రియా దుగ్గల్(రి), సిమ్రాన్ దుగ్గల్(సిమ్), జో సిద్దార్థ్ (జో), సుచితా షిర్కే(సుచి)లతో కూడిన ‘విష్’ మ్యూజిక్ బ్యాండ్ కొత్త తరం ఆకాంక్షాలు, ప్రతిభ, కలలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ‘ప్రపంచ వేదికపై మన టాలెంట్ ఏమిటో చూపాలి’ అనే లక్ష్యంతో దూసుకుపోతుంది. పాపులర్ కె–పాప్ స్ఫూర్తితో ప్రయాణం ప్రారంభించిన ‘విష్’ తనదైన స్టైల్‌ను క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయింది. ‘విష్’ సభ్యులలో ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం. సంగీతానికి సంబంధించి తమదైన ప్రత్యేక శైలి ఉంది.
చెన్నైకి చెందిన ‘జో’ తన హస్కీ వాయిస్‌తో సౌత్ ఫ్లెవర్‌ను వినుల విందు చేస్తుంది. ముంబైకి చెందిన రి, సిమ్ సిస్టర్స్ వాయిస్ ‘మాకు మాత్రమే ప్రత్యేకం’ అనేలా ఉంటుంది. ఈ బ్యాండ్‌లో అతి పిన్న వయస్కురాలైన సుచీ స్వీట్ వాయిస్‌కు మరోపేరు. ఈ బ్యాండ్ ఫస్ట్ సింగిల్ ‘లాజీజ్’‘లాజీజ్’ అంటే ఉర్దూలో ‘రుచికరమైనది’ అని అర్థం. స్త్రీ సాధికారత, స్త్రీ స్వాతంత్య్రం.... మొదలైన అంశాలను ప్రస్తావించే ‘లాజీజ్’కు మంచి స్పందన వచ్చింది.
(చదవండి: వర్క్ లైఫ్ బ్యాలెన్స్: ఏ సంస్థ లేదా కార్యాలయం అలాంటి ఆఫర్ ఇవ్వదు..!)
Comments
Please login to add a commentAdd a comment