crossing road
-
Viral Video: రోడ్డు దాటుతూ.. ట్రాఫిక్ రూల్స్ పాటించిన జింక
-
వావ్.. ఆ వృద్ధురాలి కోసం రంగంలోకి అగ్నిమాపక దళం!
రోడ్డు దాటేందుకు ఓ వృద్ధురాలు అవస్థలు పడుతోంది. కార్లు రాయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. ఏ ఒక్కరూ ఆమెకు దారివ్వటం లేదు. రోడ్డు మధ్యలో నిలుచుని ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితలో ఇబ్బందులు పడుతోంది ఆ మహిళ. అయితే, ఆమె కోసం ఏకంగా అగ్నిమాపక దళమే రంగంలోకి దిగింది. రోడ్డుకు అడ్డంగా ఫైర్ ఇంజిన్‌ను పెట్టి వాహనాలను ఆపేసి ఆమెను రోడ్డు దాటించారు ఫైర్ ఫైటర్స్. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రోడ్డు దాటేందుకు ఇబ్బందులు పడుతున్న వృద్ధురాలికి సాయం చేసిన ఫైర్ ఫైటర్స్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. రోడ్డు దాటేందుకు ఎవరైనా ఇబ్బందులు పడుతున్నప్పుడు వారికి ఇలానే సాయం చేయండి. రోడ్డుకు అడ్డుగా మీ కారు ఉంచి దారి ఇవ్వండి అంటూ ఓ యూజర్ రాసుకొచ్చారు. మరోవైపు.. దయ, మానవత్వ సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని మరో వ్యక్తి పేర్కొన్నారు. అధికారాన్ని సరైన రీతిలో ఉపయోగించారని మరొకరు రాసుకొచ్చారు. Wow 🥰👏🏽👏🏽👏🏽👏🏽 pic.twitter.com/3ahdMoDHqt — How Things Are Manufactured (@fastworkers6) October 9, 2022 ఇదీ చదవండి: మేక మొక్కులకు భక్తులే షాకయ్యారు.. శివయ్య వరమిస్తాడా?.. వీడియో వైరల్ -
ఎంత పద్దతిగా రోడ్డు దాటుతున్నాయో చూడండి
ఏనుగుల గుంపు ఒకటి రోడ్డు క్రాస్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోనూ ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ పర్వీన్ కశ్వాన్ తన ట్విటర్లో షేర్ చేశారు. కాగా ఆ వీడియోలో గున్న ఏనుగులను తల్లి ఏనుగులు ఎంత జాగ్రత్తగా చూసుకుంటాయనడానికి నిదర్శనంగా చెప్పవచ్చు. మొదట వీడియోలో ఒక ఏనుగు తన సమూహానికి ముందుండి నడిపించగా... దాని వెనకాలే గున్న ఏనుగులను మధ్యలో పెట్టుకొని మిగతా ఏనుగులు నడుచుకుంటూ పక్కనున్న పొదల్లోకి వెళ్లిపోయాయి. ఇంతవరకు బాగానే ఉంది.. అయితే కాసేపటికి మరికొన్ని ఏనుగులు గుంపు కూడా ముందు వెళ్లిన గుంపును అనుసరిస్తూ వడివడిగా అడుగులేస్తూ పరుగులు పెట్టాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. ప్రసుత్తం మనుషుల్లో ఐకమత్యం కనిపించని వేళ.. ఏనుగుల్లో మాత్రం తమ పిల్లలను కాపాడుకోవడంలో ఎంత జాగ్రత్త వహిస్తున్నాయనేది కనిపిస్తుంది. ఈ వీడియోనూ పర్వీన్ ట్విటర్లో షేర్ చేస్తూ..' తమ గున్న ఏనుగులను మధ్యలో పెట్టుకొని అత్యంత పటిష్ట భద్రత నడుమ రోడ్డు దాటడం ఆసక్తి కలిగించిందంటూ' ట్వీట్ చేశారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన లభించింది. షేర్ చేసిన కొద్ది సేపటికే 4వేల లైకులు లభించాయి. ' అవి వాటి పిల్లలను జెడ్ ప్లస్ కేటగిరి భద్రతతో తీసుకెళుతున్నాయి' అంటూ కామెంట్లు పెడుతున్నారు. The best thing you will watch today. This #elephant family with kids under high security just crossing a road. Big fat family. Forward from Coorg. pic.twitter.com/CFOF57rY5c — Parveen Kaswan, IFS (@ParveenKaswan) April 4, 2020 -
ప్రాణాలను బలిగొంటున్న హైవే క్రాసింగ్‌లు
సాక్షి, మునగాల : తొమ్మిదవ నంబర్ జాతీయ రహదారిని నాలుగులేన్లుగా తీర్చిదిద్ది 65వ నంబర్ జాతీయ రహదారిగా మార్చిన జీఎమ్మార్ సంస్థ క్రాసింగుల ఏర్పాటులో నియమాలు పాటించకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుం టున్నాయి. ముఖ్యంగా మండల పరిధిలో 25కి.మీ. పరిధిలో విస్తరించి ఉన్న జాతీయ రహదారిపై ఉన్న ఏడు గ్రామాల్లో ఆరు ఆరు క్రాసింగులను ఏర్పాటు చేశారు. వీటిలో సగానికిపైగా అనధికారికంగా ఏర్పాటు చేసినవే ముఖ్యంగా మం డల కేంద్రంలో సివిల్ ఆసుపత్రి ఎదురుగా అనధికారికంగా ఉన్న క్రాసింగ్ ప్రమాదకరంగా మారింది. నెలకు ఐదారు ప్రమాదాలు ఈ ప్రాంతంలో జరుగుతూనే ఉన్నాయి. మండల పరిధిలోని జాతీయ రహదారిపై ఉన్న క్రాసింగ్‌ల వద్ద గత అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఐదు నెలల కాలంలో 16మంది మృత్యువాత పడగా 38మంది గాయపడిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆకుపాముల శివారులో రిలయన్స్ బంక్ ఎదురుగా నిర్మించిన క్రాసింగ్ అత్యంత ప్రమాదకరంగా మారింది. ముకుందాపురం వద్ద బస్టాండ్ సెం టర్, హరిజన కాలనీ ఎదురుగా ఏర్పాటు చేసిన డివైడర్ల వద్ద ఎటువంటి సిగ్నల్స్ ఏర్పాటు చేయకపోవడంతో తరచూ ప్రమాదాలు నెలకొంటున్నాయి. ముకుందాపురం వద్ద జాతీయ రహదారిపై అండర్ పాస్ బ్రిడ్జీలతో పాటు సర్వీసు రోడ్లు ఏర్పాటు చేయాలని ఇటీవల గ్రామస్తులు 15రోజుల పాటు రిలే నిరాహారదీక్ష కూడా చేపట్టారు. జాతీయరహాదారిపై అతివేగంతో ప్రయాణించే వాహనాలు రోడ్డు దాటుతున్న పాదచారులు, ద్విచక్ర వాహనదారులను ఢీకొట్టడంతో వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. నిత్యం జరిగే ప్రమాదాల వల్ల జాతీయ రహదారిపై ఉన్న గ్రామాల ప్రజలు భయాందోళనల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి జాతీయ రహదారిపై ఉన్న క్రాసింగ్‌ల వద్ద సిగ్నల్స్ ఏర్పాటు చేస్తే కొంత మేరకు ప్రమాదాలు నివారించే అవకాశముంది. సదరు క్రాసింగుల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆరాటపడే అధికార యంత్రాంగం అటు పిమ్మట జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడం శోచనీయం. మండల కేంద్రంలో దాదాపు కి.మీ పొడవున ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేసిన జీఎమ్మార్ సంస్థ కేవలం ఒక అండర్ వెహికల్ పాస్ బ్రిడ్జిని ఏర్పాటు చేయడంతో మండల కేంద్రానికి వచ్చే ఆయా గ్రామాల ప్రజలు తప్పని పరిస్థితులలో క్రాసింగులను దాటి వెళ్లాల్సి వస్తుంది. ఫలితంగా ప్రమాదాలు జరగుతున్నాయి. అండర్‌పాస్ ఏర్పాటు చేయాలి జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన క్రాసింగుల వద్ద తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ముకుం దాపురం వద్ద జరిగే ప్రమాదాలు ఎక్కువ. తక్షణమే ముకుందాపురం వద్ద అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు ఇరువైపులా సర్వీసు రోడ్లు ఏర్పాటు చేయాలి – పందిరి నాగిరెడ్డి, ముకుందాపురం గ్రామస్తుడు సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి ప్రస్తుతం జాతీయ రహాదారిపై ఉన్న క్రాసింగుల వద్ద సిగ్నల్స్ ఏర్పాటు చేస్తే కొంతమేర ప్రమాదాలు అరికట్టవచ్చు, అదే విధంగా గ్రామాల సరిహద్దులలో వాహానాల వేగాన్ని అదుపు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. హైవేపై క్రాసింగ్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. – మాదంశెట్టి మహేష్ -
తవేరా ఢీకొని ఒకరి మృతి
రేగొండ(భూపాలపల్లి): సైకిల్‌పై రోడ్డు దాటుతున్న వ్యక్తిని తవేరా వాహనం ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందగా, బాలుడికి గాయాలపాలైన సంఘటన మండల కేంద్రంలోని పరకాల–భూపాలపల్లి ప్రధాన రహదారిపై శుక్రవారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. చిట్యాల మండలం తిర్మలాపురం గ్రామానికి చెందిన అంకం మల్లయ్య(55) సంక్రాంతికి ఇదే మండలంలోని గోరికొత్తపల్లిలోని కూతురు ఇంటికి వెళ్లాడు. తిరిగి శుక్రవారం తన మనవడు చిన్నబాబును సైకిల్‌పై ఎక్కించుకుని తిర్ములాపురానికి బయల్దేరి మండల కేంద్రానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో డీబీఎం–38 కాల్వ వద్ద పరకాల–భూపాలపల్లి ప్రధాన ర«హదారిని సైకిల్‌పై దాటుతుండగా పరకాల వైపు నుంచి వస్తున్న తవేరా వాహనం ఢీకొంది. దీంతో మల్లయ్య రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతిచెందగా, మనవడు తలకు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు. తవేరా వాహనాన్ని అజాగ్రత్తగా నడిపిన డ్రైవర్ రేగొండకు చెందిన చల్ల భరత్‌గా గుర్తించారు. కాగా మృతుడి వద్ద బాబు రోదిస్తున్న తీరును చూసి ప్రయాణికులు కంటతడి పెట్టారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కర్నూలు: కర్నూలు మండలం ఉల్చాల గ్రామ శివారుల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కురువ లక్ష్మణస్వామి (35) అక్కడికక్కడే మృతి చెందాడు. మహబూబ్‌నగర్ జిల్లా వడ్డెపల్లి మండలం ముండ్లదిన్నె గ్రామానికి చెందిన ఇతనికి కర్నూలు జిల్లా. రేమట గ్రామానికి చెందిన కుర్వ రామేశ్వరితో ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఈయనకు ఇద్దరు సంతానం. బుధవారం స్వగ్రామానికి వెళ్లేందుకు రేమట నుంచి ఆటోలో ఉల్చాలకు వచ్చాడు. అక్కడ పని ముగించుకొని మళ్లీ ఆటో కోసం రోడ్డు దాటుతుండగా కర్నూలు–2డిపోకు చెందిన ఏపీ 28 జడ్ 5078 బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే తాలూకా ఎస్ఐ గిరిబాబు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతుని బావ కురువ రామాంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ప్రాణం తీసిన ట్రాఫిక్ మళ్లింపు