
కరోనా వేళ.. ఓ వింత ప్రకటన సోషల్ మీడియాలో చకర్లు కొడుతోంది. ఓ వధువు.. తనకు కాబోయే వరుడు కోసం పెళ్లి ప్రకటన చేసింది. ఇందులో అశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా..? పెళ్లి ప్రకటనకు ఎవరైనా వధువు లేదా వరుడు వివరాలు ఇస్తారు. కానీ ఆ వధువు తన క్రియేటివికి పదును పెట్టింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న తనకు.. కోవిషీల్డ్ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వరుడే కావాలంటూ వివాహ ప్రకటన ఇచ్చింది.
ఇదే ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పెళ్లాడిబోయే వరుడి కోసం ఆమె చేసిన క్రియేటివ్ ఆలోచన ఫన్నీగా నవ్వులు కురిపిస్తోంది. అంతే కాదండోయ్ వరుడులో ఏయే క్వాలిటీస్ ఉండాలో స్పష్టంగా చెప్పి.. పైన పేర్కొన్న అర్హత ఉన్నవారు సంప్రదించవచ్చునని పేర్కొంటూ.. వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం కొసమెరుపు.
చదవండి: ల్యాప్‌టాప్‌కు అంత్యక్రియలు.. తర్వాత ఏం జరిగిందంటే
బహుశా ఈ పిల్లికి భయానికి మీనింగ్ తెలియదు అనుకుంటా ..!
Comments
Please login to add a commentAdd a comment