pop
-
కే–పాప్ కాంటెస్ట్‌లో విజేతలు వీరే..
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో కొరియన్ పాప్ సంగీతం(కే–పాప్)కు నగరంలోనూ క్రేజ్ పెరిగిన నేపథ్యంలో యువత ఆసక్తిని ప్రోత్సహించేందుకు కొరియన్ కల్చరల్ సెంటర్ ఇండియాతో కలిసి ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా నిర్వహించిన కే–పాప్ సంగీత పోటీల్లో కోల్‌కతాకు చెందిన అభిప్రియ చక్రవర్తి విజేతగా నిలిచింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. నగరం నుంచి పలువురు కే–పాప్ యూత్‌ను ఆకట్టుకున్న ఈ పోటీల్లో డ్యాన్సింగ్ విభాగంలో టైటిల్‌ను ది ట్రెండ్ ఫ్రమ్ ఇటానగర్ ఆల్బమ్ సొంతం చేసుకుందని, విజేతలకు కొరియా ట్రిప్‌ను బహుమతిగా అందించనున్నట్లు వివరించారు.అలరించిన.. సంగీత్ సమారోహ్ మాదాపూర్‌లోని సీసీఆర్టీ (సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్స్ ట్రైనింగ్)లో పండిత్ జష్రాజ్ 52వ పండిత్ మోతీరాం పండిత్ మనీరాం సంగీత్ సమారోహ్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రిషి, మహిమా ఉపాధ్యాయులు పాకవజ డ్యూయోట్ను, నటి శోభన భరతనాట్య ప్రదర్శన, అభిషేక్ రఘురాం కర్ణాటక సంగీతంతో ఆకట్టుకున్నారు. పద్యనాటకం.. నటన అద్భుతం పురాకృతి దశమ వార్షికోత్సవాలు చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రదర్శించిన పౌరాణిక పద్య నాటకాలు అలరించాయి. పాదుకా పట్టాభిషేకం, భక్త పోతన, శ్రీకృష్ణ రాయభారం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అనంతరం జరిగిన సమావేశంలో కళాకారుడు ఉప్పలపాడు షేక్ సైదులుకు జీవన సాఫల్య పురస్కారం అందజేశారు. అదే విధంగా ప్రముఖ నటులు మల్లాది గోపాలకృష్ణ, ఇందిరాదేవికు ఆత్మీయ సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు శ్రీహరిరావు, సాంబశివారెడ్డి, షేక్‌లాల్ అహ్మద్, పొత్తూరు సుబ్బారావు, నాగేశ్వర్రావు, కళ్యాణ్, మల్లాది వెంకటరమణ, పుట్రేవు పరివారం తదితరులు పాల్గొన్నారు. భగవద్గీతతో జీవన నిర్వహణగీతా సారాంశాన్ని అర్థం చేసుకోవడం, ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొనడం, మానవ సంబంధాలను మెరుగుపర్చుకోవడం, సమతుల్యమైన జీవితాన్ని గడపడం వంటి అవసరమైన అంశాలపై ఆధ్యాత్మిక బోధనలను ఆధ్యాత్మిక గురువు సుఖబోధానంద స్వామి వివరించనున్నారు. ఈ నెల 30, వచ్చే నెల 1వ తేదీల్లో భగవద్గీతతో జీవన నిర్వహణ అనే అంశంపై రెండు రోజుల పాటు విశ్వేశ్వరయ్య భవన్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. -
మ్యూజిక్ వరల్డ్: విష్ జోష్
రియా దుగ్గల్(రి), సిమ్రాన్ దుగ్గల్(సిమ్), జో సిద్దార్థ్ (జో), సుచితా షిర్కే(సుచి)లతో కూడిన ‘విష్’ మ్యూజిక్ బ్యాండ్ కొత్త తరం ఆకాంక్షాలు, ప్రతిభ, కలలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ‘ప్రపంచ వేదికపై మన టాలెంట్ ఏమిటో చూపాలి’ అనే లక్ష్యంతో దూసుకుపోతుంది. పాపులర్ కె–పాప్ స్ఫూర్తితో ప్రయాణం ప్రారంభించిన ‘విష్’ తనదైన స్టైల్‌ను క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయింది. ‘విష్’ సభ్యులలో ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం. సంగీతానికి సంబంధించి తమదైన ప్రత్యేక శైలి ఉంది.చెన్నైకి చెందిన ‘జో’ తన హస్కీ వాయిస్‌తో సౌత్ ఫ్లెవర్‌ను వినుల విందు చేస్తుంది. ముంబైకి చెందిన రి, సిమ్ సిస్టర్స్ వాయిస్ ‘మాకు మాత్రమే ప్రత్యేకం’ అనేలా ఉంటుంది. ఈ బ్యాండ్‌లో అతి పిన్న వయస్కురాలైన సుచీ స్వీట్ వాయిస్‌కు మరోపేరు. ఈ బ్యాండ్ ఫస్ట్ సింగిల్ ‘లాజీజ్’‘లాజీజ్’ అంటే ఉర్దూలో ‘రుచికరమైనది’ అని అర్థం. స్త్రీ సాధికారత, స్త్రీ స్వాతంత్య్రం.... మొదలైన అంశాలను ప్రస్తావించే ‘లాజీజ్’కు మంచి స్పందన వచ్చింది. (చదవండి: వర్క్ లైఫ్ బ్యాలెన్స్: ఏ సంస్థ లేదా కార్యాలయం అలాంటి ఆఫర్ ఇవ్వదు..!) -
HYD: సాగర్‌లో నిమజ్జనం.. కాసేపట్లో హైకోర్టులో విచారణ
సాక్షి,హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం(సెప్టెంబర్10) మధ్యాహ్నం విచారణ జరగనుంది. సాగర్‌లో ప్లాస్టర్‌ఆఫ్‌పారిస్(పీవోపీ) విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని ఇప్పటికే ఇచ్చిన హైకోర్టు ఆదేశాలు అమలయ్యేలా చూడాలని పిటిషనర్ కోర్టును కోరారు. ఈ కేసులో హైడ్రాను ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు.హుస్సేన్ సాగర్ పరిరక్షణ బాధ్యత హైడ్రాదే అయినందున ప్రతివాది ఆ సంస్థేనని పిటిషనర్ తెలిపారు. నిమజ్జనం పిటిషన్‌ను ఇవాళ లంచ్ విరామం తర్వాత మధ్యాహ్నం హైకోర్టు విచారించనుంది. సాగర్‌లో పీవోపీ వినాయక ప్రతిమల నిమజ్జనంపై హైకోర్టు ఏం నిర్ణయం వెలువరిస్తుందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదీ చదవండి: కిల్లర్ డాగ్స్..! -
ఆడియెన్స్‌ను ఉర్రూతలూగించే రియా పాటలు
పాట లక్ష్యం హుషారుగా స్టెప్పులు వేయించడం మాత్రమే కాదు. పరుగును ఆపి మనలోకి మనం వెళ్లడం. మంచి ఊహలకు స్వాగతం పలకడం అంటోంది రియ సంగీతం. సాంగ్ రైటర్, సింగర్ రియ పాటలు హుషారెత్తిస్తూనే స్వీయ క్రమశిక్షణ నుంచి ఆత్మబలం వరకు ఎన్నో మంచి విషయాలను చెబుతాయి... దిల్లీలో పుట్టిన రియ రెండు సంవత్సరాల వయసులో తల్లిదండ్రులతో యూకే వెళ్లింది. పాప్–బాలీవుడ్ మ్యూజిక్‌ను వింటూ పెరిగింది. చిన్న వయసులోనే స్టేజీపై ప్రదర్శనలు ఇచ్చింది. రియ ‘పర్మిషన్’ ట్రాక్ శ్రోతలను అలరించింది. ‘పర్మిషన్’ కోసం కలం కూడా పట్టింది రియ. ఇద్దరు ప్రేమికుల గురించి కావచ్చు, స్నేహం, కుటుంబ బంధాల గురించి కావచ్చు స్టోరీ–డ్రైవెన్ లిరిక్స్ రాయడం అంటే రియకు ఇష్టం. క్లాసికల్ సింగింగ్‌లో డిప్లొమా చేసిన రియకు థియేటర్ మ్యూజిక్ అంటే ఇష్టం. ‘పర్మిషన్’ తరువాత వచ్చిన ‘డోన్ట్ హ్యావ్ ది టైమ్’కు మంచి పేరు వచ్చింది. ఇన్స్పిరేషన్ అనేది ఎప్పుడైనా, ఎక్కడైనా రావచ్చు అనే దానికి ఉదాహరణ...డోన్ట్ హ్యావ్ ది టైమ్. ఒక ఫెస్టివల్లో లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు ఈ పాటకు ఆలోచన తట్టింది. ఆడియెన్స్ కూడా లీనమై తనతో పాటు డ్యాన్స్ చేసే పాట సృష్టించాలనుకుంది రియ. అలా పుట్టిందే... డోంట్ హ్యావ్ ది టైమ్. అయస్కాంతంలా ఆకట్టుకునే పాట ఒకటి సృష్టించాలనుకుంది. అలా అని ఆ పాట అల్లాటప్పాగా ఉండకూడదని దానిలో సందేశం ఉండాలనుకుంది. మనలో ఎంత టాలెంట్ ఉంటే మాత్రం? టైమ్ లేకపోతే అంతే! అందుకే టైమ్ విలువను క్షణ, క్షణం గుర్తు చేసుకునేలా ‘డోన్ట్ హ్యావ్ ది టైమ్’ను తీర్చిదిద్దింది. ప్రతి ఒక్కరూ రిలేట్ అయ్యేలా ఉండడమే ఈ పాట సక్సెస్ సాధించడానికి కారణం అయింది. ‘ప్రతి నిమిషం అపూర్వమైనది. వెల కట్టలేనిది’ అని గుర్తు చేసే ‘డోంట్ హ్యావ్ ది టైమ్’పై పాప్ బీట్ మాత్రమే కాదు బాలీవుడ్ మ్యూజిక్ ప్రభావం కూడా కనిపిస్తుంది. ట్రాక్ వీడియోల షూట్ కోసం ఎన్నో సార్లు దిల్లీకి వచ్చిన రియ ప్రతిసారి ఒక కొత్త అనుభవాన్ని సొంతం చేసుకుంది. ‘సాంస్కృతిక వైవిధ్యంతో వెలిగిపోయే దిల్లీలో అడుగు తీసి అడుగు వేస్తే ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి’ అని దిల్లీ గురించి మురిపెంగా చెబుతుంది రియ. ‘ప్రతి నెల ఒక సింగిల్ విడుదల చేయాలనుకుంటున్నాను’ అంటున్న రియ తన రచనలు, సంగీతంతో ఎప్పుడూ బిజీబిజీగా ఉంటుంది. ఇండియాలోని ప్రొడ్యూసర్లు, మ్యూజిషియన్లతో పనిచేయాలని, లైవ్ షోలలో పాల్గొనాలనేది రియ కల. మరి నెక్స్›్ట ఏమిటి? ‘చెప్పుకోతగ్గ అద్భుతమైన ఆనందకరమైన విషయాలు మున్ముందు ఉన్నాయి. మాంచెస్టర్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్, బీబీసీ ది హండ్రెడ్ ప్రోగ్రామ్‌లో ప్రదర్శన ఇవ్వబోతున్నాను’ అంటుంది రియ. -
నేషనల్ పెన్షన్ స్కీమ్: నేరుగా జమ చేస్తే కమీషన్
న్యూఢిల్లీ: జాతీయ పింఛను పథకం (నేషనల్ పెన్షన్ స్కీమ్-ఎన్పీఎస్) పరిధిలోని సభ్యులు తమ స్వచ్ఛంద పింఛను జమలకు డైరెక్ట్ రెమిట్ (నేరుగా జమ) మార్గాన్ని ఎంపిక చేసుకుంటే, పీవోపీలకు వచ్చే నెల నుంచి రూ.15-10,000 వరకు కమీషన్ లభిస్తుందని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) ప్రకటించింది. పీఎఫ్ఆర్డీఏ కొత్త నిబంధన కింద ఎన్పీఎస్ చందాదారులు నేరుగా జమ మార్గాన్ని ఎంపిక చేసుకోవడం వల్ల ఫీజుల రూపంలో నష్టపోయే పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ (పీవోపీలు) సంస్థలకు పరిహారాన్ని ఇవ్వడమే దీని లక్ష్యమని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేట్ రంగం, అటల్ పెన్షన్ యోజన పౌరులు ఎన్పీఎస్ చందాదారులుగా ఉంటారు. అయితే ఎన్పీఎస్కు, చందాదారులకు మధ్య అనుసంధానకర్తలను పీవోపీలుగా పేర్కొంటారు. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఫిన్‌టెక్ కంపెనీలు పీవోపీల కిందకు వస్తాయి. ఎన్పీఎస్ ఖాతాలను తీసుకొచ్చేందుకు ఎంతగానో కృషి చేస్తున్న పీవోపీలకు తమ నిర్ణయం మద్దతుగా నిలుస్తుందని పీఎఫ్ఆర్డీఏ పేర్కొంది. -
పాప్ బ్యాండ్ బీటీఎస్‌తో బైడెన్ భేటీ : వీడియో వైరల్
Biden says it was great to meet BTS: దక్షిణ కొరియా పాప్ బ్యాండ్ సూపర్ గ్రూప్ బీటీఎస్ బృందం అమెరికా శ్వేతసౌధంలో అధ్యక్షుడు జో బైడెన్‌తో సమవేశమైంది. ఈ సమావేశంలో ఆసియాకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలు, వివక్షత తదితర అంశాలకు సంబంధించిన పరిష్కారమార్గాల గురించి చర్చించారు. ఈ మేరకు పాప్ బృందం బైడెన్‌ని కలవడం తమకెంతో సంతోషంగా ఉందని చెప్పింది. ఆసియా వ్యతిరేక ద్వేషపూరిత నేరాలు, వివక్ష పెరుగుదల గురించి అవగాహన పెంచడానికి బైడెన్ చేస్తున్న కృషిని ప్రశంసించింది. కరోనాకి సంబంధించిన ద్వేష పూరిత నేరాల చట్టంపై సంతంకం చేయడం వంటి బైడెన్ నిర్ణయాలను పాప్ బృందం కొనియాడింది. గత కొంతకాలంలో వైట్‌హౌస్‌లో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించేందుకు బైడెన్ చేస్తున్న కృషిని అభినందించడమే కాకుండా తమ వంతుగా సహాయ సహకారాలను అందిస్తామని తెలిపింది. ఈ మేరకు శ్వేతసౌధంలో జరిగిన సమావేశానాకి సబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. It was great to meet with you, @bts_bighit. Thanks for all you’re doing to raise awareness around the rise in anti-Asian hate crimes and discrimination. I look forward to sharing more of our conversation soon. pic.twitter.com/LnczTpT2aL — President Biden (@POTUS) June 1, 2022 (చదవండి: అందుకే ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఆయుధ సాయం: ఎట్టకేలకు బైడెన్ కీలక ప్రకటన) -
నిమజ్జనంపై హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తాం: తలసాని
-
నిమజ్జనంపై హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తాం: తలసాని
ఖైరతాబాద్: ఈ సంవత్సరం యథావిధిగానే హుస్సేన్ సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన విగ్రహాలను నిమజ్జనానికి అనుమతించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయవద్దని హైకోర్టు అదేశించిన నేపథ్యంలో భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని కోర్టు కూడా ఆలోచించాలని కోరుతున్నామన్నారు. ఇప్పటికిప్పుడు వినాయక నిమజ్జనాలకోసం బేబీ పాండ్స్ ఏర్పాటు చేయడం కష్టమని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 35 వేలకు పైగా విగ్రహాలను ప్రతిష్టించారని, ఇంత తక్కువ సమయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం సాధ్యం కాదని, పర్యావరణ ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు. నిమజ్జనం జరిగిన 48 గంటల్లో వ్యర్థాలను పూర్తిగా తొలగిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా నిమజ్జనంపై ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం హైకోర్టును ఆశ్రయించింది. హౌస్ మోషన్ రూపంలో ఈ పిటిషన్‌ను విచారించాలని కోరగా, ధర్మాసనం తిరస్కరిస్తూ, సోమవారం ఉదయం ఇదే విషయాన్ని ధర్మాసనం ముందు నివేదించాలని సూచించింది. -
NPS: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త!
మోదీ ప్రభుత్వం పెన్షనర్లకు భారీ ఊరట కలిగించింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ(పీఎఫ్ఆర్డీఏ) తాజాగా నేషనల్ పెన్షన్ వ్యవస్థ(ఎన్పీఎస్) విత్‌డ్రాయెల్ నిబంధనలను సడలించింది. కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని, చందాదారుల ఎగ్జిట్ లేదా విత్‌డ్రాయెల్ డాక్యుమెంట్ల సెల్ఫ్ అటెస్డెడ్ కాపీలను డిజిటల్ రూపంలో స్వీకరించడానికి పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్(పీఒపీ)ను అనుమతించింది. 2021 జూన్ 30 వరకు ఎన్పీఎస్ విత్‌డ్రాయెల్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఒటీపీ/ఈ-సైన్ ఆధారంగా 'ఆన్లైన్ పేపర్‌లెస్ ఎగ్జిట్ ప్రాసెస్' ఎన్పీఎస్ చందాదారుల కోసం సీఆర్ఎ తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పీఎఫ్ఆర్డీఏ ఒక సర్క్యూలర్ కూడా జారీ చేసింది. ఎన్పీఎస్ విత్‌డ్రాయెల్స్‌కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను సబ్స్క్రైబర్లు డిజిటల్ రూపంలో సీఆర్ఏకు పంపొచ్చు. కోవిడ్ 19 సమయంలో ఎన్పీఎస్ విత్‌డ్రాయెల్‌కు సంబంధించి స్వయంగా డాక్యుమెంట్లు అందించడానికి పెన్షనర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పీఎఫ్ఆర్డీఏ తెలిపింది. జూలై 21, 2020 నాటి సర్క్యులర్‌లో పేర్కొన్న సర్క్యులర్ ప్రకారం చందాదారుల ఎగ్జిట్ లేదా విత్‌డ్రాయెల్ కేసులకు సంబంధించి అనేక సందర్భాల్లో పిఆర్‌పిలు సిఆర్‌ఎకు రికార్డులు పంపించలేదని పిఎఫ్ఆర్డిఎ పేర్కొంది. కేసులు, కఠినమైన లేదా మృదువైన కాపీలు, రికార్డ్ కీపింగ్ మరియు కంట్రోల్ ప్రయోజనం కోసం విఫలం కాకుండా 2021 జూన్ 30 లోగా సంబంధిత CRA తో POP లు పంచుకోవలసి ఉంటుంది. చదవండి: వాట్సప్ సమస్యలపై గ్రీవెన్స్ ఆఫీసర్‌కి కంప్లైంట్ చేయడం ఎలా? -
యంగ్ టాలెంట్ విభిన్న ఆకాశం
కాసేపు కేఫ్‌లో పాప్ మ్యూజిక్‌తో కచేరీ ఇస్తుంది. ఇంకాసేపు ఓ ప్రసిద్ధ బ్రాండ్ కోసం మోడలింగ్ చేస్తుంది. ఆ తర్వాత కిక్ బాక్సింగ్‌తో దడదడలాడిస్తుంది. థియేటర్ ఆర్టిస్టుగా వేదికపై అదరగొడుతుంది. గుర్రపు స్వారీలో గాలితో పోటీపడుతుంది. తాను కన్న కలలను కళాత్మకంగా మలచుకుని పంతొమ్మిదేళ్ల వయసులో విభిన్న రంగాల్లో రాణిస్తున్న సంజన ఆకాశం హైదరాబాద్‌లో ఎల్ఎల్బి చేస్తోంది. ఒకేరంగంలో ప్రతిభ చూపితేనే సరైన అవకాశాలు వస్తాయనుకునేవారి ఆలోచనలకు సంజన కళ్లెం వేస్తోంది. విభిన్నరంగాల్లో ప్రతిభను చూపుతూ తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటున్న సంజన ఇన్ని కళలను ఎలా సుసాధ్యం చేసుకుంటున్నదో వివరించింది. ‘‘జీవితం ‘కళ’వంతంగా గడవాలంటే ఎక్కడా బోర్ అనిపించకూడదు. మెదడు చురుగ్గా ఉండాలంటే నచ్చిన వాటిని ఇష్టంగా ఎంచుకుంటూనే, నచ్చని వాటితోనూ పోటీ పడాలి. అప్పుడే విజయతీరాలను చేరుకోవచ్చు. నాలో నటి ఉందనే విషయం మూడేళ్ల క్రితం వరకు తెలియదు. ‘మూడేళ్ల క్రితం సమాహార థియేటర్ వర్క్‌షాప్ చూసినప్పుడు నేనూ వారితో కలిసి పని చేయాలనుకున్నాను. సమాహార థియేటర్ వర్క్‌షాప్‌లో పాల్గొని, నటన నేర్చుకున్నాను. ‘పంచ్లైడ్’ అనే బిహారీ హిందీ నాటకంలో చేశాను. ఛాలెంజింగ్‌గా అనిపించే అందులోని స్త్రీ పాత్ర నన్ను మరిన్ని నాటకరంగ పాత్రల్లో ఒదిగిపోయేలా చేసింది. అప్పటికప్పుడు లైవ్‌లో ప్రదర్శన ఉంటుంది. ఎంతో నేర్చుకోవచ్చు. ప్రజెంటేషన్, పంక్చువాలిటీ.. అన్నీ థియేటర్ నేర్పిస్తుంది. హుషారు నింపిన పాప్ అండ్ రాక్ ఆరవ తరగతి నుంచి పాప్ అండ్ రాక్ సాంగ్స్ పాడుతూ వచ్చాను. లండన్ ట్రినిటీ మ్యూజిక్ కాలేజీ టీమ్ మెంబర్స్‌తోనూ కలిసి వర్క్ చేశాను. ఇప్పుడు సొంత యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆల్బమ్స్ విడుదల చేస్తున్నాను. లాక్డౌన్ ముందు వరకు రాక్ అండ్ పాప్ బ్యాండ్స్‌తో కలిసి షోలు చేసేదాన్ని. లాక్డౌన్ సమయం నా కళల సాధనకు మరింత ఉపయోగపడింది. ప్రొఫెషనల్ వీడియోలు చేయడం, ఆ¯Œ లై¯Œ లో పోస్ట్ చేయడం ద్వారా సోషల్‌మీడియా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నాను. భయం పోగొట్టిన ర్యాంప్‌వాక్ ‘వేదవస్త్రం’ అనే బ్రాండ్ ఫ్యాబ్రిక్‌కు మోడలింగ్ చేస్తున్నాను. అమ్మ ఫ్యాషన్ డిజైనర్. తను బొటిక్ నడుపుతుంది. తను డిజైన్ చేసిన డ్రెస్సులు అమ్మ నా మీద ప్రయోగించేది. అలా మోడలింగ్ వైపు వచ్చాను. ర్యాంప్‌వ్యాక్ బాగా ఇష్టం. మొదట్లో నలుగురిలోకి వెళ్లాలంటే కొంచెం బెరుకుగా ఉండేది. మోడలింగ్‌తో ఇప్పుడా భయం పోయింది. సాహసాల స్వారీ కళల నుండి అడ్వంచర్స్ వైపు దృష్టి మొదట్లో టీవీ ప్రోగ్రాముల్లో చూసినప్పుడు మళ్లింది. అమ్మానాన్న అనుమతితో హార్స్‌రైడింగ్ నేర్చుకున్నాను. అక్కడి ట్రెయినర్ మంచి లాయర్ కూడా. ఆమెలా నేనూ అడ్వకేట్‌గా రాణించాలనుకున్నాను. అందుకే, లా చదువుతున్నాను. అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్య అవసరమనుకున్నాను. అంతేకాదు, ఆత్మవిశ్వాసానికీ కిక్‌బాక్సింగ్ బాగా పనిచేస్తుంది. అందుకే, కిక్‌బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నాను. నా వయసువారికి కిక్‌బాక్సింగ్‌లో శిక్షణ ఇస్తున్నాను. అటు కళలు .. ఇటు చదువూ థియేటర్ రిహార్సల్స్ ఉన్నప్పుడల్లా, బ్రేక్ టైమ్‌లో చదువుకోవడానికి స్కూల్ బుక్స్ తీసుకువెళ్లేదాన్ని. అలా ఇటు చదువు, అటు కళలను రెండింటినీ బ్యాలెన్స్ చేయగలిగాను. 14 ఏళ్ల వయసు నుంచి నా గొంతును కాపాడుకోవాలనే ధ్యాస పెరిగింది. దీంతో ఐస్‌క్రీమ్‌లు తినడం, కూల్ డ్రింక్స్ తాగడం మానేశాను. స్కూల్ చదువులో అంతగా రాణించేదాన్ని కాదు. కళలపై ఇంట్రస్ట్ చూపేదాన్ని. దీంతో మా నాన్న రఘునాథ్ నన్ను ఆ దిశగా ప్రోత్సహించారు. అమ్మ భార్గవి నాకు మేకప్ నేర్పించింది. మేకప్ క్లాసులకు కూడా తీసుకెళ్లేది. దీంతో సహనం అబ్బింది’ అని వివరించింది సంజన. మిగతావన్నీ ప్యాషన్. ‘లా’ నా ప్రొఫెషన్ అని వివరించిన సంజన ఇప్పుడు ఎంబీబిఎస్ రెండవ సంవత్సరం చదువుతోంది. చార్టర్డ్ అకౌంటెంట్ అయిన తండ్రి రఘునాథ్ ఆకాశం, తల్లి భార్గవి లు తాను కళల్లో రాణించడానికి ఎంతో సహకారం అందించారని తెలిపిన సంజన తాను పఠించే మంత్రాల గురించి తెలిపింది. మొదటిది చొరవ. రెండవది కఠోర శ్రమ. మూడవది స్థిరత్వం. నాల్గవది సహనం. ఎవరైనా సరే కోరుకున్నది సాధించాలనుకునే వారందరికీ ఇవి మంత్రాల్లా పనిచేస్తాయి. – నిర్మలారెడ్డి -
పీఓపీ విగ్రహాలే అత్యధికం
సాక్షి,సిటీబ్యూరో: గతానికి భిన్నంగా ఈసారి గ్రేటర్ నగరంలో పర్యావరణ హిత మట్టివిగ్రహాల ఏర్పాటుపై సిటీజనుల్లో అవగాహన పెరిగినప్పటికీ...ఈసారి సుమారు 50 వేల ప్లాస్టర్‌ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ఆయా జలాశయాల్లో నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇళ్లలో పూజలందుకునే చిన్న పరిమాణంలో ఉన్న మట్టి ప్రతిమలను నగరవాసులు ఎక్కువగా ప్రతిష్టించినప్పటికీ..కాలనీలు, బస్తీల కూడళ్లలో ఏర్పాటుచేసిన విగ్రహాల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌వే అత్యధికంగా ఉన్నాయి. మహానగరం పరిధిలో సుమారు 30 జలాశయాల్లో వినాయకనిమజ్జనం జరగనున్నప్పటికీ..అత్యధిక విగ్రహాలు నిమజ్జనం జరిగే 21 చెరువుల్లో నీటి కాలుష్యంపై పీసీబీ దృష్టిసారించింది. ఇక జలమండలి అధికారులు శోభాయాత్రలో పాల్గొనే భక్తుల సౌకర్యార్థం శోభాయాత్ర జరిగే మార్గంలో 115 తాగునీటి క్యాంపులను ఏర్పాటుచేయనుంది. ఈ క్యాంపుల్లో 32 లక్షల తాగునీటి ప్యాకెట్లను పంపిణీ చేయనున్నారు. భక్తుల దాహార్తిని తీర్చేందుకు అవసరమైతే నీటి ప్యాకెట్ల సంఖ్యను పెంచుతామని ఎండీ దానకిశోర్ తెలిపారు. 21 చెరువుల కాలుష్యంపై పీసీబీ నజర్.. నవరాత్రి పూజలందుకున్న గణనాథులను నిమజ్జనం చేసే చెరువులు, కొలనుల కాలుష్యంపై పీసీబీ దృష్టిసారించింది. గ్రేటర్ పరిధిలో హుస్సేన్‌సాగర్ సహా 21 చెరువుల్లో కాలుష్య మోతాదును పీసీబీ నిపుణులు లెక్కించనున్నారు. నిమజ్జనానికి ముందు, నిమజ్జనం జరిగే రోజులు, నిమజ్జనం తరవాత ఆయా జలాశయాల్లో నీటి నమూనాలను సేకరించి వాటి నాణ్యతను పరిశీలించనున్నారు. వీటిలో మీరాలం(బహదూర్‌పురా), లంగర్‌హౌజ్ లేక్, సరూర్‌నగర్ లేక్, రంగధాముని చెర్వు, సఫిల్గూడా చెర్వు, హస్మత్‌పేట్‌లేక్, అంబర్‌చెర్వు(కూకట్పల్లి), కాప్రాచెర్వు, దుర్గంచెర్వు, పెద్దచెర్వు, లింగంచెర్వు(సూరారం), ముండ్లకుంట(మూసాపేట్), పత్తకుంట(రాజేంద్రనగర్), నాగోల్‌చెర్వు, కొత్తచెర్వు(అల్వాల్), నల్లచెర్వు(ఉప్పల్), కాయిదమ్మకుంట(హఫీజ్‌పేట్), గుర్నాథ్‌చెర్వు(మియాపూర్), సాఖిట్యాంక్(పటాన్‌చెర్వు), రాయసముద్రం (రామచంద్రాపురం), గోపిచెర్వు(లింగంపల్లి) చెర్వులున్నాయి. ఈ చెరువుల్లో నిమజ్జనానికి ముందు ఆగస్టు 26న, నిమజ్జనం జరిగే సెప్టెంబరు 3,5,8,11,12 తేదీలతోపాటు సెప్టెంబరు 20న (నిమజ్జనం అనంతరం)నీటి నమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించనున్నారు. ఈ జలాశయాల నీటిలో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, గాఢత, బ్యాక్టీరియా, ఘన వ్యర్థాలు, కాఠిన్యత, విద్యుత్ వాహకత, కోలిఫాం, భారలోహాలు ఇలా అన్ని రకాల కాలుష్యాలను లెక్కించనున్నారు. నిమజ్జనం సందర్భంగా ఆయా జలాశయాల్లోకి సుమారు యాభైవేల వరకు విగ్రహాల నిమజ్జనం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో ఆయా జలాశయాలు కాలుష్యకాసారంగా మారనున్నాయి. ఈ విషయంపై స్థానికులను అప్రమత్తం చేసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు పీసీబీ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. -
పొల్యూషన్ అలర్ట్!
సాక్షి, సిటీబ్యూరో: గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్‌లో ఓ మోస్తరు కాలుష్యం తగ్గినట్లు ఇటీవల అధికారులు పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు ఆ ఆనందం ఆవిరయ్యే పరిస్థితి కనిపిస్తోంది. నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వస్తున్న గణపతి విగ్రహాలను సాగర్‌లో భారీగా నిమజ్జనం చేస్తున్నారు. దీంతో కాలుష్యం తీవ్రత పెరిగే ప్రమాదం పొంచి ఉందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టర్‌ఆఫ్ ప్యారిస్, ఇతర రసాయనాలతో చేసిన గణపతుల నిమజ్జనంతో ఆయా జలాశయాలు కాలుష్యకాసారం అవుతాయని వారు అంటున్నారు. గత అనుభవాల నేపథ్యంలో హుస్సేన్‌సాగర్ సహా ఇతర జలాశయాల్లో కాలుష్యంతో జరిగే అనర్థాలను వివరిస్తున్నారు. ♦ ఏటా గణేష్ నిమజ్జన ప్రక్రియ కారణంగా సుమారు 20 వేల టన్నుల ఘన వ్యర్థాలు, 30 వేల లీటర్ల అధిక గాఢత గల రసాయనాలు, హానికారక మూలకాలు, 400 టన్నుల ఇనుము, 150 టన్నుల కలప, సుమారు వంద టన్నుల పీఓపీ సాగర జలాల్లో కలుస్తాయని అంచనా. ♦ ఇందులో ఇనుము, కలపను హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో తొలగించినా..పీఓపీ, ఇతర హానికారక రసాయనాలు, రంగులు నీళ్లలో కలిసిపోవడంతో హుస్సేన్‌సాగర్ మరింత గరళసాగరమౌతోంది. ♦ అధిక మోతాదులో హానికారక రసాయనాలు, వ్యర్థాలు, మూలకాలు ప్రవేశించడంతో జలాశయంలో ప్రతి లీటరు నీటిలో జీవరాశుల మనుగడకు అత్యావశ్యకమైన బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్(బీఓడి) ప్రతి లీటరు నీటికి 100 పీపీఎంగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణ రోజుల్లో ఇది 35 నుంచి 40 పీపీఎం మించదు. ♦ ఇక కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ లీటరు నీటికి (సీఓడీ) 200 పీపీఎంకు మించే ప్రమాదం పొంచి ఉంది. సాధారణరోజుల్లో ఇది 80–100 పీపీఎం మించదు. ఇక జలాశయం నీటిలో ఆక్సిజన్ స్థాయి దారుణంగా పడిపోతోంది. ఇది ప్రతి లీటరు నీటిలో ‘సున్న’గా నమోదయ్యే ఆస్కారం ఉంది. అమ్మో.. ప్లాస్టర్ ఆఫ్ప్యారిస్.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారుచేసిన విగ్రహాలను హుస్సేన్‌సాగర్ సహా ఇతర జలాశయాల్లో నిమజ్జనం చేయడంతో అందులోని హానికారక రసాయనాలు ఆయా జలాశయాల నీటిలో చేరి పర్యావరణ హననం జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రసాయన రంగుల అవశేషాలివే: లెడ్ సల్ఫేట్, చైనా క్లే, సిలికా, జింక్ ఆక్సైడ్, రెడ్ ఐరన్ ఆక్సైడ్, రెడ్ లెడ్, క్రోమ్ గ్రీన్, పైన్ ఆయిల్, లిన్సీడ్ ఆయిల్, లెడ్ అసిటేట్, వైట్ స్పిరిట్, టర్పీన్, ఆల్కహాల్, ఎస్టర్, తిన్నర్, వార్నిష్. ♦ హానికారక మూలకాలు::కోబాల్ట్, మ్యాంగనీస్, డయాక్సైడ్, మ్యాంగనీస్ సల్ఫేట్, అల్యూమినియం, జింక్, బ్రాంజ్ పౌడర్స్, బేరియం సల్ఫేట్, క్యాల్షియం సల్ఫేట్, కోబాల్ట్, ఆర్సినేట్, క్రోమియం ఆక్సైడ్, రెడ్ ఆర్సినిక్, జింక్ సల్ఫైడ్, మెర్క్యురీ, మైకా. జలాశయాల కాలుష్యంతోతలెత్తే అనర్థాలివే.. ♦ ఆయా జలాశయాల్లో సహజ ఆవరణ వ్యవస్థ దెబ్బతింటుంది. చేపలు, పక్షులు, వృక్ష, జంతు అనుఘటకాల మనుగడ ప్రశ్నార్థకమౌతుంది. ♦ పర్యావరణం దెబ్బతింటుంది. సమీప ప్రాంతాల్లో గాలి, నీరు కలుషిత మౌతుంది. దుర్వాసన వెలువడే ప్రమాదం ఉంది. ♦ ఆయా జలాశయాల్లో పట్టిన చేపలను పలువురు మత్స్యకారులు నగరంలోని వివిధ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసి తిన్న వారికి శరీరంలోకి హానికారక మూలకాలు చేరుతున్నాయి. చేపల ద్వారా మానవ శరీరంలోకి మెర్క్యురీ మూలకం చేరితే మెదడులో సున్నితమైన కణాలు దెబ్బతింటాయి. ♦ మలేరియా, డెంగీ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ♦ సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు గరళంగా మారతాయి. ♦ నగరంలో జీవావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. జలాల్లో అరుదుగా పెరిగే వృక్ష జాతులు అంతర్థానమౌతాయి. ♦ ఆర్సినిక్, లెడ్, మెర్క్యురీ మూలకాలు భారతీయ ప్రమాణాల సంస్థ, వైద్య పరిశోధనా సంస్థలు సూచించిన పరిమితులను మించి ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ♦ వీటితోపాటు క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాలిబ్డనమ్, సిలికాన్లు జలాశయం ఉపరితలంపై తెట్టుగా ఏర్పడతాయి. ♦ జలాశయాల అడుగున క్రోమియం, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్, కాడ్మియం, లిథియం వంటి హానికారక మూలకాలు అవక్షేపంగా ఏర్పడతాయి. ప్రత్యామ్నాయాలివే.. ♦ రంగులు, రసాయనాలు లేని మట్టి వినాయక ప్రతిమలను మాత్రమే నిమజ్జనం చేయాలి. వీటి పరిమాణంసైతం చిన్నవిగానే ఉండాలి. ♦ ఆయా జలాశయాల్లో నిమజ్జనం చేసే వినాయక విగ్రహాల సంఖ్యను ఏటేటా తగ్గించాలి. ఎక్కడి విగ్రహాలను అక్కడే నిమజ్జనం చేసేలా ఆయా విభాగాలు చర్యలు తీసుకోవాలి. ♦ నగరంలో మంచినీటి చెరువులు, బావుల్లో విగ్రహాల నిమజ్జనం చేయరాదు. ♦ వినాయక విగ్రహాలతోపాటు జలాశయాల్లోకిపూలు, కొబ్బరి కాయలు, నూనె, వస్త్రాలు, పండ్లు, ధాన్యం, పాలిథీన్ కవర్లను పడవేయరాదు. ♦ నిమజ్జనం జరిగిన గంటలోపే వ్యర్థాలను తొలగించాలి. ♦ పీఓపి(ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్)తో తయారు చేసిన భారీ విగ్రహాలను నిమజ్జనం చేయకుండా... వాటిని జలాశయం వద్దకు తీసుకొచ్చి కొంత నీరు చల్లాలి. వచ్చే ఏడాది వీటిని వినియోగించేలా ప్రోత్సహించాలి. ♦ జలాశయాల్లో వ్యర్థాలు పోగుపడడంతో దోమలు వృద్ధిచెంది..మలేరియా, డెంగీ వ్యాధులు విజృంభిస్తాయి. ♦ జలాశయాల్లో వృక్ష, జంతు జాతులు, నీరు, మృతిక, గాలి, పర్యావరణం దెబ్బతినకుండా అన్నివర్గాల్లో అవగాహన పెంచాలి. -
ఓ ఐపీఎస్.. ఓ‘థ్రిల్లర్’
నేత్రదాన ంపై పోలీసు అధికారి పాడిన పాప్ గీతం ఎస్పీ ఆకే రవికృష్ణ స్వీయ రచన, గానం సోషల్ మీడియాలో హల్చల్ ఆయనో ఐపీఎస్ అధికారి. ఓ జిల్లాకు పోలీస్ బాస్. కాఠిన్యంతోనే కాదు కారుణ్యంతోనూ సమాజంలో మార్పు తీసుకురావాలని భావించారు. అంధుల జీవితాల్లో చీకట్లను పారదోలాలని అనుకున్నారు. అందుకు నేత్రదానం ఒక్కటే మార్గమనుకున్నారు. అంతే ‘నేత్రదానం’పై ‘థ్రిల్లర్’ పేరుతో ఓ గీతానికి స్వీయ రచన చేసి ఆయనే గానం చేశారు. యువతను ఆకట్టుకునేలా.. ప్రజలు ఒక్క నిమిషం ఆలోచించేలా పాటను చిత్రీకరించారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న ఆ ఐపీఎస్ మనకూ సుపరిచితుడే. ఆయనే ఆకే రవికృష్ణ. శాంతిభధ్రతలతో పాటు సమాజ శ్రేయస్సునూ భుజాలకెత్తుకున్నారాయన. గుంటూరు జిల్లాలో సైతం సామాజిక స్పృహ కలిగిన ఎన్నో అంశాలపై ఆయన స్పందించిన వైనం ప్రశంసనీయం. 4.15 నిమిషాల నిడివితో.. షార్ట్‌ఫిల్మ్ తరహాలో నలుగురు యువకులు స్టెప్పులేస్తుండగా, ఎస్పీ పాప్ గీతం తరహాలో పాట పాడారు. 4.15 నిమిషాల నిడివితో ఈ పాటను ఎస్పీ మ్యూజిక్ స్టూడియోలో పాడుతుండగా చిత్రీకరించారు. నేత్రదానంపై యువతను మేల్కొలిపేలా ఉన్న ఈ పాట ప్రస్తుతం ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ పాటను విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు అంకితం చేశారాయన. - ప్రత్తిపాడు -
ఆస్తుల పరిరక్షణలో భేష్
- సీఐఎస్ఎఫ్ ట్రెయినింగ్ సెక్టార్ ఐజీ అనిల్‌కుమార్ - హకీంపేట్ సీఐఎస్ఎఫ్లో 62 మందికి శిక్షణ - కేంద్ర అగ్నిమాపక సిబ్బంది పాసింగ్ అవుట్ పెరేడ్ శామీర్‌పేట్ రూరల్: ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల పరిరక్షణకు కేంద్ర అగ్నిమాపక సిబ్బంది ఎంతగానో శ్రమిస్తున్నారని సెంట్రల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ట్రెయినింగ్ సెక్టార్ ఐజీ అనిల్‌కుమార్ అన్నారు. శనివారం మండలంలోని హకీంపేట్ పరిధిలోని సీఐఎస్ఎఫ్లో అగ్నిమాపక కానిస్టేబుల్, డ్రైవర్, పంప్ ఆపరేటర్ల 12వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పెరేడ్ (పీఓపీ) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అనిల్‌కుమార్ మాట్లాడుతూ విపత్కాలంలో అగ్నిమాపక సిబ్బంది ఎంతగానో కష్టించి దేశ ప్రజలకు మంచి సేవలందిస్తున్నారని ప్రశంసించారు. ఇటీవల రసాయన పరిశ్రమల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, శిక్షణతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడాలని సూచించారు. శిక్షణలో ప్రతిభ కనపర్చిన జవాన్లకు బహుమతులు అందజేశారు. ముందుగా శిక్షణ పొందిన సిబ్బంది నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 62 మంది ఇందులో శిక్షణ పొంది పాసింగ్ అవుట్ పెరేడ్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఫైర్ ట్రెయినింగ్ ప్రిన్సిపాల్ భట్టాచార్య తదితరులు పాల్గొన్నారు.