Kajal Aggarwal Learns Martial Arts for Kamal Haasan Indian 2 Movie - Sakshi
Sakshi News home page

Kajal Agarwal: ఇండియన్‌ 2 కోసం కాజల్ కసరత్తులు.. వీడియో వైరల్

Published Sun, Sep 25 2022 5:23 PM | Last Updated on Sun, Sep 25 2022 6:01 PM

Kajal Aggarwal Learns Martial Arts for Kamal Haasan Indian 2 Movie - Sakshi

కమల్ హాసన్ కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఇండియన్ 2’. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తుండగా లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఈ చిత్రంలో కమల్‌కు జోడీగా అందాల భామ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ చిత్రం కోసం కాజల్ అగర్వాల్ మార్షల్ ఆర్ట్స్  నేర్చుకుంటోంది. అతిపురాతనమైన యుద్ధ క్రీడ కలారిపాయట్టును సాధన చేస్తోంది. తాజాగా ఆమె ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చిన ఈ బ్యూటీ చాలా రోజుల తర్వాత తిరిగి షూటింగ్‌లో అడుగుపెట్టింది. ఇండియన్  2 సినిమాలో తన పాత్ర కోసం యుద్ధ కళలతో పాటు గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంటోంది కాజల్. 

‍(చదవండి: Kamal Haasan: రెండేళ్ల తర్వాత సెట్స్‌లో అడుగుపెట్టిన కమల్.. ఫోటోలు వైరల్)

ఇన్‌స్టాలో పోస్టులో "కలరిపాయట్టు ఒక పురాతన మార్షల్ ఆర్ట్స్‌. షావోలిన్, కుంగ్ ఫూ, కరాటే, తైక్వాండో క్రీడలు కలరిపాయట్టు నుంచి పుట్టుకొచ్చినవే. ఈ యుద్ధ క్రీడ సాధారణంగా గెరిల్లా యుద్ధంలో వినియోగిస్తారు. ఇది శారీరక, మానసికంగా దృఢంగా ఉండేలా చేస్తుంది. మూడేళ్లుగా అడపాదడపా నేర్చుకుంటున్నా. నాకు చాలా ఓపికగా నేర్పిస్తున్న మాస్టర్‌కు ధన్యవాదాలు' అని రాసుకొచ్చింది. ఈ చిత్రంలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, బాబీ సింహా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెండేళ్ల క్రితం సెట్స్‌లో అగ్నిప్రమాదం సంభవించి ముగ్గురు సిబ్బంది మృతి చెందడంతో షూటింగ్ నిలిపేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement