HYD: సాగర్‌లో నిమజ్జనం.. కాసేపట్లో హైకోర్టులో విచారణ | Ganesh Idols Immersion In Hussain Sagar Hearing In Highcourt Updates | Sakshi
Sakshi News home page

హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం.. కాసేపట్లో హైకోర్టులో విచారణ

Published Tue, Sep 10 2024 11:22 AM | Last Updated on Tue, Sep 10 2024 11:25 AM

Ganesh Idols Immersion In Hussain Sagar Hearing In Highcourt Updates

సాక్షి,హైదరాబాద్‌: హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం(సెప్టెంబర్‌10) మధ్యాహ్నం విచారణ జరగనుంది. సాగర్‌లో ప్లాస్టర్‌ఆఫ్‌పారిస్‌(పీవోపీ) విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని ఇప్పటికే ఇచ్చిన హైకోర్టు ఆదేశాలు అమలయ్యేలా చూడాలని పిటిషనర్‌ కోర్టును కోరారు. ఈ కేసులో హైడ్రాను  ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌ విజ్ఞప్తి చేశారు.

హుస్సేన్ సాగర్ పరిరక్షణ  బాధ్యత హైడ్రాదే అయినందున ప్రతివాది  ఆ సంస్థేనని పిటిషనర్‌ తెలిపారు. నిమజ్జనం పిటిషన్‌ను  ఇవాళ లంచ్‌ విరామం తర్వాత మధ్యాహ్నం హైకోర్టు విచారించనుంది. సాగర్‌లో పీవోపీ వినాయక ప్రతిమల నిమజ్జనంపై హైకోర్టు ఏం నిర్ణయం వెలువరిస్తుందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.  

 ఇదీ చదవండి: కిల్లర్‌ డాగ్స్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement