మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం తెలుగు రీమేక్ ఇది. చిరంజీవి కెరీర్లో 154వ చిత్రంగా వస్తున్న ఈ మూవీలో హీరోయిన్‌గా తమన్నా, చిరు చెల్లెలిగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.
మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మెగా అభిమానులు వెండితెరపై చిరంజీవి ఎలా చూడాలనుకుంటున్నారో.. అలా ఈ ఫస్ట్ లుక్ ఉంది. స్టైల్‌గా జీపుపై కూర్చొని ఊర మాస్ లుక్‌లో చిరంజీవి అదరగొట్టేశాడు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రం ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది
Happy #MahaSivaratri to All !🙏
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 1, 2022
Here goes the #VibeOfBHOLAA #BholaaShankarFirstLook #BholaaShankar 🔱@MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @dudlyraj #MahathiSwaraSagar @AKentsOfficial @BholaaShankar pic.twitter.com/XVxVYP5316
Comments
Please login to add a commentAdd a comment