కీవ్: తమ దేశంలోని జపోర్జియా అణువిద్యుత్ కేంద్రంపై రష్యా దళాలు పేలుళ్లకు పాల్పడ్డాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. తమను బ్లాక్ మెయిల్ చేసేందుకే వారు ఈ చర్యకు పాల్పడ్డారన్నారు. మరోవైపు రష్యా మాత్రం ఉక్రెయిన్ సైన్యం జరిపిన దాడుల వల్లే మంటలు వ్యాపించాయని చెబుతోంది.
యూరప్‌లోనే అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రాల్లో ఒకటైన జపోర్జియా న్యూక్లియర్ పవర్‌ప్లాంటులో ప్రస్తుతం మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే ఇక్కడ ఎలాంటి రేడియేషన్ లీక్ కాలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ సిబ్బంది తెలిపారు. మంటలు వ్యాపించిన ప్రదేశానికి తమను అనుమతించాలని వారు కోరుతున్నారు.
కాగా, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలైన 2022లోనే ఈ అణువిద్యుత్ కేంద్రాన్ని రష్యాదళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అప్పటి నుంచి ఇక్కడ విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. తాజాగా ఈ విద్యుత్‌కేంద్రం కూలింగ్‌టవర్లపై డ్రోన్ దాడి జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment