marshalarts
-
మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న కాజల్ అగర్వాల్.. ఆ సినిమా కోసమే..!
కమల్ హాసన్ కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఇండియన్ 2’. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఈ చిత్రంలో కమల్‌కు జోడీగా అందాల భామ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ చిత్రం కోసం కాజల్ అగర్వాల్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటోంది. అతిపురాతనమైన యుద్ధ క్రీడ కలారిపాయట్టును సాధన చేస్తోంది. తాజాగా ఆమె ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చిన ఈ బ్యూటీ చాలా రోజుల తర్వాత తిరిగి షూటింగ్లో అడుగుపెట్టింది. ఇండియన్ 2 సినిమాలో తన పాత్ర కోసం యుద్ధ కళలతో పాటు గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంటోంది కాజల్. (చదవండి: Kamal Haasan: రెండేళ్ల తర్వాత సెట్స్‌లో అడుగుపెట్టిన కమల్.. ఫోటోలు వైరల్) ఇన్‌స్టాలో పోస్టులో "కలరిపాయట్టు ఒక పురాతన మార్షల్ ఆర్ట్స్. షావోలిన్, కుంగ్ ఫూ, కరాటే, తైక్వాండో క్రీడలు కలరిపాయట్టు నుంచి పుట్టుకొచ్చినవే. ఈ యుద్ధ క్రీడ సాధారణంగా గెరిల్లా యుద్ధంలో వినియోగిస్తారు. ఇది శారీరక, మానసికంగా దృఢంగా ఉండేలా చేస్తుంది. మూడేళ్లుగా అడపాదడపా నేర్చుకుంటున్నా. నాకు చాలా ఓపికగా నేర్పిస్తున్న మాస్టర్‌కు ధన్యవాదాలు' అని రాసుకొచ్చింది. ఈ చిత్రంలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, బాబీ సింహా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెండేళ్ల క్రితం సెట్స్‌లో అగ్నిప్రమాదం సంభవించి ముగ్గురు సిబ్బంది మృతి చెందడంతో షూటింగ్ నిలిపేశారు. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) -
యాహూ! నేను పగలుగొట్టేశాను
ఒక్కోసారి మనం ఈ పనులు చేయగలమా అనిపిస్తుంది. మనం చేయలేమో ఆనే సందేహంతోనే చాలా వరకు కొన్ని పనులు చేయం. కానీ ఇక్కడొక మార్షల్ అర్ట్స్ నేర్చుకున్న చిన్నారి కూడా అలానే భావిస్తోంది. కానీ చివరకు తాను చేయగలనని అనుకుంటుంది. (చదవండి: సూప్ నచ్చకపోతే మరీ అలా చేస్తావా!) అసలు విషయంలోకెళ్లితే....మార్షల్ ఆర్ట్స్ నేరుకున్న చిన్నారిని తన టీచర్ ఒక బోర్డు పట్టకుని పగలకొట్టమని చెబుతుంది. ఆ తర్వాత ఆ చిన్నారి ఒకే ఒక్క షార్ట్‌లో పగలు కొట్టేసింది. దీంతో ఆ చిన్నారి వెంటనే తానేన ఇది పగలుగొట్టింది అని ఆశ్చర్యపోతుంది. ఒక్కసారిగా నేను పగలుగొట్టేగలిగాను అంటూ ఆనందంగా గెంతులేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింగ తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు "ఈ ఘటనతో ఆమె చాలా ఆత్మవిశ్వాసాన్ని పొందింది" అంటూ ఆ చిన్నారిని ప్రశంసిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: బంపర్ ఆఫర్....వ్యాక్సిన్ తీసుకో..బహుమతి పట్టు) View this post on Instagram A post shared by Dear Dorans (@deardorans) -
వైరల్: బ్రూస్లీ వన్ ఇంచ్ పంచ్‌తో అదరగొడుతున్న యువకుడు
కరాటే యోధుడు, మార్షల్ ఆర్ట్స్ ఐకాన్ నటుడు బ్రూస్ లీ అంటే తెలియని యాక్షన్ సినీ ప్రేమికులు ఉండరు. ప్రస్తుతం చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని మిక్సియన్ జిల్లాకు చెందిన ఓ యువ మార్షల్ ఆర్టిస్ట్ తన అద్భుతమైన వన్ ఇంచ్ పంచ్ నైపుణ్యంతో బ్రూస్లీని గుర్తు చేస్తున్నాడు. నెటిజన్లు ను షాక్ కు గురిచేస్తున్నాడు. అసలు ఈ వన్ ఇంచ్ పంచ్ అనేది కుంగ్ పూ లోని ఓ కళ. అలనాటి ప్రఖ్యాత హాంకాంగ్ మార్షల్ ఆర్టిస్ట్ బ్రూస్ లీ దీనికి ఎంతో ప్రాచుర్యాన్ని తెచ్చిపెట్టారు. మరో ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఇది ఫా జిన్ అని పిలువబడే ఒక యుద్ధ నైపుణ్యం. అసలు వన్ ఇంచ్ పంచ్ కథేంటి..1964 లో లాంగ్ బీచ్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో ప్రదర్శన తర్వాత బ్రుస్ లీ వన్ ఇంచ్ పంచ్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బ్రుస్ లీ మరణం తర్వాత ఈ వన్ ఇంచ్ పంచ్ ప్రజాదరణ కోల్పోయింది. బ్రుస్ లీ సినిమాల్లో ఈ టెక్నీక్ ను చూసి యువత ఇష్టపడటమే కాకుండా కొందరు సాధన కూడా చేసేవారు. ఐతే ఇప్పుడు ఒక చైనీస్ మార్షల్ ఆర్టిస్ట్.. బ్రుస్ లీ ఒకప్పుడు చేసిన వన్ ఇంచ్ పంచ్ ను చేసి చూపిస్తున్న వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో లో ఆ యువకుడు స్త్రీని తన కుడి భుజంపై మోస్తూ తన వన్ ఇంచ్ పంచ్‌తో రెండు సిమెంట్ బ్లాక్‌లను పగలగొట్టడం మనం చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను చూసి బ్రుస్ లీ ని గుర్తు చేసుకుంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ( చదవండి: వైరల్: ఈ లంచ్ బాక్స్ చూస్తే కన్నీళ్లు ఆగవు ) View this post on Instagram A post shared by @mosstacx -
డిష్యూం.. డిష్యూం
ఎంతో ఏకాగ్రతగా పుస్తకం చదవడంలో నిమగ్నమైపోయారు కథానాయిక కాజల్ అగర్వాల్. హెడ్డింగ్‌కి, పుస్తకానికి ఉన్న అనుబంధం ఏంటి? అంటే... అక్కడికే వస్తున్నాం. ఆమె చదువుతున్నది మామూలు పుస్తకం కాదు. కేరళకు చెందిన మార్షల్ ఆర్ట్ ‘కలరిపయ్యట్టు’ శిక్షణకు సంబంధించిన పుస్తకం. ‘‘కలరిపయ్యట్టు ట్రైనింగ్ పుస్తకం చదవడం స్టార్ట్ చేశాను. త్వరలో సాధన మొదలుపెడతాను’’ అని కాజల్ పేర్కొన్నారు. మరి... కాజల్ సడన్‌గా ఈ మార్షల్ ఆర్ట్ ఎందుకు నేర్చుకుంటున్నారో చెప్పలేదు కదూ. ‘ఇండియన్ 2’ కోసమట. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా ‘ఇండియన్ 2’ అనే చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయికగా నటిస్తారు కాజల్. ఆల్రెడీ మొదటి షెడ్యూల్‌కి సంబంధించిన సెట్ వర్క్ కూడా పూర్తి కావొచ్చిందట. ఈ నెలాఖరులో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుందని కోలీవుడ్ సమాచారం. అయితే ఈ సినిమా కోసమే కాజల్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని డిష్యూం.. డిష్యూం అంటూ వెండితెరపై విలన్స్‌ను రప్ఫాడిస్తారన్నమాట. 1996లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) చిత్రానికి ‘ఇండియన్ 2’ రీమేక్ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమా కాకుండా తెలుగులో తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న సినిమాలో కూడా కాజల్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. -
నాకు ‘అయికిడో’ వచ్చు!?
సాక్షి, న్యూఢిల్లీ : మార్షల్ ఆర్ట్స్‌లో ఒకటైన అయికిడో విద్య తనకు వచ్చని.. అందులోతనకు బ్లాక్‌బెల్ట్ ఉందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. అంతేకాక వ్యాయామం శారీరక దారుఢ్యానికేగాక, మానసిక వికాసానికి కూడా ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. గురువారం పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే రాహుల్ గాంధీ తనకు అయికిడో వచ్చని ప్రకటించారు. అంతేకాక తాను రోజు ఉదయాన్నే గంట సేపు ఈత కొట్టడం, రన్నింగ్ వంటివి చేస్తానని ఆయన తెలిపారు. అయితే ఈ విషయాలను పబ్లిసిటీ కోసం ఎన్నడూ చెప్పుకోలేదని అన్నారు. శారీరక వ్యాయామాలను సోషల్ మీడియాలో పెట్టాలని కొందరు రాహుల్ గాంధీని కోరడంతో.. అందుకు ఆయన అంగీకరించారు. -
కరీంనగర్లో కరాటే అకాడమీ ఏర్పాటుపై దృష్టి
ఐబీకేవో అధ్యక్షుడు, సినీ నటుడు సుమన్ కరీంనగర్ స్పోర్ట్స్ : కరాటేలో కరీంనగర్ జిల్లాకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని సినీనటుడు, ఐబీకేవో అధ్యక్షుడు సుమన్ అన్నారు. గురువారం కరీంనగర్‌కు వచ్చిన ఆయన ఆగస్టులో ఇండోనేషియాలో జరుగనున్న ఇంటర్నేషనల్ కరాటే పోటీల్లో పాల్గొనే భారత జట్టు జాబితాను ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒక క్రీడాకారుడు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలంటే ఎంతో కృషి, పట్టుదల అవసరమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులపై తాను దృష్టి పెట్టానని, వారి భవిష్య™Œ పై ప్రభుత్వంతో మాట్లాడుతానన్నారు. నేటికాలంలో ఆత్మసై్థర్యానికి, ఆత్మరక్షణకు, ఫిట్‌నెస్‌కు మార్షల్ ఆర్ట్స్‌ను నేర్చుకోవాలని అందరూ అంటున్నారే కాని అందులో రాణించిన వారిని పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. భవిష్యత్‌లో కరీంనగర్లో జాతీయ కరాటే అకాడమీని నెలకొల్పడానికి కృషి చేస్తానన్నారు. కాంటినెంటల్ బూడోకాన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ అకాడమీ స్థాపించినప్పటి నుంచి 13 అంతర్జాతీయ పోటీల్లో సుమారు 24 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొని బంగారు, రజత, కాంస్య పతకాలు సాధించారని వివరించారు. ఎంపికైన క్రీడాకారులు వీరే.. ఆగస్టు 24 నుంచి 27 వరకు ఇండోనేషియాలోని తన్జంగ్పింగాలో జరిగే అంతర్జాతీయ కరాటే పోటీల్లో పాల్గొనే భారత జట్టు జాబితాను సుమన్ ప్రకటించారు. జట్టులో జిల్లాకు చెందిన ఇ.అంజన, ఎస్.శృతి, జి.శ్వేత, కె.పావని, ఈ.ఓంకార్ జయస్వరూప్ ఉన్నారు. ఇ.శ్రీనివాస్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను సుమన్ సత్కరించారు.