మనలో ప్రతి ఒకరికీ ఓ కోరిక ఉంటుంది. అది చేయాలి, అక్కడికి వెళ్లాలి.. అని ఏదోఒకటి ఉండనే ఉంటుంది. ఇక అవి తీరేంత వరకు మనసు లోపల ఏదో వెలితిగా ఉండిపోతుంది. అదృష్టవశాత్తు కొందరికి తొందరగా..మరికొందరికి ఆలస్యంగా తీరుతుంది. అలా ఓ యువతి తనను తాను తెల్లటి పెళ్లి గౌనులో చూడాలనుకుంది. ఆ కోరికి తీరేసరికి ఆ యువతి కాస్త బామ్మగా మారింది. ఏదైతే ఏముంది చివరకు పెళ్లి గౌను వేసుకుని ఆ బామ్మ మురిసిపోతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే.. మార్తా మే ఓపేలియా మూన్ టక్కర్ అనే 94 ఏళ్ల బామ్మ ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో నివసిస్తుంది. టక్కర్‌కి తన పెళ్లిలో తెల్ల గౌను ధరించి అది చూసి మురిసి పోవాలని ఆమెకు చిన్నప్పటి నుంచి ఓ కల ఉండేది. కానీ ఆ కోరికి తీరలేదు. ఎందుకంటే టక్కర్ వివాహ సమయంలో అనగా 1952లో తాను నివసిస్తున్న ప్రాంతంలో నల్లజాతీయుల పట్ల వివక్ష ఉండేది. ఈ కారణంగా అప్పట్లో అది కుదరలేదు. ఇక చేసేదేమిలేక టక్కర్ తన పెళ్లి రోజున అద్దెకు తీసుకున్న బట్టలనే వేసుకుని పెళ్లి తతంగాన్ని కానిచ్చింది. అప్పటి నుంచి తన కల కలగానే మిగిలిపోయిందనే బాధ ఆమె మనసులో అలాగే ఉండిపోయింది. ఇదంతా ఓ రోజు టక్కర్ తన మనవరాలికి చెప్పగా, బామ్మ బాధను అర్థం చేసుకుంది. వెంటనే తన బామ్మను బ్రైడల్ షాప్‌కు తీసుకెళ్లి ఒక పెళ్లి గౌను కొనిచ్చింది.
పెళ్లి గౌను ధరించిన ఆ బామ్మ, ఆలస్యంగానైనా తన కోరిక నెరవేరడంతో చిన్న పిల్లలా సంబరపడిపోయింది. ఆ ఆనందంలో కేరింతలు కొట్టింది. అద్దం ముందు నిల్చుని తనను తాను చూసుకుని మురిసిపోయింది. ఇదంతా వీడియో తీసిన తన మనవరాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తమ కోసం తన జీవితంలో ఎన్నో త్యాగాలు చేసిన బామ్మ కోరిక నెరవేర్చినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని ఆ పోస్ట్‌లో తెలిపింది. పెళ్లి గౌనులో బామ్మను చూసిన నెటిజన్లు ఇంత అందమైన పెళ్లి కూతురిని మా జీవితంలో చూడలేదంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా హల్ చల్ చేస్తోంది.
Martha Mae Ophelia Moon Tucker, who was married in 1952, always wanted to wear a wedding dress. But at the time Black women weren’t allowed in bridal shops.
— ABC News (@ABC) July 10, 2021
Now 94, her dream is coming true. https://t.co/hwaA5v9T9B pic.twitter.com/qlJ84ejemX
Comments
Please login to add a commentAdd a comment