
రోడ్డు దాటేందుకు ఓ వృద్ధురాలు అవస్థలు పడుతోంది. కార్లు రాయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. ఏ ఒక్కరూ ఆమెకు దారివ్వటం లేదు. రోడ్డు మధ్యలో నిలుచుని ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితలో ఇబ్బందులు పడుతోంది ఆ మహిళ. అయితే, ఆమె కోసం ఏకంగా అగ్నిమాపక దళమే రంగంలోకి దిగింది. రోడ్డుకు అడ్డంగా ఫైర్ ఇంజిన్‌ను పెట్టి వాహనాలను ఆపేసి ఆమెను రోడ్డు దాటించారు ఫైర్ ఫైటర్స్. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
రోడ్డు దాటేందుకు ఇబ్బందులు పడుతున్న వృద్ధురాలికి సాయం చేసిన ఫైర్ ఫైటర్స్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. రోడ్డు దాటేందుకు ఎవరైనా ఇబ్బందులు పడుతున్నప్పుడు వారికి ఇలానే సాయం చేయండి. రోడ్డుకు అడ్డుగా మీ కారు ఉంచి దారి ఇవ్వండి అంటూ ఓ యూజర్ రాసుకొచ్చారు. మరోవైపు.. దయ, మానవత్వ సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని మరో వ్యక్తి పేర్కొన్నారు. అధికారాన్ని సరైన రీతిలో ఉపయోగించారని మరొకరు రాసుకొచ్చారు.
Wow 🥰👏🏽👏🏽👏🏽👏🏽 pic.twitter.com/3ahdMoDHqt
— How Things Are Manufactured (@fastworkers6) October 9, 2022
ఇదీ చదవండి: మేక మొక్కులకు భక్తులే షాకయ్యారు.. శివయ్య వరమిస్తాడా?.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment