మగధీరుడి నయా ప్లాన్స్ | Ramcharan taking share in profits as remunaration | Sakshi
Sakshi News home page

మగధీరుడి నయా ప్లాన్స్

Published Fri, Nov 13 2015 11:37 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

మగధీరుడి నయా ప్లాన్స్ - Sakshi

మగధీరుడి నయా ప్లాన్స్

వరుసగా 40 కోట్ల సినిమాలతో సత్తా చాటిన రామ్చరణ్ తాజా చిత్రం 'బ్రూస్ లీ'తో మాత్రం ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా భారీ అంచనాల మధ్య, హై బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా తొలిరోజు నుంచే నెగెటివ్ టాక్ తెచ్చుకోవటంతో వసూళ్ల విషయంలో కూడా బాగా వెనకపడింది. 40 కోట్లకు పైగా వసూళ్లు సాధించినా.. బడ్జెట్ పరంగా చూసుకుంటే ఈ సినిమాకు చాలా లాస్ వచ్చినట్టే అంటున్నారు సినీజనాలు.

'బ్రూస్ లీ' రిజల్ట్తో ఆలోచనలో పడ్డ చరణ్, నెక్ట్స్ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ముఖ్యంగా బడ్జెట్, బిజినెస్ల మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నాడట. బ్రూస్ లీ భారీ వసూళ్లను రాబట్టినా, ఫ్లాప్ టాక్ రావటానికి భారీ బడ్జెటే కారణం అని ఫీల్ అవుతున్న చరణ్ నెక్ట్స్ సినిమాను లిమిటెడ్ బడ్జెట్తో తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు.

ప్రస్తుతం విదేశాల్లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న మగధీరుడు తిరిగిరాగానే, తమిళ రీమేక్ 'తనీఒరువన్' షూటింగ్ను మొదలెట్టనున్నాడు. ఈ సినిమా బడ్జెట్ కంట్రోల్ చేయటం కోసం తన రెమ్యూనరేషన్లో కూడా మార్పులు చేసుకుంటున్నాడు చరణ్. ఇన్నాళ్లు రెమ్యూనరేషన్ డైరెక్ట్ గా తీసుకున్న చరణ్, ఈ సినిమాకు పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల తరహాలో లాభాల్లో షేర్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట. ఇలా చేస్తే సినిమా మీద తనకు కూడా బాధ్యత పెరుగుతుందని భావిస్తున్నాడు చరణ్. మరి చరణ్ కొత్త ప్లాన్స్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement