Urvashi Rautela Special Song In Chiranjeevi Waltair Veerayya Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Waltair Veerayya: వాల్తేరు వీరయ్యలో ఊర్వశి రౌతేల ఐటెం సాంగ్‌! క్లారిటీ వచ్చేసింది!

Published Tue, Nov 8 2022 1:27 PM | Last Updated on Tue, Nov 8 2022 3:45 PM

Urvashi Rautela Special Song In Chiranjeevi Waltair Veerayya Movie - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్‌, వాల్తేరు వీరయ్య చిత్రాలతో బిజీగా ఉన్నాడు. డైరెక్టర్‌ కేఎస్‌ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈచిత్రం ప్రస్తుతం షూటింగ్‌ను శరవేగంగా జరపుకుంటోంది. ఇటీవల ఈ మూవీ టైటిల్‌ ఖరారు చేసిన ఈ మూవీ నుంచి తాజా ఆసక్తికర అప్‌డేట్‌ బయటికొచ్చింది. ఇందులో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశీ రౌతేల ఓ స్పెషల్‌ సాంగ్‌ చేస్తున్నట్లు సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేదు. తాజాగా చిత్ర బృందం విడదల చేసిన ఓ ఫోటోతో ఈ వార్తలపై స్పష్టత వచ్చేసింది. సినిమాలో ఐటెం సాంగ్‌కు చిరుతో కలిసి ఆమె స్టెప్పులేసినట్లు తెలుస్తోంది.

చదవండి: బర్త్‌డే సర్‌ప్రైజ్.. వర్షకు కాస్ట్‌లీ నెక్లెస్‌ గిఫ్ట్‌ ఇచ్చిన ఇమ్మాన్యుయేల్‌!

ఇటీవల ఈ పాటకు సంబంధించిన షూటింగ్‌ కూడా జరిగినట్లు తెలుస్తోంది. దర్శకుడు మెహర్‌ రమేశ్‌ బర్త్‌డేను వాల్తేరు వీరయ్య సేట్‌లో సెలబ్రేట్‌ చేశారు. మూవీ సెట్‌లో ఆయనతో కేక్‌ కట్‌ చేయించిన ఫొటోను డైరెక్టర్ బాబీ ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ఆయన పుట్టిన రోజును వాల్తేరు వీరయ్య సెట్‌లో నిర్వహించడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. అయితే ఈ ఫొటోలో చిరంజీవి, డైరెక్టర్‌ బాబీ, మెహర్‌ రమేశ్‌ ఇతర క్రూడ్‌తో పాటు నటి ఊర్వశి రౌతేల కూడా దర్శనమించింది. దీంతో ఈ చిత్రంలో ఆమెతో అదిరిపోయే స్పెషల్‌ సాంగ్‌ను ప్లాన్‌ చేశారని స్పష్టమైందంటూ మెగా ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తు‍న్నారు. కాగా రామ్ పోతినేని-బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే ఓ సినిమాలో ఆమె ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే.

చదవండి: విశ్వక్‌ సేన్‌, అర్జున్‌ వివాదంపై స్పందించిన తమ్మారెడ్డి భరద్వాజ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement