
బ్రూస్లీ పాటకు నన్నెవరూ అడగలేదు: తమన్నా
బ్రూస్లీ సినిమాలో చిరంజీవి సరసన ప్రత్యేక పాట కోసం తనను ఎవరూ సంప్రదించలేదని మిల్కీ బ్యూటీ తమన్నా చెప్పింది. ఈ విషయంలో ఇప్పటివరకు వచ్చినవన్నీ తప్పుడు వార్తలేనని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. బాహుబలి హిట్తో మంచి జోరుగా ఉన్న తమన్నాను.. ఈ సినిమాలో ప్రత్యేక గీతం కోసం ఎంపిక చేశారని కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. రామ్చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ యాక్షన్ డ్రామా బ్రూస్లీ. దాదాపు ఏడాది తరువాత రిలీజ్ అవుతున్న చరణ్ సినిమా కావటంతో అన్ని రకాల హంగులతో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు.
బ్రూస్లీలో ఓ యాక్షన్ సీన్తో పాటు స్పెషల్ సాంగ్లో కూడా నటిస్తున్నాడు చిరు. చాలా కాలం తరువాత చిరు వెండితెర మీద కనిపిస్తుండటంతో ఈ సాంగ్ను భారీ స్థాయిలో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే థమన్ అదిరిపోయే ట్యూన్ అందించాడన్న టాక్ వినిపిస్తుండగా, చిరుతో చిందేసే అందాలభామ కోసం చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. దసరా నాటికి ఈ సినిమాను విడుదల చేయాలని తలపెడుతున్నా.. చిరంజీవి పాట విషయం ఎంతకీ తేలకపోవడం కొంత ఇబ్బందిగానే ఉన్నట్లు తెలుస్తోంది.
Not been approached for any song in the film #BruceLee , false news guys!!!!
— Tamannaah Bhatia (@tamannaahspeaks) September 18, 2015