బ్రూస్‌లీ ఫైటింగ్!
అదో పెద్ద గది. గదిలో మొత్తం అద్దాలు. ఆ గదిలోకి ఎంటరయ్యేవాళ్లు అన్ని అద్దాల్లోనూ కనిపిస్తారు. ఏది రియల్ ఇమేజ్.. ఏది మిర్రర్ ఇమేజో కనుక్కోలేం. నాయకుడు, ప్రతినాయకుడు మధ్య ఆ గదిలో ఫైట్ సీన్ ఉంటే, ఏది అసలు ఇమేజ్.. ఏది నకిలీ అని తికమకపడిపోతారు. హాలీవుడ్ చిత్రాలను బాగా ఫాలో అయ్యేవారికి ‘ఎంటర్ ది డ్రాగన్’లోని ఈ సీన్ వెంటనే గుర్తొచ్చేస్తుంది. ఆ వెంటనే అద్భుతంగా ఫైట్స్ చేసే ఆ చిత్రకథానాయకుడు బ్రూస్‌లీ గుర్తు రాకుండా ఉండరు. మార్షల్ ఆర్ట్స్ పేరు చెప్పగానే ఇప్పటికీ అందరూ తలుచుకొనేది బ్రూస్‌లీనే. ఎప్పుడో నలభై ఏళ్ల క్రితం చని పోయిన బ్రూస్‌లీని ఇప్పుడు గుర్తు చేసుకోవ డానికి కారణం ఉంది.
రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘బ్రూస్‌లీ... ది ఫైటర్’ పేరు ఖరారు చేశారు. దీన్ని బట్టి చరణ్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని ఊహించవచ్చు. ఈ సినిమాలో ఆయన స్టంట్‌మ్యాన్‌గా నటిస్తు న్నారు. దీని కోసం చరణ్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని భోగట్టా. సో... థ్రిల్‌కి గురి చేసే కొత్త రకం ఫైట్స్‌తో విలన్లను రఫ్ఫాడిస్తారని చెప్పొచ్చు. శ్రీను వైట్ల దర్శకత్వంలో డి. పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం విజయ దశమికి విడుదల కానుంది.