చిరంజీవి ఇంటికి వెళ్లిన పవన్ కల్యాణ్
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవిని తమ్ముడు పవన్ కల్యాణ్ కలిశారు. ఆదివారం సాయంత్రం పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ నుంచి నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లారు. పవన్‌కు చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ స్వాగతం పలికి ఆహ్వానించారు.
చాలా కాలం తర్వాత 'బ్రూస్ లీ' లో నటించిన అన్నయ్య చిరంజీవిని పవన్ అభినందించారు. చిరుతో పాటు రామ్ చరణ్‌లను పవన్ అభినందించారు. పవన్ జనసేన పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత చిరంజీవితో అంతరం ఏర్పడినట్టు వార్తలు వచ్చాయి. కాగా ఇటీవల జరిగిన చిరు 60వ జన్మదినోత్సవం సందర్భంగా అన్నయ్యను కలిసిన పవన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత చిరంజీవిని పవన్ కలవడం ఇది రెండోసారి. తనయుడు రామ్ చరణ్ నటించిన 'బ్రూస్ లీ' సినిమాలో చిరంజీవి సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై మెరిశారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఆయన సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.