Shruti Haasan Reveals Her First Crush Name - Sakshi
Sakshi News home page

Shruti Haasan: ఆయనే నా ఫస్ట్ క్రష్

Apr 1 2023 11:04 AM | Updated on Apr 1 2023 11:35 AM

Bruce Lee Is My First Crush Shruti Haasan Says - Sakshi

సంచలనానికి మరో పేరు ఉంటే అది నటి శ్రుతిహాసనే అవుతుంది. విశ్వ నటుడు కమలహాసన్‌ వారసురాలు అయిన ఈమె తొలుత సంగీత దర్శకురాలిగా తన తండ్రి నటించిన ఉన్నైప్పోల్‌ ఒరువన్‌ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. ఆ తరువాత నటిగా తెరంగేట్రం చేశారు. హిందీలో లక్‌ చిత్రం, తెలుగులో అనగనగా ఒక ధీరుడు చిత్రాల్లో నటించిన తర్వాతే కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు.

ఆ విధంగా శ్రుతిహాసన్‌కు తమిళంలో కంటే తెలుగులోనే మంచి విజయాలు వరించాయి. ఇటీవల తెలుగులో ఈ బ్యూటీ నటించిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలు సంచలన విజయాన్ని సాధించాయి. ప్రస్తుతం ప్రభాస్‌ సరసన సోలార్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఇది పాన్‌ ఇండియా చిత్రంగా త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. మరో కొత్త చిత్రానికి సైన్‌ చేయకపోయినా శ్రుతిహాసన్‌ నిత్యం వార్తల్లో ఉంటారు.

తన గ్లామరస్‌ ఫోటోలను సామాజిక మాధ్యమాలలో విడుదల చేస్తూ నెటిజన్లకు బాగానే పని చెబుతుంటారు. అదేవిధంగా నిజాలను నిర్భయంగా చెప్పే నటి ఎవరైనా ఉన్నారంటే అది శ్రుతిహాసనే. తన ప్రియుడితో కలిసిన ఫొటోలను ధైర్యంగా సామాజిక మాధ్యమాలకు తెలియజేసే నటి ఈ బ్యూటీ. ఇప్పటికే రెండు మూడు సార్లు ప్రేమలో విఫలమైన శ్రుతి మళ్లీ ప్రేమలో పడినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హోరెత్తుతోంది. కాగా ఇటీవల ఈమె ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ తన తొలి క్రష్‌ నటుడు ఎవరన్న ప్రశ్నకు ఏ మాత్రం తడుముకోకుండా హాలీవుడ్‌ నటుడు బ్రూస్‌లీ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement