
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై శనివారం(ఆగస్టు10) అర్ధరాత్రి రష్యా మిసైల్ దాడులకు దిగింది. రష్యా నుంచి వచ్చిన బాలిస్టిక్ మిసైళ్లను ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అడ్డుకుంది. దాడుల విషయాన్ని కీవ్ నగర మేయర్ కిట్ష్‌కో నిర్ధారించారు.
కీవ్‌పై ఎయిర్ రెడ్ అలర్ట్ కొనసాగుతుందని తెలిపారు. కీవ్ శివార్లలో రెండు భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు ప్రత్యక్షసాక్షులు చెప్పారు. దాడుల్లో ప్రాణ, ఆస్తి నష్టమేమైనా జరిగిందా లేదా అనేది తెలియరాలేదు. కాగా, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం 2022 నుంచి జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment