రష్యాలో మిస్టరీ డెత్స్‌.. ఎక్కువ మరణాలు వారివే | Mysterious Deaths Of Celebrities And Journalists In Russia Since Ukraine War - Sakshi
Sakshi News home page

రష్యాలో మిస్టరీ డెత్స్‌.. ఎక్కువ మరణాలు వారివే

Published Wed, Jan 10 2024 11:03 AM | Last Updated on Wed, Jan 10 2024 11:37 AM

Mysterious Deaths In Russia Since Ukrain War - Sakshi

మాస్కో: ఉక్రెయిన్‌తో 2022లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యాలో వరుసగా సంభవిస్తున్న ప్రముఖుల మరణాలు సంచనం కలిగిస్తున్నాయి. ఇటీవల దేశంలో వరుసగా జర్నలిస్టులు మృతి చెందుతుండడంపైనా చర్చ జరుగుతోంది. తాజాగా రష్యా అధికారిక టీవీ చానల్‌కు చెందిన ఇంటర్నెట్‌ గ్రూపు హెడ్‌ కుబాన్‌ జోయా(48) అనుమానాస్పద స్థితిలో ఇంట్లో మృతి చెందారు.

ఆమె ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని ఆమెపై విష ప్రయోగం జరిగి ఉండవచ్చని రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే న్యూస్‌ ఏజెన్సీ ఆర్‌ఐఏ నొవోస్తీ వెల్లడించింది. ఇటీవలే మరో రష్యా జర్నలిస్టు అలెగ్జాండర్‌ రైబిన్‌ కూడా ఓ హైవేపై అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

అలెగ్జాండర్‌ మరణానికి కారణాలు తెలియవని అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు చెబుతున్నారు. గత నెలలో ఓ న్యూస్‌ పేపర్‌ డిప్యూటీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌గా పనిచేస్తున్న అన్యా సరేవా రాజధాని మాస్కో నగరంలోని తన అపార్ట్‌మెంట్‌లో మృతి చెందడం సంచలనం కలిగించింది. 

ఇదీచదవండి..ఇజ్రాయెల్‌ హమాస్‌ యుద్ధం భారత్‌ కీలక వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement