కరాటే యోధుడు, మార్షల్ ఆర్ట్స్ ఐకాన్ నటుడు బ్రూస్ లీ అంటే తెలియని యాక్షన్ సినీ ప్రేమికులు ఉండరు. ప్రస్తుతం చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని మిక్సియన్ జిల్లాకు చెందిన ఓ యువ మార్షల్ ఆర్టిస్ట్ తన అద్భుతమైన వన్ ఇంచ్ పంచ్ నైపుణ్యంతో బ్రూస్‌లీని గుర్తు చేస్తున్నాడు. నెటిజన్లు ను షాక్ కు గురిచేస్తున్నాడు. అసలు ఈ వన్ ఇంచ్ పంచ్ అనేది కుంగ్ పూ లోని ఓ కళ. అలనాటి ప్రఖ్యాత హాంకాంగ్ మార్షల్ ఆర్టిస్ట్ బ్రూస్ లీ దీనికి ఎంతో ప్రాచుర్యాన్ని తెచ్చిపెట్టారు. మరో ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఇది ఫా జిన్ అని పిలువబడే ఒక యుద్ధ నైపుణ్యం.
అసలు వన్ ఇంచ్ పంచ్ కథేంటి..1964 లో లాంగ్ బీచ్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో ప్రదర్శన తర్వాత బ్రుస్ లీ వన్ ఇంచ్ పంచ్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బ్రుస్ లీ మరణం తర్వాత ఈ వన్ ఇంచ్ పంచ్ ప్రజాదరణ కోల్పోయింది. బ్రుస్ లీ సినిమాల్లో ఈ టెక్నీక్ ను చూసి యువత ఇష్టపడటమే కాకుండా కొందరు సాధన కూడా చేసేవారు. ఐతే ఇప్పుడు ఒక చైనీస్ మార్షల్ ఆర్టిస్ట్.. బ్రుస్ లీ ఒకప్పుడు చేసిన వన్ ఇంచ్ పంచ్ ను చేసి చూపిస్తున్న వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో లో ఆ యువకుడు స్త్రీని తన కుడి భుజంపై మోస్తూ తన వన్ ఇంచ్ పంచ్‌తో రెండు సిమెంట్ బ్లాక్‌లను పగలగొట్టడం మనం చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను చూసి బ్రుస్ లీ ని గుర్తు చేసుకుంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
( చదవండి: వైరల్: ఈ లంచ్ బాక్స్ చూస్తే కన్నీళ్లు ఆగవు )
Comments
Please login to add a commentAdd a comment