాస్టర్‌కు కోపం అందుకే వారే చంపేశారని చాలా మంది నమ్ముతున్నారు. కానీ నేటికి బ్రూస్‌ మరణం మిస్టరీగానే ఉండిపోయింది. – సాక్షి, స్కూల్‌ ఎడిషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement