wish
-
మ్యూజిక్ వరల్డ్: విష్ జోష్
రియా దుగ్గల్(రి), సిమ్రాన్ దుగ్గల్(సిమ్), జో సిద్దార్థ్ (జో), సుచితా షిర్కే(సుచి)లతో కూడిన ‘విష్’ మ్యూజిక్ బ్యాండ్ కొత్త తరం ఆకాంక్షాలు, ప్రతిభ, కలలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ‘ప్రపంచ వేదికపై మన టాలెంట్ ఏమిటో చూపాలి’ అనే లక్ష్యంతో దూసుకుపోతుంది. పాపులర్ కె–పాప్ స్ఫూర్తితో ప్రయాణం ప్రారంభించిన ‘విష్’ తనదైన స్టైల్‌ను క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయింది. ‘విష్’ సభ్యులలో ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం. సంగీతానికి సంబంధించి తమదైన ప్రత్యేక శైలి ఉంది.చెన్నైకి చెందిన ‘జో’ తన హస్కీ వాయిస్‌తో సౌత్ ఫ్లెవర్‌ను వినుల విందు చేస్తుంది. ముంబైకి చెందిన రి, సిమ్ సిస్టర్స్ వాయిస్ ‘మాకు మాత్రమే ప్రత్యేకం’ అనేలా ఉంటుంది. ఈ బ్యాండ్‌లో అతి పిన్న వయస్కురాలైన సుచీ స్వీట్ వాయిస్‌కు మరోపేరు. ఈ బ్యాండ్ ఫస్ట్ సింగిల్ ‘లాజీజ్’‘లాజీజ్’ అంటే ఉర్దూలో ‘రుచికరమైనది’ అని అర్థం. స్త్రీ సాధికారత, స్త్రీ స్వాతంత్య్రం.... మొదలైన అంశాలను ప్రస్తావించే ‘లాజీజ్’కు మంచి స్పందన వచ్చింది. (చదవండి: వర్క్ లైఫ్ బ్యాలెన్స్: ఏ సంస్థ లేదా కార్యాలయం అలాంటి ఆఫర్ ఇవ్వదు..!) -
OTT: యానిమేటడ్ ఫాంటసీ మూవీ ‘విష్’ రివ్యూ
మనకందరికీ విషెస్ ఉంటాయి. మన విష్ తీరాలని మనం ప్రతిరోజూ దేవుడిని కోరుకుంటాం. ఒకవేళ మన విష్ తీర్చే విజార్డ్ మనకు దొరికితే సూపర్ గా వుంటుంది కదా. అలాంటి కాన్సెప్ట్ తో తీసిన సినిమానే ఈ విష్. వాల్ట్ డిస్నీ ప్రొడ్యూస్ చేసిన ఈ యానిమేటడ్ ఫాంటసీ మూవీ హాట్ స్టార్ ప్లాట్ ఫాంలో స్ట్రీం అవుతోంది. క్రిస్బక్, ఫాం అనే ఇద్దరు డైరెక్టర్స్ ఈ మూవీని కలిసి తీశారు. ఇక ఈ మూవీ స్టోరీ ఏంటంటే మెడిటేరియన్ సీ లోని ఓ ఐలాండ్ లో కింగ్ డమ్ ఆఫ్ రోజాస్ అనే రాజ్యం వుంటుంది. ఆ రాజ్యానికి రాజు మాగ్నిఫికో, రాణి అమాయ. మాగ్నిఫికో రాజు తన మంత్రశక్తితో నెలకోసారి తన ప్రజలకు సంబంధించి ఒక్క విష్ ను తీరుస్తూవుంటాడు. అది కూడా ఓ పెద్ద ఉత్సవం లా చేసి ఎవరికైతే విష్ కావాలో వాళ్ళని మాగ్నిఫికో ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేసుకుంటాడో వారి విష్ ను మాత్రం తీరుస్తాడు. అలాంటి టైంలో ఈ సినిమా హీరోయిన్ ఆషా తన తాత సబినో100th బర్త్ డే కి తాత విష్ కింగ్ గ్రాంట్ చేయాలని ఇంటర్వ్యూకి వెళ్ళి సక్సెస్ అవుతుంది. అయితే రాజు మాగ్నిఫికోకి తన తాత విష్ ను గ్రాంట్ చేయమని కోరుతుంది. దానికి మాగ్నిఫికో ఒప్పుకోడు. ఆషా ఈ విషయంలో బాగా బాధ పడి ఆకాశం లో వున్న స్టార్ ను తన విష్ ను గ్రాంట్ చేయమని ప్రే చేస్తుంది. అనుకోకుండా ఆషా కోసం స్టార్ ఒక బాల్ రూపంలో వచ్చి మాజిక్ చూపిస్తుంది. ఇంక మిగతా స్టోరీ అంతా స్టార్ మాజిక్ తో కింగ్ మాగ్నిఫికో ని ఆషా ఎలా ఎదుర్కుంటుందనేదే ఈ విష్ మూవీ. స్టన్నింగ్ మాజిక్ ఎఫెక్ట్స్ తో సూపర్ గ్రాండ్ విజువల్స్ తో విష్ మూవీ మీకు ఈ వీక్ సూపర్ ఎంటర్ టైనర్. గో అండ్ వాచిట్. - ఇంటూరు హరికృష్ణ -
ఛత్తీస్‌గఢ్ చిన్నారికి ప్రధాని మోదీ లేఖ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ తన చిత్రం గీసిన చిన్నారికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేకంగా లేఖ రాశారు. గురువారం ప్రధాని మోదీ ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆకాంక్ష అనే చిన్నారి తన చిత్రం గీసి తీసుకువచ్చింది. ప్రధాని మోదీ ఆ చిన్నారిని గమనించి, వేదికపైకి పిలిపించుకున్నారు. వివరాలడిగి ఆమె ప్రతిభను మెచ్చుకున్నారు. శనివారం చిన్నారి ఆకాంక్షకు ఆయన ఒక లేఖ రాశారు. నేటి బాలికలే దేశ ఉజ్వల భవిత అని పేర్కొన్నారు. నువ్వు తీసుకువచ్చిన స్కెచ్ నాకు చాలా బాగా నచ్చింది. నాపై నువ్వు చూపిన అభిమానం, ప్రేమకు ధన్యవాదాలు. నీకు ఎల్లప్పుడూ నా ఆశీస్సులు ఉంటాయి. భవిష్యత్తులో నువ్వు విజయాలు సాధించాలని కోరుకుంటున్నా. రాబోయే 25 ఏళ్లు మీలాంటి చిన్నారులకు ముఖ్యమైన రోజులు కానున్నాయి. ఈ కాలంలో ముఖ్యంగా దేశయువతతోపాటు మీలాంటి పుత్రికలు భారత్ కలలను నెరవేరుస్తారు. దేశ భవిష్యత్తుకు కొత్త దిశను అందిస్తారు’అని ప్రధాని ఆ లేఖలో పేర్కొన్నారు. -
నా బిగ్గెస్ట్ చీర్లీడర్ అంటూ ఫోటో షేర్ చేసిన సితార
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూతురిగా సితార ఘట్టమనేని పరిచయమే. కానీ తనకంటూ సొంతగుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది. అందుకేనేమో సోషల్‌మీడియాలో తనకు ఫ్యాన్స్ ఎక్కువే. తాజాగా మహేష్‌బాబుకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా షేర్ చేసింది. (ఇదీ చదవండి: Adipurush: దిల్ రాజు ముందే ఊహించాడా?) 'మా సూపర్ డాడ్, నా బిగ్గెస్ట్ చీర్లీడర్కి హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా... లవ్ యూ టు ది మూన్ ' అంటూ తెలిపింది. సితార షేర్ చేసిన ఫోటోలు చాలా అందంగా ఉన్నాయి. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. మహేష్ బాబు తన పిల్లల కోసం ఎక్కువగానే సమయం కేటాయిస్తాడు. అందుకే ఆయనకు పిల్లలతో ప్రత్యేకమైన బాండింగ్ ఉంటుంది. దీంతో టాలీవుడ్లో మహేష్‌కు ఫ్యామిలీ మ్యాన్‌గా గుర్తింపు ఉంది. సినిమా విషయానికి వస్తే గుంటూరు కారం మూవీతో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. (ఇదీ చదవండి: రాజకీయాల్లో సినిమా గ్లామర్ క్లిక్ అవుతుందా?) -
650 కోరికలు.. యూఎస్ ప్రో రెజ్లర్ జాన్ సేనా గిన్నిస్ రికార్డు
‘మేక్ ఎ విష్’ ఫౌండేషన్ మనకు చిరపరిచితమైందే. దాని ద్వారా పిల్లల విషెస్ తెలుసుకుని మన హీరోలు సైతం ఒకటి అరా నిజం చేశారు. కానీ... యూఎస్ ప్రో రెజ్లర్ జాన్ సేనా... 650 మంది విషెస్‌ను నిజం చేసి గిన్నిస్ రికార్డు సృష్టించాడు. 45 ఏళ్ల జాన్... జూలై 19నాటికే ఈ రికార్డును పూర్తి చేసినట్టు గిన్నిస్ ప్రకటించింది. జాన్‌ను ‘హెర్క్యులీన్’(అత్యంత బలశాలి)అని ప్రశంసించింది గిన్నిస్. 42 ఏళ్ల మేక్ ఎ విష్ ఫౌండేషన్ చరిత్రలో... 200 మించిన విషెస్‌ను పూర్తి చేసినవారే లేరట. అలాంటిది 650 మంది పిల్లల కోరికలను నిజం చేయడం అంటే మామూలు విషయం కాదు కదా! అయితే... పిల్లలు ఎక్కువగా కోరుకునే సెలబ్రిటీ కూడా అతనేనట. 1999లో రెజ్లింగ్ కెరీర్‌ను మొదలుపెట్టిన 2002 నుంచే మేక్ ఎ విష్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. (చదవండి: వీడియో: కానిస్టేబుల్ కక్కుర్తి.. అటు ఇటు చూసి మామిడి పండ్ల దొంగతనం.. అడ్డంగా బుక్కయ్యాడు) -
పెళ్లి గౌనులో 94 ఏళ్ల బామ్మ క్యూట్ ఎక్స్ప్రెషన్స్... వీడియో వైరల్
మనలో ప్రతి ఒకరికీ ఓ కోరిక ఉంటుంది. అది చేయాలి, అక్కడికి వెళ్లాలి.. అని ఏదోఒకటి ఉండనే ఉంటుంది. ఇక అవి తీరేంత వరకు మనసు లోపల ఏదో వెలితిగా ఉండిపోతుంది. అదృష్టవశాత్తు కొందరికి తొందరగా..మరికొందరికి ఆలస్యంగా తీరుతుంది. అలా ఓ యువతి తనను తాను తెల్లటి పెళ్లి గౌనులో చూడాలనుకుంది. ఆ కోరికి తీరేసరికి ఆ యువతి కాస్త బామ్మగా మారింది. ఏదైతే ఏముంది చివరకు పెళ్లి గౌను వేసుకుని ఆ బామ్మ మురిసిపోతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. మార్తా మే ఓపేలియా మూన్ టక్కర్ అనే 94 ఏళ్ల బామ్మ ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో నివసిస్తుంది. టక్కర్‌కి తన పెళ్లిలో తెల్ల గౌను ధరించి అది చూసి మురిసి పోవాలని ఆమెకు చిన్నప్పటి నుంచి ఓ కల ఉండేది. కానీ ఆ కోరికి తీరలేదు. ఎందుకంటే టక్కర్ వివాహ సమయంలో అనగా 1952లో తాను నివసిస్తున్న ప్రాంతంలో నల్లజాతీయుల పట్ల వివక్ష ఉండేది. ఈ కారణంగా అప్పట్లో అది కుదరలేదు. ఇక చేసేదేమిలేక టక్కర్ తన పెళ్లి రోజున అద్దెకు తీసుకున్న బట్టలనే వేసుకుని పెళ్లి తతంగాన్ని కానిచ్చింది. అప్పటి నుంచి తన కల కలగానే మిగిలిపోయిందనే బాధ ఆమె మనసులో అలాగే ఉండిపోయింది. ఇదంతా ఓ రోజు టక్కర్ తన మనవరాలికి చెప్పగా, బామ్మ బాధను అర్థం చేసుకుంది. వెంటనే తన బామ్మను బ్రైడల్ షాప్‌కు తీసుకెళ్లి ఒక పెళ్లి గౌను కొనిచ్చింది. పెళ్లి గౌను ధరించిన ఆ బామ్మ, ఆలస్యంగానైనా తన కోరిక నెరవేరడంతో చిన్న పిల్లలా సంబరపడిపోయింది. ఆ ఆనందంలో కేరింతలు కొట్టింది. అద్దం ముందు నిల్చుని తనను తాను చూసుకుని మురిసిపోయింది. ఇదంతా వీడియో తీసిన తన మనవరాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తమ కోసం తన జీవితంలో ఎన్నో త్యాగాలు చేసిన బామ్మ కోరిక నెరవేర్చినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని ఆ పోస్ట్‌లో తెలిపింది. పెళ్లి గౌనులో బామ్మను చూసిన నెటిజన్లు ఇంత అందమైన పెళ్లి కూతురిని మా జీవితంలో చూడలేదంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా హల్ చల్ చేస్తోంది. Martha Mae Ophelia Moon Tucker, who was married in 1952, always wanted to wear a wedding dress. But at the time Black women weren’t allowed in bridal shops. Now 94, her dream is coming true. https://t.co/hwaA5v9T9B pic.twitter.com/qlJ84ejemX — ABC News (@ABC) July 10, 2021 -
నమస్తే పెట్టలేదని.. విద్యార్థిపై దాడి
సాక్షి, కొత్తూరు: తమకు నమస్తే పెట్టలేదనే కోపంతో కొందరు యువకులు డిగ్రీ విద్యార్థిని కిడ్నాప్ చేసి కర్రలతో తీవ్రంగా కొట్టి గాయపర్చారు. ఈ సంఘటన కొత్తూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. సీఐ భూపాల్ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో నివాసముండే మహేష్‌కుమార్‌సింగ్ శంషాబాద్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. గురువారం తన స్నేహితులతో కలిసి శంషాబాద్ మండలం నానాజీపూర్‌లోని వాటర్‌ఫాల్స్ వద్దకు వెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న కొత్తూరుకే చెందిన పల్లెల చందు, కొల్లంపల్లి మురారి, ముడావత్ వినోద్, శ్రీకాంత్ తమను చూసి కూడా నమస్తే పెట్టలేదని ఆగ్రహంతో మహేష్‌కుమార్‌తో గొడవకు దిగారు. అనంతరం అక్కడి నుంచి మహేష్‌కుమార్ తన బైకుపై కొత్తూరుకు వస్తుండగా యువకులు మార్గమధ్యలో అడ్డగించి తమ బైకుపై ఎక్కించుకొని కిడ్నాప్ చేశారు. సుమారు రెండు గంటల పాటు మండలకేంద్రంలోని ఆయా వెంచర్లలో తిప్పుతూ కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన మహేష్‌కుమార్ వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుని, శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు నలుగురు యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మద్యం మత్తులో హత్య శంకర్పల్లి: కన్న తండ్రిని కత్తితో నరికి చంపిన ఉన్మాదిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, మద్యం మత్తులో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో నివాసముంటున్న మ్యాదరి అంజయ్య(60)ను గురువారం రాత్రి అతడి కుమారుడు యాదయ్య కత్తితో తల నరికి హత్య చేశాడు. ఇది గమనించిన స్థానికులు ఇంటి బయట నుంచి తలుపులు వేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యాదయ్యను పట్టుకునేందుకు యత్నించగా కత్తితో బెదిరించే ప్రయత్నం చేశాడు. దీంతో గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో చేవెళ్ల ఏసీపీ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆక్టోపస్, ఫైర్ సిబ్బంది, 50 మందికి పైగా పోలీసులు ఇంటిని చుట్టుముట్టారు. ఆక్టోపస్ సిబ్బంది టియర్ గ్యాస్‌ను ఇంట్లోకి వదలడంతో వాసన తట్టుకోలేక యాదయ్య ఇంట్లో నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చాడు. అప్పటికే బయట సిద్ధంగా ఉన్న పోలీసులను తప్పించుకుని మరో ఇంటిపైకి ఎక్కాడు. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఇంటి పక్కనే ఉన్న మరో భవనం పైనుంచి నీటిని బలంగా వదలడంతో యాదయ్య కిందపడిపోయాడు. వెంటనే పోలీసులు అతడిని బంధించి పోలీస్‌స్టేషన్ తరలించారు. అనంతరం అంజయ్య మృతదేహం వద్ద వివరాలు సేకరించి పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం యాదయ్యను విచారించగా.. మద్యం మత్తులో కత్తితో తల నరికానని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. యాదయ్య మానసికస్థితి బాగోలేదని తరచూ భార్య, తల్లిదండ్రులతో గొడవçప³డేవాడని చెల్లెలు సరిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. -
అమ్మకానికి సద్దాం హుస్సేన్ ఫోటో
వాషింగ్టన్: ఇరాక్ మాజీ అధ్యక్షుడు, నియంత సద్దాం హుస్సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచాన్ని గడగడలాడించిన ఈ ఇరాకీ నేత ఫోటోను ఓ అమెరికన్ ఈ కామర్స్ సైట్ అమ్మకానికి పెట్టింది. పైగా డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తోంది. వివరాలు.. అమెరికాకు చెందిన ఈ కామర్స్ సైట్ ‘విష్’లో సద్దాం ఫోటోను అమ్మకానికి ఉంచింది. ధరను 20 డాలర్లుగా నిర్ణయించింది. పైగా డిస్కౌంట్‌ను కూడా ప్రకటించింది. ‘అన్ని ప్రొడక్ట్స్‌పై 60-80శాతం డిస్కౌంట్ లభించనుంది’ అంటూ విష్ ప్రమోట్ చేసిన యాడ్‌లో సద్దాం హుస్సేన్ ఫోటో కూడా ఉంది. దానిపై రేటు 20 డాలర్లుగా నిర్ణయించబడింది. ఇది చూసిన నెటిజనులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ‘సద్దాం హుస్సేన్‌ను ఎవరు కొనాలనుకుంటున్నారు.. అది కూడా కేవలం 20 డాలర్లకే’ అంటూ కామెంట్ చేస్తున్నారు. వాస్తవానికి ఇది సద్దాం ఫోటో కాపీ. అమెరికా సేనలకు పట్టుబడిన తర్వాత తీసిన సద్దాం ఫోటోను ప్రీమియం హెవీ స్టాక్ పేపర్లో రీప్రింట్ చేశారు. పైగా ‘దీన్ని ఉరి తీయవచ్చు లేదా ప్రేమ్ కట్టించుకోవచ్చు’ అంటూ ప్రకటన ఇచ్చారు. ప్రస్తుతం ఇది తెగ ట్రెండ్ అవుతోది. Who wants to buy Saddam Hussein for $20? pic.twitter.com/4tTpgSRKLj — The State Of Selling (@StateOfSelling) August 27, 2020 1979 జూలై 16 నుంచి 2003 ఏప్రిల్ 9 వరకు ఇరాక్‌ను అప్రతిహతంగా పాలించిన సద్దామ్, 2003 లో అమెరికా ఆధ్వర్యంలో జరిగిన ఇరాక్ ఆక్రమణలో పదవి కోల్పోయాడు. యుద్ధానంతరం అమెరికా సేనలకు బందీగా పట్టుబడి, ఇరాక్ న్యాయస్థానంలో విచారణ తరువాత 2006 డిసెంబర్ 30 న ఉరితీయబడిన సంగతి తెలిసిందే. -
వారికి మాత్రం హ్యాపీ దీపావళి!
ముంబై: దీపావళి పండుగను ఎవరైతే సెలబ్రేట్ చేసుకోవడం లేదో వారికి మాత్రం హ్యాపీ దీపావళి అంటున్నాడు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఎందుకంటే తనకు ప్రతిరోజూ దీపావళినే అని, దానిని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చేశాడు. అంతేకాదు.. భారీ శబ్దాలు చేసే బాంబులు కాలుస్తూ.. ఆనారోగ్యంతో ఉన్న ముసలివారు, చిన్నపిల్లలకు ఇబ్బంది కలిగించేవారికి అన్‌హ్యాపీ దీపావళి అంటూ రామ్‌గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎప్పటిలాగే పండుగవేళ సందడి చేశాడు. భారీ శబ్దాలు, కాంతులు వెదజిమ్మే బాణాసంచాతో పక్షులు, జంతువులను ఇబ్బంది పెట్టేవారికి ఈ 'నా ఇష్టం' రైటర్ ట్వట్టర్ ద్వారా అన్‌హ్యాపీ దీపావళి విషెస్ తెలిపాడు. అలాగే.. క్రాకర్స్ వెలిగించడం ద్వారా గాలిలోకి జింక్, మెగ్నీషియం, పొటాషియం లాంటి విషవాయువులను రిలీజ్ చేసేవారికి, నరకాసురుడు ఏం చేశాడో కూడా తెలియకుండా దీపావళి జరుపుకునే వారికి సైతం రాము తన అన్‌హ్యాపీ విషెస్ చెప్పాడు. -
జనతన సర్కారు వర్ధనరావు ఆకాంక్ష
సంస్మరణ సభలో విరసం నేత వరవరరావు తెనాలి: జనతన సర్కారు సాకారం కావాలనే కాంక్షతో తానే ఒక విప్లవ పాఠశాలగా పనిచేసిన పీజే వర్ధనరావు విప్లవ కృషీవలుడని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీన కన్నుమూసిన విప్లవ రచయిత, సామాజిక ఉద్యమకారుడు పీజే వర్ధనరావు సంస్మరణ సభను ఆదివారం రాత్రి కొత్తపేటలోని పెన్షనర్స్ అసోసియేషన్ హాలులో నిర్వహించారు. భిన్నస్వరాలు, సాహితీ సాంస్కృతిక వేదిక, శారద సాహిత్య వేదిక సంయుక్తంగా నిర్వహించిన ఈ సభకు పిల్లి వాసు అధ్యక్షత వహించారు. వరవరరావు మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ చేసిన వర్ధనరావు 1964–67 మధ్య చైనా శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవం, నక్సల్బరీ, శ్రీకాకుళం పోరాటాల ప్రభావంలోకి వచ్చినట్టు చెప్పారు. తన 20వ ఏటనే తెనాలిలో ఇంగ్లిష్ అధ్యాపకుడిగా చేరిన దగ్గర నుంచి తుదిశ్వాస వరకు 45 ఏళ్లకు పైగా విప్లవోద్యమమే ఆచరణగా, ఆలోచనగా, ఆకాంక్షగా జీవించారని అన్నారు. 1978లో గుంటూరులో జరిగిన రాడికల్ యువజన సంఘం అధ్యక్షుడిగా ఎన్నికై, రాష్ట్రవ్యాప్తంగా ‘గ్రామాలకు తరలండి’ అనే క్యాంపెయిన్ నిర్వహించి, ఎన్నో నిర్బంధాలు, చిత్రహింసలు, దాడులను వర్ధనరావు ఎదుర్కొన్నారని గుర్తుచేసుకున్నారు. దండకారణ్యంలో నిర్మాణమవుతున్న జనతన సర్కారును సాకారం చేసుకుందామన్న ఆకాంక్షతో కన్నుమూసిన విప్లవ మేస్టారుకు విప్లవ జోహార్లు చెప్పారు. వరంగల్‌కు చెందిన డాక్టర్ గోపీనాథ్, జేఎస్ఆర్ కృష్ణయ్య, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, ఎంవీ ప్రసాదరావు, ప్రమీల, ప్రదీప్, రవి మాట్లాడారు. ఉమారాజశేఖర్ స్వాగతం పలికారు. -
బ్రిటన్ బామ్మకు శుభాకాంక్షల వెల్లువ
ఆమె... మొదటి ప్రపంచయుద్ధ సమయంలో టీనేజర్. కూలిపోయిన మొదటి జెపెలియన్ విమానాన్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి. పియానో వాయిద్యంలోనూ ఆరితేరిన అనుభవశాలి. ఎన్నో చారిత్రక విషయాలు, విశేషాలు కళ్ళారా చూసి, మనసునిండా మూటగట్టుకుని 112 ఏళ్ళ సుదీర్ఘ జీవితాన్ని దాటింది. ప్రస్తుతం 113 వ పడిలోకి అడుగిడి.. బ్రిటన్ లోనే అత్యంత వృద్ధురాలుగా రికార్డులకెక్కి ప్రజల సుభాకాంక్షలు అందుకుంటోంది. రైట్ బ్రదర్స్ విజయవంతంగా విమానాన్ని కనుగొన్న సమయంలో పుట్టిన గ్లాడీస్ హూపర్... కేక్ ముక్క తిని, టీ తాగుతూ హాయిగా తన పుట్టిన రోజు వేడుకలను నిర్వహించుకుంది. ఇంగ్లాండ్ ఇస్లే ద్వీప ప్రాంతం రైడ్ నగరంలోని ఓ నర్సింగ్ హోమ్ లో జరిగిన ఆమె 113 వ పుట్టిన రోజు వేడుకలకు.. కుటుంబ సభ్యులు, స్నేహితులతోపాటు.. దేశవ్యాప్తంగా ఎంతోమంది అతిథులు హాజరయ్యారు. దేశంలో అత్యంత వయసు కలిగిన మహిళగా గుర్తింపు పొందిన అనంతరం మిసెస్ హూపర్ కు హిప్ రీప్లేస్ మెంట్ అవసరమని వైద్యుల ఆదేశాల మేరకు గత అక్టోబర్ లో నర్సింగ్ హోమ్ లో చేర్పించారు. ఆస్పత్రిలో చేరే ముందు ఆమె 85 ఏళ్ళ కుమారుడు హర్మిస్టాన్ ఇంట్లోనే ఉండేవారు. బ్రిటన్ దగ్గరలోని రొట్టింగ్ డీన్ లో పెరిగిన ఆమె.. మొదటి ప్రపంచ యుద్ధం సమయానికి యుక్త వయసులో ఉంది. నాజీలు పోలాండ్ ను ఆక్రిమించుకొని రెండో ప్రపంచ యుద్ధం మొదలైన సమయంలో ఆమెకు 36 ఏళ్ళు. 1916 లో లండన్ పై బాంబు దాడి సందర్భంగా కూలిపోయిన మొదటి జర్మన్ ఎయిర్ షిప్ ను తన తల్లి ప్రత్యక్షంగా చూశారని మిస్టర్ హార్మిస్టాన్ చెప్తున్నారు. అంతేకాక ఆమెకు కాలేజీలో ఎంతోమంది మంచి స్నేహితులు ఉండేవారని, బ్రిటన్ నుంచి ఆస్ట్రేలియా కు సోలోగా విమానాన్ని నడిపిన ఫస్ట్ ఫిమేల్ పైలట్ ఆర్మీ జాన్సన్ తన తల్లికి మంచి ఫ్రెండ్ అని ఆయన చెప్తున్నారు. అప్పట్లో హూపర్ ప్రముఖ పియానో విద్వాంసురాలుగా ఎంతోమంది ప్రముఖులతో కలిసి కచేరీలు ఇచ్చేవారని చాలా కచేరీలకు తాను కూడ వెళ్ళానని అన్నారు. హూపర్ 1922 లో లెస్లీని వివాహం చేసుకున్నారు. 1998 లో ఆయన మరణించారని అప్పటినుంచీ ఆమె తమవద్దే ఉంటున్నారని చెప్పారు. హూపర్ మొదటి లండన్ కార్ హైర్ కంపెనీని పెడదామనుకున్నారని, ఆ తర్వాత... ఇప్పుడు బ్రిటన్ కాలేజ్ గా మారిన కింగ్స్ క్లిఫ్ హౌస్ స్కూల్ ను స్థాపించినట్లు చెప్పారు. నేను ఆమెను చిన్నతనంనుంచే చూస్తున్నానని, ఇప్పటికీ ఆమెను చూస్తే ఎంతో గర్వంగా అనిపిస్తుందని హూపర్ మరో కుమారుడు.. రిటైర్డ్ పైలట్ డెరెక్ అంటున్నారు. అప్పట్లో ఆమె ఎన్నో పార్టీల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచేవారన్నారు. గొప్ప పియానో విద్యాంసురాలైన ఆమె... లండన్ డార్‌చెస్టర్ హోటల్ లో కచేరీ చేస్తున్నప్పుడు ఎన్నోసార్లు చూశానని చెప్పారు. ఇప్పటికీ ఆమె చేతులు కిందికి పైకీ కదిలించడం చూస్తే.. ఆమె సంగీత జీవితాన్నిగుర్తుచేసుకుంటున్నట్లుగా అనిపిస్తుందని, మ్యూజిక్ ఆమెకు ఎంతో సంతోషమైన, ఆరోగ్యకరమైన జీవితాన్నిచ్చిందని, భవిష్యత్తు కూడ ఆమెకు అంతే ఆనందంగా హాయిగా సాగిపోవాలని కోరుకుంటున్నామని ఆమె కుమారులు చెప్తున్నారు. -
అమెరికా చిన్నారికి చైనా యూజర్ల సహకారం
ఆ చిన్నారి అందరిలాగే తానూ ఎంతో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందాలనుకుంది. అదీ... గ్రేట్ వాల్ కలిగిన చైనా దేశంలోనే ప్రసిద్ధిపొందిన వ్యక్తిగా మారాలనుకుంది. అయితే దురదృష్టం ఆమెను వెంటాడింది. ఓ మాయదారి రోగంతో బాధపడుతున్న ఆ ఎనిమిదేళ్ళ బాలిక జీవితానికి అంత సమయం లేకపోయింది. అందుకే తల్లిదండ్రులు ఆమె కోరిక తీర్చేందుకు సామాజిక మాధ్యమాల సహాయం కోరారు. ఫేస్ బుక్ లో తమకు సహకరించమని వేడుకున్నారు. దీనికి చైనా నెట్ వినియోగదారులు భారీగా స్పందించారు. అమెరికాలోని రోడే ఐల్యాండ్ వెస్లీ ప్రాంతానికి చెందిన డోరియన్ కు నాలుగేళ్ళ వయసులోనే చిన్నపిల్లల్లో చాలా అరుదుగా కనిపించే క్యాన్సర్ (ర్యాబ్డోమియోసర్కోమా) సోకింది. పసి వయసులోనే శరీరమంతా పాకిన ఆ జబ్బుకు వైద్యం లేదని ఇంటికి వెళ్ళిపొమ్మని వైద్యులు చెప్పేశారు. పది రోజుల తర్వాత బాధితురాలి తల్లి తన గారాలపట్టి కోరికతోపాటు... చిన్నారి డోరియన్ గురించి ప్రార్థనలు చేయమంటూ.. ఫేస్ బుక్ లో తన విన్నపాన్ని పోస్ట్ చేసింది. దీంతో చైనా ఇంటర్నెట్ యూజర్లు మరణానికి దగ్గరలో ఉన్న ఆ పసిప్రాణం కల నిజం చేసేందుకు నడుం బిగించారు. ముందుగా స్పందించిన జు జింగ్ అనే మహిళ స్వయంగా బీజింగ్ దగ్గరలోని గ్రేట్ వాల్ ప్రాంతానికి వెళ్ళి, తనతోపాటు ఇతరులను కూడా 'డి స్ట్రాంగ్' బోర్డుతో ఫోటోలు తీసి ఆ సందేశాన్ని ప్రపంచవ్యాప్తం చేసేందుకు ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ వీబోలో పోస్ట్ చేసింది. గ్రేట్ వాల్ ఎక్కినందుకు ఆమె ఓ మెడల్ ను కూడా పొందింది. మెడల్ తో పాటు ఆ ఫోటోలను డోరియన్ కుటుంబానికి పంపించింది. దీంతో గ్రేట్ వాల్ తో పాటు ఇతర చైనాలోని ప్రముఖ స్థలాల్లో 'డి స్ట్రాంగ్' అంటూ తీసుకున్న అనేక ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తాయి. అంతేకాదు చైనా ప్రభుత్వ వార్తా పత్రిక సిబ్బంది కూడా ఈ ప్రచారంలో పాలుపంచుకున్నారు. ఇంకేముందీ డి స్ట్రాంగ్ వీబోలో టాప్ టెన్ టాపిక్స్ లో ముందు నిలిచింది. దీంతో ఐదువేలకు పైగా లైక్ లు, 2,500 పైగా షేర్లు వచ్చిన కొన్ని ఫోటోలు, వీడియోలను వీబో అధికారికంగా వెల్లడించింది. తమకు అందిన సహకారానికి డోరియన్ తల్లి మెలీసా ఆశ్చర్యపోయింది. డోరియన్ ప్రపంచ ప్రజలనుంచి ఎంతో స్ఫూర్తిని పొందిందని, అందరికీ తమ కృతజ్ఞతలు తెలుపుతూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. పలువురు ప్రముఖులు కూడా ట్విట్టర్, ఫేస్ బుక్ లలో డోరియన్ కు ప్రోత్పాహాన్నిచ్చారు. వారికి మాత్రమే అనుమతి ఉండే హాలీడే రిసార్ట్ లో వీఐపీ ట్రీట్ మెంట్ తో ఆనందంగా గడిపేందుకు ఒకరోజు అవకాశం కల్పించారు. స్థానిక రోడే ఐల్యాండ్ గవర్నర్, ఆయన సెనేటర్లు కూడా డి స్ట్రాంగ్ ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. -
జేబులో పట్టే కొత్త రోబో ఫోన్...
టోక్యో... జపాన్‌కు చెందిన బహుళ జాతి సంస్థ 'షార్ప్' ఇప్పుడు మీ జేబులో చక్కగా ఇమిడిపోయే కొత్త రోబో ఫోన్‌ను అందుబాటులోకి తెస్తోంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రోబోట్ ఫోన్‌ను ఈ సంస్థ పరిచయం చేస్తోంది. రోబోహోన్ పేరిట రానున్న ఈ స్మార్ట్ ఫోన్... అన్ని ఎండ్రాయిడ్, స్మార్ట్ ఫోన్లలాగే కాల్స్ మాట్లాడేందుకు, ఫోటోలు తీసేందుకు, మ్యాప్‌లు చూపించేందుకు ఉపయోగపడుతుంది. దీనితోపాటు.. డ్యాన్స్ చేయడం కూడా ఈ ఫోన్లో ప్రత్యేకత. చిన్నపాటి టచ్ స్క్రీన్ ఉండే ఈ బుజ్జి రోబో ఫోన్లో ఒక్కో స్క్రీన్ మీద కేవలం నాలుగు ఐకాన్లు మాత్రమే కనిపించే అవకాశం ఉంది. ప్రసిద్ధ టోక్యో ప్రొఫెసర్.. అండ్ రోబోటిసిస్ట్.. టొమోటకా తకహాషి అభివృద్ధి పరచిన ఈ కొత్త పరికరాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. రోబోహోన్ ప్రయోగం ద్వారా ప్రాథమికంగా ఈ ఫోన్.. మాట్లాడే సౌకర్యం కలిగి ఉంటుంది. టచ్ స్క్రీన్ లో మరోభాగం ఇంటర్నెట్. ఫోన్ వెనుక భాగంలో రెండు అంగుళాల టచ్ స్క్రీన్ ఉంటుంది. ముఖం భాగంలో లోపల కెమెరా, ప్రొజెక్టర్ అమర్చారు. ఈ ఫోన్‌కు అదనంగా కనిపించే రోబోట్ చేతులు, కాళ్ళు అది నడిచేందుకు వీలుగా ఉంటాయి. అయితే ఈ ఫోన్ మీరు కోరితే డాన్స్ కూడా చేస్తుంది. ఫోన్లో టెక్స్ట్ సందేశాలతో పాటు... ప్రొజెక్టర్ ఆధారంగా ప్రాజెక్ట్ ఫొటోలు, వీడియోటెక్స్ కనిపించే అవకాశం ఉంది. ఓ బొమ్మను నిలబెట్టినట్లే ఈ ఫోన్‌ను ఎక్కడైనా నిలబెట్టి ఫోటోలు తీయొచ్చు. యూజర్ వాయిస్‌ను, ముఖాన్ని గుర్తించగలిగే సామర్థ్యం కూడ ఈ ఫోన్‌కు ఉన్నాయి. అయితే వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్న ఈ కొత్త ఫోన్ ధర వివరాలు మాత్రం కంపెనీ ఇంకా బయట పెట్టలేదు. -
చిరంజీవి.. చూడగానే నచ్చేస్తాడు!!