bruce Lee
-
బ్రూస్ లీ మరణానికి నేటితో 50 ఏళ్లు.. ఆయన గురించి ఈ విషయాలు తెలుసా..?
మార్షల్ ఆర్ట్స్.. ఈ పేరు వినగానే ఎవరైనా టక్కున చెప్పే పేరు బ్రూస్ లీ. తరాలు మారుతున్న మార్షల్ ఆర్ట్స్‌పై ఆసక్తికనబరిచే యువతకు ఆయనే ఆదర్శం. తన మార్షల్ ఆర్ట్స్‌తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న అమెరికన్ లెజెండరీ నటుడు బ్రూస్ లీ అతి చిన్న వయసులోనే లోకాన్ని వీడారు. 1973 జులైలో తన 32వ ఏట సెరెబ్రల్ ఎడిమా (మెదడు వాపు) అనే వ్యాధితో మరణించారు. అయితే ఆయన మృతికి సంబంధించి సుమారు యాభై ఏళ్ల తర్వాత విస్తుగొలిపే విషయాలు బయటికొచ్చాయి. అతిగా నీళ్లు తాగడం వల్లే బ్రూస్లీ మరణించారని స్పెయిన్ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం ద్వారా గతేడాది వెల్లడించారు. నేటితో ఆయన చనిపోయి 50 ఏళ్లు దాటినా ఆయన పేరుకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. బ్రూస్ లీ కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ ఫ్రాన్సిస్కో అనే నగరంలో 1940 నవంబరు 27 న పుట్టి, హాంకాంగ్‌లో పెరిగాడు. దీంతో ఆయనకు హాంగ్‌కాంగ్, అమెరికా దేశాల నుంచి రెండు పౌరసత్వాలు దక్కాయి. కానీ బాల్యంలో కడు పేదరికాన్ని ఎదుర్కొన్నాడు. బ్రూస్ లీ సినిమాల్లోకి ఎలా వచ్చాడంటే హాంగ్‌కాంగ్‌లో అప్పటికే తను కుంగ్ పూలో మంచి నేర్పరి దీంతో కొందరికి శిక్షణ ఇచ్చేవాడు చైనాయేతరులకు కుంగ్ పూ నేర్పిస్తున్నాడని కొంతమంది అతడిపై దాడి చేసేందకు ప్రయత్నించారు. ఆ సమయంలో వారికి ఇలా ఛాలెంజ్ విసిరాడు 'మీరందరూ రండి నేనొక్కడినే బరిలోకి దిగుతా నేను ఓడితే ఇక కుంగ్‌పూ జోలికి వెళ్లను అని' అన్నాడు . సెకన్ల వ్యవధిలో వారందరినీ మట్టికరిపించాడు. ఆ తరువాత సొంతంగా ఓ మార్షల్ ఆర్ట్ కనిపెట్టి మరింత పాపులర్ అయ్యాడు. అక్కడే ఫిలాసఫీ టీచర్‌గా పనిచేస్తున్న లిండా అనే విద్యార్థిని పెళ్లిచేసుకున్నాడు. వారికో కుమారుడు పుట్టాడు. అతడి పేరు బ్రాండన్ లీ. బ్రూస్ లీ వద్ద ఎంత టాలెంట్ ఉన్నా కడు పేదరికం వెంటాడుతూనే ఉంది కుటుంబాన్ని పోషించటం కోసం చిన్నచిన్న టీవీ సీరియళ్లలో కూడా నటించాడు. పలు చిన్న చిన్న మూవీస్‌లో రోల్స్‌లలో కనిపించాడు బ్రూస్లీ. ఆ తరువాత హాంకాంగ్‌లోని ఓ ప్రొడ్యూసర్ సాయంతో ఓ సినిమా తీశాడు. అక్కడే తన జీవితం మలుపు తిరిగింది. ఆ సినిమానే 'ద బిగ్ బాస్'. అప్పట్లో అది హాంగ్‌కాంగ్ బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొట్టింది. తర్వాత బ్రూస్ లీ నుంచి వచ్చిన 'ద గేమ్ ఆఫ్ డెత్' సినిమాతో హాంకాంగ్ చిత్ర పరిశ్రమ చరిత్రే మారిపోయింది. ఆ తరువాత ఎంటర్ ది డ్రాగన్ సినిమా షూటింగ్ పూర్తి అయింది. అందులో ఆయన చాలా వరకు రియల్‌గానే స్టంట్స్ చేశాడు. సినిమా రిలీజ్‌కు కూడా దగ్గర్లో ఉండగా ఒకరోజు తలనొప్పి వచ్చిందని బ్రూస్లీపెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ తీసుకున్నాడు. దీంతో ఆయన కోమాలోకి వెళ్లి 1973 జులై 20న మరణించాడు. బ్రూస్లీ మరణం వెనుక ఆయన అతిగా నీళ్లు తాగడం వల్లే బ్రూస్లీ మరణించారని స్పెయిన్ శాస్త్రవేత్తలు ఓ అధ్యయనం నిర్వహించి గతేడాది ప్రకటించారు. హైపోనాట్రేమియా.. అతిగా నీరు తాగడం వల్ల శరీరంలో అవసరానికి మించిన సోడియం స్థాయిలు కరిగిపోతాయి. ఈ స్థితి వల్లే బ్రూస్లీ సెరెబ్రల్ ఎడిమా బారిన పడినట్లు స్పెయిన్ శాస్త్రవేత్తలు అధ్యయనం ద్వారా వెల్లడించారు. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల సోడియం లెవల్స్ తగ్గిపోయి.. శరీరంలోని కణాలు, ముఖ్యంగా మెదడులో కణాలు వాపు చెందుతాయి. అదే బ్రూస్లీ మరణానికి దారితీసి ఉంటుందని స్పెయిన్ సైంటిస్టులు ప్రకటించారు. ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవడం, గంజాయి లాంటి మాదకద్రవ్యాల వల్ల అతిగా దాహం వేయడం, ఆల్కహాల్ అలవాట్లతో అధిక నీటిని బయటకు పంపించే సామర్థ్యాన్ని కిడ్నీలు కోల్పోవడం వంటివి ఈ పరిస్థితికి దారితీస్తాయని స్పెయిన్ సైంటిస్టుల అధ్యయనం వెల్లడించింది. బ్రూస్ లీ కూతురు బ్రూస్ లీకి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. ఆయన కుమారుడు బ్రాండన్ బ్రూస్ లీ కూడా 1993లో మరణించాడు. కూతురు షానన్ లీ మాత్రమే బ్రూస్ లీ కుటుంబం నుంచి బతికి ఉన్నారు. బ్రూస్ లీ మరణం తర్వాత అతని భార్య లిండా మరోక వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆమె ఆమెరికాలో ప్రముఖ వ్యాపారవేత్త,సినీ నిర్మాతగా కొనసాగుతున్నారు. త్వరలో తన తండ్రి గురించి బయోపిక్ తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కామెంట్ బ్రూస్ లీ గురించి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి ఓసారి ఇలా చెప్పాడు. 'చైనీస్ జోడియాక్ ప్రకారం.. పుట్టిన గడియా, సంవత్సరం రెండూ డ్రాగన్ ఉన్న బిడ్డ మహర్జాతకుడు అవుతాడు. ఈ విషయాన్ని చైనీయులు బాగా నమ్ముతారు. సరిగ్గా అదేరీతిలో డ్రాగన్ లాంటి కుర్రాడు అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో పుట్టాడు. వాడే బ్రూస్లీ. బ్రూస్ అనే పేరు అక్కడున్న నర్స్ పెట్టింది. అతడి తల్లిదండ్రులు ఇద్దరూ గాయకులు. వారి కుటుంబం కొంతకాలానికి హాంకాంగ్‌కు మకాం మార్చింది. పదమూడేళ్ల వయసుకే చైల్డ్ ఆర్టిస్టుగా ఇరవై సినిమాల్లో చేశాడు బ్రూస్లీ. యీప్ మ్యాన్ దగ్గర కుంగ్‌పూ నేర్చుకున్నాడు. ఇంటర్ స్కూల్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ కొట్టాడు. అయితే చాలామందికి తెలియని విషయం ఒకటుంది అదేంటంటే అతడో అద్భుతమైన డ్యాన్సర్. 18 ఏళ్ల వయసులో హాంకాంగ్ చా చా ఛాంపియన్ షిప్ గెలిచాడు. సినీరంగం విషయంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం అతడికి లభించలేదు. దాంతో 100 డాలర్లు దొరకగానే అమెరికా షిప్ ఎక్కేశాడు. సియాటెల్‌లో కుంగ్‌పూ నేర్పిస్తూ వచ్చిన డబ్బుతో ఫిలాసఫీ చదువుకున్నాడు. మీకు తెలుసా ప్రపంచంలో మిక్స్ మార్షల్ ఆర్ట్స్ ప్రారంభించింది లీనే. అతడి కంటే గొప్ప ఫైటర్లు చాలామందే ఉండొచ్చు. కానీ ప్రతిఒక్కరికీ అతడే స్ఫూర్తి. కొట్టే ప్రతి పంచ్ వెనుక ఓ థియరీ చెబుతాడు. అతడిలోని ఫిలాసఫీకి అందరూ ఫిదా అవుతారు. అతిచిన్న వయసులో 32 ఏళ్లకే బ్రూస్లీ మరణించాడు. అతడి జీవితం మొత్తంలో చేసిన పని చాలా తక్కువ. అయినా ప్రపంచంలోని ప్రతీ చిన్న పల్లెలోనూ బ్రూస్లీ పేరు తెలుసు. అదే అతడు చూపించిన ప్రభావం.' అని పూరి చెప్పాడు. -
Bruce Lee Workout Plan: ఇదే బ్రూస్ లీ జిమ్ వర్క్అవుట్ ప్లాన్..
బ్రూస్ లీ.. ఈ పేరు విననివారు ఎవరూ ఉండరు. మార్షల్ ఆర్ట్స్ అనగానే ఎవరికైనా టక్కున బ్రూస్ లీ పేరు గుర్తుకు వస్తుంది. మార్షల్ ఆర్ట్స్‌లో ఇప్పటి వరకూ బ్రూస్లీ పేరును పడగొట్టే మొనగాడెవడూ లేడంటే అతిశయోక్తి కాదు. ఇంటర్నెట్లో బ్రూస్ లీ గురించి వెదుకులాట.. తన 32 ఏళ్ల జీవితంలో బ్రూస్ లీ అద్భుత ప్రతిభతలో ప్రపంచవ్యాప్తంగా తన పేరు మారుమోగిపోయేలా చేసుకున్నాడు. ఈరోజు ప్రపంచమంతా బ్రూస్ లీని ఎంతో గౌరవ మర్యాదలతో చూస్తుంది. బ్రూస్ లీ 1940లో ఫ్రాన్సిస్కోలో జన్మించారు. నేటి కాలంలోనూ ఇంటర్నెట్లో బ్రూస్ లీకి సంబంధించిన అనేక విషయాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే లెక్కకు మించిన నెటిజన్లు తరచూ బ్రూస్ లీ గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తుంటారు. ఇటీవల బ్రూస్ లీకి సంబంధించిన 1965 నాటి వర్క్అవుట్ ప్లాన్ వైరల్‌గా మారింది. Bruce Lee early Training plan in 1965. pic.twitter.com/H1uLj49NFK — World Of History (@UmarBzv) May 17, 2023 బ్రూస్ లీ వర్క్అవుట్ ఇలా.. బ్రూస్ లీ వర్క్అవుట్ ప్లాన్ కెవుంగ్ జిమ్నాషియంతో ముడిపడివుంది. దీనిలో అతను ఏ వర్క్అవుట్ ఎన్నిసార్లు, ఎంతసేపు చేసేవాడనే వివరాలు ఉన్నాయి. ఈ వర్క్అవుట్ ప్లాన్ చూసినవారు ఈ రొటీన్‌ను ఫాలో చేయడం అంత సులభం కాదని వారు చెబుతున్నారు. ట్వీట్ చేసిన ఈ పోస్టులో బ్రూస్ లీకి సంబంధించిన ఒక బ్లాక్ అండ్ వైట్ ఫొటో కనిపిస్తోంది. అతని ట్రైనింగ్ ప్రోగ్రాం వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలలో కనిపిస్తోంది. ఈ ప్లాన్ చూసిన వారంతా.. ట్విట్టర్‌పై ఈ పోస్టును ‘వరల్డ్ ఆఫ్ హిస్టరీ’(@UmarBzv) పేరు గల పేజీలో షేర్ చేశారు. దానికి 1965లో బ్రూస్ లీ ఎర్లీ ట్రైనింగ్ ప్లాన్ అనే కామెంట్ రాశారు. ఈ పోస్టుకు 8 మిలియన్లకుపైగా వ్యూస్ దక్కాయి. 70 వేలకుపైగా లైక్స్ పడ్డాయి. ఈ వర్క్అవుట్ ప్లాన్ చూసినవారంతా తెగ ఆశ్చర్యపోతూ, దీనిని ఫాలో చేయడం అసాధ్యమంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్.. బ్రూస్ లీ వర్క్అవుట్ ప్లాన్‌ను పరిశీలించి ఈ ప్లాన్ పూర్తి చేసేందుకు 2 గంటల సమయం పడుతుందని లెక్కవేశారు. ఇది కూడా చదవండి: ఈ 8 రైల్వే స్టేషన్లు బ్రిటీష్ కాలం నాటివి.. ఇప్పుడెలా ఉన్నాయో తెలిస్తే.. -
ఆయనే నా ఫస్ట్ క్రష్ : శ్రుతిహాసన్
సంచలనానికి మరో పేరు ఉంటే అది నటి శ్రుతిహాసనే అవుతుంది. విశ్వ నటుడు కమలహాసన్ వారసురాలు అయిన ఈమె తొలుత సంగీత దర్శకురాలిగా తన తండ్రి నటించిన ఉన్నైప్పోల్ ఒరువన్ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. ఆ తరువాత నటిగా తెరంగేట్రం చేశారు. హిందీలో లక్ చిత్రం, తెలుగులో అనగనగా ఒక ధీరుడు చిత్రాల్లో నటించిన తర్వాతే కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ విధంగా శ్రుతిహాసన్‌కు తమిళంలో కంటే తెలుగులోనే మంచి విజయాలు వరించాయి. ఇటీవల తెలుగులో ఈ బ్యూటీ నటించిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలు సంచలన విజయాన్ని సాధించాయి. ప్రస్తుతం ప్రభాస్ సరసన సోలార్ చిత్రంలో నటిస్తున్నారు. ఇది పాన్ ఇండియా చిత్రంగా త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. మరో కొత్త చిత్రానికి సైన్ చేయకపోయినా శ్రుతిహాసన్ నిత్యం వార్తల్లో ఉంటారు. తన గ్లామరస్ ఫోటోలను సామాజిక మాధ్యమాలలో విడుదల చేస్తూ నెటిజన్లకు బాగానే పని చెబుతుంటారు. అదేవిధంగా నిజాలను నిర్భయంగా చెప్పే నటి ఎవరైనా ఉన్నారంటే అది శ్రుతిహాసనే. తన ప్రియుడితో కలిసిన ఫొటోలను ధైర్యంగా సామాజిక మాధ్యమాలకు తెలియజేసే నటి ఈ బ్యూటీ. ఇప్పటికే రెండు మూడు సార్లు ప్రేమలో విఫలమైన శ్రుతి మళ్లీ ప్రేమలో పడినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హోరెత్తుతోంది. కాగా ఇటీవల ఈమె ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ తన తొలి క్రష్ నటుడు ఎవరన్న ప్రశ్నకు ఏ మాత్రం తడుముకోకుండా హాలీవుడ్ నటుడు బ్రూస్లీ అని చెప్పారు. -
Bruce Lee: నమ్మిందే బ్రూస్లీ ప్రాణం తీసిందా?
మార్షల్ ఆర్ట్స్.. ఈ పేరు వినగానే కళ్ల ముందర మెదిలే రూపం బ్రూస్ లీ. తరాలు మారుతున్న మార్షల్ ఆర్ట్స్‌పై ఆసక్తికనబరిచే యువతకు ఆయనే ఆదర్శం. ఒకవైపు డిష్యుం.. డిష్యుంలతో పాటు నటుడిగానూ అశేష అభిమానులను సంపాదించుకున్నారాయన. అయితే.. కేవలం 32 ఏళ్ల వయసులోనే చనిపోయి.. అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టేసి వెళ్లిపోయారు. ఆ టైంలో ఆయన మరణంపై రకరకాల ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి. కానీ, మెదడు వాపు కారణంగానే ఆయన చనిపోయారని వైద్యులు ఆ టైంలో ప్రకటించారు. అయితే.. ఇప్పుడు సుమారు యాభై ఏళ్ల తర్వాత ఆయన మరణానికి కారణం చర్చలోకి వచ్చింది. మార్షల్ ఆర్టిస్ట్ బ్రూస్లీ మరణంపై తాజాగా మరో ప్రకటనపై చేశారు పరిశోధకులు. అదీ ఓ అధ్యయనం నిర్వహించి మరీ!. 1973 జులైలో సెరెబ్రల్ ఎడిమా అనే వ్యాధితో బ్రూస్లీ మరణించినట్లు ఆయన్ని పరిశీలించిన వైద్యులు ప్రకటించారు. సెరెబ్రల్ ఎడిమా అంటే మెదడు వాపు. పెయిన్‌కిల్లర్స్ అతిగా వినియోగించడం వల్ల మెదడు కణాలు వాపు ఎక్కినట్లు వైద్యులు భావించారు. కానీ.. బ్రూస్లీ మరణం వెనుక.. మంచి నీళ్లు ఉన్నాయన్నది ఇప్పుడు స్పెయిన్ సైంటిస్టులు చెప్తున్న మాట. అవును.. అతిగా నీళ్లు తాగడం వల్లే బ్రూస్లీ మరణించారని స్పెయిన్ శాస్త్రవేత్తలు ఓ అధ్యయనం నిర్వహించి మరీ ప్రకటించారు. హైపోనాట్రేమియా.. అతిగా నీరు తాగడం వల్ల శరీరంలో అవసరానికి మించిన సోడియం స్థాయిలు కరిగిపోతాయి. ఈ స్థితి వల్లే బ్రూస్లీ సెరెబ్రల్ ఎడిమా బారిన పడినట్లు స్పెయిన్ శాస్త్రవేత్తలు తాజా అధ్యయనం ద్వారా వెల్లడించారు. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల సోడియం లెవల్స్ తగ్గిపోయి.. శరీరంలోని కణాలు, ముఖ్యంగా మెదడులో కణాలు వాపు చెందుతాయి. అదే బ్రూస్లీ మరణానికి దారితీసి ఉంటుందని ఇప్పుడు స్పెయిన్ సైంటిస్టులు చెప్తున్నారు. ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవడం, గంజాయి లాంటి మాదకద్రవ్యాల వల్ల అతిగా దాహం వేయడం, ఆల్కహాల్ అలవాట్లతో అధిక నీటిని బయటకు పంపించే సామర్థ్యాన్ని కిడ్నీలు కోల్పోవడం వంటివి ఈ పరిస్థితికి దారితీస్తాయని స్పెయిన్ సైంటిస్టుల అధ్యయనం వెల్లడించింది. నీరు ఎక్కువగా తాగడం ముప్పే! బీ వాటర్ మై ఫ్రెండ్.. బ్రూస్ లీ తరపున విపరీతంగా వైరల్ అయ్యే కోట్ ఇది. పలు పుస్తకాల్లోనూ ఈ ప్రస్తావన ఉంటుంది. రోజూవారీ జీవితంలో ఆయన మంచి నీటికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు వాటిని చదివితే తెలుస్తుంది. అంతేకాదు.. ఓ మనిషి మంచి నీటిలా బతకాలంటూ ఆయన పేరు మీద ఓ ఫిలాసఫీ కూడా ప్రచారంలో ఉంది. కానీ, అంతలా నమ్మిన మంచి నీరే ఆయన ప్రాణం తీయడం ఇక్కడ విశేషం. అయితే అందుకు ‘అతి’ ప్రధాన కారణం అయ్యింది. నీరు అధికంగా తీసుకోవడం వల్ల మరణం సంభవిస్తుందా? అవును.. అలాంటి కేసులు మెడికల్ హిస్టరీలో బోలెడు నమోదు అయ్యాయి. చాలా ఎక్కువ నీటి వినియోగం ఇంట్రాక్రానియల్ ఒత్తిడిని (ICP)కి కారణం అవుతుంది. ఇది రకరకాల లక్షణాలకు, ఒక్కోసారి పరిస్థితులు తిరగబడి ప్రాణాల మీదకు కూడా తీసుకొస్తుంది. అసలు ఎంత తాగాలి.. ఒక వ్యక్తి తన మూత్రపిండాలు(కిడ్నీల) మూత్రం ద్వారా తొలగించగల దానికంటే ఎక్కువ నీటిని తీసుకుంటే 'ఓవర్‌హైడ్రేషన్' 'వాటర్ ఇంటాక్సికేషన్' సంభవిస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. హైపోనాట్రేమియా, సెరిబ్రల్ ఎడెమా సందర్భాల్లో ఒక్కోసారి అధికంగా నీరు తీసుకున్న గంటలో కూడా మరణం సంభవించవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరి ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎంత నీరు తీసుకోవాలి?.. కొందరు రెండు, కొందరు మూడు, కొందరు ఐదు లీటర్లు అంటూ చెప్తుంటారు. కానీ, శాస్త్రీయంగా దీనికంటూ ఓ పరిమితి లేదు. కానీ, గంటలో లీటర్ లోపు నీటిని మాత్రమే తీసుకోవాలని కొన్నిసార్లు సూచిస్తుంటారు వైద్య నిపుణులు. తద్వారా కిడ్నీలపై ఒత్తిడి ఉండదని చెప్తున్నారు. అంతేకాదు.. అతిగా నీటిని తీసుకోవడం మూలంగా మానసిక అనారోగ్యం కూడా సంభవించవచ్చని చెప్తున్నారు. -
బ్రూస్ లీ ఆరాధించిన భారత్ ఫహిల్వాన్ ఎవరో తెలుసా?
మార్షల్ ఆర్ట్స్ దిగ్గజం.. దివంగత హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రూస్ లీ.. ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు.చరిత్ర పుటల్లోకి వెళ్లి మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ గురించి మాట్లాడుకుంటే మొదటిగా బ్రూస్ లీ పేరు గుర్తుకువస్తుంది. కెమెరా కూడా అతని వేగాన్ని అందుకోలేదు. చిన్న వయసులోనే మార్షల్ ఆర్ట్స్‌పై పట్టు సాధించి గొప్ప పేరు సంపాదించాడు. 32 ఏళ్ల వయసులోనే కన్నుమూసిన బ్రూస్ లీ 'ఎంటర్ ది డ్రాగన్' సినిమాతో విశ్వవ్యాప్తంగా ఎనలేని క్రేజ్ సాధించాడు. మరి బ్రూస్ లీ ఆరాధించే వ్యక్తి ఎవరో తెలుసా.. భారత్‌కు చెందిన మహ్మద్ భక్ష్ భట్.. అలియాస్ గ్రేట్ గామా ఫహిల్వాన్. గామా ఫహిల్వాన్ ఫిజిక్కు ముచ్చటపడిన బ్రూస్ లీ అతనిలా కండలు పెంచాలని అనుకున్నాడు. అందుకోసం మహ్మద్ ఎక్సర్సైజ్ ఫుటేజీలు, రెజ్లింగ్ టెక్నిక్స్‌ను కేవలం ఫోటోల ద్వారా నేర్చుకున్నాడు. గామా ఫహిల్వాన్ పేరు మీద వచ్చిన ఆర్టికల్స్‌ను తప్పకుండా చదివేవాడు. ఒక రకంగా తాను మార్షల్ ఆర్ట్స్‌లో నైపుణ్యం సాధించడానికి గామా ఫహిల్వాన్ దారి చూపాడని బ్రూస్ లీ పలు సందర్బాల్లో చెప్పుకొచ్చాడు. కాగా గామా ఫహిల్వాన్ ఇవాళ(మే 22) ఆయన జయంతి. ఈ సందర్భంగా గూగుల్ అతని ఫోటోను డూడుల్‌గా ఉపయోగించింది. వ్రిందా జవేరీ అనే ఆర్టిస్ట్ గూగూల్‌కు గామా ఫహిల్వాన్ కార్టూన్‌ను గీసిచ్చాడు. భారత రెజ్లర్‌గా ఎనలేని గుర్తింపు సాధించిన మహ్మద్ భక్ష్ భట్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. రింగ్‌లో ఓటమి ఎరుగని రెజ్లర్‌గా పేరు పొందిన ఆయన దేశానికి ఒక రోల్ మోడల్‌గా నిలిచాడు. భారతీయ సంస్కృతికి గౌరవ ప్రతీకగా ఉన్నాడు. గామా ఫహిల్వాన్ను స్మరించుకోవడం మన అదృష్టం అని గూగుల్ రాసుకొచ్చింది. మహ్మద్ భక్ష్ భట్ తన అంతర్జాతీయ రెజ్లింగ్ కెరీర్లో 1910లో వరల్డ్ హెవీ వెయిట్ చాంపియన్‌షిప్, 1927లో వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ గెలిచాడు. వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ గెలిచిన తర్వాత టైగర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్నాడు. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నుంచి రజత తామరపత్రం అందుకున్నాడు. Gama Pehelwan's 124th Birthday pic.twitter.com/8j5kQrDXbV — Akash Kharade (@cricaakash) May 22, 2022 -
డమ్మీ గన్ ప్రాణాలు తీయడమేంటి?
సినిమాల్లో వాడే ఆయుధాలు డమ్మీవనే అపోహ చాలామందికి ఉంటుంది. అఫ్కోర్స్.. అందులో కొంత వాస్తవమూ లేకపోలేదు. సాధారణంగా సినిమాలకు ఉత్తుత్తి తుపాకులనే వినియోగిస్తుంటారు. కానీ, వాటివల్లా ప్రమాదాలు చోటు చేసుకుంటుండడం గమనార్హం. తాజాగా ‘రస్ట్’ షూటింగ్ లో డమ్మీ తుపాకీ పేలి సినిమాటోగ్రాఫర్ హల్యానా హచిన్స్(42) మరణించిన విషయం తెలిసిందే!. మరి డమ్మీ తుపాకులతో కూడా చనిపోతారా? అనే అనుమానం కలగొచ్చు. వాస్తవానికి ఆ తుపాకులతోనూ తీవ్రమైన పరిణామాలు కలుగుతుంటాయి. టెక్నికల్ కోణంలో అదెలాగంటే.. వినోద రంగంలో వాడే ఏదైనా మారణాయుధాలను ‘ప్రాప్’ ఆయుధాలు అంటారు. థియేటర్ ప్రొడక్షన్స్, రేంజ్ కోసం వాటిని వాడుతుంటారు. చాలా మంది అవి పనిచేయవని అనుకుంటారు. కేవలం తుపాకుల్లా కనిపించేవాటిని మాత్రమే వాడుతుంటారని పొరపడుతుంటారు. కానీ, చాలా సందర్భాల్లో వాడేవి నిజమైన తుపాకులే. యస్.. క్లోజప్ షాట్స్ లో ఒరిజినల్ ఫీలింగ్ కలిగేందుకు వాటిని వాడుతుంటారు. అయితే గన్స్‌ను హ్యాండిల్ చేసే నిపుణుల సమక్షంలోనే వీటిని ఉపయోగించాల్సి ఉంటుంది. అద్దెకు తెచ్చేవే అయినా వీటిని ఉపయోగించడానికి అయ్యే ఖర్చు.. దాదాపు రియల్ గన్లను ఉపయోగించడానికి అయ్యేంతగా ఉంటుందట!. ప్రాప్ గన్స్(ప్రతీకాత్మక చిత్రం) How Prop Gun Works.. ఇక నిజమైన తుపాకీని వాడేటప్పుడు.. బుల్లెట్లు లేకుండా కేవలం కార్ట్రిడ్జ్‌ను లోడ్ చేస్తారు. మిగతావన్నీ తుపాకీ సెటప్‌కు తగ్గట్లే ఉంటాయి. అంటే బుల్లెట్లు లేకపోయినా.. కేసింగ్, గన్ పౌడర్, ఫైరింగ్ పిన్ వంటివన్నీ ఉంటాయన్నమాట. ఈ క్రమంలో తుపాకీ పేల్చినప్పుడు పెద్ద శబ్దంతో గన్ పౌడర్ మండుతుంది. వీటిని హ్యాండిల్ చేయడంలో ఏమైనా పొరపాటు జరిగితే కాల్చేవారికి మాత్రమే కాదు.. దగ్గరగా ఉన్న వ్యక్తులకు తీవ్రగాయాలయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక్కోసారి చనిపోవచ్చు కూడా. ‘రస్ట్’ సినిమా షూటింగ్లో జరిగింది కూడా ఇదే అని ప్రాథమిక విచారణలో తేలింది. ప్రాప్ గన్ను అలెక్ బాల్డ్విన్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం వల్లే ఘోరం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. జోన్-ఎరిక్ హెక్సమ్(ఎడమ), బ్రాండన్ లీ(బ్రూస్లీ కొడుకు మధ్యలో), హల్యానా హచిన్స్(కుడి) గతంలోనూ.. ప్రాప్ గన్ విషాదాలు గతంలోనూ జరిగాయి. మార్షల్ ఆర్ట్స్ లెజెండ్ బ్రూస్ లీ కొడుకు బ్రాండన్ లీ కేవలం 28 సంవత్సరాల వయసులోనే మృత్యువాత పడ్డాడు. అందుకు కారణం.. ప్రాప్ గన్. 1993లో ‘ది క్రౌ’ షూటింగ్ సందర్భంగా ప్రాప్ గన్ పేలి చనిపోయాడు. తుపాకీ పేలిన తర్వాత లీ కుప్పకూలగానే.. అంతా అది నటనేమో అనుకున్నారట. కానీ, షాట్ కట్ అయిన తర్వాత కూడా కదలిక లేకపోవడంతో అసలు విషయం గుర్తించి.. ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే పరిస్థితి చేయి దాటి పోయింది. ఇక 1984లో యూకే నటుడు జోన్-ఎరిక్ హెక్సమ్.. ఓ టీవీ షో సెట్స్‌లో షూటింగ్ ఆలస్యం అవుతోందన్న ఫ్రస్టేషన్లో జోక్ చేయడం ప్రారంభించాడు. కాసేపటికే ఆయన తుపాకీ తలకు గురిపెట్టి షూటింగ్ మొదలుపెడతారా? కాల్చుకోమంటారా? అంటూ సరదాగా కామెంట్లు చేశాడు. చివరకు డమ్మీ గన్నే కదా అని ట్రిగ్గర్ నొక్కడంతో అది కాస్త ‘ఫాట్’మని పేలి ఆయన్ని గాయపరిచింది. అయితే ఆ దెబ్బకు ఆయన పుర్రెకు బలమైన గాయమైంది. కొన్నిరోజులు ఆస్పత్రిలో చికిత్స పొందాక చివరకు ఆయన ప్రాణాలు విడిచాడు. ఇక ఇప్పుడు పొరపాటున అలెక్ బాల్డ్విన్ చేతిలో ప్రాప్ గన్ పేలి.. హల్యానా హచిన్స్ ప్రాణం విడిచింది. బాల్డ్విన్(ఎడమ), హల్యానా(కుడి) బాల్డ్విన్ అరెస్ట్ చేయాల్సిందే ప్రముఖ నటుడు అలెక్ బాల్డ్విన్(63) చేతిలోని డమ్మీ తుపాకీ (ప్రాప్ గన్) పేలి మహిళా సినిమాటోగ్రాఫర్ హల్యానా హచిన్స్ మరణించగా, డైరెక్టర్ జోయల్ సౌజా తీవ్రంగా గాయపడ్డారు. న్యూమెక్సికోలో ఉన్న బొనాంజా క్రీక్ రాంచ్లో ‘రస్ట్’ షూటింగ్ సందర్భంగా శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనపై బాల్డ్ విన్ పై ఎలాంటి కేసూ నమోదు కాకపోవడంతో ‘అరెస్ట్ చేయాల్సిందేన’ని సోషల్ మీడియా కూస్తోంది. అయితే పోలీసులు మాత్రం పూర్తి దర్యాప్తు అయిన తర్వాతే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. పోలీస్ స్టేషన్ బయట బాల్డ్విన్ ఘటన జరిగిన వెంటనే బాల్డ్విన్ స్వయంగా శాంటా ఫే కౌంటీ పోలీస్ స్టేషన్ కు వచ్చారని, విచారణకు సహకరించారని పోలీసులు తెలిపారు. ఆయన తన డిటెక్టివ్ లతో మాట్లాడుతున్నారని, ఘటన గురించి తలచుకుని కుమిలి కుమిలి ఏడ్చారని పర్సనల్ మేనేజర్ మీడియాకు తెలిపారు. కాగా, హచిన్స్ స్వదేశం ఉక్రెయిన్. కానీ, ఆర్కిటిక్ సర్కిల్ లో సోవియట్ మిలటరీ బేస్ పెరిగింది. కైవ్‌లో జర్నలిజం చేసిన ఆమె.. ఆపై లాస్ ఏంజెల్స్‌లో సినిమాటోగ్రఫీపై శిక్షణ తీసుకుంది. ఆమె పని చేసిన ‘ఆర్కెనిమీ’ కిందటి ఏడాది రిలీజ్ అయ్యింది కూడా. - సాక్షి, వెబ్‌స్పెషల్ -
వైరల్: బ్రూస్లీ వన్ ఇంచ్ పంచ్‌తో అదరగొడుతున్న యువకుడు
కరాటే యోధుడు, మార్షల్ ఆర్ట్స్ ఐకాన్ నటుడు బ్రూస్ లీ అంటే తెలియని యాక్షన్ సినీ ప్రేమికులు ఉండరు. ప్రస్తుతం చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని మిక్సియన్ జిల్లాకు చెందిన ఓ యువ మార్షల్ ఆర్టిస్ట్ తన అద్భుతమైన వన్ ఇంచ్ పంచ్ నైపుణ్యంతో బ్రూస్లీని గుర్తు చేస్తున్నాడు. నెటిజన్లు ను షాక్ కు గురిచేస్తున్నాడు. అసలు ఈ వన్ ఇంచ్ పంచ్ అనేది కుంగ్ పూ లోని ఓ కళ. అలనాటి ప్రఖ్యాత హాంకాంగ్ మార్షల్ ఆర్టిస్ట్ బ్రూస్ లీ దీనికి ఎంతో ప్రాచుర్యాన్ని తెచ్చిపెట్టారు. మరో ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఇది ఫా జిన్ అని పిలువబడే ఒక యుద్ధ నైపుణ్యం. అసలు వన్ ఇంచ్ పంచ్ కథేంటి..1964 లో లాంగ్ బీచ్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో ప్రదర్శన తర్వాత బ్రుస్ లీ వన్ ఇంచ్ పంచ్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బ్రుస్ లీ మరణం తర్వాత ఈ వన్ ఇంచ్ పంచ్ ప్రజాదరణ కోల్పోయింది. బ్రుస్ లీ సినిమాల్లో ఈ టెక్నీక్ ను చూసి యువత ఇష్టపడటమే కాకుండా కొందరు సాధన కూడా చేసేవారు. ఐతే ఇప్పుడు ఒక చైనీస్ మార్షల్ ఆర్టిస్ట్.. బ్రుస్ లీ ఒకప్పుడు చేసిన వన్ ఇంచ్ పంచ్ ను చేసి చూపిస్తున్న వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో లో ఆ యువకుడు స్త్రీని తన కుడి భుజంపై మోస్తూ తన వన్ ఇంచ్ పంచ్‌తో రెండు సిమెంట్ బ్లాక్‌లను పగలగొట్టడం మనం చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను చూసి బ్రుస్ లీ ని గుర్తు చేసుకుంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ( చదవండి: వైరల్: ఈ లంచ్ బాక్స్ చూస్తే కన్నీళ్లు ఆగవు ) View this post on Instagram A post shared by @mosstacx -
మంచి ‘గుజ్జూ’ గర్ల్
కృతీ కర్బందా కన్నడ అమ్మాయి. మంచి యాక్టర్. పెర్ఫార్మెన్స్ అదరగొడుతుంది. తెలుగు సినిమాలో కూడా ఆట ఆడించింది. నటన నడిపించింది. ఫ్యాన్స్ హృదయాలపై ఆటోగ్రాఫ్‌లు కొట్టింది. అలా.. అలా.. గ్రాఫ్ పెరిగింది. ఇప్పుడు హిందీ సినిమాల్లో.. ‘శిల్పాశెట్టి కంటే నేనేమైనా తక్కువా? ఆమె మంగళూరు మగువైతే, నేను బెంగళూరు భామ’ అని బాలీవుడ్ గుండెల మీద డ్యాన్స్ చేస్తోంది. ‘ఎర్లా పగ్లా దివానా ఫిర్ సే’ అనే హిందీ సినిమాలో మంచి పాత్ర కొట్టేసింది. తెలుగు సినిమాలు మీకు తెలిసే ఉంటాయి. బోణీ, తీన్మార్, అలా మొదలైంది, బ్రూస్లీ లో కర్బందా కర్ర తిప్పడం చూసే ఉంటారు. ఇప్పుడా హిందీ సినిమాలో బాడీ తిప్పాలట! గుజ్జూ అనే పాటకు తిప్పాలట. మన నవరాత్రుల్లో చేస్తారు చూడండి.. గర్భ, దాండియా.. అదే పాటకు గంతులేయాలట. ‘చిన్నప్పుడు నవరాత్రి ఉత్సవాల్లో భలే డ్యాన్స్ చేసేవాళ్లం మేము. ఈ గుజ్జూ దాండియా ఇప్పుడు చేస్తే బాడీ మీద ఉన్న గుజ్జు కాస్తయినా కరుగుతుంది’ అని సంతోషపడిపోతోంది కర్బందా. -
మెరుపు వీరుడు!
-
కొట్టేద్దామా పోస్టర్!
ఒకటోసారి.. రెండోసారి.. మూడోసారి... ఇదేదో వేలం పాటలా ఉందే! ఇంతకీ, వేలం పాట దేని కోసం? అనేగా మీ డౌట్. ఇక్కడ వేలం పాట లేదు... మీరు పోటీలో పాడుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. అసలు విషయం ఏంటంటే... రామ్‌చరణ్, రకుల్‌ప్రీత్ సింగ్‌లది హిట్ కాంబినేషన్. ‘బ్రూస్లీ, ధృవ’ సినిమాలతో హిట్ పెయిర్ అని పేరు తెచ్చుకున్నారు. ముచ్చటగా మూడోసారి వీళ్లిద్దరూ జోడీ కట్టనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించనున్న సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న సంగతి తెలిసిందే. అందులో చరణ్ సరసన రకుల్ నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. చిత్రవర్గాలు కూడా ఆమెను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. పైగా, ‘సరైనోడు, జయ జానకి నాయక’ చిత్రాల్లో రకుల్ ప్రతిభ, అంకితభావం చూసిన బోయపాటి తన తర్వాతి సినిమాకి రకుల్‌ని తీసుకోనున్నట్లు గతంలోనే వార్తలొచ్చాయి. దీనిబట్టి చూసినా చరణ్ సరసన రకుల్‌కి మరో ఛాన్స్ ఫిక్స్ అయినట్లే అని ఊహించవచ్చు. ఆ సంగతలా ఉంచితే ‘బ్రూస్లీ’లో ‘మెగా మెగా మెగా మీటర్.. కొట్టేద్దామా పోస్టర్’ అని రామ్‌చరణ్, రకుల్ పాడతారు. మరోసారి నటిస్తే.. మళ్లీ పోస్టర్ కొట్టేస్తారు. అదేనండీ.. కొత్త సినిమాకి పోస్టర్లు వేస్తారు కదా! ప్రస్తుతం సుకుమార్ ‘రంగస్థలం’లో నటిస్తున్న చరణ్, అది పూర్తయిన తర్వాత బోయపాటి సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారట. -
అదరగొడుతున్న బుల్లి బ్రూస్ లీ
జపాన్‌కు చెందిన యుసేయి ఏడాదిన్నర వయసులో ఉండగానే అతని తల్లిదండ్రులు ఎక్సర్ సైజులపై పిల్లాడు దృష్టిసారించేలా చేశారు. అలా కొన్నాళ్లపాటు వాళ్ల పర్యవేక్షణలోనే రాటుదేలిన యుసేయి... నాలుగేళ్లకే సొంతంగా ఫిట్నెస్ కేర్ తీసుకోవటం ప్రారంభిం చాడు. ఏడాది నుంచే బ్రూస్లీ సినిమాలు చూడటం మొదలుపెట్టిన యుసేయి ఆ ప్రేరణతో మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకుని..ఐదేళ్లకే మార్షల్ కింగ్‌గా మారిపోయాడు. ఈ సిక్స్ ప్యాక్ బుడ్డోడిపై అంతర్జాతీయ మీడియాలూ ప్రత్యేక కథనాలు ప్రచురించడం విశేషం. అతని పంచ్ పవర్ చూసిన మార్షల్ ఆర్ట్స్ నిపుణులు సైతం నోళ్లు వెళ్లబెడుతున్నారు. ఓ 20 ఏళ్ల ఆరోగ్యవంతమైన వ్యక్తికి ఉండేంత బలం అతని పిడికిలికి ఉందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం సూపర్ కిడ్స్ అనే ఓ ప్రోగ్రాంలో తన గురువు బ్రూస్ లీ నటించిన గేమ్ ఆఫ్ డెత్ చిత్రంలోని ఫైట్ సీక్వెన్స్‌ను తీసుకుని.. వెనకాల స్క్రీన్‌పై అది ప్రదర్శితమౌతుంటే.. అచ్చంగా అదే హావభావాలతో ప్రదర్శించి అందరిచేత విజిల్స్ వేయించుకున్నాడు. చదువుల్లో కూడా ఈ పిల్లాడు చాలా చురుకుగా ఉంటాడని టీచర్లు చెబుతున్నారు. అయితే ఫైట్ సమయంలో దూకుడు చూపించే యుసేయి.. తోటి విద్యార్థుల వద్ద మాత్రం చాలా ప్రశాంతంగా ఉండడం గమనార్హం. -
అదరగొడుతున్న బుల్లి బ్రూస్లీ
-
బుల్లి బ్రూస్లీ.. బొక్కలు ఇరుగుతయ్...
టోక్యో : సాధారణంగా ఓ వయసొచ్చాక ప్రతీ ఒక్కరిలో శారీరక దారుఢ్యం గురించి ఒకరకమైన ఆలోచన కలగటం సహజం. చిన్న వయసు నుంచే సరిగ్గా శ్రద్ధా ఉంటే తీసుకుని ఉంటే బావుండు అని తెగ బాధపడిపోతుంటాం. అయితే తమ పిల్లాడి విషయంలో మాత్రం అది జరగకూడదని యుసేయి ఇమై పేరెంట్స్ భావించారు. అందుకే అతన్ని తిరుగులేని యోధుడిగా తీర్చిదిద్దాలని చిన్నప్పటి నుంచే ఫిట్ నెస్ పై శ్రద్ధ పెట్టించారు. ఇప్పుడు ఆ ఏడేళ్ల చిచ్చర పిడుగు.. మినీ బ్రూస్లీగా అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. జపాన్‌కు చెందిన యుసేయి ఏడాదిన్నర వయసులో ఉండగానే అతని తల్లిదండ్రులు ఎక్సర్ సైజులపై పిల్లాడు దృష్టిసారించేలా చేశారు. అలా కొన్నాళ్లపాటు వాళ్ల పర్యవేక్షణలోనే రాటుదేలిన యుసేయి... నాలుగేళ్లు వచ్చాక సొంతంగా ఫిట్ నెస్ కేర్ తీసుకోవటం ప్రారంభించాడు. ఏడాది నుంచే బ్రూస్లీ సినిమాలు చూడటం మొదలుపెట్టిన రైసుయి ఆ ప్రేరణతో మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకుని.. ఐదేళ్లకే మార్షల్ కింగ్‌గా మారిపోయాడు. ఈ సిక్స్ ప్యాక్ బుడ్డొడిపై అంతర్జాతీయ మీడియాలు సైతం ప్రత్యేక కథనాలు వెలువరించటం విశేషం. అతని పంచ్ పవర్ చూసిన మార్షల్ ఆర్ట్స్ నిపుణులు సైతం నోళ్లు వెళ్లబెడుతున్నారు. ఓ 20 ఏళ్ల ఆరోగ్యవంతమైన వ్యక్తికి ఉండేంత బలం అతని పిడికిలికి ఉందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం సూపర్ కిడ్స్ అనే ఓ ప్రోగ్రాంలో తన గురువు బ్రూస్ లీ నటించిన గేమ్ ఆఫ్ ది డెత్ చిత్రంలోని ఫైట్ సీక్వెన్స్ ను తీసుకుని.. వెనకాల స్క్రీన్ పై అది ప్రదర్శితమౌతుంటే.. యాజ్ ఇట్ ఈజ్‌గా హవ భావాలతోసహా దానిని ప్రదర్శించి అందరిచేత విజిల్స్ వేయించుకున్నాడు. ఈ వీడియో చూస్తే చాలూ ఇతని టాలెంట్ ఏంటో అర్థమైపోతుంది. ఫైట్లలోనే కాదు.. చదువుల్లో కూడా ఈ పిల్లాడు చాలా చురుకుగా ఉంటాడని టీచర్లు చెబుతున్నారు. అయితే ఫైట్ సమయంలో దూకుడు చూపించే రైసుయి.. తోటి విద్యార్థుల వద్ద మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటాడని అంటున్నారు. -
ఆ చిత్రం క్రేజే వేరు అని చెప్పనక్కర్లేదు
కోలీవుడ్‌లో సంగీత పయనాన్ని ప్రారంభించిన ఏఆర్. రెహ్మాన్ ఆ తరువాత టాలీవుడ్, బాలీవుడ్‌లను దాటి హాలీవుడ్ చిత్రాలకు తన సంగీత మాధుర్యాన్ని అందించే స్థాయికి ఎదిగారు. ఆంగ్ల చిత్రం స్లమ్డాగ్తో ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న ఆ సంగీత మాంత్రికుడు మరోసారి అంతర్జాతీయ స్థాయి చిత్రానికి సంగీతం అందించడానికి రెడీ అయ్యారన్నది తాజా సమాచారం. ఏఆర్. రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారంటే ఆ చిత్రం క్రేజే వేరు అని చెప్పనక్కర్లేదు. కరాటే కింగ్ బ్రూస్లీ పేరు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ సజీవం అని వేరే చెప్పక్కర్లేదు. సినిమాల్లో ఏ నటుడు చేయనటువంటి సాహసాలు బ్రూస్లీ చేశాడు. అలాంటి బ్రూస్లీ జీవిత చరిత్ర వెండి తెరకెక్కుతోంది. ప్రఖ్యాత బాలీవుడ్ దర్శకుడు, నటుడు శేఖర్‌కపూర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించే సాహసం చేస్తున్నారు. ఆ బ్రహ్మాండ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్. రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారట. ఈ విషయాన్ని ఇటీవల ఒక భేటీలో శేఖర్‌కపూర్ స్వయంగా వెల్లడించారు. ఆ చిత్రానికి లిటిల్డ్రాగన్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. సంగీతంలో ఎన్నో మైలు రాళ్లను అధిగమించిన ఏఆర్. రెహ్మాన్ సినీ కేరీర్లో ఈ లిటిల్ డ్రాగన్ చిత్రం మరో ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందని చెప్పవచ్చు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. -
విషమిచ్చే చంపేశారా?
ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ మేన్. అతని పంచ్ పవర్‌కు కొండలు కూడా పిండి పిండి అవుతాయి. అతని ముందుకు రావాలంటే మరణానికి కూడా చచ్చేంత భయం. అందుకేనేమో చావు అతన్ని దొంగదెబ్బ తీసింది. ఆయన ఎవరో కాదు మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ ‘బ్రూస్ లీ’. తక్కువ సమయంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించిన వ్యక్తి బ్రూస్లీ. అతని గురించి తెలుసుకుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అలాంటి గ్రేట్ పర్సన్ అర్ధాంతరంగా కన్ను మూశాడు. అతని మరణం వెనుక రహస్యం ఏమిటో ఈరోజు ‘మిస్టరీ’లో తెలుసుకుందాం. అది 1970 జూలై 20...‘గేమ్ ఆఫ్ ది డెత్’ సినిమాపై చర్చలు జరపడానికి డైరెక్టర్ రేమండ్ చో.. బ్రూస్ లీ ఇంటికి వచ్చాడు. సాయంత్రం దాకా చర్చలు జరిగాయి అక్కడి నుండి ఇద్దరూ కలిసి హీరోయిన్ ‘బెట్టి టింగ్’ ఇంటికి వెళ్ళారు. కొద్ది సేపు స్క్రిప్టు గురించి మాట్లాడుకున్నారు. ఆ తరువాత బ్రూస్ లీని బెట్టి ఇంట్లో వదిలేసి రేమండ్ చో.. జేమ్స్ బాండ్ స్టార్ జార్జి లాటిన్ బీని కలవడానికి వెళ్ళాడు..బ్రూస్ లీ ని తరువాత రమ్మనాడు. అప్పుడు సమయం రాత్రి 7:30 తలనొప్పితో బ్రూస్ విలవిలలాడుతున్నాడు. బెట్టి టాబ్లెట్ ఇచ్చింది.. తలనొప్పి తగ్గడానికి బెట్టి టింగ్ ఈక్వజేసిక్ టాబ్లెట్‌ని ఇచ్చింది. అది వేసుకుని బ్రూస్ లీ పడుకున్నాడు. కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్నాడు. సమయం రాత్రి 9 గంటలు బ్రూస్ లీ వస్తాడని ఎదురు చూస్తున్న రేమండ్ చో.. బెట్టీకి ఫోన్ చేసాడు. బ్రూస్ ఇంకా ఎందుకు రాలేదు అని అడిగాడు. దీంతో బెట్టి బ్రూస్ లీని నిద్రలేపడానికి ప్రయత్నించింది. కానీ బ్రూస్ లేవలేదు. బెట్టి రేమండ్‌కి పిరిస్థితిని వివరించింది. అరగంట తరువాత అక్కడికి వచ్చిన రేమండ్ బ్రూస్ లీని నిద్రలేపడానికి ప్రయత్నించాడు. కానీ అతడు కళ్ళు తెరవలేదు. కాసేపటికే బెట్టి డాక్టర్ వచ్చాడు. బ్రూస్ కండీషన్ చాలా సీరియస్‌గా ఉందని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పాడు. అప్పటికే సమయం రాత్రి 10 దాటింది. కాని రాత్రి సమయంలో నీడ అయినా విడిచిపెట్టి పోతుంది కాని మరణం మాత్రం బ్రూస్లీని వెంటాడుతూనే ఉంది. హీరోయిన్ ‘బెట్టి టింగ్’ లెజెండ్‌ను మృత్యువు మింగేసింది.. అపస్మారక స్థితిలో ఉన్న బ్రూస్లీని వార్దిదరూ ఆసుపత్రికి తీసుకెళ్లారు. క్వీన్ ఎలిజిబెత్ ఆసుపత్రిలో అప్పటికే సిద్దంగా ఉన్న డాక్టర్లు బ్రూస్కి చికిత్స మొదలు పెట్టారు. బతికించడానికి ఎంతగానో ప్రయత్నించారు. కానీ లాభం లేకపోయింది. రాత్రి 11 గంటలు సమయంలో కోట్లాది అభిమానులు తట్టుకోలేని విషాద వార్తను చెప్పడానికి రేమండ్ చో ప్రిపేర్ అయ్యాడు. ‘బ్రూస్ లీ ఈజ్ డెడ్’.. అవును హ్యూమన్ డ్రాగన్ బ్రూస్ లీ చనిపోయాడు. లెజండ్ని మృత్యువు మింగేసింది. టాబ్లెట్టే కారణమా? తలనొప్పిగా ఉన్నప్పుడు హీరోయిన్ బెట్టి ఇచ్చిన టాబ్లెట్‌తో బ్రూస్లీ చనిపోయాడా? దీనికి సమాధానం మాత్రం ‘కాదు’..అని అనలేం. ఎందుకంటే బ్రూస్ వేసుకున్న ఈక్వజేసిక్ టాబ్లెట్ అతణ్ని చంపేసిందని ప్రాథమికంగా వైద్యులు నిర్ధారించారు. టాబ్లెట్ రియాక్షన్ అవడంతో మెదడులోకి నీరు చేరింది. సెరెబ్రల్ ఎడెమా బ్రూస్ లీని బలి తీసుకుంది. కాని ఈ కారణాన్ని మాత్రం చివరి నివేదికలో వైద్యులు వెల్లడించలేదు. దీంతో అభిమానులకు బ్రూస్లీ మరణంపై అనుమానాలు మొదలయ్యాయి.. బ్రూస్లీ ఫ్యామిలీ ఎవరీ బ్రూస్లీ..? నవంబర్ 27, 1940 సాన్ ఫ్రాన్సిస్కో అమెరికాలో లీయోచూన్, గ్రేసీలకు బ్రూస్ లీ జన్మించాడు. లీయోచూన్ చైనీయుడు, హాంకాంగ్ లో ఉంటాడు. తల్లి చైనీస్ సంతతికి చెందిన జర్మన్. వీరిద్దరూ కళాకారులే. ఓ ప్రదర్శన కోసం అమెరికాలో ఉన్నప్పుడు వాళ్లకు బ్రూస్ లీ పుట్టాడు. అప్పట్లో హాంకాంగ్ బ్రిటీష్ పాలనలో ఉండేది. అక్కడ చాలా మంది వలస వచ్చి ఉండేవారు. అక్కడి వారు గ్రూపులు గా చేరి వలస వచ్చిన వారిపై దాడికి దిగేవారు. అయితే ఇటువంటి పరిస్థితే బ్రూస్లీ కుటుంబానికి ఎదురైంది. బ్రూస్ 13 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు అతనిపై దాడి చేశారు. బ్రూస్ తల్లి జర్మన్ కావడమే ఇందుకు కారణం. దీంతో ఆత్మరక్షణ కోసం తండ్రి దగ్గర నుంచి ‘థామ్ చీ చువాన్ ’ అనే యుద్ధ విద్యను నేర్చుకున్నాడు. కొన్ని రోజుల తరువాత సైకో ఇప్ మెన్ దగ్గర స్టూడెంట్‌గా చేరాడు. కుంఫులో భాగమైన ‘వింగ్ చున్’ లో ఇప్మెన్ను ఎదురించే వారే లేరు. కానీ ఓ జర్మన్ జాతీయురాలికి పుట్టిన బ్రూస్ లీ కి ‘వింగ్ చున్’ నేర్చుకోడానికి వీలు లేదంటూ చైనీయులు అభ్యంతరం చెప్పారు. ఇప్మెన్పై ఒత్తిడి తేవడంతో శిక్షణ ఆగిపోయింది. కాని ఎవ్వరికీ తెలీకుండా బ్రూస్కి ఇప్ మెన్ శిక్షణ ఇచ్చాడు. ఆ తరువాత బాక్సింగ్, డాన్సింగ్, కత్తి సాముల్లో నైపుణ్యం సాధించాడు. ఇవన్నీ 18 సంవత్సరాల వయస్సులోనే నేర్చుకొని కదిలే కత్తిలా మారాడు. 1964లో లిండా ఎమెరీని పెళ్లి చేసుకున్నాడు. అనంతరం 1965లో మార్షల్ ఆర్ట్స్ అకాడమీని ప్రారంభించి.. జీత్ కున్ డోను రూపొందించాడు. పసివాడిగా ఉన్నప్పుడే గోల్డెన్ గర్ల్ సినిమాలో కనిపించాడు. 18 సంవత్సరాల నాటికే 12 సినిమాలు పూర్తి చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాడు. నిర్మాతలే చంపేశారా? గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందిన బ్రూస్లీ మరణానికి కారణం ఏమిటో ఎవ్వరికీ తెలియలేదు. బెట్టి ఇంట్లోనే మరణించాడు కాబట్టి బెట్టి విషం ఇచ్చి చంపేసిందని కొంతమంది అనుమానం. బ్రూస్ మరణం వెనుక హాంకాంగ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్లు మాఫియాతో చేతులు కలిపి బ్రూస్ లీని అంతం చేసారన్నది చాలా మంది నమ్మకం. దీనికి బెట్టి సహాయం చేసిందని కూడా అంటారు. అతని మరణానికి ఈక్వజేసిక్ రియాక్షన్ కారణం కాదని బ్రూస్ పర్సనల్ డాక్టర్ తెలిపారు. బ్రూస్ లీ పై షావోలీన్ మాస్టర్‌కు కోపం అందుకే వారే చంపేశారని చాలా మంది నమ్ముతున్నారు. కానీ నేటికి బ్రూస్ మరణం మిస్టరీగానే ఉండిపోయింది. – సాక్షి, స్కూల్ ఎడిషన్ -
మగధీరుడి నయా ప్లాన్స్
వరుసగా 40 కోట్ల సినిమాలతో సత్తా చాటిన రామ్‌చరణ్ తాజా చిత్రం 'బ్రూస్ లీ'తో మాత్రం ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా భారీ అంచనాల మధ్య, హై బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా తొలిరోజు నుంచే నెగెటివ్ టాక్ తెచ్చుకోవటంతో వసూళ్ల విషయంలో కూడా బాగా వెనకపడింది. 40 కోట్లకు పైగా వసూళ్లు సాధించినా.. బడ్జెట్ పరంగా చూసుకుంటే ఈ సినిమాకు చాలా లాస్ వచ్చినట్టే అంటున్నారు సినీజనాలు. 'బ్రూస్ లీ' రిజల్ట్‌తో ఆలోచనలో పడ్డ చరణ్, నెక్ట్స్ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ముఖ్యంగా బడ్జెట్, బిజినెస్‌ల మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నాడట. బ్రూస్ లీ భారీ వసూళ్లను రాబట్టినా, ఫ్లాప్ టాక్ రావటానికి భారీ బడ్జెటే కారణం అని ఫీల్ అవుతున్న చరణ్ నెక్ట్స్ సినిమాను లిమిటెడ్ బడ్జెట్‌తో తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం విదేశాల్లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న మగధీరుడు తిరిగిరాగానే, తమిళ రీమేక్ 'తనీఒరువన్' షూటింగ్‌ను మొదలెట్టనున్నాడు. ఈ సినిమా బడ్జెట్ కంట్రోల్ చేయటం కోసం తన రెమ్యూనరేషన్లో కూడా మార్పులు చేసుకుంటున్నాడు చరణ్. ఇన్నాళ్లు రెమ్యూనరేషన్ డైరెక్ట్ గా తీసుకున్న చరణ్, ఈ సినిమాకు పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల తరహాలో లాభాల్లో షేర్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట. ఇలా చేస్తే సినిమా మీద తనకు కూడా బాధ్యత పెరుగుతుందని భావిస్తున్నాడు చరణ్. మరి చరణ్ కొత్త ప్లాన్స్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి. -
'వేర్వేరు పార్టీల్లో ఉన్నా.. మేమంతా ఒక్కటే'
హైదరాబాద్: అన్నయ్య, తాను వేర్వేరు పార్టీల్లో ఉన్నా తామంతా ఒక్కటేనని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అన్నయ్య చిరంజీవిని ఆదివారం ఆయన నివాసానికి వెళ్లి కలిసిన సందర్భంగా పవన్ విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు తాను వెళుతానో లేదో ఇప్పుడు చెప్పలేనన్నారు. తనకు వెళ్లాలని ఉన్నా షూటింగ్ షెడ్యూల్, డేట్స్ వల్ల ఇంకా నిర్ణయానికి రాలేదని చెప్పారు. సినిమాలపరంగా తామంతా ఒకటేనని తెలిపారు. అన్నయ్య మళ్లీ సినిమాల్లోకి రావడం ఆనందం కలిగించిందని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అన్నయ్యను కొన్నిసార్లే కలుసుకున్నానని చెప్పారు. రాజకీయంగా తమ విధానాలు వేరైనాకానీ.. సినిమాలపరంగా, కుటుంబపరంగా అన్నయ్య అంటే గౌరవమని తెలిపారు. మీరిద్దరు మళ్లీ కలిసి నటించే అవకాశముందా? అన్న ప్రశ్నకు నాడు శంకర్ దాదా సినిమాలో యాదృచ్ఛికంగానే నటించానని చెప్పారు. రామ్ చరణ్ హీరోగా తాను నిర్మించబోయే సినిమా కోసం రెండు, మూడు కథలను పరిశీలించామని చెప్పారు. 'సర్దార్ గబ్బర్‌సింగ్' సినిమా సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నట్టు తెలిపారు. -
చిరంజీవి ఇంటికి వెళ్లిన పవన్ కల్యాణ్
-
చిరంజీవి ఇంటికి వెళ్లిన పవన్ కల్యాణ్
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవిని తమ్ముడు పవన్ కల్యాణ్ కలిశారు. ఆదివారం సాయంత్రం పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ నుంచి నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లారు. పవన్‌కు చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ స్వాగతం పలికి ఆహ్వానించారు. చాలా కాలం తర్వాత 'బ్రూస్ లీ' లో నటించిన అన్నయ్య చిరంజీవిని పవన్ అభినందించారు. చిరుతో పాటు రామ్ చరణ్‌లను పవన్ అభినందించారు. పవన్ జనసేన పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత చిరంజీవితో అంతరం ఏర్పడినట్టు వార్తలు వచ్చాయి. కాగా ఇటీవల జరిగిన చిరు 60వ జన్మదినోత్సవం సందర్భంగా అన్నయ్యను కలిసిన పవన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత చిరంజీవిని పవన్ కలవడం ఇది రెండోసారి. తనయుడు రామ్ చరణ్ నటించిన 'బ్రూస్ లీ' సినిమాలో చిరంజీవి సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై మెరిశారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఆయన సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. -
ఫైటర్స్
-
నేడు అన్నయ్యను కలువనున్న పవర్ స్టార్
హైదరాబాద్: సినిమా నటుడు మెగాస్టార్ చిరంజీవిని తమ్ముడు పవన్ కల్యాణ్ ఆదివారం కలుసుకోనున్నారు. మరికాసేపట్లో పవన్ చిరంజీవి ఇంటికి రానున్నారు. 'బ్రూస్ లీ' లో నటించడం ద్వారా మళ్లీ సినిమాల్లోకి అడుగుపెట్టిన అన్నయ్య చిరంజీవిని అభినందించేందుకు పవన్ రానున్నట్టు తెలుస్తున్నది. జనసేన పార్టీని ఏర్పాటుచేసిన తర్వాత పవన్ కల్యాణ్ పెద్దగా చిరంజీవిని కలుసుకోలేదు. మొన్నామధ్య జరిగిన చిరు 60వ జన్మదినోత్సవం సందర్భంగా అన్నయను కలిసి పవన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత చిరంజీవిని పవన్ కలువడం ఇదే కావడం గమనార్హం. తనయుడు రామ్ చరణ్ నటించిన 'బ్రూస్ లీ' సినిమాలో చిన్న పాత్ర పోషించడం ద్వారా మళ్లీ చిరంజీవి వెండితెరపై మెరిశారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఆయన సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. -
'బ్రూస్ లీ'పై వర్మ సెటైర్లు!
క్రియేటివ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ రామ్ చరణ్ హీరోగా నటించిన 'బ్రూస్లీ' సినిమాపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. 'బ్రూస్ లీ' లో రామ్ చరణ్ నటనను ప్రశంసిస్తూనే మరోవైపు సున్నిత విమర్శలు చేశారు. ఈ సినిమాకు బ్రూస్ లీ అని పేరు పెట్టకపోయి ఉంటే రామ్ చరణ్ నటన బ్రహ్మాండంగా ఉండేది. కానీ 'బ్రూస్ లీ' అనడంతోనే చిక్కంత వచ్చిందని పేర్కొన్నారు. బ్రూస్ లీ లేని ఈ సినిమాకు ఆ పేరు ఎందుకు పేరు పెట్టారో బ్రూస్ లీ అభిమానిగా తనకు అర్థం కాలేదని ట్వీట్ చేశారు. బాస్ (చిరంజీవి) తన 150వ సినిమా కోసం ఎందుకు 'బ్రూస్ లీ'ని ఎంచుకున్నాడో ఆశ్చర్యం కలిగిస్తున్నదని పేర్కొన్నారు. చిరంజీవి 151వ సినిమాలో బ్రూస్ లీ కంటే గొప్పగా కనిపించాలని ఆశిస్తున్నానంటు ట్విట్ చేశారు. మెగాస్టార్ మెగాఫ్యాన్గా, బ్రూస్ లీ పవర్ ఫ్యాన్‌గా చిరంజీవి 151వ సినిమా మెగా కిక్కింగ్ పవర్ పంచ్ ఇస్తుందని ఆశిస్తున్నట్టు వర్మ పేర్కొన్నారు. 'బాస్ 151వ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది? జస్ట్ అడుగుతున్నా..' అంటూ వ్యాఖ్యానించారు. బ్రూస్ లీని సినిమాలో చేర్చకపోయినట్టయితే రామ్‌చరణ్ బ్రూస్లీలాగే కనిపించి ఉండేవాడని అన్నారు. 'బ్రూస్ లీ' సినిమా చూసి వచ్చిన తర్వాత మళ్లీ బ్రూస్ లీ నటించిన 'ఎంటర్ ద డ్రాగన్' చిత్రం చూశానని వర్మ పేర్కొన్నారు. After watching Ram Charan in "Bruce Lee" now watching Bruce Lee in "Enter The Dragon" — Ram Gopal Varma (@RGVzoomin) October 16, 2015 If not called Bruce Lee, Ram Charan is fantastic in "Bruce Lee" but since he is called Bruce Lee he is ........ — Ram Gopal Varma (@RGVzoomin) October 16, 2015 As a Bruce Lee fan I really wonder why they named Ram Charan as Bruce Lee in a Bruce Lee less film — Ram Gopal Varma (@RGVzoomin) October 16, 2015 -
బ్రూస్ లీ దర్శక, నిర్మాతలపై ఐటీ ఎటాక్
-
బ్రూస్ లీ దర్శక, నిర్మాతలపై ఐటీ ఎటాక్
హైదరాబాద్ : నిన్న కోలివుడ్ ...తాజాగా టాలీవుడ్‌పై ఐటీ శాఖ కన్నేసింది. భారీ బడ్జెట్ తో నిర్మించిన బ్రూస్ లీ చిత్రమే ప్రధాన లక్ష్యంగా సినిమా రంగంపై ఆదాయపు పన్నుశాఖ గురువారం పంజా విసిరింది. ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల, నిర్మాత డీవీవీ దానయ్య, సంగీత దర్శకుడు థమన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. కాగా రామ్ చరణ్ హీరోగా రూ. 50కోట్లు బడ్జెట్‌తో తెరకెక్కిన బ్రూస్ లీ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ అధికారులు దాడులు చేసి, సోదాలు నిర్వహిస్తున్నారు. శ్రీనువైట్ల, దానయ్య నివాసాలతో పాటు, వారి కార్యాలయాలు, వారి సమీప బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా కొద్దిరోజుల క్రితం పులి చిత్ర హీరో విజయ్, హీరోయిన్లు సమంత, నయనతార ఇళ్లపై దాడులు నిర్వహించింది. నిర్మాతలు కలైపులి ఎస్ థాను, మదురై అన్బు ఇళ్లలో సోదాలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఐటీ సోదాల్లో పెద్ద ఎత్తున నగదుతో పాటు బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. -
బ్రూస్లీ తో కబుర్లు
-
డాడీ... బాబాయ్... నేను రెడీ..!
చేసింది స్టంట్‌మేన్ కేరెక్టర్. ఏ సినిమాకీ తగలనన్ని గాయాలు తగిలాయి. అయినా ‘బ్రూస్లీ’ సినిమాను ఫుల్ ఎంజాయ్ చేశానంటున్నారు రామ్‌చరణ్. చాలా రోజుల తర్వాత మీడియాతో చాలా విషయాలు మాట్లాడారు చరణ్. ‘గోవిందుడు అందరివాడేలే’ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ‘బ్రూస్లీ’ చేయడానికి కారణం ఏంటి? గతేడాది అక్టోబర్‌లో ‘గోవిందుడు అందరివాడేలే’ విడుదలయ్యింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘బ్రూస్లీ’ మొదలు కావాల్సింది. సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఈ సినిమా ఉండాలనుకున్నాం. ఇప్పటివరకూ ప్రేక్షకులకు తాను అలవాటు చేసిన కామెడీకి డిఫరెంట్‌గా ఈ చిత్రం ఉండాలని శ్రీనూగారు అనుకున్నారు. కొత్త తరహా ఎంటర్టైన్మెంట్ ట్రై చేశారు. దానికోసం బాగా స్క్రిప్ట్ వర్క్ చేశారు. ఏప్రిల్‌లో మొదలుపెట్టాం. ‘బ్రూస్లీ’ చేసిన చిత్రాల్లో మీకు బాగా నచ్చినది? ప్రతి స్టంట్ మేన్కీ నచ్చే వ్యక్తులు బ్రూస్లీ, జాకీచాన్. బ్రూస్లీ చేసిన చిత్రాల్లో నాకు ‘ఎంటర్ ది డ్రాగన్’ ఇష్టం. ఆయన సినిమాల్లో కేవలం ఫైట్స్ మాత్రమే కాదు. ఓ ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ అందరికీ అర్థమయ్యేలా, టచ్ చేసేలా ఉంటుంది. బ్రూస్లీ చిత్రాలను ఆదర్శంగా తీసుకునే ఈ చిత్రంలో బ్రదర్, సెంటిమెంట్‌ని డిజైన్ చేశారు. మీ నాన్నగారి 150వ చిత్రాన్ని నిర్మిస్తాన్నారు.. మీ సినిమాలో ఆయన్ను అతిథిగా చేయించడంవల్ల ఇది 150వ సినిమా అయిపోతుంది కదా? ఈ సినిమాలో నటింపజేయాలన్న డెసిషన్ శ్రీను వైట్లగారిది. ఆయనే నాన్నగార్ని అడిగారు. కథ, సందర్భం విని నాన్నగారు కన్విన్స్ అయ్యారు. సందర్భానుసారం ఓ పెద్ద ఇమేజ్ ఉన్న నటుడు అవసరం. ఒకవేళ నాన్నగారు ఒప్పుకుని ఉండకపోతే ఆ సందర్భాన్ని తీసేసేవాళ్లం లేకపోతే రీ-వర్క్ చేసేవాళ్లం. రెండున్నర, మూడు గంటలు కనిపించే ఫుల్ ప్లెడ్జెడ్ రోల్ అయితే అప్పుడు దాన్ని 150వ సినిమా అనొచ్చు అని నాన్నగారు అన్నారు. ఈ చిత్రంలో జస్ట్ మూడు నిముషాలే కనిపిస్తారు కాబట్టి 150వ సినిమాకి ఇది టీజర్‌లాంటిది. చిరంజీవిగారితో ఫైట్‌తో పాటు సాంగ్ చేయిస్తారనుకుని అభిమానులు ఆశిస్తే సాంగ్ వద్దని మీరే అన్నారట. ఎందుకని? ఫైట్ సిట్యుయేషన్‌తో పాటు సాంగ్ చేయిద్దాం అని శ్రీనూగారు అంటే వద్దనున్నాను. ఎందుకంటే 150వ సినిమాకి స్పెషాల్టీ ఉండాలి కదా. మీ నాన్నగార్ని దాటుకుని వెళ్లాలని మీకుంటుందా? అలా వెళ్లాలని కలలో కూడా అనుకోను. నాన్నగారి వెనకాల నేను అన్నదే నాకు బాగుంటుంది. ఎప్పటికీ అలా ఉండటమే నాకు ఆనందంగా ఉంటుంది. దానికి మించి ఈ జీవితంలో నాకేమీ వద్దు. మరో వారం రోజుల వరకూ ఏ పెద్ద సినిమా విడుదల కాకపోతే ‘రుద్రమదేవి’కి హెల్ప్ అవుతుంది. మరి.. ‘బ్రూస్లీ’ విడుదలను వాయిదా వేయమని మిమ్మల్ని ఎవరైనా అడిగారా? గుణశేఖర్‌గారు నన్నడిగారు. విడుదల తేదీ అనేది నా చేతుల్లో ఉండదు. అది పూర్తిగా నిర్మాతల బాధ్యత. ఈ సినిమా ప్రారంభించిన రోజునే దసరాకి విడుదల అని చెప్పేశాం. ‘రుద్రమదేవి’ ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు. తెలిస్తే ఏదైనా చేయగలిగేవాళ్లం. ఆ సినిమా ఆడాలని మా ఫ్యామిలీ మొత్తం కోరుకున్నాం. నాన్నగారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. బన్నీ యాక్ట్ చేశాడు. అయితే ఆ చిత్రం విడుదల వాయిదా పడుతూ రావడంవల్ల గ్యాప్ లేకుండాపోయింది. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. ‘బాహుబలి’ అప్పుడు రాజమౌళిగారు ‘శ్రీమంతుడు’ని కొంచెం వాయిదా వేస్తే బాగుంటుందని అన్నారట. ‘కిక్ 2’ని కూడా వాయిదా వేసుకున్నారు. అలాగే, ‘ఆగడు’ అప్పుడు శ్రీను వైట్లగారు నన్నడిగారు. అంత హెల్దీగా ఉంటాం. కొన్నిసార్లు పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. పెద్ద స్టార్స్ సినిమాలు పండగ అప్పుడు విడుదలైతేనే కాదు.. ఎప్పుడు విడులైతే అప్పుడు పండగ అని దాసరిగారు అన్నారు.. ఆయన చెప్పిన మాట మంచిదే. వినడానికి చాలా బాగుంది. కానీ ప్రాక్టికల్‌గా సాధ్యమా అని తెలియడంలేదు. తమిళ చిత్రం ‘తని ఒరువన్’ రీమేక్‌లో నటించాలనుకోవడానికి కారణం? ఒకప్పుడు రీమేక్స్ చేయకూడదనుకునేవాణ్ణి. నాన్నగారు చేసిన ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’, ‘ఠాగూర్’, బాబాయ్ చేసిన ‘గబ్బర్ సింగ్’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ‘తని ఒరువన్’ మేకింగ్ చాలా బాగుంటుంది. తెలుగుకి అనుగుణంగా దర్శకుడు సురేందర్‌రెడ్డి వర్కవుట్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరో కన్నా విలన్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. విలన్ క్యారెక్టర్‌కి ఆర్టిస్ట్ సెట్ కాగానే షూటింగ్ మొదలుపెడతాం. పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రం చేయాలని లేదా? గౌతమ్ మీనన్‌తో చేయబోయేది లవ్‌స్టోరీ. ‘ఏ మాయ చేశావె’లా ఫైట్స్ ఏమీ లేకుండా ప్యూర్ లవ్‌స్టోరీ చేస్తే నా ఆడియన్స్ ఒప్పుకుంటారా? లేదా? అనేది చూడాలి. వైట్ హార్స్ ప్రొడక్షన్స్, కొణిదెల పేరుతో నిర్మాణ సంస్థలు ఆరంభించారు కదా.. ఎలాంటి చిత్రాలు నిర్మించాలనుకుంటున్నారు? వైట్ హార్స్‌పై కొత్తవాళ్లతో చిన్న బడ్జెట్ చిత్రాలు చేయాలని ఉద్దేశం. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పెద్ద బడ్జెట్ చిత్రాల కోసం. వైట్ హార్స్ ఎనౌన్స్ చేసిన వెంటనే తేజు (సాయిధరమ్ తేజ్), శిరీష్ ఫోన్ చేసి కొత్త దర్శకులు ఉన్నారు.. కథ చెబుతారని అన్నారు. ‘బ్రూస్లీ’ చిత్రంతో పాటు, డాడీ 150వ చిత్రం, సురేందర్‌రెడ్డితో సినిమా పనుల మీద బిజీగా ఉన్నాను. ఇవి పూర్తయ్యాకే వైట్ హార్స్ సంస్థపై సినిమాలు నిర్మిస్తానని వాళ్లతో అన్నాను. కొత్త దర్శకులతో సినిమాలు చేయాలనుకోవడంలేదా? మనకు బోల్డంత మంది ఆర్టిస్టులు ఉన్నారు. దర్శకులు తక్కువయ్యారు. కొత్తవాళ్లు రావాలి. మంచి కథతో ఎవరు వచ్చినా నేను చేయడానికి రెడీ. ఈ మధ్య చూసినవాటిలో ‘సినిమా చూపిస్త మావ’, ‘భలే భలే మగాడివోయ్’ చాలా నచ్చాయి. ఆ చిత్రదర్శకులు మంచి కథలు రెడీ చేసుకుని పెద్ద సినిమాలు ట్రై చేస్తే బాగుంటుంది. మారుతివంటి దర్శకులు వచ్చి కథ చెప్తే కచ్చితంగా ఎంకరేజ్ చేస్తా. మీ నాన్నగారి 150వ చిత్రానికి సంబంధించిన సెకండాఫ్ కథ నచ్చలేదని తనతో చెప్పకుండా మీడియాకి చెప్పారని పూరి జగన్నాథ్ అనడంపై మీ కామెంట్? పూరీగారికి క్లియర్‌గా చెప్పాం. మరి.. ఆయన ఎందుకలా అన్నారో తెలియదు. ‘లోఫర్’ సినిమాతో బిజీగా ఉన్నారు కాబట్టి, డిస్ట్రబ్ చేయడం సరికాదనిపించింది. ‘లోఫర్’ తర్వాత సెకండాఫ్ చేస్తానని పూరీగారు అన్నారు. పవన్ కల్యాణ్‌తో నిర్మించాలనుకున్న చిత్రం గురించి? ఆ సినిమా గురించి బాబాయ్, నేనూ మాట్లాడుకున్నాం. ఆయన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’తో, నేను నా సినిమాలతో బిజీగా ఉన్నాం. ఒక స్క్రిప్ట్ వర్కవుట్ చేస్తున్నాం. మొన్న బాబాయ్ సాంగ్ షూట్లో ఉన్నప్పుడు కలిశా. వచ్చే ఏడాది ఆ సినిమా ఉండొచ్చు. మీ నాన్నగారు, బాబాయ్, మీరు కలిసి సినిమా చేస్తారా? ముగ్గురం కలిసి సినిమా చెయ్యాలి కాబట్టి చేయకూడదు. మాకు తగ్గ కథ కుదరాలి. అంతేకానీ మా కాంబినేషన్ వేస్ట్ కాకూడదు. ‘కత్తి’ చిత్రం చిరంజీవిగారికి నచ్చిందట.. 150వ చిత్రం అదే అవుతుందా? నాన్నగారు చూశారు. ఆయనకు నచ్చింది. అదే 150వ చిత్రం అవుతుందా? అని చెప్పలేను. 151, 152 చిత్రాలకు కథలు రెడీగా ఉన్నాయి. శ్రీను వైట్లగారు, వినాయక్‌గారు రెడీగా ఉన్నారు. అయితే ముందు 150వ చిత్రం కుదరాలి. సామాజిక అంశం, వినోదం.. ఈ రెండూ ఉండే సినిమా చేయాలని నాన్నగారు అనుకుంటున్నారు. చాలా విరామం తర్వాత చేస్తారు కాబట్టి, అర్థవంతమైన చిత్రం చేయాలి. జనవరికల్లా ఆరంభించాలనుకుంటున్నాం. దసరా లోపే నాన్నగారు 150వ చిత్రం ప్రకటిస్తారు. ‘బ్రూస్లీ’ కోసం నాన్‌స్టాప్‌గా వర్క్ చేశారు.. మరి రిలాక్సేషన్ సంగతేంటి? ‘ఎక్కడికైనా తీసుకెళ్తావా? సినిమాలేనా?’ అని నా వైఫ్ ఉపాసన అడుగుతోంది. ‘బ్రూస్లీ’ కోసం పడిన కష్టం తాలూకు ‘పెయిన్స్’ తగ్గాలంటే ముందు కేరళ వెళ్లి, ‘పెయిన్ మేనేజ్మెంట్’ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే, అలిగింది. సో.. ముందు హాలిడే ట్రిప్ వెళ్లాలి. ఖాళీ టైమ్‌లో ఏం చేస్తారు? బేసిక్‌గా నాకు లవ్‌స్టోరీస్ ఇష్టం. ఖాళీ సమయాల్లో ఇంట్లో అవి చూస్తాను. మా ఫామ్‌లో గుర్రాలు, ఒంటె ఉన్నాయి. అమలగారు చెబితే ఒంటెను దత్తత తీసుకున్నాం. వాటితో స్పెండ్ చేస్తాం. ఇంతకుముందు కొంచెం అగ్రెసివ్‌గా ఉండేవారనిపించేది.. ఇప్పుడు అలా కాకుండా చాలా మెచ్యుర్డ్‌గా, ప్రశాంతంగా ఉండటానికి కారణం ఏంటి? అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టకూడదని నిర్ణయించుకున్నా. వాటి మీద మనసు పెట్టడం వల్ల ఎనర్జీ వృథా తప్ప ఉపయోగం ఉండదని తెలుసుకున్నాను. అదే ఎనర్జీని నా ఫ్యామిలీకి, షూటింగ్స్‌కి కేటాయిస్తే మంచిదనిపించింది. ఎన్టీఆర్, బన్నీ ఫాదర్‌హుడ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు.. మరి మీరెప్పుడు? ఇప్పుడే అన్నారు మెచ్యుర్టీ వచ్చిందని. ఫాదర్ హుడ్‌కి ఇంకా మెచ్యూర్ అవ్వాలి (నవ్వుతూ). పదేళ్లుగా అయ్యప్ప మాల వేసుకుంటున్నా! నాన్నగారి ఇరుముడి తీసుకెళ్లడానికి నేను మాల వేసుకునేవాణ్ణి. ఆయన వెళితే క్రౌడ్ ప్రాబ్లమ్ అవుతుంది. అందుకని నేను వేసుకునేవాణ్ణి. అది అలవాటైపోయింది. షూటింగ్ అప్పుడు ఎప్పుడూ వేయలేదు. ‘బ్రూస్లీ’ సమయంలో వేసుకున్నాను. అమ్మ మొక్కు తీర్చడానికి ఆ మధ్య అమరనాథ్ యాత్రకెళ్లాను. అమ్మ కళ్లు చెమర్చాయి! నాన్నగారు మేకప్ వేసుకుని షూటింగ్‌కి వస్తుంటే అమ్మ కళ్లు చెమర్చాయి. ఆయన లుక్, కాస్ట్యూమ్స్ నేనే డిజైన్ చేశాను. క్లీన్ షేవ్ చేసుకుందామా? లేక గడ్డంతో కనిపించాలా? అని నాన్నగారు ఆలోచిస్తుంటే నాకు ‘గ్యాంగ్ లీడర్’ గుర్తొచ్చింది. అందుకని చిన్న గడ్డం పెట్టమన్నాను. నేను ఏడు గంటలకల్లా లొకేషన్‌కి వెళ్లిపోయాను. నాన్నగారి గెటప్‌తో లొకేషన్‌కి ఎంటరయ్యేసరికి నాకు చాలా సంతోషం అనిపించింది. ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’కన్నా ముందు.. ఇంకా చెప్పాలంటే.. 1990లలో ఎలా ఉండేవారో అంత యంగ్‌గా కనిపించారు. మేమిద్దరం గుర్రం మీద వచ్చే సీన్ ఒకటి ఉంటుంది. ‘మగధీర’లో వాడిన గుర్రాన్నే వాడాను. నాన్నగారు మాత్రం అప్పటివరకూ అలవాటు లేని గుర్రం వాడారు. ఓ వైట్ హార్స్ నచ్చడంతో ఆయన కావాలని అడిగి, మరీ చేశారు. జస్ట్ అలా గుర్రం ఎక్కారో లేదో ఇలా కంట్రోల్ చేసేశారు. నాన్నగారి క్యారెక్టర్ సెకండాఫ్‌లో ఉంటుంది. -
వర్మ 'బ్రూస్ లీ' వీడియో సాంగ్ విడుదల
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరో వివాదానికి తెరతీశాడు. ఇప్పటికే 'వర్మ బ్రూస్ లీ' పేరుతో ట్రైలర్ రిలీజ్ చేసిన ఆయర తాజాగా ఆ చిత్రంలోని ఒక వీడియో సాంగ్ ని బుధవారం ట్విట్టర్ లో విడుదల చేశారు. దమ్ముంది.. తెగింపు ఉంది...ఇంకా నీకేం కావాలీ అంటూ.. కొనసాగే ఈ పాటలో ఓ అమ్మాయి మార్షల్ ఆర్ట్స్ చేస్తూ కనబడుతుంది. 'వర్మ బ్రూస్ లీ' పాటను అక్టోబర్ 14వ తేదీ సాయంత్రం 5.30 గంటలకి విడుదల అంటూ... రామ్‌గోపాల్ వర్మ ఇవాళ ఉదయం ట్విట్ చేశారు. అన్నట్టుగానే సాయంత్రం ఆ పాటను విడుదల చేశారు. అయితే ఇప్పటికే శ్రీనువైట్ల దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కిన 'బ్రూస్లీ' విడుదలకు సిద్ధం అవుతుండగా, తమిళ్లో జివి ప్రకాష్ హీరోగా మరో సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ రేసులోకి వర్మ కూడా వచ్చి చేరారు. బ్రూస్ లీకి వీరాభిమాని అయిన వర్మ ఇది తొలి భారతీయ మార్షల్ ఆర్ట్స్ చిత్రమని ఇప్పటికే ప్రకటించారు. తన ప్రతి సినిమాను వివాదాలతోనే ప్రమోట్ చేసుకునే వర్మ ఈసారి కూడా తన సినిమా ప్రమోషన్ కోసం టైటిల్ వివాదాన్ని తెరమీదకు తెచ్చారన్న వాదన వినిపిస్తుంది. మరి రామ్‌గోపాల్ 'వర్మ' బ్రూస్ లీ పై ...రామ్‌చరణ్ బ్రూస్లీ యూనిట్ ఎలా స్పందించారో చూడాలి. -
వర్మ'బ్రూస్ లీ' వీడియో సాంగ్ విడుదల
-
బ్రూస్లీ చెప్పిందే నాకు స్ఫూర్తి!
‘‘ ‘బ్రూస్లీ’ అవుట్‌పుట్ విషయంలో నేను ఫుల్ హ్యాపీ’’ అంటున్నారు శ్రీను వైట్ల. ఓ కసితో, ఓ దీక్షతో చాలా తక్కువ టైమ్‌లో ఇంత క్వాలిటీ ప్రొడక్ట్ తీసుకురావడమంటే మాటలు కాదు. ‘‘చిరంజీవి గారు, రామ్‌చరణ్ ఇచ్చిన సపోర్ట్‌తోనే ఎలాంటి ప్రెజర్ లేకుండా పనిచేయగలిగా’’ అన్నారు శ్రీను వైట్ల. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘బ్రూస్లీ’ గురించి, తన కెరీర్ గురించి శ్రీను వైట్ల చాలా విషయాలు చెప్పారు. రామ్‌చరణ్‌ని ఫైటర్‌గా చూపించాలని ఎందుకనిపించింది? హీరోకి ఏదో ఒక ప్రొఫెషన్ పెట్టాలి. చరణ్ ఫిజిక్‌కి తగ్గట్టు ఫైటర్ అయితే కొత్తగా ఉంటుందనిపించింది. అందరూ అదే ఫీలయ్యారు. ‘బ్రూస్లీ’ టైటిల్ ఎందుకు పెట్టినట్టు? ఇందులో చరణ్ పాత్ర పేరు కార్తీక్. బ్రూస్లీకి వీరభక్తుడు. అందరూ బ్రూస్లీ అనే నిక్‌నేమ్‌తో పిలుస్తారు. అందుకే టైటిల్ అదే పెట్టేశాం. ఇందులో చిరంజీవి పాత్రకు తొలుత పవన్‌కల్యాణ్‌ని అనుకున్నారట? ఆ సీన్ అనుకోగానే మొదట మేం అనుకున్నది చిరంజీవి గారినే. అదృష్టవశాత్తూ మేం అడగ్గానే ఆయన కూడా ఓకే అన్నారు. చిరంజీవి చాలా ఏళ్ల తర్వాత షూటింగ్లో పాల్గొన్నారు. ఆయనను ఎలా చూపించాలనే విషయంలో ఒత్తిడి ఫీలయ్యారా? చిరంజీవి గారితో ముందే బాగా డిస్కస్ చేసి మరీ వెళ్లాం కాబట్టి నో ప్రెజర్. ఆయన కనబడే అయిదు నిమిషాలూ అద్భుతంగా ఉండాలని మేం బోలెడన్ని కసరత్తులు చేశాం. నిజంగానే ఆయన ఆ ఐదు నిమిషాల ఎపిసోడ్‌తో సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లారు. చిరంజీవిగారు కేవలం ఓ యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే చేశారా? స్పెషల్ సాంగ్ కూడానా? లేదండీ. ఒక డైలాగ్, యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే ఉన్నాయి. పాట పెడదామని అత్యాశతో ప్రయత్నించాను గానీ కుదర్లేదు(నవ్వుతూ).ఈ సినిమాలో ఆరో పాటకు బదులు చిరంజీవిగారి ఎంట్రీ ఉంటుంది. అంతకు మించి నేనేం చెప్పలేను. చిరంజీవిగారి 150వ చిత్రాన్ని డెరైక్ట్ చేసే అవకాశం వస్తే చేస్తారా? తప్పకుండా. అది చాలా గొప్ప విషయం. ఆయనను మళ్లీ డెరైక్ట్ చేయాలని ఉంది. అన్నీ కుదిరితే తప్పకుండా చేస్తాను. చిరంజీవిగారితో ‘అందరివాడు’, రామ్‌చరణ్‌తో ‘బ్రూస్లీ’ చేశారు. వీళ్లిద్దరి మధ్య మీరు గమనించిన సిమిలారిటీస్? చిరంజీవిగారిలో కనిపించే బ్యాలెన్సెడ్ నేచర్, వర్క్ అంటే డెడికేషన్, కమిట్మెంట్ రామ్‌చరణ్ పుణికి పుచ్చుకున్నాడు. చిరంజీవిగారిది సెపరేట్ కామెడీ టైమింగ్. మరి చరణ్ కామెడీ టైమింగ్ ఎలా అనిపించింది? ఎవరి దగ్గరైతే సెన్సాఫ్ హ్యూమర్ ఉంటుందో వాళ్లందరూ నాకు బాగా కనెక్ట్ అవుతారు. రామ్‌చరణ్‌లో మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉంది. అందుకే చాలా ఈజీగా మా ఇద్దరి మధ్య మంచి ర్యాపో కుదిరింది. అది ఇప్పటి వరకూ ఆయన నటించిన సినిమాల్లో సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదని నా ఫీలింగ్. మీరు-కోన వెంకట్-గోపీమోహన్ మంచి టీమ్. ‘బాద్షా’ తర్వాత కోన వెంకట్‌తో ఇక పని చేయరని వార్తలొచ్చాయి. ‘బ్రూస్లీ’ కోసం చరణ్ మిమ్మల్ని కలిపారని టాక్. నిజమేనా? 2003 నుంచి మేం ట్రావెల్ అవుతున్నాం. క్లాషెస్ అనేవి కామన్. అలాగని శత్రుత్వం పెంచుకుని పనిచేయడం మానేయలేం కదా... నాకూ కోనతో పనిచేయాలని ఉంది. వాళ్లకూ అదే ఫీలింగ్. రామ్‌చరణ్ ఓ స్టెప్ ముందుకేసి మా కాంబినేషన్ మళ్లీ సెట్ చేశాడు. అయినా గతం గతః. ఇప్పుడు మా మధ్య ఎలాంటిస్పర్థలూ లేవు. అందరం ఫుల్ హ్యాపీ. మీకంటూ ఓ సెపరేట్ కామెడీ ట్రెండ్ సృష్టించారు. ‘బ్రూస్లీ’ కూడా ఆ తరహాలోనే ఉంటుందా? కథ చెప్పడంలో రెండు పద్ధతులు ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ కోసం కథ రాసుకోవడం ఓ పద్ధతి. కథను ఎంటర్టైనింగ్గా చెప్పడం ఓ స్టయిల్. నేను ఆ రె ండు పద్ధతుల్లో సినిమా తీసి విజయం సాధించాను. కానీ కథను ఎంటర్టైనింగ్గా చెప్పడంలో కిక్ ఉంది. ఎంటర్టైనింగ్గా కథను చెప్పడానికి చేసిన మరో ప్రయత్నమే బ్రూస్లీ.ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందించాం. మీ గత సినిమాల్లోలాగా ఎవరి మీదైనా పేరడీ ఉంటుందా? అసలు అలాంటి సన్నివేశాలేవీ ఇందులో ఉండవు. అందరికీ నచ్చేలా ఈ సినిమా రూపొందించాం. సెపరేట్ కామెడీ ట్రాక్ ఉండదు. కథతో పాటు హాస్యం మిళితమై ఉంటుంది. ‘ఢీ’ సినిమా నుంచి ఓ ఫార్మాట్ క్రియేట్ చేశాను. కానీ ఆ ఫార్మాట్ అందరికీ బోర్ కొట్టేసింది. నాతో పాటు చాలా మంది అదే ఫార్మాట్ ఫాలో అయ్యారు. నా మీద చాలా మందికి కోపం కూడా వచ్చింది. అందుకే ఈసారి నా పంథా మార్చాను. కానీ నా మార్క్ కామెడీ మాత్రం మిస్ కాదు. ఓ మంచి హిట్ సాధించి తీరాలన్న కసితో ఇంత పెద్ద సినిమాను అయిదు నెలల్లో కంప్లీట్ చేసినట్టున్నారు? ఒకటైతే నిజం. కొంత కాలం డిస్టర్బ్ అయ్యాను. నా మీద విమర్శలను కూడా ప్రేమగా తీసుకుని మళ్లీ వర్క్ చేయడం మొదలు పెట్టాను. ఇంత షార్ట్ స్పాన్‌లో ఇంత క ంటెంట్ ఉన్న సినిమా తీయడానికి నా టెక్నీషియన్స్, నటీనటుల సపోర్ట్ ఎంతో ఉంది. నా అదృష్టం ఏమిటంటే నాపై ఎలాంటి ప్రెజర్ లేదు. చాలా క్లారిటీతో ప్లానింగ్ చేసుకుంటూ ఈ షూటింగ్ చేశాం. ముఖ్యంగా కెమెరామ్యాన్ మనోజ్ పరమహంస సహకారం లేకపోతే రిలీజ్ డేట్ కచ్చితంగా మార్చాల్సి వచ్చేది. ‘ఆగడు’ టైమ్‌లో మీకూ ప్రకాశ్‌రాజ్‌కీ మధ్య మాటల యుద్ధం జరిగింది కదా. మళ్లీ కలిసి పని చేస్తారా? ఎందుకు చేయను? సినిమా అనేది క్రియేటివ్ జాబ్. కథకు ఏం కావాలో ఒక దర్శకునికి ఒక అవగాహన ఉంటుంది. ఆ అవగాహనతో మనం చెప్పింది ఒక్కోసారి కొంత మంది ఆర్టిస్ట్‌లకు నచ్చకపోవచ్చు. ఆ సమయంలో క్లాషెస్ సహజం. ప్రకాశ్ బ్రిలియంట్ యాక్టర్. ఆయనతో తప్పకుండా పని చేస్తాను. ‘ఆగడు’ సినిమా పరాజయాన్ని ఎప్పుడైనా విశ్లేషించుకున్నారా? కచ్చితంగా. గెలిచినప్పుడు కంటే ఓడినప్పుడే ఎక్కువ అనుభవాలు ఎదురవుతాయి. ఆ టైమ్‌లో మూడు రోజులు ఇంట్లోనే ఉండిపోయాను. నాలుగో రోజు నుంచి మళ్లీ మామూలైపోయి ‘బ్రూస్లీ’ కథ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. కెరీర్లో ఇబ్బందుల్ని ఎలా ఫేస్ చేయగలిగారు? ‘‘సాఫీగా సాగిపోయే జీవితం గురించి ప్రార్థించకు. ఎలాంటి కష్టాన్నయినా ఎదుర్కొనే బలం కోసం ప్రార్థించు’’ అని ‘బ్రూస్లీ’ చెప్పిన క్యాప్షన్‌ను ఈ సినిమాలో ఉపయోగించాం. దాన్నే నేనూ స్ఫూర్తిగా తీసుకున్నా. కష్టాలకు ఎదురెళ్లి పోరాడటమే కదా జీవితం. మీ సినిమాల్లో హీరోయిన్లకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడానికి కారణం? ఇది హీరో సెంట్రిక్ ఫీల్డ్ కాబట్టి హీరోయిన్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేం. లవ్‌స్టోరీ అయితే హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. మహేశ్‌బాబుతో మీ రిలేషన్ ఎలా ఉంది? మహేశ్ చాలా మంచి వ్యక్తి. తన గురించి మీకో ఎగ్జాంపుల్ చెబుతా. ‘ఆగడు’ విడుదలైన 5 రోజులకు నా పుట్టినరోజు వచ్చింది. మహేశ్‌బాబు మాత్రం నా పుట్టినరోజును చాలా ఘనంగా సెలబ్రేట్ చేశారు. ఇప్పటికీ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం. వీలు చిక్కితే కలుస్తాం. మా బంధం జయాపజయాలకు అతీతం. ఇంతకు మించి నేనేం చెప్పలేను. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్? ప్రస్తుతం కథలు తయారు చేసే పనిలో ఉన్నాను. ఇంకా ఎవరితో అనేది అనుకోలేదు. ఈ సినిమా రిలీజ్ తర్వాత ప్రకటిస్తా. ఈ మధ్య కాలంలో చాలామంది దర్శకులు సోషియో ఫ్యాంటసీ, హిస్టారికల్ మూవీస్ తీస్తున్నారు. మీక్కూడా అలాంటి ఆలోచనేమైనా ఉందా? ఆ ఆలోచనైతే ఉంది. ఎప్పుడు అనేది చెప్పలేను. దాని కోసం కొంత టైమ్ తీసుకుని రీసెర్చ్ చేయాలి. కచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు చేస్తాను. అలాగే బాలీవుడ్లో మసాన్, పీకూ, పీకే... లాంటి డిఫరెంట్ జానర్స్‌లో సినిమాలొస్తున్నాయి. నాక్కూడా హ్యూమన్ ఎమోషన్స్‌కు అద్దం పట్టే అలాంటి సినిమాలు తీయాలని ఉంది. కచ్చితంగా తీస్తా. అన్నీ కుదిరితే త్వరలో మంచి ప్రేమ కథ చేస్తా. -
బ్రూస్లీ ఆడియో హైలైట్స్
-
నా కల నెరవేరింది: సంపూర్ణేష్ బాబు
హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు, హీరో సంపూర్ణేష్ బాబు కల ఎట్టకేలకు నెరవేరింది. రాం చరణ్ తేజ హీరోగా నటిస్తున్న 'బ్రూస్ లీ' చిత్ర షూటింగ్ బుధవారం జరుగుతుండగా సెట్స్‌లోకి మెగా స్టార్ చిరంజీవి వచ్చాడు. అయితే ఎప్పటి నుంచో చిరూని కలవాలన్న సంపూ కల ఇన్ని రోజులకి నెరవేరింది. ఇంకేముంది వెంటనే చిరుదగ్గరికి వెళ్లి కలిసి ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఈ చిత్రంలో మోగా స్టార్ చిరంజీవి అతిథి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.. చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమాలో ఉన్నట్టుగానే ఇప్పుడు కనిపిస్తున్నారని..తన అభిమానాన్ని వ్యక్తం చేశాడు. Dream come true...Met MEGASTAR chiranjeevi Garu on BRUCE LEE Sets He looks like Gangleader chiranjeevi #Goosebumps — Sampoornesh (@sampoornesh) September 30, 2015 -
చిరు ముచ్చటగా మూడు నిమిషాలే!
హైదరాబాద్ : సుమారు ఎనిమిదేళ్ల విరామం అనంతరం మెగాస్టార్ చిరంజీవి మళ్లీ మేకప్ వేసుకున్నాడు. చిరంజీవి తన వారసుడు రామ్ చరణ్ తాజా చిత్రం 'బ్రూస్ లీ' లో 'చిరు' పాత్ర చేయబోతున్నాడు. గతంలో కూడా 'మగధీర'లో తనయుడితో కలిసి సెప్ట్లు వేసిన చిరంజీవి ...మళ్లీ కొడుకుతో కలిసి నటిస్తున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్రూస్ లీ లో చిరు మూడు నిముషాల పాటు సందడి చేయబోతున్నాడు. చిరంజీవి సోమవారం బ్రూస్ లీ షూటింగ్ స్పాట్‌కు వచ్చాడు. అయితే ఈ షూటింగ్ వ్యవహారాన్ని సింపుల్ గా చేయకుండా అత్యంత గ్రాండ్‌గా ఉండేలా దర్శకుడు శ్రీనువైట్ల సన్నాహాలు చేశాడు. హైటెక్ పరిసర ప్రాంతాల్లో చిరంజీవి ఎపిసోడ్‌కి సంబంధించిన సీన్స్ షూట్ చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో హెలికాప్టర్లు, గుర్రల్ని వాడుతున్నారు. అంతేకాకుండా మెగా అభిమానులు చిరంజీవికి శుభాకాంక్షలు తెలియచేస్తున్న దృశ్యాన్ని చిరంజీవి ఇంట్రడక్షన్ సీన్‌గా తీస్తున్నట్లు సమాచారం. ఇంద్ర, స్టాలిన్ సినిమాల స్థాయిలో భారీ సంఖ్యలో అభిమానుల మధ్య ఈ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారట. కాగా చిరంజీవి ఈసినిమాలో రియల్ మెగాస్టార్‌గా కనిపిస్తున్నట్లు టాక్. అక్టోబర్ 2న జరిగే ఆడియోలో చిరంజీవికి సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయనుంది. అక్టోబర్ 16న బ్రూస్ లీ మూవీ రిలీజ్ కాబోతోంది. కాగా మెగాస్టార్ ని శ్రీను వైట్ల ఎలా చూపించబోతున్నాడా అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. -
చిరు ముచ్చటగా మూడు నిమిషాలే!
-
‘బ్రూస్లీ - ది ఫైటర్’ మూవీ మేకింగ్
-
’బ్రూస్లీ’ సాంగ్ టీజర్ విడుదల
-
నా స్టయిల్ మార్చుకున్నా!
‘‘కెరీర్ ప్రారంభంలో ‘నీ కోసం’, ‘ఆనందం’ లాంటి ప్రేమకథలు తీశాను. ఆ తర్వాత తీసినవన్నీ కమర్షియల్ ఎంటర్టైనర్స్. ఎక్కువగా ఆ తరహా చిత్రాల మీదే దృష్టి పెట్టాను. అయితే, ఆ కథలను తెర మీద ఆవిష్కరించే విషయంలో ఒకే ప్యాట్రన్ ఫాలో అయ్యాను. ఒకే పంథాలో తీయడం వల్ల ప్రేక్షకులు కూడా బోర్ ఫీలయ్యారు. అందుకే, ‘బ్రూస్లీ’ చిత్రానికి నా స్టయిల్ మార్చుకున్నాను. ఎలాంటి కథలు ఎంచు కున్నా, ఏ పంథాలో తీసినా నాదైన శైలి వినోదం ఉంటుంది’’ అని దర్శకుడు శ్రీను వైట్ల అన్నారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ - ‘‘ప్రస్తుతం చేస్తున్న ‘బ్రూస్లీ’ నాకు స్పెషల్. రామ్‌చరణ్‌ను, చిరంజీవిగారిని ఒకేసారి ఈ సినిమాలో డెరైక్ట్ చేసే ఛాన్స్ రావడం నా అదృష్టం. చిరంజీవిగారు చేసిన పాత్ర కథలో భాగంగానే ఉంటుంది. ఆయన కనిపించే సన్నివేశాలు అభిమానులకు కన్నులపండగే. ఆయన పాత్ర ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అభిమా నులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, అది సస్పెన్స్. ఈ చిత్రంలో బ్రూస్లీ అభిమానిగా, స్టంట్‌మాస్టర్‌గా రామ్‌చరణ్ విభిన్న పాత్రలో కనిపిస్తారు. కొంత విరామం తర్వాత కోన వెంకట్, గోపీ మోహన్లతో పని చేయడం ఆనందంగా ఉంది. నా గత చిత్రాల్లా కాకుండా ఇందులో బ్రహ్మా నందం పాత్ర చిత్రణ కాస్త వైవిధ్యంగా ఉంటుంది’’ అని చెప్పారు. -
బ్రూస్లీ పాటకు నన్నెవరూ అడగలేదు: తమన్నా
బ్రూస్లీ సినిమాలో చిరంజీవి సరసన ప్రత్యేక పాట కోసం తనను ఎవరూ సంప్రదించలేదని మిల్కీ బ్యూటీ తమన్నా చెప్పింది. ఈ విషయంలో ఇప్పటివరకు వచ్చినవన్నీ తప్పుడు వార్తలేనని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. బాహుబలి హిట్‌తో మంచి జోరుగా ఉన్న తమన్నాను.. ఈ సినిమాలో ప్రత్యేక గీతం కోసం ఎంపిక చేశారని కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. రామ్‌చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ యాక్షన్ డ్రామా బ్రూస్లీ. దాదాపు ఏడాది తరువాత రిలీజ్ అవుతున్న చరణ్ సినిమా కావటంతో అన్ని రకాల హంగులతో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. బ్రూస్లీలో ఓ యాక్షన్ సీన్‌తో పాటు స్పెషల్ సాంగ్‌లో కూడా నటిస్తున్నాడు చిరు. చాలా కాలం తరువాత చిరు వెండితెర మీద కనిపిస్తుండటంతో ఈ సాంగ్‌ను భారీ స్థాయిలో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే థమన్ అదిరిపోయే ట్యూన్ అందించాడన్న టాక్ వినిపిస్తుండగా, చిరుతో చిందేసే అందాలభామ కోసం చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. దసరా నాటికి ఈ సినిమాను విడుదల చేయాలని తలపెడుతున్నా.. చిరంజీవి పాట విషయం ఎంతకీ తేలకపోవడం కొంత ఇబ్బందిగానే ఉన్నట్లు తెలుస్తోంది. Not been approached for any song in the film #BruceLee , false news guys!!!! — Tamannaah Bhatia (@tamannaahspeaks) September 18, 2015 -
నిర్విఘ్నంగా సినిమా పండగ
క్యూ కిటకిటలాడుతోంది. చవితి మంటపాల్లో భక్తులు... రిలీజ్‌ల కోసం నిర్మాతలు.... ఇప్పటి నుంచి దీపావళి దాక.... 50 రోజులు... 50 సినిమాలు... సినిమా చూపిస్త మామా... నీకు సినిమా చూపిస్త మామా... ప్రేక్షకులు ఫుల్. ప్చ్.... థియేటర్లు నిల్. స్వామీ... గణనాయకా... థియేటర్లు కూడా నీ హోల్డ్‌లో తీసుకొని మాకు కాసిన్ని పడేయ్ తండ్రీ.... తెలిసిన హీరో... లేత స్టార్... తాజా కుర్రాడు.... తోపులాటలో ఎవరు ముందు ఎవరు వెనుక? శశివర్ణం... చతుర్భుజం.... ఎగ్జిబిటర్లు హ్యాపీగా ఉన్నారు. ఒక సినిమా అడిగితే నాలుగు ఇస్తామంటున్నారు. ఇండస్ట్రీ కళకళలాడుతోంది. వినోదం పంట పండుతోంది. ‘సాక్షి’ తన వంతుగా ఈ సమాచారంతో పాఠక దేవుళ్ళకు నైవేద్యం అందిస్తోంది. సినిమా పేరు: బ్రూస్లీ... శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్‌చరణ్ నటి స్తున్న యాక్షన్ ఎంటర్టైనర్. అక్టోబర్ 16న రిలీజ్‌కు సిద్ధమవుతున్నారు. చిరంజీవి గెస్ట్ అప్పీయరెన్స్ స్పెషల్ ఎట్రాక్షన్. సినిమా పేరు: అఖిల్ హీరో నితిన్ నిర్మాణంలో అఖిల్ తెరంగేట్రం. రూ. 50 కోట్ల బడ్జెట్‌తో వి.వి. వినాయక్ దర్శకత్వంలో వస్తున్న సోషియో ఫ్యాంటసీ. అక్టోబర్ 22న రిలీజ్. సినిమా పేరు: బెంగాల్ టైగర్ సంపత్ నంది దర్శకత్వంలో రవితేజ చేస్తున్న భారీ చిత్రం. తమన్నా, రాశీఖన్నా హీరోయిన్లు. బొమన్ ఇరాని స్పెషల్ ఎట్రాక్షన్. అక్టోబర్ రిలీజ్. సినిమా పేరు: శివమ్ దాదాపు రూ. 20 కోట్ల బడ్జెట్‌తో శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో రామ్ నటిస్తున్న ‘ఢీ’, ‘కందిరీగ’ తరహా యాక్షన్ ఎంటర్టైనర్. అక్టోబర్ 2న రిలీజ్. సినిమా పేరు: షేర్ మల్లికార్జున్ దర్శకత్వంలో బయటి బేనర్లో కల్యాణ్‌రామ్ చేస్తున్న సినిమా. పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. అక్టోబర్ సెకండ్ వీక్‌లో విడుదల. సోనాల్ చౌహాన్ నాయిక. సినిమా పేరు: సాహసం శ్వాసగా సాగిపో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మరోసారి నాగచైతన్య చేస్తున్న చిత్రం. మంఝిమ కథానాయిక. యాక్షన్ లవ్‌స్టోరీ. నవంబ ర్లో రిలీజ్. ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్. సినిమా పేరు: నాయకి తెలుగు తమిళ భాషల్లో త్రిష నటిస్తున్న హారర్ థ్రిల్లర్. గోవి దర్శకుడు. రఘు కుంచె సంగీతం. 1980ల నాటి కథ, లుక్స్ ఉంటాయి. షూటింగ్లో ఉంది. సినిమా పేరు: కొలంబస్ ఆర్.సామల దర్శకత్వంలో సుమంత్ అశ్విన్ నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్. సీరత్ కపూర్, మిస్తీ హీరోయిన్స్. నవంబర్‌లో రిలీజ్. సినిమా పేరు: కృష్ణాష్టమి వాసు వర్మ దర్శకత్వంలో సునీల్ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్. కోన వెంకట్ కథ. దినేష్ సంగీతం. త్వరలో విడుదల. సినిమా పేరు: సుబ్రమణ్యం ఫర్ సేల్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ నటించిన సినిమా. రెజీనా హీరోయిన్. పిల్లా నువ్వు లేని జీవితం తర్వాత మరో ఎంటర్టైనర్. ఈ నెల 24న రిలీజ్. సినిమా పేరు: కంచె రెండో ప్రపంచయుద్ధం నేపధ్యంలో వరుణ్‌తేజ్ నటిస్తున్న క్రిష్ చిత్రం. చిరంతన్ భట్ సంగీతం. అదిరిపోయే లొకేషన్స్‌లో చిత్రీకరణ. అక్టోబర్ 2 విడుదల. సినిమా పేరు: శంకరాభరణం నిఖిల్, నందిత కాంబినేషన్లో ఉదయ్ నందనవనం దర్శకత్వంలో వస్తున్న క్రైమ్ కామెడీ. పాత శంకరాభరణానికీ దీనికీ సంబంధం లేదు. నవంబర్‌లో విడుదల. సినిమా పేరు: పులి చాలాకాలం తర్వాత శ్రీదేవి నటిస్తున్న చిత్రం. హీరో విజయ్. దర్శకత్వం సింబు దేవన్. జానపద స్వభావం ఉన్న సినిమా. అక్టోబర్1న రిలీజ్. సినిమా పేరు: కుమారి 21 ఎఫ్. రాజ్‌తరుణ్ హీరోగా నటించిన మూడో సినిమా. సుకుమార్ కథ, మాటలు సమకూర్చడం విశేషం. సూర్యప్రతాప్ దర్శకుడు. అక్టోబర్ 30న రిలీజ్. సినిమా పేరు : భలే మంచిరోజు సుధీర్ బాబు హీరోగా శ్రీరామ్ ఆదిత్వ రచన, దర్శకత్వంలో విజయ్, శశి నిర్మిస్తున్న సినిమా ఇది. సన్ని ఎమ్మార్ సంగీతం. కొత్త తరహా కథతో థ్రిల్ చేసే కథనం. సినిమా పేరు : గరమ్ మదన్ దర్శకత్వంలో ఆది హీరోగా రూపొందుతున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇది. ఆదా శర్మ కథానాయిక. బ్రహ్మానందం పికె గెటప్ స్పెషల్. పాటలు మినహా పూర్తి. సినిమా పేరు : నిర్మలా కాన్వెంట్ హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ నాగార్జున నిర్మిస్తున్న చిత్రం. నాగార్జున స్పెషల్ రోల్. నాగ కోటేశ్వరరావు దర్శకుడు. షూటింగ్ జరుగుతోంది. సినిమా పేరు : అబ్బాయితో అమ్మాయి రమేష్ వర్మ దర్శకత్వంలో నాగ శౌర్య నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్. ఇళయరాజా సంగీతం. సినిమా దాదాపుగా పూర్తయ్యింది. త్వరలో విడుదల. సినిమా పేరు : త్రిపుర గీతాంజలి ఫేమ్ రాజకిరణ్ దర్శకత్వంలో కలర్స్ స్వాతి నటించిన ద్విభాషా చిత్రం. కలల నేపథ్యంలో వస్తున్న థ్రిల్లర్. సుమారు 5 కోట్ల బడ్జెట్. అక్టోబర్‌లో రిలీజ్. సినిమా పేరు : కొబ్బరి మట్ట సంపూర్ణేశ్‌బాబు హీరోగా రూపక్ రోనాల్డ్ సన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. పెదరాయుడు, పాపా రాయుడు, ఆండ్రాయుడుగా సంపూ త్రిబుల్ పోజ్. సంక్రాంతి బరిలో... పెద్ద పండుగ దసరాకు యువ హీరోల పోటీ సాగుతుంటే, వచ్చే ఏడాది సంక్రాంతికి సీనియర్ సినీ హీరోలు బరిలో దిగుతున్నారు. శ్రీనివాస్ దర్శకత్వంలో బాబాయ్ బాలకృష్ణ ‘డిక్టేటర్’గా రావడానికి తయారవుతున్నారు. సుకుమార్ డెరైక్షన్‌లో అబ్బాయి చిన్న ఎన్టీయార్ కూడా ఆ టైమ్‌కి ‘నాన్నకు ప్రేమతో...’ (వర్కింగ్ టైటిల్) అని చెప్పాలనుకుంటున్నారు. చిరంజీవి ఫ్యామిలీ నుంచి కూడా సంక్రాంతి మొనగాళ్ళు వస్తున్నారు. బాబీ డెరైక్షన్‌లో పవన్‌కల్యాణ్ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’గా మరోసారి పోలీస్ యూనిఫామ్‌లో సందడి చేయనున్నారు. ఈ భారీ యాక్షన్ బాక్సాఫీస్ వార్ మధ్యలో ప్రేమపుష్పాలు కూడా పూస్తున్నాయి. ‘నువ్వే - నువ్వే’ తరువాత చాలాకాలం విరామానికి త్రివిక్రమ్ ఒక పూర్తిస్థాయి ప్రేమకథతో యువ హీరో నితిన్‌ను ‘అ...ఆ...’ అనిపిస్తున్నారు. వరస చూస్తుంటే, కొత్త ఏడాది ప్రారంభంలో మొదటి రెండు వారాలూ తెలుగు లోగిళ్ళలోనే కాక, సినిమాహాళ్ళలోనూ పండుగ వాతావరణం సందడి చేయనుంది. క్రిస్మస్ కానుకలు... ఈ డిసెంబర్లో కూడా ప్రముఖ హీరోల పెద్ద చిత్రాల హంగామా కొనసాగనుంది. మోహన్‌బాబు, నాగార్జున లాంటి సీనియర్ హీరోలతో పాటు గోపీచంద్, రామ్ లాంటి యువ హీరోలు కూడా ఈ డిసెంబర్ సినిమా సీజన్‌కు కళ తేనున్నారు. మోహన్‌బాబు, ‘అల్లరి’ నరేశ్ కలసి నటిస్తున్న వినోదభరిత చిత్రం ‘మామ మంచు - అల్లుడు కంచు’ చిత్రం ఈ క్రిస్మస్ సంబరాన్ని పెంచనుంది. దర్శకుడు శ్రీనివాసరెడ్డి తనదైన తరహాలో ఇందులో కామెడీ పండిస్తారని భావిస్తున్నారు. కల్యాణ్‌కృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ, నాగార్జున నిర్మిస్తున్న ‘సోగ్గాడే... చిన్ని నాయనా’ రిలీజ్ కూడా ఆ సీజన్లోనే. చాలాకాలం తర్వాత నాగ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో రమ్యకృష్ణ నటించడం మరో స్పెషల్ ఎట్రాక్షన్. పదేళ్ళ క్రితం నాటి ‘యజ్ఞం’ తరువాత ఏ.ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో గోపీచంద్ చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ డిసెంబర్లో వస్తుంది. రచయిత కిశోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘హరికథ’ కూడా ప్రేక్షకులకు క్రిస్మస్ కానుకే. వేర్వేరు జానర్ల ఈ చిత్రాలతో తెలుగు తెర కొత్త ఏడాదికి స్వాగతం పలకనుంది. బాహుబలి, రుద్రమదేవి లాంటి పెద్ద సినిమాలు వస్తాయంటూ, మిగిలిన సినిమాలు రిలీజ్ చేయకుండా బంగారం లాంటి సమ్మర్ సీజన్ అంతా మనకు మనమే వృథా చేసుకున్నాం. అలా షూటింగ్‌లు, రిలీజ్లు డిలే చేసుకుంటూ వచ్చిన సినిమాలన్నీ ఇప్పుడు ఒక్కసారిగా రిలీజ్‌కు వచ్చాయి. అందుకే సినిమాల క్లాష్ సమస్య, థియేటర్ల సమస్య. - ప్రముఖ నిర్మాత - హీరో నితిన్ తండ్రి ఎన్. సుధాకరరెడ్డి కొన్ని వారాల వ్యవధిలోనే ఇన్ని సినిమాలు బరిలో ఉండటం అంటే ఒక రకంగా మా కత్తితో మేమే పొడుచుకోవడమే. ఇలా ఒకేసారి పెద్ద సినిమాలన్నీ రావడం వల్ల రావాల్సినంత రెవెన్యూ రాదు. నిర్మాతలకూ, బయ్యర్లకూ రావాల్సిన ఆదాయంలో దాదాపు 25 శాతం కోత పడుతుంది. అంటే డబ్బు కొంత నష్టపోవడానికి ముందే సిద్ధపడి సినిమా రిలీజ్ చేయడమన్న మాట. ఇది నిజంగా బాధ కలిగించే విషయం. - ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ -
బాహుబలికి షాక్ ఇచ్చిన బ్రూస్లీ
-
బ్రూస్లీ ఫైటింగ్!
అదో పెద్ద గది. గదిలో మొత్తం అద్దాలు. ఆ గదిలోకి ఎంటరయ్యేవాళ్లు అన్ని అద్దాల్లోనూ కనిపిస్తారు. ఏది రియల్ ఇమేజ్.. ఏది మిర్రర్ ఇమేజో కనుక్కోలేం. నాయకుడు, ప్రతినాయకుడు మధ్య ఆ గదిలో ఫైట్ సీన్ ఉంటే, ఏది అసలు ఇమేజ్.. ఏది నకిలీ అని తికమకపడిపోతారు. హాలీవుడ్ చిత్రాలను బాగా ఫాలో అయ్యేవారికి ‘ఎంటర్ ది డ్రాగన్’లోని ఈ సీన్ వెంటనే గుర్తొచ్చేస్తుంది. ఆ వెంటనే అద్భుతంగా ఫైట్స్ చేసే ఆ చిత్రకథానాయకుడు బ్రూస్లీ గుర్తు రాకుండా ఉండరు. మార్షల్ ఆర్ట్స్ పేరు చెప్పగానే ఇప్పటికీ అందరూ తలుచుకొనేది బ్రూస్లీనే. ఎప్పుడో నలభై ఏళ్ల క్రితం చని పోయిన బ్రూస్లీని ఇప్పుడు గుర్తు చేసుకోవ డానికి కారణం ఉంది. రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘బ్రూస్లీ... ది ఫైటర్’ పేరు ఖరారు చేశారు. దీన్ని బట్టి చరణ్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని ఊహించవచ్చు. ఈ సినిమాలో ఆయన స్టంట్‌మ్యాన్‌గా నటిస్తు న్నారు. దీని కోసం చరణ్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని భోగట్టా. సో... థ్రిల్‌కి గురి చేసే కొత్త రకం ఫైట్స్‌తో విలన్లను రఫ్ఫాడిస్తారని చెప్పొచ్చు. శ్రీను వైట్ల దర్శకత్వంలో డి. పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం విజయ దశమికి విడుదల కానుంది. -
మూడు నెలల వయసులోనే... తెరపై!
బ్రూస్లీ.. ఈ పేరు వినని సినీ ప్రియులు ఎవరూ ఉండరేమో! ఈ మార్షల్ ఆర్ట్స్ హీరోను స్ఫూర్తిగా తీసుకుని చాలా మంది నటులు వెండితెరపై వెలిగారు. బ్రూస్లీ చేసింది 32 చిత్రాలైనా ప్రేక్షకులు గుండెల్లో చెరగని ముద్ర వేశారు. అయితే, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా బ్రూస్లీ కూడా చిన్నతనంలోనే వెండితెరపై తళుక్కుమన్న సంగతి చాలా మందికి తెలీదేమో! మూడు నెలల వయసులోనే ఆయన ‘గోల్డెన్ గేట్ గర్ల్’ చిత్రంలో కనిపించారు. 1941లో షూటింగ్ జరిగిన ఈ చిత్రం 1946లో విడుదలైంది. అన్నట్లు, బాలనటుడిగా ఆయన మొత్తం 20 చిత్రాలలో నటించారు. బ్రూస్లీ తండ్రి లీ హాయ్ చూన్ హాంగ్‌కాంగ్‌కు చెందిన ప్రసిద్ధ గాయకుడు. పెద్దయ్యాక యాక్షన్ హీరో బ్రూస్లీ రేపిన సంచలనం గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదేమో! -
బ్రూస్ లీ మళ్లీ వచ్చాడు!!
కాబూల్: గాల్లో ఇంతెత్తున ఎగురుతూ బీభత్సమైన కరాటే పోజు పెట్టిన ఈ కండలు తిరిగిన యువకుడు ఎవరో గుర్తుపట్టారా? అచ్చం అలనాటి మార్షల్ ఆర్ట్స్ వీరుడు బ్రూస్ లీ లా ఉన్నాడు కదూ. ఉండటం ఏమిటి.. అలనాటి బ్రూస్లీ ఫొటోయేనంటారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఈ కుర్రాడు అఫ్ఘానిస్థాన్‌కు చెందిన అబ్బాస్ అలీజాదా. నిన్న మొన్నటి వరకు అతడూ మామూలు యువకుడే. కానీ, బ్రూస్లీ ఫొటో పక్కనే తానూ ఫొటో తీయించుకుని, దాన్ని ఫేస్బుక్లో అప్లోడ్ చేయడంతో ఒక్కసారిగా ఇతడి పేరు మార్మోగిపోయింది. సోషల్ మీడియాలో అతడికి ఫాలోయింగ్ బీభత్సంగా పెరిగింది. 'ఓల్డ్ డ్రాగన్ - న్యూ డ్రాగన్' అనే క్యాప్షన్‌తో పెట్టిన ఫొటో సోషల్ మీడియాలో బాగా ప్రచారమైంది. అబ్బాస్ 14 ఏళ్ల వయసులో ఉండగా అతడికి బ్రూస్ లీ యాక్షన్ సినిమాల మీద ఆసక్తి కలిగింది. బ్రూస్ లీ, జాకీచాన్ లాంటి మార్షల్ ఆర్ట్స్ హీరోల సినిమాలకు అఫ్ఘానిస్థాన్‌లో ఎప్పుడూ బోలెడంత ఆదరణ ఉంది. అబ్బాస్ లాంటి చాలామంది యువకులు కరాటే, కుంగ్ ఫూ లాంటి యుద్ధవిద్యలు నేర్చుకున్నారు. కొన్నాళ్ల పాటు కాబూల్ స్పోర్ట్స్ క్లబ్బులో శిక్షణ పొందినా, తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా ఆగిపోయాడు. దాంతో ఇంటివద్దే ప్రాక్టీసు చేయడం మొదలుపెట్టాడు. కొంతమంది తనను బాగానే ఆదరిస్తున్నా, మరికొందరు మాత్రం ఫొటోలను ఫొటోషాప్‌లో మార్చేశారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని అబ్బాస్ వాపోయాడు. ఇప్పుడు అతడికి ఏవైనా అవకాశాలు వస్తే వాటి ఆధారంగా ఆ పేద కుటుంబం కాస్త బతకాలని ఆశపడుతోంది. -
పంచ్ ఫిలాసఫర్!
బ్రూస్లీ కి బాగా పేరొచ్చాక... ‘రా, చూస్కుందాం’ అని కాల్‌తో నేలని తన్నేవారు ఎక్కువయ్యారు. నేలని కాలితో తన్నడం అంటే సవాల్ విసరడం. బ్రూస్లీ ని ఓడించడం గొప్ప కదా.. అందుకు! బ్రూస్ లీ నవ్వేవాడు. సవాల్ చేసింది పిల్లలైతే కాసేపు వారిని ఆడించేవాడు. సవాల్ చేసింది పెద్దలైతే కాసేపు వారిని రఫ్ఫాడించేవాడు. బ్రూస్ లీ బలమంతా అతడి చేతుల్లో, కాళ్లలో ఉందనుకుంటాం కదా... కానీ నిజంగా బలమైనవి అతడి చిరునవ్వు, చిరుత కళ్లు. ఇంకా బలమైనది అతడి ఫిలాసఫీ! ఓటమి అనేది పడిపోయానని అనుకోవడంలో ఉంది తప్ప... పడిపోవడంలో లేదని అంటాడు బ్రూస్ లీ. చిన్న జీవితంలో పెద్ద ఫిలాసఫీని చూసిన ఈ యుద్ధవిద్యా ప్రవీణుడి వర్ధంతి ఇవాళ. ఆ సందర్భంగా... సాక్షి ఫ్యామిలీ... నివాళి. సినిమా ఆగిపోయింది! రేమాండ్ చో హతాశుడయ్యాడు. ‘గేమ్ ఆఫ్ డెత్’ నిర్మాత అతడు. అయితే అతడు హతాశుడయ్యింది ‘గేమ్ ఆఫ్ డెత్’ ఆగిపోయినందుకు కాదు. మరి?! స్క్రిప్టులో చేయవలసిన మార్పుల గురించి ఆ మధ్యాహ్నమే బ్రూస్ లీ, రేమాండ్ చో దాదాపు రెండు గంటల సేపు మాట్లాడుకున్నారు. అసలు అందుకోసమే అమెరికా టూర్ నుంచి హాంగ్‌కాంగ్ చేరుకున్నాడు బ్రూస్ లీ. బ్రూస్ లీ రాసిన కథకు, బ్రూస్ లీ చేస్తున్న డెరైక్షన్‌లో, బ్రూస్ లీ నటిస్తున్న చిత్రం ‘గేమ్ ఆఫ్ డెత్’. తీసినంత వరకు సంతృప్తికరంగా వచ్చింది. మరికొన్ని సీన్లు ఉన్నాయి. వాటిల్లో మార్పులు చేర్పుల గురించి నోట్స్ రాసుకున్నాక ఇద్దరూ కలిసి కారులో బెట్టీ టింగ్ పే ఉంటున్న అపార్ట్మెంట్కి బయల్దేరారు. బెట్టీ ఆ సినిమాలో బ్రూస్ లీ భార్యగా నటిస్తున్న తైవాన్ నటి. ముగ్గురూ కలిసి మళ్లీ ఒకసారి స్క్రిప్ట్టును సరిచూసుకున్నారు. ఆ తర్వాత, అక్కడికి దగ్గర్లోనే డిన్నర్ మీటింగ్ ఉంటే అక్కడి వెళ్లాడు రేమాండ్. అక్కడికి లీ కూడా వెళ్లాల్సి ఉంది. కానీ వెళ్లలేదు. బ్రూస్ లీ ఎంతసేపటికీ రాకపోవడంతో రేమాండ్ అపార్ట్మెంట్కి తిరిగొచ్చాడు. అప్పటికే బ్రూస్ లీ నిద్రపోతూ కనిపించాడు! వేళ కాని వేళ ఇదేమిటి? రేమాండ్ తట్టి లేపాడు. బెట్టీ తట్టి లేపింది. ఎంత లేపినా బ్రూస్ లీ లేవలేదు. అనుమానం వచ్చి అంబులెన్స్‌ని పిలిపించారు. క్వీన్ ఎలిజబెత్ ఆసుపత్రికి చేరుకుంటుండగా... అప్పటికే బ్రూస్ లీ మరణించి ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు! రేమాండ్ చో హతాశుడయ్యాడు. గేమ్ ఆఫ్ డెత్ ఆగిపోయినందుకు కాదు. డెత్ బ్రూస్ లీ తో గేమ్ ఆడినందుకు! మళ్లీ స్క్రిప్టు మారింది. కాదు కాదు, విధి మార్పించింది. మాఫీయా నుంచి తప్పించుకోడానికి బ్రూస్ లీ తను చనిపోయినట్లుగా నాటకం ఆడినట్లు మార్పు చేశారు. బ్రూస్ లీ అంత్యక్రియలు జరుగుతున్నపుడు క్లోజప్‌లో తీసిన నిజమైన దృశ్యాలను సినిమాలో వాడుకున్నారు. అయితే ఆ సినిమా ఇప్పటికీ పూర్తి కాలేదు. రేమాండ్ చో వయసు ప్రస్తుతం 85 ఏళ్లు. బతికుంటే బ్రూస్ లీ వయసు 74 ఏళ్లు. ఇద్దరూ కలిసి ఇప్పటికి ఎన్ని సినిమాలో తీసేవారు, మనం ఎన్ని సినిమాలు చూసేవాళ్లమో. అదృష్టం ఎవరికీ లేకపోయింది. రేమాండ్కీ, మనకు. ************* బ్రూస్ లీ చనిపోయి నలభై ఏళ్లు దాటిపోయాయి. అసలు ఆయన ఎలా చనిపోయాడన్న విషయమై నేటికీ హాంకాంగ్‌లో, అమెరికాలో ఆయన అభిమానులు గతాన్ని తవ్వుతూనే ఉన్నారు. విషప్రయోగం జరిగి ఉంటుందని ఒక అనుమానం. తలనొప్పి మాత్రలు వేసుకోవడం వల్ల అవి వికటించి చనిపోయాయాడని ఒక వాదన. ఈ వాదనకు బలం చేకూర్చే సంఘటన ఒకటి, బ్రూస్ లీ చనిపోడానికి రెండు నెలల ముందు జరిగింది. ఆరోజు మే 10. హాంగ్‌కాంగ్‌లోని గోల్డెన్ హార్వెస్ట్ స్టూడియోస్‌లో ‘ఎంటర్ ది డ్రాగన్’ చిత్రానికి డబ్బింగ్ చెబుతూ, ఫిట్స్ వచ్చి బ్రూస్ లీ కుప్పకూలి పోయాడు. వెంటనే అక్కడికి దగ్గర్లోని బాప్టిస్ట్ హాస్పిటల్‌కు అతడిని తరలించారు. డాక్టర్లు ‘సెరెబ్రెల్ ఎడెమా’ అన్నారు. మెదడు వాయడం వల్ల బ్రూస్ లీ కుప్పకూలిపోయాడని నిర్థరించారు. సరిగ్గా ఇవే లక్షణాలు బ్రూస్ లీ మరణించిన రోజు జూలై 20న ఆయనలో కనిపించాయి. అయితే ఆ లక్షణాలు పైకి కనిపించలేదు. లోపల్లోపలే అంతా జరిగిపోయింది. బ్రూస్ లీ మరణాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన సినీ అభిమానులు జీర్ణించుకోలేక పోయారు. మార్షల్ ఆర్ట్స్‌లో ఆయన శిష్యులు, గురువులు ‘బ్రూస్లీ ఇకలేడు’ అనే వార్త విని తట్టుకోలేకపోయారు. ఇప్పటికీ టీవీలలో పదే పదే ప్రసారమవుతుండే బ్రూస్ లీ చిట్టచివరి సినిమా ‘ఎంటర్ ది డ్రాగన్’ ను మనం ఎన్నోసార్లు చేసి ఉంటాం. కానీ బ్రూస్ లీ చూసుకోలేకపోయారు. ఆ సినిమా రిలీజ్ అవడానికి ముందే ఆయన మృత్యువాత పడ్డారు. ది బిగ్ బాస్ , ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ (ది చైనీస్ కనెక్షన్), వే ఆఫ్ డ్రాగన్ (రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్), ఎంటర్ ది డ్రాగన్ చిత్రాలు బ్రూస్ లీని చిరస్మరణీయుడి చేశాయి. అప్పటివరకు ప్రపంచానికి ఆసియా సినిమాల మీద ఉన్న చిన్నచూపును దూరం చేశాయి. అంతే కాదు, కేవలం బ్రూస్ లీ కారణంగా హాలీవుడ్... ఆసియా చిత్రాలను గౌరవించడం నేర్చుకుంది. అలాగే అనుకరించడం కూడా! బ్రూస్ లీ తన సినిమాల్లో చైనా సంప్రదాయాలను ఎక్కువగా చూపించేవాడు. అందుకనే చైనీయులు కూడా బ్రూస్ లీ సినిమాలను బాగా ఇష్టపడేవారు. బ్రూస్ లీని ఆరాధించేవారు. కుంగ్‌ఫూతో శత్రువును బ్రూస్ లీ మట్టికరిపిస్తుంటే చూడాలి... చైనా ప్రేక్షకులను పట్టలేం. కుంగ్‌ఫూ వారి సంప్రదాయ క్రీడ మరి. ‘ది బిగ్ బాస్’ కంటే ముందు బ్రూస్ లీ తన తొలిచిత్రం ‘మార్లోవ్’లో నటించాడు. అంతకంటే ముందు చిన్నారి బ్రూస్ లీగా అనేక చిత్రాలలో నటించాడు. అసలైతే బ్రూస్ లీ వెండి తెరమీద కనిపించిన మొట్టమొదటి సినిమా ‘గోల్డెన్ గేట్ గర్ల్’. అప్పటికి బ్రూస్ లీ వయసు మూడు నెలలు! ఆ సినిమాలో నటిస్తున్న ఒక అమెరిన్ బేబీకి ఒంట్లో బాగోలేకపోతే ఆ స్థానంలో బ్రూస్లీని కూర్చోబెట్టారు. ************ బ్రూస్ లీ సినిమాలు ఎంతగా ప్రజాదరణ పొందాయో, చేతులే ఆయుధమైన యుద్ధవిద్యల్లో (ముఖ్యంగా కరాటే విద్యలో) బ్రూస్ లీ అంతగా పేరు తెచ్చుకున్నారు. అతడిలో డ్రాగన్ అంశ ఏదో ఉండేది. డ్రాగన్‌లా చురుగ్గా కదిలేవాడు. డ్రాగన్‌లా చురుగ్గా చూసేవాడు. దేహం క రడుగట్టి ఉండేది. దృఢంగా ఉండడం కోసం అతడు గంటల తరబడి కసరత్తు చేసేవాడు. ఇక బ్రూస్ లీ కనిపెట్టిన ‘వన్ ఇంచ్ పంచ్’ టెక్నిక్ గురించి అయితే ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రత్యర్థికి అంగుళం దూరంలో మాత్రమే చేతిని ఉంచి బలంగా కొట్టడం ప్రపంచంలో ఇంతవరకు ఏ యోధుడు కూడా చెయ్యలేని పని. బ్రూస్ లీ వల్ల మాత్రమే అయిన పని! సాధారణంగా గట్టి దెబ్బ తగలాలంటే చేతిని దూరం నుంచి లాగి కొట్టాలి. అలాంటిది బ్రూస్ లీ అంగుళం దూరం నుంచే అంత దెబ్బను కొట్టేవాడు. మందంగా ఉండే చెక్క సైతం వన్ ఇంచ్ పంచ్‌తో రెండు ముక్కలయ్యేది. అంత ఫోర్సు బ్రూస్ లీలో ఎక్కడిది? బహుశా డ్రాగన్ అంశ ఏదో ఉండివుండాలి. *********** 1940 నవంబర్ 27న చైనీస్ క్యాలెండర్ ప్రకారం డ్రాగన్ సంవత్సరంలో, డ్రాగన్ ఘడియల్లో జన్మించాడు బ్రూస్ లీ. జన్మస్థలం మాత్రం చైనా కాదు. కాలిఫోర్నియాలోని శాన్ఫ్రాన్సిస్కో. అక్కడి జాక్సన్ స్ట్రీట్ హాస్పిటల్లో ‘కేర్’మన్నాడు. తండ్రి లీ హోయ్ ఛెన్ ఆ సమయంలో అక్కడ లేడు. (పాటలంటూ అమెరికాలో టూర్లు తిరుగుతున్నాడు). తల్లి గ్రేస్ హో ఉన్నా, మెలకువలో లేదు. దాంతో రికార్డులో రాయడం కోసం నర్సే ఆ పసికందుకు ‘బ్రూస్ లీ ’ అనే అమెరికన్ పేరు పెట్టింది. అలా పుట్టుకతోనే బ్రూస్ లీ అమెరికన్ అయ్యాడు. అయితే బ్రూస్ లీని కుటుంబ సభ్యులెవ్వరూ ఎప్పుడూ బ్రూస్ లీ అని పిలవలేదు! ఆ చిన్నారికి వారు పెట్టుకున్న పేరు ‘లిటిల్ ఫీనిక్స్’. అదే పేరుతో పిలిచేవారు. అప్పుడప్పుడూ ఇంకో ముద్దు పేరు ‘సాయ్ ఫోన్’ అంటూ దగ్గరకు తీసుకునేవారు. నిజానికి లిటిల్ ఫీనిక్స్ అనేది ఆడపిల్ల పేరు. కావాలనే అలా పెట్టారు. దుష్టశక్తులకు మగపిల్లలంటే ఇష్టం ఉండదని, అందుచేత వారిని త్వరగా తీసుకుపోతాయని బ్రూస్ లీ తల్లిదండ్రులకు ఓ నమ్మకం. అందుకే ఆ దృష్ట శక్తులను తప్పుదారి పట్టించడం కోసం బ్రూస్ లీకి ఆడపిల్ల పేరు పెట్టారు. బ్రూస్ లీ తండ్రి లీ హోయ్ గాయకుడు. బ్రూస్ లీ పుట్టకముందు హాంగ్‌కాంగ్‌లోని ఒక అపేరాలో పనిచేసేవారు. ఉపాధికోసం అమెరికా వచ్చినప్పుడు బ్రూస్ లీ పుట్టాడు. (ఐదుగురు పిల్లల్లో అతడు నాల్గవవాడు). తిరిగి అదే ఏడాది లీ హోయ్ తన కుటుంబంతో సహా హాంగ్‌కాంగ్ చేరుకున్నాడు. అప్పటికి హాంగ్‌కాంగ్ జపాన్ అధీనంలో ఉంది. లీ హోయ్కి పెద్ద పెద్ద వాళ్లతో, సినిమా ప్రముఖులతో పరిచయాలు ఉండేవి. అలా బ్రూస్ లీకి ఆరేళ్ల వయసుకే 20 సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అదొక్కటే కాదు బ్రూస్ లీ చక్కగా డాన్స్ చేసేవాడు. టీనేజ్‌కి వచ్చే సరికి కవితలూ రాయడం మొదలుపెట్టాడు. అప్పుడే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం కూడా. బ్రూస్ లీ హైస్కూల్ చదువుకి వచ్చేనాటికి ఆ కుటుంబం మళ్లీ అమెరికా చేరుకుంది. అక్కడే వాషింగ్టన్‌లోని ఎడిసన్‌లో తన స్కూలు చదువు పూర్తి చేశాడు బ్రూస్ లీ. తర్వాత వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో తత్త్వశాస్త్రం చదివాడు. ఆ తర్వాత హాంగ్‌కాంగ్‌లో తను మార్షల్స్ ఆర్ట్ నేర్చుకున్న అనుభవంతో ఇక్కడ కొంతమంది విద్యార్థులను తయారు చేశాడు. ఆ సమయంలో పరిచయమైన లిండా ఎమెరినీ 1954లో వివాహమాడారు. అప్పటికే సియాటిల్‌లో ఒక మార్షల్ ఆర్ట్స్ స్కూల్ ఉంది. అక్కడి నుంచి బ్రూస్ లీ, లిండా కాలిఫోర్నియా వెళ్లారు. అక్కడ బ్రూస్ లీ ఓక్లాండ్లో, లాస్ ఏంజెలిస్‌లో రెండు స్కూళ్లను ప్రారంభించారు. అవీ మార్షల్ ఆర్ట్స్‌కి సంబంధించినవే. లాభాపేక్షతో కాకుండా కేవలం నేర్పించడానికే స్కూళ్లు నడుపుతున్న బ్రూస్ లీ... మెల్లమెల్లగా మళ్లీ సినిమాల వైపు మళ్లారు. అంతకన్నా ముందు అతడికి టీవీలో నటించే అవకాశాలు వచ్చాయి. 1966 నుండి 1967 వరకు 26 ఎపిసోడ్లుగా టీవీలో ప్రసారమైన ‘ది గ్రీన్ హార్నెట్’ సిరీస్‌తో బ్రూస్ లీ యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అలా1969లో తొలిసారిగా అతడికి ‘మార్లోవ్’ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. తర్వాత మిగతా సినిమాలు. తర్వాత అర్ధంతర మరణం. ముప్పై మూడేళ్ల వయసులో తను చనిపోయే నాటికి బ్రూస్లీ నూరేళ్ల జీవితానికి సరిపడా తన ముద్రను అన్ని రంగాలపై వదిలి వెళ్లారు. సినిమాలు, యుద్ధకళలు, సాహిత్యం... ఇలా. అందుకే అతడిని ప్రపంచంలోని చాలాదేశాలు, ముఖ్యంగా ఆసియా దేశాలు 20వ శతాబ్దంలోనే ప్రఖ్యాతిగాంచిన యుద్ధ ప్రవీణుడిగా, సాంస్కృతిక చిహ్నంగా భావిస్తాయి. బ్రూస్ లీ కుమారుడు బ్రాండన్‌లీ, కుమార్తె షానన్ లీ కొంతవరకు మాత్రమే ఆయన వారసత్వాన్ని కొనసాగించగలిగారు. అది కూడా సినిమాల్లో. బ్రూస్ లీ ప్రధానంగా కరాటే యోధుడు అయినప్పటికీ ఆయన జీవితం చాలావరకు పోరాటాలతో కాకుండా ఫిలసాఫికల్‌గా గడిచింది. పోరాటాలలో సైతం బ్రూస్ లీ తాత్వికతను ప్రద ర్శించడం విశేషం. ‘‘జీవితం మనకొక ‘పంచ్’ ఇచ్చినప్పుడు దాంతో మనం తాత్వికంగా దెబ్బలాడాలి తప్ప మనకొచ్చిన మార్షల్ ఆర్ట్స్ అన్నీ దాని ముందు ప్రదర్శించకూడదు. ఫైటింగ్ ఒక ఫిలాసఫీ! వేళ్లకు, పిడికిళ్లకు ఆలోచనాశక్తిని ఇచ్చే ఫిలాసఫీ!! మన దగ్గర ఉన్నదంతా బయట పెట్టుకోవడం వల్ల మన దగ్గర లేనిదేమిటో బయటికి తెలిసిపోతుంది. అది ప్రమాదం’’ అంటాడు బ్రూస్లీ. తన చిన్న జీవితంలో బ్రూస్ లీ కనిపెట్టిన అతి గొప్ప సంగతి ఇది. లీ ఫిలాసఫీ జీవితం జీవితం నిన్ను అనేక తెలివితక్కువ ప్రశ్నలతో విసిగించాలని చూస్తుంది. నువ్వు తెలివైన వాడివైతే ఆ ప్రశ్నలనుంచి ఎంతోకొంత నేర్చుకుంటావ్. తెలివైన సమాధానం నుంచి తెలివితక్కువవాడు నేర్చుకునే దానికన్నా, తెలివైనవాడు తెలివితక్కువ ప్రశ్నల నుంచి నేర్చుకునేదే ఎక్కువ. పోరాటం శత్రువుతో పోరాడవలసిందే. వాడు మన మొహం పగలగొడతాడు. మనం వాడిని చితగ్గొడతాం. వాడు మన ఎముకల్ని సున్నం చేస్తాడు. మనం వాడి వెన్నుపూసల్ని ధ్వంసం చేస్తాం. చివరికి ఎవరో ఒకరే మిగులుతారు. వాడో, మనమో. అయితే ఇదంతా తేలిగ్గా జరగాలి. ఒళ్లు అలవకుండా జరగాలి. కష్టపడకుండా చేసిన పనే... కచ్చితంగా జరిగిన పని! పదివేల కిక్కుల్ని ప్రాక్టీస్ చేసి వచ్చినవాడికి నేను భయపడను. ఒకే ఒక కిక్కును పదివేల సార్లు ప్రాక్టీస్ చేసి వచ్చినవాడితో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. జీవితాంతం ఎవరో ఒకరితో, ఏదో ఒక సమస్యతో పోరాడుతూనే ఉండాలా? నేర్చుకోవలసిందీ, మనలోకి మనం చూసుకోవలసిందీ చాలా ఉంది. టైమ్ సరిపోతుందా? జీవితాన్ని ప్రేమించేవాడు టైమ్ వేస్ట్ చేసుకోడు. అసలు టైమ్ చూసుకోడు. అదొక టైమ్ వేస్ట్ పని. పోరాడవలసిందే. కానీ గెలుపు ఓటముల కోసం పోరాడకూడదంటాను. కాలం ఉన్నంత కాలం మనమూ ఉండిపోడానికి పోరాడాలి! తావోయిజం ‘‘మన ఆలోచనే మనం’ అంటుంది తావోయిజం. ఎప్పుడూ ఇంకొకరి ఆలోచల ప్రకారం నడుస్తుంటే మనకు బదులుగా వారు మిగిలిపోతారు లోకంలో. అప్పుడు మనం పుట్టి, పెరిగి, పోయి... ఏం లాభం? అందుకే మన పంచ్ డిఫరెంట్‌గా ఉండాలి. నా ఇష్ట ప్రకారం జీవించడానికి నువ్వీ లోకంలోకి రాలేదు. నీ ఇష్ట ప్రకారం నడుచుకోడానికి నేనీ లోకంలోకి రాలేదు. ఎవరి జీవితం వారిది. అయితే ఈ రెండు జీవితాలను సమన్వయం చేయడానికి - మనం పుట్టక ముందే - సమాజం స్థిర ఆదర్శాలను ఏర్పాటు చేసి ఉంచింది. ఫిక్స్డ్ పాటర్న్! కానీ జీవిత సత్యాలన్నీ ఆ ఆదర్శాల బయటే ఉన్నాయే! ఎలా బయట పడడం? పడాలి. నియమాలకు విధేయులమై ఉంటూనే, వాటికి లోబడకుండా ఉండాలి. గై-క్వాం-డూ! నాకు అనిపిస్తుంటుంది... ఈ మూస విద్యల్లో, ప్రాచీన పద్ధతుల్లో ఏదో ప్రాణాంతక లోపం ఉందని! కొత్తదేదైనా కనిపెట్టాలి. అది అసాధారణంగా ఉండాలి. ‘అతి సాధారణత’ దాని ప్రత్యేకత అయివుండాలి. తక్కువ ఎనర్జీతో, తక్కువ సమయంలో మన లోపలి వ్యక్తీకరణలన్నిటినీ బయటపెట్టగలిగేదై ఉండాలి. మార్చుకోడానికీ, వదిలేయడానికీ అనువైనదిగా ఉండాలి. అలా నాకోసం నేను డెవలప్ చేసుకున్నదే ‘గైక్వాండూ’! నీటిలా... షేప్‌లెస్‌గా ఉండాలి మనిషి. నీటికి సొంత ఆకృతి ఉండదు. గ్లాసులో పోస్తే గ్లాసులా ఉంటుంది. సీసాలో పోస్తే సీసాలా ఉంటుంది. టీపాట్‌లో టీపాట్లా ఉంటుంది. కానీ నీరు ప్రవహిస్తుంది. ముంచెత్తుతుంది. మనిషి కూడా అలానే ఉండాలి. ఇదే గై క్వాం డూ ఫిలాసఫీ. పోరాడే క్షణాలేవీ మనవి కావని గుర్తుంచుకోండి. తేల్చిపారేయాలి తొలి క్షణంలో. రెండో క్షణంలో మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు. బ్రూస్ లీ బయోగ్రఫీ (27 నవంబర్ 1940 - 20 జూలై 1973) పూర్తి పేరు: బ్రూస్ జున్ ఫాన్ లీ ఎత్తు: 5 అడుగుల ఏడున్నర అంగుళాలు జన్మస్థలం: శాన్ఫ్రాన్సిస్కో (అమెరికా) పెరిగింది: హాంకాంగ్ తండ్రి: లీ హోయ్ చుయన్ తల్లి: హో చదువు: యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్లో తత్వశాస్త్రం ప్రభావితం చేసిన తత్వాలు: తావోయిజం, బౌద్ధం, జిడ్డు కృష్ణమూర్తి తత్వం. భార్య: లిండా లీ కాడ్వెల్ సంతానం: బ్రాండన్ లీ (నటుడు), షానన్ లీ (నటి) ప్రత్యేకతలు: మార్షల్ ఆర్టిస్ట్, ఫిలాసఫర్, ఇన్స్ట్రక్టర్, యాక్టర్, ఫిల్మ్ డెరైక్టర్, స్క్రీన్ రైటర్, గైక్వాండో (మార్షల్ ఆర్ట్) సృష్టికర్త. హిట్ మూవీస్: ది బిగ్ బాస్, ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ, ఎంటర్ ది డ్రాగన్, వే ఆఫ్ ది డ్రాగన్ (రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్), ది గేమ్ ఆఫ్ డెత్. రాసిన పుస్తకాలు: చైనీస్ కుంగ్-ఫూ: ది ఫిలసాఫికల్ ఆర్ట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్, తావో ఆఫ్ గైక్వాండో, వింగ్ చున్ కుంగ్-ఫూ ఫిలాసఫీ: ఏ జ్ఞానమైనా చివరికి ఆత్మజ్ఞానానికి దారితీస్తుంది. -
ఆరోగ్యమా! అనర్థమా!
బ్రూస్లీ ఒక్కసారిగి ఛాతీని విశాలంగా చేస్తే, కెమెరా జూమ్‌లో చూపిస్తుంటే కళ్లు పెద్దవి చేసి చూశారు. అంతటితో ఆగిపోక ఆ ప్రయత్నం తామూ చేస్తే ఎలా ఉంటుందని సరదా పడ్డారు మన నటులు. ఇప్పుడా క్రేజ్ ముదిరి యువత ముందు సవాల్‌గా నిలిచింది. సిక్స్‌ప్యాక్ ఆబ్స్ లేకపోవడం అవమానంగా భావించే వాళ్లు కూడా ఉన్నారు. ఛాతీ వెడల్పుగా ఉండి, పొట్ట పలుచగా ఉంటే దేహాకృతి చక్కగా ఉంటుంది. చక్కటి బాడీషేప్ మనిషిలో ఆత్మస్థయిర్యాన్ని పెంచుతుంది. ఏ దుస్తులు ధరించినా చక్కగా కనిపిస్తారు. అయితే వ్యాయామం దేహమంతటినీ ఉత్తేజితం చేసేదిగా ఉండాలి. ఏదో ఒక భాగానికి పరిమితం చేస్తూ (లోకల్ ఎక్సర్సైజ్) వ్యాయామం చేయకూడదు. సిక్స్‌ప్యాక్ కోసం చేసే విపరీతమైన వ్యాయామం వల్ల దేహంలో సమతుల్యం దెబ్బతింటుంది. ఆహారంలో ప్రోటీన్లు పెంచుతున్నారు, దేహంలో ప్రోటీన్లు ఓవర్‌లోడ్ అయితే వాటిని తొలగించడానికి కిడ్నీలు ఎక్కువగా పనిచేయాలి. ఒక కిలో దేహం బరువుకి ఒక రోజుకు 1.2 గ్రాముల ప్రోటీన్లు సరిపోతాయి. అంతకంటే ఎక్కువగా తీసుకున్నప్పటికీ దేహం వాటిని నిల్వ ఉంచుకోదు. ఈ సాధనలో సహజమైన ఆహారాన్ని తగ్గించి సప్లిమెంట్ల మీద ఆధారపడుతుంటారు. అది దీర్ఘకాలంలో దుష్ర్పభావాన్ని చూపిస్తుంది. వ్యాయామం చాలా బాలెన్స్డ్గా ఉండాలి. దేహంలో భాగాలు ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఆపోజిట్ గ్రూప్స్‌లో సమతుల్యాన్ని కలిగి ఉంటాయి. అబ్డామిన్ ఎక్సర్సైజ్ వల్ల నడుము మీద ఒత్తిడి పెరుగుతుంది. నడుమునొప్పి, హెర్నియా సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. నడుము నొప్పి సమస్య ఉన్న వాళ్లు ఈ వ్యాయామం చేస్తే డిస్క్ ప్రొలాప్స్ ప్రమాదం కూడా ఉంటుంది. సిక్స్‌ప్యాక్ ఫ్యాషన్ ప్రభావంతో చేసేదంతా అశాస్త్రీయమైన సాధన అనే చెప్పాలి. ఇందులో నీరు తక్కువగా తాగడం ఒకటి. నీరు తక్కువగా తీసుకోవడం వల్ల దేహంలోని మలినాల విసర్జన సరిగా జరగదు. పైగా వ్యాయామం చేసినప్పుడు చెమట బయటకు రావాలి. ఈ సహజధర్మాలను నియంత్రించడం వల్ల శరీర దుర్వాసన, ఇతర చర్మ సమస్యలు కూడా వస్తాయి. - డా. భక్తియార్ చౌదరి, స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండ్ ఫిట్నెస్ ఎక్సఫర్ట్ -
‘బ్రూస్లీ’ టైటిల్‌తో రామ్‌గోపాల్‌వర్మ
రామ్‌గోపాల్‌వర్మ ఏం చేసినా సంచలనమే. రకరకాల కాన్సెప్ట్‌లతో చిత్రవిచిత్రమైన టైటిల్స్‌తో ఏకధాటిగా సినిమాలు చేయడం ఆయనకే చేతనవునేమో! ప్రస్తుతం శర్వానంద్ హీరోగా ‘సత్య-2’ చేస్తోన్న వర్మ, మరో పక్క ‘బ్రూస్లీ’ టైటిల్‌తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. అయితే ఇదేదో హీరోతో యాక్షన్ సినిమా అనుకునేరు. పక్కా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అట. హీరోయిన్ ఎవరు? షూటింగ్ ఎప్పుడు? అనేది త్వరలోనే వెల్లడి స్తారట. అలాగే తనకిష్టమైన హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో మరో చిత్రం చేయడానికి వర్మ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తెలుగు వెర్షన్ కోసం ‘పట్ట పగలు’ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారట. 30 రోజుల్లోనే ఆ చిత్రాన్ని పూర్తి చేస్తారట వర్మ. -
బ్రూస్లీ 40వ వర్థంతి