సుమారు ఎనిమిదేళ్ల విరామం అనంతరం మెగాస్టార్ చిరంజీవి మళ్లీ మేకప్ వేసుకున్నాడు. చిరంజీవి తన వారసుడు రామ్ చరణ్ తాజా చిత్రం 'బ్రూస్ లీ' లో 'చిరు' పాత్ర చేయబోతున్నాడు. గతంలో కూడా 'మగధీర'లో తనయుడితో కలిసి సెప్ట్లు వేసిన చిరంజీవి ...మళ్లీ కొడుకుతో కలిసి నటిస్తున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్రూస్ లీ లో చిరు మూడు నిముషాల పాటు సందడి చేయబోతున్నాడు. చిరంజీవి సోమవారం బ్రూస్ లీ షూటింగ్ స్పాట్కు వచ్చాడు.