‘బ్రూస్‌లీ’ టైటిల్‌తో రామ్‌గోపాల్‌వర్మ
రామ్‌గోపాల్‌వర్మ ఏం చేసినా సంచలనమే. రకరకాల కాన్సెప్ట్‌లతో చిత్రవిచిత్రమైన టైటిల్స్‌తో ఏకధాటిగా సినిమాలు చేయడం ఆయనకే చేతనవునేమో! ప్రస్తుతం శర్వానంద్ హీరోగా ‘సత్య-2’ చేస్తోన్న వర్మ, మరో పక్క ‘బ్రూస్‌లీ’ టైటిల్‌తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టారు.
అయితే ఇదేదో హీరోతో యాక్షన్ సినిమా అనుకునేరు. పక్కా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అట. హీరోయిన్ ఎవరు? షూటింగ్ ఎప్పుడు? అనేది త్వరలోనే వెల్లడి స్తారట.
అలాగే తనకిష్టమైన హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో మరో చిత్రం చేయడానికి వర్మ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తెలుగు వెర్షన్ కోసం ‘పట్ట పగలు’ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారట. 30 రోజుల్లోనే ఆ చిత్రాన్ని పూర్తి చేస్తారట వర్మ.