Appear
-
Cannes 2024: సన్నజాజి తీగలా సొట్ట బుగ్గల సుందరి (ఫొటోలు)
-
స్నేహితుని స్థానంలో పరీక్షకు సిద్ధం.. బయోమెట్రిక్ మెషీన్లో వేలు పెట్టగానే..
మధ్యప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో మరో అభ్యర్థి పేరుతో, అతని స్థానంలో పరీక్ష రాసేందుకు వచ్చిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. రత్లాంలోని ఒక పరీక్షా కేంద్రంలో బయోమెట్రిక్ మెషీన్లో అభ్యర్థుల వేలి ముద్రల గుర్తింపులో సమస్య ఏర్పడటంతో వారికి కంటి రెటీనా పరీక్షలు చేస్తున్నారు. అయితే ఇంతలో ఒక నకిలీ అభ్యర్థి బిల్డింగ్‌లోని మెదటి అంతస్థు నుంచి దూకి పారిపోయాడు. అయితే పోలీసులు అతనిని వెంబడించి పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే రత్లాంకు సుమారు 28 కిలోమీటర్ల దూరంలోని సాత్‌రూంఢాలో గల మారుతి స్కూలులో పోలీస్ కానిస్టేబుళ్ల రాతపరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చే అభ్యర్థులు తమ హాల్‌టిక్కెట్, ఆధార్ కార్డును అధికారులకు చూపిస్తేనే వారిని పరీక్షా హాలులోకి అనుమతిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌కు చెందిన పుష్పేంద్ర యాదవ్(20) తన స్నేహితుడు, ఇటావానివాసి రాహుల్ యాదవ్ స్థానంలో పరీక్ష రాసేందుకు అతని హాల్ టిక్కెట్‌తో పరీక్షా కేంద్రానికి వచ్చాడు. అయితే బయోమెట్రిక్ వెరిఫికేషన్ సమయంలో అధికారులకు అనుమానం రావడంతో అతనిని ప్రశ్నించారు. దీంతో పుష్ఫేంద్ర యాదవ్ స్కూలు మొదటి అంతస్తు నుంచి దూకి, స్కూలు వెనుక తలుపు నుంచి పొలాల్లోకి పారిపోయాడు. అయితే అతనిని పోలీసులు వెంబడించి గ్రామ శివార్లలో పట్టుకున్నారు. అధికారులు ప్రశ్నించినప్పుడు పుష్పేంద్ర యాదవ్.. రాహుల్ యాదవ్ తన స్నేహితుడని తెలిపాడు. డబ్బు కోసం ఆశపడి రాహుల్ స్థానంలో పరీక్ష రాసేందుకు వచ్చానని తెలిపాడు. దీంతో పోలీసులు రాహుల్ యాదవ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా చదవండి: వింత మొఘల్ పాలకుడు: ఒకసారి నగ్నంగా, మరోసారి స్త్రీల దుస్తులు ధరించి.. -
మాల్యాకు భారీ షాక్ : అక్టోబర్ 5న కోర్టుకు
సాక్షి, న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక ఎగవేత దారుడు విజయ్ మాల్యాకు (64) భారీ షాక్ తగిలింది. అక్టోబర్ 5 న మధ్యాహ్నం 2 గంటలకు వ్యక్తిగతంగా హాజరుకావాలని సుప్రీంకోర్టు సోమవారం (ఆగస్టు 31) ఆదేశించింది. ఆ రోజు కోర్టు గదిలో మాల్యా ఉనికిని నిర్ధారించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లు బదిలీ చేసినందుకు కోర్టు ధిక్కారం కేసులో దోషిగా తేలిన ఉత్తర్వులను సమీక్షించాలని కోరిన మాల్యా పిటిషన్‌ను సుప్రీం కొట్టివేసింది. మాల్యా తన పిల్లలకు 40 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను బదిలీ చేశారన్న ఆరోపణలు రుజువు కావడంతో, మే 9, 2017 ఆయనను సర్వోన్నత న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. ఈ తీర్పును పునఃసమీక్షించాలని మాల్యా కోరారు. ఈ కేసులో వాదనలు విన్న జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం మాల్యా పిటిషన్‌ను తోసిపుచ్చింది. అంతేకాదు సమీక్ష చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో 2020 అక్టోబర్ 5న మాల్యా కోర్టు ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. అంతేకాదు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం మాల్యా హాజరుకు బాధ్యత వహించాలని తెలిపింది. కాగా 9,000 కోట్ల రూపాయలకు పైగా బ్యాంక్ లోన్ డిఫాల్ట్ కేసులో నిందితుడైన మాల్యా బెయిల్ మీద లండన్ లో ఉన్న సంగతి తెలిసిందే. -
నాట్ మిస్సింగ్
చీమ చిటుక్కుమన్నా పసిగట్టి, విషయాన్ని వెంటనే వైట్ హౌస్‌కి చేరవేసే నెట్వర్క్ ఉన్న అమెరికాలో.. నెల రోజులుగా ఆ దేశపు ప్రథమ మహిళ ఆచూకీ తెలియకపోవడం విశేషమే! ఎట్టకేలకు ట్రంప్ భార్య మెలానియ జూన్ 4 సోమవారం ప్రత్యక్షమయ్యారు. యుద్ధంలో అమరులైన వీరుల కుటుంబాలను (గోల్డ్ స్టార్ ఫ్యామిలీస్) గౌరవించే వేడుకల్లో మెలనియా కనిపించడంతో ఇంతకాలం ఆమె ఏమయ్యారు, ఎక్కడున్నారు అనే సందేహాలు సద్దుమణిగాయి. ఈ నెల 12న సింగపూర్‌లో జరుగుతున్న జి7 దేశాల సదస్సుకు భర్తతో పాటు కనుక ఆమె కనిపించకపోతే ప్రస్తుతం ఇంటర్నెట్లో పచార్లు చేస్తున్న పలు రకాల అనుమానాలకు బలం చేకూరడం ఖాయం అనుకుంటుండగా ఆఖరి నిముషంలో మెలానియ ఒక నక్షత్రంలో మెరిశారు. సోమవారం నాటి సాయంత్రపు వేడుకలకు ప్రెస్‌ను అనుమతించనప్పటికీ మసకగా కనిపిస్తున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది. అందులో మెలానియ కనిపించారు! ఈ వీడియోను సోషల్ మీడియాకు విడుదల చేసింది జెనా గ్రీన్ అనే రిపోర్టర్. ఆమె తండ్రి 2004 ఇరాక్‌పై ఆమెరికా యుద్ధంలో మరణించారు. దీనిని బట్టే మెలానియ హాజరయింది ‘గోల్ట్స్టార్ ఫ్యామిలీస్’ ఈవెంట్ అని మీడియా అంచనా వేయగలిగింది. ఆ తర్వాత మెలానియనే స్వయంగా ‘నేలకొరిగిన వీరులకు నివాళి ఘటించే గౌరవం నాకు దక్కింది’ అని ట్వీట్ చేయడంతో ఆ వీడియో వార్త నిజమేనని నిర్థారణ అయింది. ‘నా భార్య నన్ను వదిలిపెట్టి వెళ్లిపోయిందని మీడియా అనుమానిస్తోంది. అది నిజం కాదు. ఆ ముందు వరుసలో కూర్చొని ఉన్నది ఆమే’నని ట్రంప్ ఓ మీడియా ప్రతినిధితో జోక్ చేశారు కూడా. ఇంతవరకు సంతోషమే కానీ, అసలు ఇన్నాళ్లూ మెలానియ ఏమైనట్లు? మెలానియ చివరిసారిగా ఒక అధికార కార్యక్రమంలో కనిపించింది మే 10న. ఉత్తర కొరియా నుంచి విడుదలై వచ్చిన ముగ్గురు యు.ఎస్. మాజీ ఖైదీలకు ఈ భార్యాభర్తలు వెల్కమ్ చెప్పిన సందర్భం అది. తర్వాత నాలుగు రోజులకు మెలానియ కిడ్నీ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. మే 19న ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆ ఆనందాన్ని ట్విట్టర్లో పంచుకుంటూ ట్రంప్ తన భార్య పేరు తప్పుగా టైప్ చేశారు కూడా. వెంటనే పొరపాటు తెలుసుకుని ఆ ట్వీట్‌ను డిలీట్ చేసి, కరెక్ట్ స్పెల్లింగ్‌తో మళ్లీ పోస్ట్ చేశారు. ఆ తర్వాత మొన్న సోమవారం వరకు మెలానియ కనిపించలేదు. ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని, జీవితంమంటే విసుగొచ్చి ఏవో దూర తీరాలకు చేరుకున్నారనీ, ట్రంప్‌తో విడిపోయి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని.. ఇంటర్నెట్లో రకరకాలుగా ప్రచారం జరిగింది. న్యూయార్క్‌లో ‘మిస్సింగ్’ అని ఆమె ఫొటోతో పోస్టర్లు కూడా వెలిశాయి! అప్పటికే మెలానియ ‘బి బెస్ట్’ అనే యాంటీ బుల్లీయింగ్ (భయపెట్టి వేధించడం) ప్రచారోద్యమాన్ని నడుపుతున్నారు. దీనిపై బిల్లీ అనే టీవీ వ్యాఖ్యాత, ‘కనిపించకుండా పోతే బి బెస్ట్ ఎలా అవుతారు మీరు’ అని ట్వీట్ కూడా చేశారు. వీటన్నిటికీ సమాధానంగా మెలానియ.. ‘‘నేను వైట్ హౌస్‌లోనే ఉన్నాను. చక్కగా, ఆరోగ్యంగా ఉన్నాను. పిల్లల కోసం, అమెరికన్ ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు. అయితే దాన్ని కూడా మీడియా నమ్మలేదు. అది మెలానియ ఇచ్చిన ట్వీట్ కాకపోవచ్చని అనుమానించింది. చవరికి మెలనియా కనిపించడంతో ఆ అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. -
కశ్మీర్లో అల్లర్ల మధ్య 10th పరీక్షలు
-
పుష్కరాల్లో కనిపించని మంత్రులు
-
ఆకాశంలో మరో అద్భుతం!
కోల్ కత్తాః ఆకాశంలో మరో అద్భుతం జరగబోతోంది. పౌర్ణమినాడు అతి పెద్ద ఆకారంలో కనిపించే చంద్రబింబం.. కొంత పరిమాణం తగ్గి... ఈసారి సూక్ష్మ రూపాన్ని సంతరించుకోనుంది. శుక్రవారం ఏప్రిల్ 22న వచ్చే పౌర్ణమినాడు కనిపించే నిండు చంద్రుడు ఎప్పుడూ కంటే చిన్న పరిమాణంలో కనిపిస్తాడని దాదాపు 15 ఏళ్ళ తర్వాత ఇటువంటి అరుదైన సన్నివేశం 'మినీ మూన్' ఆకాశంలో ఆవిర్భవించనుందని నిపుణులు చెప్తున్నారు. ఇటీవలి కాలంలో గ్రహాలు భూమికి దగ్గరగా రావడం, ఎప్పుడూ కనిపించే కంటే చిన్న, పెద్ద సైజుల్లో మారుతుండటం అనేక సార్లు చూస్తున్నాం. అయితే ప్రతి పున్నమికీ నిండైన ఆకారంతో ఆకాశంలో ఆవిర్భవించే చంద్రవదనం.. ఈసారి దాని పరిమాణాన్ని తగ్గించుకుంటోందట. ప్రకృతి ప్రేమికులను అమితంగా ఆకట్టుకునే చందమామ ఈ పున్నమినాడు 14 శాతం పరిమాణం తగ్గనున్నాడట. భూ కక్ష్యకు సుమారు 4,06,350 కిలోమీటర్ల దూరంలోని ఓ బిందువువద్దకు చేరుకున్న చంద్రుడు సగటున భూమికి 3,84,000 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమౌతాడు. దీంతో శుక్రవారంనాడు కనిపించే చంద్రుడు భూమినుంచి చివర స్థానంలోని బిందువుకు దగ్గరగా కనిపిస్తాడు. దీంతో ప్రతిసారి కనిపించే పౌర్ణమి చంద్రుడికన్నా ఈసారి చంద్రుడు చిన్నగా కనిపిస్తాడని కలకత్తాలోని ఎంపి బిర్లా ప్లానిటోరియం డైరెక్టర్ దేవీప్రసాద్ దౌరి తెలిపారు. అయితే శుక్రవారం ఉదయం 10.55 సమయంలో ఈ అద్భుతం సంభవించే అవకాశం ఉండటంతో చిన్న పరిమాణంలో ఉండే 'మినీ మూన్' ను జ్యోతిష్య శాస్త్రజ్ఞులు సహా చూడలేరని, సూర్యకాంతి కారణంగా జనానికి ఈ చిన్నపాటి చంద్రుడు కనిపించే అవకాశం లేదని దౌరి తెలిపారు. అయితే ఈ మినీ మూన్ రాత్రి సమయంలో కనిపించినప్పుడు మాత్రం ఓ పలుచని నీడ చాటున ఉన్నట్లుగా కనిపిస్తుందని చెప్పారు. ఇటువంటి మినీ మూన్ తిరిగి 2030 డిసెంబర్ 10 శుక్రవారం నాడు కనిపించే అవకాశం ఉందని వెల్లడించారు. చంద్రుడి రంగు ఇంటర్నెట్లో పుకార్లు వ్యాపిస్తున్నట్లుగా ఎటువంటి గులాబీ, ఆకుపచ్చ రంగులను కలిగి ఉండదని ఎప్పటిలాగే వెండిముత్యంలా ఉంటుందని దౌరి తెలిపారు. ఇదివరలో భూమికి దగ్గరగా వచ్చిన 'సూపర్ మూన్' కంటే ఈసారి చంద్రుడు 14 శాతం తక్కువ పరిమాణంలో ఉంటాడని వెల్లడించారు. -
చిరు ముచ్చటగా మూడు నిమిషాలే!
-
నగరంలో కనపడని అక్షయ తృతీయ శోభ