కీవ్: రష్యా భూభాగంపై ప్రతి దాడులను ఉక్రెయిన్ ముమ్మరం చేసింది. శుక్రవారం సరిహద్దుల్లోని రష్యాకు చెందిన రోస్టోవ్ ప్రాంతంపైకి ఉక్రెయిన్ పదుల సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో మొరొజొవ్‌స్కీ ఎయిర్ ఫీల్డ్‌లోని ఆరు సైనిక విమానాలు ధ్వంసం కాగా, మరో ఎనిమిదింటికి నష్టం వాటిల్లిందని ఉక్రెయిన్ తెలిపింది.
20 మంది సిబ్బంది చనిపోయినట్లు ప్రకటించుకుంది. మొరొజొవ్‌స్కీ ప్రాంతంపైకి వచ్చిన 44 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. వైమానిక స్థావరంపై దాడి, యుద్ధ విమానాలకు జరిగిన నష్టంపై రష్యా స్పందించలేదు. దాడుల్లో ఒక విద్యుత్ ఉపకేంద్రం మాత్రం ధ్వంసమైందని పేర్కొంది. సరటోవ్, కుర్‌స్క్, బెల్గొరోడ్, క్రాస్నోడార్‌లపైకి వచ్చిన డ్రోన్లను అడ్డుకున్నట్లు రష్యా ఆర్మీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment