Ganesh idol immersion
-
అదర్‌సైడ్ .. నువ్వు విజిలేస్తే...
ప్రతి సంవత్సరం మన దేశంలో నిమజ్జనోత్సవాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రకరకాల వేషాల్లో వినాయకుడు సరదాగా ఉన్నాడు. లడ్డూ వేలాలు కోట్లకు చేరుకుంటు న్నాయి. ఇన్ని జరుగుతున్నా, ఇన్ని మారుతున్నా ఒక్కటి మాత్రం మారలేదు – నిమజ్జనం లాంటి సమయాల్లో పోగైన జనాల మధ్యనుంచి స్త్రీలని వేధించే పోకిరీ వేషాలు.నిమజ్జనాలు మొదలైన మూడో రోజు అనుకుంటా. ఒక మీటింగ్ ముగించుకుని ఊబర్ బైక్‌పై ఇంటికొస్తున్నాను. ట్రాఫిక్ మెల్లగా కదుల్తోంది. మా బైక్‌కి కొంచెం ముందు ఒక చిన్న ట్రాలీ ఆటోలో ఒక బుజ్జి వినాయకుడు. క్యూట్‌గా ఉన్నాడు. వినాయకుడి విగ్రహం కంటే చుట్టూ పెట్టిన సౌండ్ సిస్టం పెద్దదిగా ఉంది. డుబ్ డుబ్ అని డీజే సౌండ్లతో మారుమోగిపొతోంది రోడ్డంతా. ట్రాలీలో ఒక పదిమందికి పైగానే కుర్రాళ్ళు ఫుల్ డాన్స్ చేస్తున్నారు. అంతా బావుంది అనుకుంటుండగా ఆ గుంపులో ఒకడు నన్ను చూసి కన్ను కొట్టాడు. అప్పటివరకూ నేనూ సరదాగా చూస్తున్న ఆ దృశ్యం వికృతంగా మారింది.అంతటితో అయినపోలేదు. నా వైపు చూసి కన్ను కొట్టినోడు, పక్కనున్న మరొకడి చెవిలో ఏదో చెప్పడు. వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఏమో గట్టిగా నవ్వుకుంటూ అప్పటిదాకా నిలబడి చూస్తున్న వీళ్లిద్దరూ డాన్స్ చేస్తున్న కుర్రాళ్లతో కలిసి అదో రకంగా స్టెప్స్ వేయడం మొదలుపెట్టారు. మామూలుగా అయితే నేను మొహం తిప్పేసుకోవడమో లేదా మొబైల్ చూసుకోవడమో చేసేదాన్ని. కానీ ఆ రోజు మాత్రం వాళ్లవైపే గుడ్లురుమి చూస్తుండిపోయాను. ఎంత కోపంగా చూస్తే అంత రెచ్చిపోతున్నారు. ట్రాఫిక్ కదలడం లేదు. కాసేపటికి నేనే తల తిప్పుకున్నాను. ట్రాఫిక్ కొంచెం మూవ్ అయింది. మా ఊబర్ డ్రైవర్ ఒక కారు వెనక ఆగిపోయాడు. ఆ ట్రాలీ ఆటో ముందుకు వెళ్లిపోయింది. పాట మారింది. అప్పుడే మమ్మల్ని దాటుకొని ఒక స్కూటీ వెళ్లింది. ఆ స్కూటీ నడుపుతున్న అమ్మాయి మీదకి మారింది ఆ కుర్రాళ్ల చూపు. ఆ అమ్మాయిని చూసి కూడా అవే కోతలు, అవే కేకలు, అవే కుప్పి గంతులు. ఆ అమ్మాయి చున్నీ సర్దుకోవడం నాకు కనిపించింది. ఆ అమ్మాయి ఆ ట్రాలీని కూడా దాటుకొని ఫాస్ట్ గా అక్కడి నుండి వెళ్లిపోయింది. ఓయ్ ఓయ్ అని తరిమాయి ఆ పిల్లని ఈ గాలి మాటలు.ఆ కుర్రాళ్లు ఆ రాత్రికెప్పుడో నిమజ్జనం పూర్తి చేసుకుని, ఏ అర్ధరాత్రో ఇంటికి చేరుకుని హాయిగా నిద్రపోయుంటారు. కానీ వాళ్ల చేసిన అల్లరికి ఎంతమంది అమ్మాయిలకు ఆ రాత్రి నిద్రపట్టకుండా చేసుంటారో, వాళ్లలో ఎంత భయాందోళనలు కలుగచేసి ఉంటారో వాళ్లకి తెలిసుండదు.ఏదో దార్లో ఆమ్మాయి కనిపిస్తే జస్ట్ విజిలేసా, అంతే అని మగాళ్లకి అనిపించవచ్చు. అదేం పెద్ద విషయం కాదని మన సినిమాలు నార్మలైజ్ చేసుండొచ్చు. కానీ ఈ రకమైన వేధింపులు స్త్రీలకు తీవ్రమైన మానసిక, శారీరక ఇబ్బందులను కలుగచేస్తాయనేది ఇప్పటికైనా అందరూ తెలుసుకోవాల్సిన విషయం.ఇదో పెద్ద సమస్యా అని తీసిపారేసే విషయం కాదు. 2014లో న్యూయార్క్ లో సొషానా రాబర్ట్స్ అనే మహిళ 10 గంటల పాటు నడిచినప్పుడు దాదాపు 100 సార్లు ఇలాంటి వేధింపులకు గురైంది. ఆమె ఈ అనుభవాన్ని వీడియోగా చిత్రీకరించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో వైరల్ అయి, ప్రపంచవ్యాప్తంగా క్యాట్ కాలింగ్‌పై చర్చకు తెరలేపింది.అంటే ఒకమ్మాయి రోడ్డు మీద గంటసేపు నడిస్తే కనీసం పదిసార్లు ఎవరో ఒకరు ఆమెను అదోలా చూడడమో, ఏదో ఒకటి అనడమో జరుగుతుంది. ఒక్కసారి ఆలోచిస్తే భయంగా లేదా?సరే ఇది ఒక వైపైతే, నిమజ్జనం చివరి రోజు ఆ జనాల మధ్య ఎంతమంది మగాళ్లు ఆడవాళ్లని తాకరాని చోట తాకుతూ ఎంత హింసకు గురిచేస్తారో, ఈ దేశంలోని ప్రతి మహిళ ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి అనుభవానికి గురయ్యే ఉంటారు. ఇది కేవలం నిమజ్జనానికి సంబంధించిన విషయం కాదు. ఎక్కడ ఎప్పుడు జనాలు గుమిగూడినా జరిగే విషయమే.ఒక్క ఖైరతాబాద్ గణేష్ మండపం దగ్గర, కేవలం వారం రోజుల్లో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న 285 మందిని అరెస్ట్ చేశారంటే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఆలోచించండి.లైంగిక వేధింపు అనేది కేవలం స్త్రీల సమస్య కాదు, ఇది మన సమాజం మొత్తం ఎదుర్కొంటున్న సమస్య. ఈసారి ఎదురుగా వస్తున్న అమ్మాయిని చూసి ఏదైనా అనాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా అక్కడ మీ అమ్మో, అక్కో, చెల్లో ఉంటే ఏం చేస్తారు అని ఒక్కసారి ఆలోచించమని మై డియర్ మగాళ్లను రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతేకాదు ఈ సమస్య బయట వేరేవరో కాదు మీ అక్క, మీ చెల్లి కూడా ఎదుర్కొంటున్నారని ఆలోచించమంటున్నాను. -
HYD: సాగర్‌లో నిమజ్జనం.. కాసేపట్లో హైకోర్టులో విచారణ
సాక్షి,హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం(సెప్టెంబర్10) మధ్యాహ్నం విచారణ జరగనుంది. సాగర్‌లో ప్లాస్టర్‌ఆఫ్‌పారిస్(పీవోపీ) విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని ఇప్పటికే ఇచ్చిన హైకోర్టు ఆదేశాలు అమలయ్యేలా చూడాలని పిటిషనర్ కోర్టును కోరారు. ఈ కేసులో హైడ్రాను ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు.హుస్సేన్ సాగర్ పరిరక్షణ బాధ్యత హైడ్రాదే అయినందున ప్రతివాది ఆ సంస్థేనని పిటిషనర్ తెలిపారు. నిమజ్జనం పిటిషన్‌ను ఇవాళ లంచ్ విరామం తర్వాత మధ్యాహ్నం హైకోర్టు విచారించనుంది. సాగర్‌లో పీవోపీ వినాయక ప్రతిమల నిమజ్జనంపై హైకోర్టు ఏం నిర్ణయం వెలువరిస్తుందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదీ చదవండి: కిల్లర్ డాగ్స్..! -
హైదరాబాద్‌ను ప్రశాంతంగా ఉండనివ్వరా?: తలసాని
-
టీఆర్ఎస్ నేతల తీరుపై మండిపడ్డ ఈటెల రాజేందర్
-
గణేష్ నిమజ్జనం ఆంక్షల వివాదంపై తలసాని స్పందన
-
ప్రగతిభవన్ లోనే విగ్రహాల నిమజ్జనం చేస్తాం : బండి సంజయ్
-
Hyderabad : గణేష్ నిమజ్జనంపై వివాదం
-
విగ్రహాల నిమజ్జనంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: వినాయకుడి విగ్రహాల నిమజ్జనంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి శుక్రవారం కీలక ప్రకటన చేసింది. గణేష్ విగ్రహాల నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లోనే చేసి తీరుతామని ఉత్సవ సమితి చీఫ్ భగవంత్ రావు వెల్లడించారు. విగ్రహాల తయారీ విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతీస్తున్నామని తెలిపారు. విగ్రహాల ఎత్తు విషయంలో ప్రభుత్వం, పోలీసులు జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం నిమజ్జనం ఏర్పాట్లను ఎలాంటి ఆటంకం లేకుండా చేయాలని కోరారు. మండప నిర్వహకులు ఎవ్వరికీ ఇబ్బంది జరగకుండా విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రతి మండపంలో జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వీరులను స్మరించుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే వేడుకలను సంస్కృతి సాంప్రదాయబద్దంగా నిర్వహించాలని, డీజే, సినిమా పాటలు, డాన్సులు లేకుండా ఉత్సవాలు జరపాలని పేర్కొన్నారు. -
గణేశ్ విగ్రహాల తయారీపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే పీవోపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసే నీటి గుంటల్లోనే(బేబి పాండ్స్) పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయాలని పేర్కొంది. కాగా గతేడాది కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) పీవోపీ విగ్రహాల నిషేధంపై మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ మార్గదర్శకాలను సవాల్ చేస్తూ విగ్రహాల తయారీదారులు హైకోర్టును ఆశ్రయించారు. కరోనాకు ముందు విగ్రహాలను తయారు చేశామని, కనీసం వాటినైనా అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. దీనిపై విచారించిన కోర్టు.. ఇందులో తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. పీసీబీ కేవలం మార్గదర్శకాలను మాత్రమే జారీ చేసిందని, ప్రభుత్వం పీవోపీ విగ్రహాలపై ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయలేనందున తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. అయితే విగ్రహాల ఎత్తు తగ్గించేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు.. దుర్గాపూజపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ మార్గదర్శకాలను పరిశీలించాలని సూచించింది. చదవండి: కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేం: కేంద్రం -
హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి లైన్‌క్లియర్
-
మహేశ్ ఫ్యామిలీ ఇంట వినాయక నిమజ్జన వేడుకలు.. వీడియో వైరల్
Mahesh Babu Family Ganesh Chaturthi Celebrations: టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఫ్యామిలీ ప్రతి ఏటా వినాయక చవితి పండగను ఘనంగా జరుపుకుంటుంది. ఇంట్లో గణేశ్ విగ్రహాన్ని ప్రతిష్టించి నిష్టగా పూజలు చేస్తారు. అయితే ఈ సారి పర్యావరణ సహిత వినాయకుడిని ఇంటికి తెచ్చుకున్నారు ఘట్టమనేని ఫ్యామిలీ. ఘనంగా పూజలు నిర్వహించడమే కాదు.. నిమజ్జనం కూడా అలాగే చేశారు.మట్టి గణేషుడిని ఇంట్లోని తొట్టిలో నిమజ్జనం చేయగా, ఆ కార్యక్రమంలో మహేశ్, నమ్రత, సితార, గౌతమ్ పాల్గొన్నారు. నిమజ్జనం చేసే ముందు పూజలు చేసి ఆ తర్వాత గణేషుడికి బైబై చెప్పారు. ‘గణేశుడికి వీడ్కోలు ఎప్పుడూ ఉండదు. ఆ దేవ దేవుడి కృప మా కుటుంబంపై ఎప్పుడూ ఉంటుంది. వచ్చే ఏడాది మళ్లీ త్వరగా వస్తావని ఆశిస్తున్నాను అంటూ నమ్రత ఓ వీడియోని తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. (చదవండి: సైదాబాద్ చిన్నారి హత్యాచారంపై స్పందించిన మహేశ్) వినాయక విగ్రహాల నిమజ్జనం జలవనరులు కాలుష్యానికి కారణం కాకుడదని ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. మహేశ్‌బాబు, నమ్రత సహజంగానే ప్రకృతి ప్రేమికులు. పర్యావరణాన్ని కాపాడుతూనే పండగలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవచ్చని ఘట్టమనేని ఫ్యామిలీ నిరూపించింది. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
వేయలేక.. వదల్లేక.. భక్తులకు నిమజ్జనం టెన్షన్!
ఓ వైపు చెరువుల్లో పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దంటూ నిబంధనలు...మరోవైపు తెచ్చిన విగ్రహాన్ని ఎలాగైనా నిమజ్జనం చేయాలనే ఆరాటం మధ్య భక్తులు ఒత్తిడికి గురవుతున్నారు. పోలీసుల కంటపడకుండా నానా ఇబ్బందులు పడుతూ దొడ్డిదారిలో వెళ్లి విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా సోమవారం ట్యాంక్‌బండ్‌పై ఇలా ప్రమాదపుటంచున నిమజ్జనం చేయడం కనిపించింది. సాక్షి, హైదరాబాద్: గణేశ్ నిమజ్జనాలకు సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం నుంచి స్పష్టమైన సూచనలు లేకపోవడం..హైకోర్టు ఆదేశాల గురించి ప్రజలకు తెలియకపోవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చెరువుల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ)తో చేసిన, కెమికల్స్‌తో కూడిన రంగుల విగ్రహాలను నిమజ్జనం చేయరాదనే హైకోర్టు ఆదేశాలు తెలియని ప్రజలు ప్రతి సంవత్సరం మాదిరిగానే తాము ఎప్పుడూ నిమజ్జనం చేసే ప్రాంతాలకు విగ్రహాలతో వెళ్తున్నారు. కానీ ఆయా విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు పోలీసులు అనుమతించడం లేదు. దీంతో ఆ విగ్రహాలను నీళ్లలో వేయలేక.. అక్కడే వదిలి వెళ్లలేక వారంతా అయోమయానికి గురవుతున్నారు. వందలాది మంది దూర ప్రాంతాల నుంచి వాహనాల్లో విగ్రహాలను తీసుకువచ్చి...తీరా నిమజ్జనానికి అనుమతి లేదని తెలిసి అవాక్కవుతున్నారు. చదవండి: హుస్సేన్‌సాగర్‌లో ‘నిమజ్జనం’పై సుప్రీంకు.. పోలీసులకు తలనొప్పులు సరూర్‌నగర్, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లోని చెరువుల వద్దకు బ్యాండు మేళాలతో డ్యాన్సులు చేస్తూ వెళ్తున్న భక్త జనం విగ్రహాలను నిమజ్జనం చేయకుండా అక్కడే వదిలేస్తున్నారు. ఈ వ్యవహారం పోలీసులకు తలనొప్పిగా మారింది. సాధారణంగా నాలుగు రోజుల వరకు చిన్న విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేయడం, ఐదో రోజునుంచే మూడు నాలుగు అడుగులు, అంతకంటే ఎక్కువ ఎత్తు విగ్రహాలను నిమజ్జనం చేయడం తెలిసిందే. దీంతో ఐదోరోజైన మంగళవారం పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశాలున్నాయి. కొన్ని చెరువుల వద్ద మాత్రం ఎలాంటి ప్రతికూలత లేకపోవడంతో నిమజ్జనాలు చేసి వెళ్తున్నారు. చదవండి: హైదరాబాద్: వినాయక నిమజ్జనం ఎక్కడ? అధికారుల మల్లగుల్లాలు విగ్రహాల నిమజ్జనాలకు సోమవారం హైకోర్టు నుంచి సానుకూల స్పందన వస్తుందని అధికారులు ఆశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని హైకోర్టు స్పష్టం చేయడంతో వివిధ శాఖల అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. కోర్టు అనుమతించిన బేబీ పాండ్స్ (ప్రత్యేక నిమజ్జన కొలను)లోనే నిమజ్జనాలకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసే ప్రయత్నాల్లో మునిగారు. భారీ గణపతులు సైతం బేబీ పాండ్స్‌లోనే... ► ఖైరతాబాద్, బాలాపూర్ వంటి పెద్ద వినాయక విగ్రహాలను సైతం బేబీ పాండ్స్‌లోనే నిమజ్జనం చేసేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. సంజీవయ్యపార్కు, నెక్లెస్‌రోడ్ వద్ద హుస్సేన్సా గర్ నీటిలోనే రెండు బేబీపాండ్స్ ఉన్నాయి. పెద్ద విగ్రహాలను కూడా వాటిల్లో నిమజ్జనం చేసేందుకు అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది. ► మరోవైపు హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు కూడా తెలుస్తోంది. ఏదేమైనా , తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో జీహెచ్ఎంసీ, తదితర అధికారులు బిజీబిజీగా ఉన్నారు. ఏం చేస్తున్నారన్నది మాత్రం స్పష్టంగా వెల్లడించడం లేరు. ► బేబీపాండ్స్లోనే అన్నివిగ్రహాల నిమజ్జనం జరగాలంటే ఎక్కువ రోజులు పడుతుందని అంచనా వేస్తున్నారు. జాప్యం జరగకుండా ఉండేందుకు బేబీపాండ్స్ను పూర్తిగా నీటితో నింపి, వాటిల్లో విగ్రహాలను తడిచేలా ముంచి వెంటనే తొలగించే చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. తద్వారా వేగంగా జరగడంతోపాటు పెద్ద విగ్రహాలవి కూడా పూర్తిచేయాలని భావిస్తున్నారు. బేబీ పాండ్లు నిర్మించారిలా.. జీహెచ్ఎంసీ నిరి్మంచిన బేబీ పాండ్లు 26 అడుగుల పొడవు, 24 అడుగుల వెడల్పు, 12– 15 అడుగుల లోతు ఉన్నాయి. వీటిల్లో కొన్నింటికి పవర్ బోర్లతో నీరు నింపే సదుపాయం ఉంది. లేనివాటికి ట్యాంకర్లతో నీటిని నిండుగా నింపే యోచనలో ఉన్నారు. దిగువ ప్రాంతాల్లోనే.. అంబీర్‌చెరువు (కూకట్పల్లి), రంగధాముని చెరువు (కూకట్పల్లి), బోయిన్‌చెరువు (హస్మత్‌పేట్), ఊరచెరువు (కాప్రా), చెర్లపల్లిచెరువు, పెద్దచెరువు(గంగారం), వెన్నెల చెరువు(జీడిమెట్ల), మల్కచెరువు(రాయదుర్గం), నల్లగండ్ల చెరువు, పెద్దచెరువు(మన్సూరాబాద్),పెద్దచెరువు(నెక్నాంపూర్),లింగంచెరువు(సూరారం), ముండ్లకత్వ (మూసాపేట), నాగోల్ చెరువు, కొత్తచెరువు(అల్వాల్),నల్లచెరువు(ఉప్పల్), పత్తికుంట(రాజేంద్రనగర్), గురునాథ్‌చెరువు(మియాపూర్), గోపిచెరువు(లింగంపల్లి), రాయసముద్రం(ఆర్సీపురం), కైదమ్మ కుంట (హఫీజ్‌పేట), దుర్గంచెరువు, బండచెరువు (మల్కాజిగిరి), హుస్సేన్‌సాగర్‌లో రెండు పాండ్లు ఉన్నాయి. -
Ganesh Idol Immersion: జీహెచ్ఎంసీ రివ్యూ పిటిషన్‌పై హైకోర్టు అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: గణేష్ నిమజ్జనంపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను యథావిధిగా కొనసాగించాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. గతేడాది కూడా నిమజ్జనంపై ఇచ్చిన ఉత్తర్వులను పాటించలేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ వేసిన రివ్యూ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కాలుష్యాన్ని నియంత్రించాల్సిన జీహెచ్ఎంసీ.. అనుమతి కోరడం ఏంటని ప్రశ్నించింది. గణేష్ నిమ్మజ్జనంపై ఏ ఒక్క మినహాయింపు కూడా ఇవ్వలేమని, నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. కాగా వినాయక నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టులో జీహెచ్ఎంసీ సోమవారం రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తమ తీర్పును పునః పరిశీలించాలని జీహెచ్ఎంసీ కోరింది. హుస్సేన్ సాగర్, ఇతర జలాశయాల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనంపై నిషేధం ఎత్తేయాలని పిటిషన్లో జీహెచ్ఎంసీ పేర్కొంది. ట్యాంక్ బండ్ వైపు నుంచి నిమజ్జనానికి అనుమతించాలని కోరింది. హుస్సేన్‌సాగర్‌లో రబ్బర్ డ్యాం నిర్మించాలన్న ఉత్తర్వులను సవరించాలని జీహెచ్ఎంసీ విజ్ఞప్తి చేసింది. నిమజ్జనం తర్వాత 24 గంటల్లో వ్యర్థాలు తొలగిస్తామని జీహెచ్ఎంసీ పేర్కొంది. చదవండి: హైదరాబాద్: వినాయక విగ్రహాల నిమజ్జనం ఎక్కడ? -
హైదరాబాద్: వినాయక నిమజ్జనం ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: వినాయక విగ్రహాల సామూహిక నిమజ్జనం ఎక్కడ అనే అంశంపై గందరగోళం నెలకొంది. హైకోర్టు ఆదేశాల మేరకు హుస్సేన్‌సాగర్‌లో వద్దంటూ మండప నిర్వాహకులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు హఠాత్తుగా ఆ ప్రక్రియను ఆపేశారు. మరోపక్క ఈ అంశంపై హైకోర్టులో ప్రభుత్వం సోమవారం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింహైకోర్టు తమ తీర్పును పునః పరిశీలించాలని జీహెచ్ఎంసీ కోరింది.. ► వినాయక విగ్రహాల సామూహిక నిమజ్జనం ఏళ్లుగా హుస్సేన్‌సాగర్‌లో నిర్వహిస్తున్నారు. ఆ రోజు నగరంతో పాటు చుట్టు పక్కల కమిషనరేట్లు, జిల్లాల నుంచి భారీ సంఖ్యలో విగ్రహాలు వస్తాయి. పోలీసు శాఖ గత వారం ట్రయల్ రన్ సైతం నిర్వహించింది. ►నేపథ్యంలో హుసేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారైన విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయవద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పునరాలోచనలో పడ్డ పోలీసు విభాగం శనివారం రాత్రి 11 గంటలకు అన్ని పోలీసుస్టేషన్లకు దానికి సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. ► హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. దీంతో పోలీసుస్టేషన్లకు చెందిన సిబ్బంది తక్షణం రంగంలోకి దిగారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయడానికి వీలులేదంటూ నోటీసులు రూపొందించింది. వీటికి హైకోర్టు ఆదేశాల కాపీలను జత చేస్తూ మండపాల నిర్వాహకులు జారీ చేయడం ప్రారంభించింది. ► శనివారం రాత్రి కొన్ని మండపాల నిర్వాహకులకు అందించారు. అయితే ఆదివారం ఉదయం నోటీసుల జారీ ఆపాలంటూ ఆదేశాలు వచ్చాయి. ► హైకోర్టు ఉత్తర్వులపై రివ్యూ పిటిషన్ వేయాలంటూ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో నోటీసులు జారీ ఆపేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆదివారం వరకు అవసరమైన సంఖ్యలో క్రేన్లను కూడా ఏర్పాటు చేయలేదు. ► గణేష్ నవరాత్రుల్లో మూడో రోజు నిమజ్జనాలు ప్రారంభమవుతాయి. ఆదివారం కొన్ని విగ్రహాలను నెక్లెస్ రోడ్లో ఉన్న బేబీ పాండ్‌లో చేపట్టారు. సోమవారం ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలను బట్టి తదుపరి చర్యలు తీసుకోవాలని పోలీసు విభాగం నిర్ణయించింది. ఈలోపు ప్రత్యామ్నాయంగా అవకాశం ఉన్న చెరువుల జాబితాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. -
వినాయక నిమజ్జనంపై హైకోర్టులో పిటిషన్
-
సెల్ఫీ పిచ్చి.. యువకుడి మృతి
కోల్‌కతా: సెల్ఫీ పిచ్చి ఓ యువకుడి ప్రాణం తీసింది. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఓ యువకుడి సెల్ఫీ దిగడానికి ప్రయత్నిస్తూ.. నదిలో కొట్టుకుపోయి మరణించాడు. ఈ ఘటన డెహ్రడూన్‌లోని సాంగ్ నది వద్ద జరగింది. వివరాలు.. నగరంలోని క్లెమెంట్ టౌన్లో నివాసం ఉండే శుభం ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం వినాయకుడి నిమజ్జనం సందర్భంగా సాంగ్ నది వద్ద సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో కాలు జారి నదిలో పడి కొట్టుకుపోయాడు. అతడి స్నేహితులు కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు రాష్ట్ర విపత్తు స్పందన దళం సాయంతో రెండు గంటల అన్వేషణ తర్వాత శుభం మృతదేహాన్ని వెలికి తీశారు. -
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం మ.12గం.ల పూర్తి చేస్తాం
-
ప్రశాంతంగా నిమజ్జనాలు: నాయిని
హైదరాబాద్ : ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం మధ్యాహ్నం లోపే అవడం హర్షించదగ్గ విషయమని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. నగరంలో జరుగుతున్న నిమజ్జన కార్యక్రమాన్ని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, సీపీ మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి మంగళవారం సాయంత్రం ఏరియల్ సర్వే నిర్వహించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఏరియల్ వ్యూ ద్వారా చార్మినార్, ట్యాంక్‌బండ్‌లలో నిమజ్జన కార్యక్రమాలను వీక్షించారు. అనంతరం నాయిని మాట్లాడుతూ... నిమజ్జనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. సహకరించిన గణేష్ ఉత్సవ సమితికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని ఇతర వినాయక విగ్రహాలు రాత్రి లోపే నిమజ్జనం చేయాలని గణేష్ ఉత్సవ కమిటీకి అదేశించామని తెలిపారు. ప్రజలు కూడా స్వచ్చందంగా, వీలైనంత త్వరగా రాత్రి లోపే నిమజ్జనాన్ని ముగించాలని కోరుతున్నామన్నారు. పోలీసులు రాత్రింబవళ్లు నిద్రాహారాలు మాని శ్రమించారన్నారు. పోలీస్ శాఖ పనితీరు చాలా బాగుందని, జీహెచ్ఎంసీ అధికారులు, హెచ్ఎండీఏ, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పని చేశారని ప్రశంసించారు. -
ప్రశాంతంగా నిమజ్జనాలు: నాయిని
-
నిమజ్జనానికి వెళ్లి నలుగురి మృతి
– నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి – తిప్పనపల్లె శోకసంద్రం – మతులు కూలీల బిడ్డలు సూర్యాస్తమయ సమయం..పక్షులన్నీ గూళ్లకు చేరుతన్న వేళ..పొలాలకు వెళ్లిన కూలీలు వడివడిగా ఊరు చేరుతున్న వేళ.. తప్పెట శబ్దాలు, కళాకారుల చిందులు, ఈలలు కేకలు...ప్రథమ పూజ్యుడు నిమజ్జనానికి బయలుదేరిన వేళ.. ఆ విధికి కన్నకుట్టిందేమో.. చెరువు రూపంలో నలుగురు చిన్నారులను పొట్టనపెట్టుకుంది. వారి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. బుధవారం సాయంత్రం 5.30 గంటల చోటుచేసుకున్న ఈ ఘటన చాగలమర్రి మండలం తిప్పనపల్లె గ్రామంలో విషాదాన్ని నింపింది. గ్రామస్తుల కంటతడిపెట్టించింది. చాగలమర్రి: గణేశ్ నిమజ్జనం.. ఊరువాడా సందడే సందడి. ఉరకలేసే ఉత్సాహంతో పిల్లాపెద్దలు.. స్కూళ్లకు సెలవు ఇచ్చేశారు. కొందరు పనులు సైతం మానుకున్నారు. చాగలమర్రి మండలం తిప్పనపల్లెలోనూ నిమజ్జన కోలాహం బుధవారం ఉదయం నుంచే మొదలైంది. వేడుక సందడిలో అల్లరిచేసే పిల్లల గురించి పెద్దలు పట్టించుకోవడం మరిచిపోయారు. వారెక్కడికి వెళ్తున్నారనే విషయాన్ని కూడా గ్రహించలేకపోయారు. దీంతో వేడుకలో అపశ్రుతి దొర్లింది. నిమజ్జనం చేసే చెరువు నలుగురు చిన్నారులను మింగేసింది. గ్రామంలో దళితవాడకు చెందిన బండి ఓబులేసు(12), శ్రీహరి(13), గడ్డం రాము(12), విష్ణువర్ధన్(13).. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏడు, ఎనిమిది తరగతులు చదువుతున్నారు. నిమజ్జనం సందర్భంగా పాఠశాలకు సెలవు ప్రకటించడంతో వీరి ఆనందాన్ని అవధుల్లేకుండా పోయాయి. ఉదయం నుంచే తోటి మిత్రులతో వేడుకలో అలా ఇలా చేయాలని చర్చించారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో ముందుగా ఊరి సమీపంలోని నిమజ్జన చెరువు వద్దకు చేరాలనుకున్నారు. అనుకున్నదే తడువు ఉరుకులు పరుగులు మీద కిలోమీటర్ దూరంలో ఉన్న చెరువు వద్దకు చేరుకున్నారు. విగ్రహాలను నిమజ్జం చేసేందుకు ఇంకా సమయం ఉందని..అంతలోపు ఈత కొడదామని చెరువులోకి దిగారు. బుధవారం ఉదయమే తెలుగుగంగ అధికారులు చెరువుకు నీరు చేశారు. దీంతో నీటిమట్టం పెరిగి నలుగురు చిన్నారులు అందులో చెరువులో చిక్కుకుపోయారు. భయంతో కేకలు వేయడంతో సమీపంలో పొలాల్లో ఉన్న గ్రామస్తులు వచ్చి వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఈ లోపు సమీపంలోనే నిమజ్జన వేడుకలో ఉన్న గ్రామస్తులు గుంపులు గుంపులుగా చెరువు వద్దకు చేరుకున్నారు. మునిగిపోతున్న చిన్నారులను వెలికి తీసి ఒడ్డుకు చేర్చారు. చాగలమర్రిలో నిమజ్జన వేడుకల్లో ఉన్న ఎస్ఐ మోహన్‌రెడ్డి సైతం విషయం తెలుసుకొని ఘటన స్థలానికి చేరుకున్నారు. కొన ఊపిరితో ఉన్న వారిని తన జీపులో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విష్ణువర్ధన్ వారి తల్లిదండ్రులు మోటార్ సైకిల్‌పై ఆసుపత్రికి తీసుకెళ్తుండా మార్గమధ్యంలో మతి చెందాడు. మిగిలిన ముగ్గురు చిన్నారులు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకొన్నాయి. విష్ణువర్ధన్ మతదేహాన్ని చూసి తట్టుకోలేని తల్లిదండ్రులు పురుగుల మందు తాగేందుకు యత్నిస్తుండగా బంధువుల అడ్డుపడి వారించారు. అందరూ కూలీల పిల్లలే.. తిప్పనపల్లె చెరువులో మృతి చెందిన చిన్నారులంతా కూలీల పిల్లలే. బండి ఓబులేసు తల్లితండ్రులు నాగేశ్వరరావు, వెంకటమ్మలు కూలీ పని చేస్తూ కుమారున్ని చదివిస్తున్నారు. బుధవారం ఉదయం కూడా వారు పొలంలో పనులకు వెళ్లారు. వినాయక నిమజ్జం ఉండడంతో మందుగా ఇంటికి చేరుకొన్నారు. కుమారుడి మరణ వార్తవిని గుండెలు పగిలేలా రోదించారు. వీరికి ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు అడపిల్లలు ఉన్నారు. మృతి చెందిన ఓబులేసు చివరి వాడు. గడ్డం రాము తల్లిదండ్రులు బలరాం, సుబ్బమ్మలు సైతం కూలీ పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడిని బాగా చదివించి ప్రయోజకున్ని చేయాలనేది వీరి లక్ష్యం. నిత్యం కూలీ పనికి వెళ్తూ..కుమారున్ని బాగా చదువుకోవాలని చెప్పేవారు. వారి ఆశలు చెరువు మింగేసింది. వారి రోదన వర్ణనాతీతం. తిరుపాలు, ధనలక్ష్మి కుమారుడు శ్రీహరి చురుకైన బాలుడు.. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. తమ కుమారుడు మంచి ప్రయోజకుడువుతాడని తల్లిదండ్రులు కలలు కనేవారు. ముందుగా వినాయక నిమజ్జన ప్రదేశానికి వెళతామని చెప్పి వతిరిగిరాని లోకాలకు వెళ్లాడని వారు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రతాప్‌కు విష్ణువర్దన్ ఒక్కగానొక్క కుమారుడు.. బాగా చదివేవాడు. తన కళ్లెదుటే కుమారుడు మృతి చెందడంతో పురుగు మందు తాగేందుకు ప్రతాప్ ప్రయత్నించగా..అక్కడే ఉన్న బంధువులు వారించి వారికి నచ్చచెప్పారు. -
ఇప్పటిదాకా ఇరవైవేల గణపతుల నిమజ్జనం
-
ఈసారికి హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం
-
గణేష్ నిమజ్జనానికి వెళ్లి ముగ్గురు మృతి
-
రేపు ఉదయం 8 కల్లా...నిమజ్జనం పూర్తి
-
రేపు ఉదయం 8 కల్లా...నిమజ్జనం పూర్తి
హైదరాబాద్ : ఘనంగా పూజలు అందుకున్న గణనాథులు నిమజ్జనానికి సిద్ధం అవుతున్నారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ సోమవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం ఉదయం ఎనిమిదిగంటల కల్లా నిమజ్జనం పూర్తయ్యేలా చూస్తామన్నారు. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనమవుతున్న వినాయక విగ్రహాల శకలాలు ఎప్పటికప్పుడూ తొలగిస్తున్నట్లు తెలిపారు. సోమవారం దాదాపు అరవై వేలకు పైగా విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అంచనా వేస్తున్నట్లు సోమేష్ కుమార్ అన్నారు. మరోవైపు పాతబస్తీలో నిమజ్జన ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టామన్నారు. అందరూ మత సామరస్యాన్ని పాటించాలని నాయిని కోరారు. అన్ని ప్రాంతాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. -
ఆపరేషన్ విశ్వరూప
'ఆపరేషన్ విశ్వరూప' అద్భుతమైన ఘట్టం. భారీ గణపతి విగ్రహాన్ని రథంపై అమర్చే అపురూపమైన సన్నివేశాన్ని కనులారా తిలకించాలన్నది లక్షలాదిమంది భక్తుల ఆకాంక్ష. ఈ కార్యక్రమం సోమవారం జరగనుంది. ఖైరతాబాద్ మహాగణపతి ప్రాంగణం దీనికి వేదిక కానుంది. ఈ ఆపరేషన్ లో కీలక వ్యక్తులెవరు..? ఎన్ని గంటలకు జరగనుంది..! వినియోగించే యంత్ర సామగ్రి విశేషాలు తదితర అంశాలపై కథనం... అధునాతనమైన క్రేన్... 'ఆపరేషన్ విశ్వరూప'లో కీలకమైనది క్రేన్. అత్యాధునికమైన టెక్నాలజీ దీని సొంతం. ఈ క్రేన్ సోమవారం తెల్లవారుజామున ఖైరతాబాద్ గణనాథుడి వద్దకు చేరుకుంటుంది. జర్మన్ టెక్నాలజీతో తయారైన దీని ధర రూ.12 కోట్లు. ఇది కూకట్పల్లి రవి క్రేన్స్‌కు చెందినది. ఈ ఏడాది క్రేన్‌ను జమీల్ అనే వ్యక్తి ఆపరేట్ చేయనున్నారు. ప్రత్యేకతలివే.. పొడవు: 60 అడుగులు వెడల్పు 14 అడుగులు టైర్లు: 12 (ఒక్కో టైరు టన్ను బరువు) మొత్తం బరువు: 120 టన్నులు 150 టన్నుల బరువును 160 అడుగుల ఎత్తుకు లేపగలిగే సామర్థ్యం దీని సొంతం. వీరు కీలకం... ఈయన పేరు వెంకట్. విగ్రహానికి ఎటువంటి నష్టం కలగకుండా షెడ్డును తొలగించడంలో ఈయనది కీలకపాత్ర. ఓవైపు వేలాది మంది భక్తులతో కిటకిటలాడే ప్రాంగణంలో షెడ్డుకు సంబంధించిన కర్రలను తొలగించడం ఓ రకంగా కత్తిమీద సాము వంటిదే. ఈ పనిని ఆయన కొన్నేళ్లుగా దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. ఈయన పేరు నాగరాజు. విద్యుత్‌శాఖ ఉద్యోగి. మహా గణపతి శోభాయాత్రకు ‘మార్గ’దర్శకుడు. ఖైరతాబాద్ మండపం నుంచి సాగర్ తీరం చేరే వరకూ ముందుండి నడిపిస్తారు. ఈయన సూచనలతోనే వాహనం కదులుతుంది. భారీ విగ్రహం విద్యుత్ స్తంభాలకు, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌కు తగలకుండా ట్రాలీ డ్రైవర్‌కు కచ్చితమైన సూచనలిస్తూ ముందుకు తీసుకువెళ్లడంలో ఆయన దిట్ట. 16 ఏళ్ల అనుభవం నాగరాజు సొంతం. పేరు సందీప్. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీలో సభ్యుడు. నిమజ్జనయాత్రలో అన్ని శాఖల్ని సమన్వయ పరుస్తూ ఎప్పటికప్పుడు అవసరాలు తీర్చడంలో ఈయన కీలకపాత్ర పోషిస్తారు. ప్రత్యేక విధుల్లో శంకర్.. ఈయన పేరు శంకర్. పోలీస్ శాఖలో ఇన్స్పెక్టర్. కొంతకాలం క్రితం వరకు సైఫాబాద్ డీఐగా పనిచేశారు. ప్రస్తుతం ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో విధులు నిర్వహిస్తున్నారు. నాలుగేళ్లుగా నిమజ్జన యాత్రలో అనుభవం ఉన్న వ్యక్తి కావడంతో ఈ ఏడాది గణనాథుడి వద్దకు ప్రత్యేక డ్యూటీ నిమిత్తం వచ్చారు. కలల రూపం కరిగే వేళ.. నిమజ్జనం వేళ అంతటా ఆనందోత్సాహం. నాకు మాత్రం భావోద్వేగం. బహుశా నేను తయారు చేసింది విగ్రహం అనుకోకపోవడమే కారణమేమో! నిజం.. అది కేవలం విగ్రహం కాదు. నా గుండెలోతుల్లోంచి ఎగసిన అపురూప ఊహకు ‘నిలువెత్తు’ రూపం. విగ్రహాన్ని వాహనంపై అమర్చే వరకు ఉంటా. యాత్ర ప్రారంభం కాగానే ఇంటికెళ్లి పోతా. ఏదో తెలియని బాధ.. రోజంతా ఒంటరిగా నిశ్శబ్దంగా గడుపుతా. - రాజేంద్రన్, మహాగణపతి ప్రధాన శిల్పి -
మూడో కన్ను పట్టేస్తుంది.....
హైదరాబాద్: నిమజ్జన శోభాయాత్రలో పోలీసుల కన్ను గప్పి ఏదైనా చేయాలనుకుంటే నిఘా నేత్రం పట్టేస్తుంది జాగ్రత్త. జంట పోలీసు కమిషనరేట్ల పరిధిలో నేడు (సోమవారం) జరిగే నిమజ్జన కార్యక్రమాన్ని ప్రతిక్షణం కనిపెట్టేందుకు 900 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నుంచి అందుతున్న ఫుటేజ్‌ని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఐపీఎస్ స్థాయి అధికారిని నియమించారు. అంతేకాకుండా ఆరుగురు ఏసీపీలు, 10 మంది ఇన్స్పెక్టర్లు, 15 మంది ఎస్ఐలతో పాటు సుమారు 50 మంది సిబ్బంది శోభాయాత్రతో పాటు నిమజ్జన ప్రాంతాలను సీసీ టీవీ ద్వారా ప్రతిక్షణం వీక్షిస్తుంటారు. వీరికి పది రోజులుగా ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. వీరంతా కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ లో ఉంటారు. 24 గంటలు విధుల్లో ఉంటారు. ఊరేగింపుగా వస్తున్న గణేష్ లారీల వద్దగాని అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, వాహనాలు కనిపిస్తే బందోబస్తులో ఉన్న అధికారిని మ్యాన్‌పాక్, సెల్‌ఫోన్, ఎస్ఎంఎస్ ద్వారా అప్రమత్తం చేస్తారు. నిరంతరం కంట్రోల్‌రూమ్ అధికారులతో సంప్రదింపులు జరుపుతూనే ఉంటారు. బందోబస్తులో ఉన్న అధికారులు, సిబ్బంది సెల్ నంబర్లు సీసీ టీవీలను వీక్షించే అధికారుల వద్ద ఉంటాయి. -
వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
దర్శి, న్యూస్‌లైన్ : వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఓ ఇంజినీరింగ్ విద్యార్థి కాలువలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మండలంలోని బొట్లపాలెంలో బుధవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన చిన్నపురెడ్డి బ్రహ్మారెడ్డి కుమారుడు సుబ్బారెడ్డి (19) ఒంగోలు క్విస్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. స్వగ్రామంలో జరుగుతున్న వినాయక నిమజ్జన ఉత్సవంలో పాల్గొనేందుకు మంగళవారం ఇంటికి వచ్చాడు. రాత్రి గ్రామంలో వినాయక విగ్రహాన్ని ఊరేగించారు. బుధవారం ఉదయం నిమజ్జనం చేసేందుకు గ్రామానికి చెందిన యువకులు, విద్యార్థులు, మహిళలు 8 ట్రాక్టర్లలో ఎన్ఎస్పీ కాలువకు వెళ్లారు. నిమజ్జనం అనంతరం స్నానాలు చేసేందుకు యువకులంతా కాలువలో దిగారు. వారిలో సుబ్బారెడ్డి నీళ్లలో మునిగిపోవడాన్ని కొందరు గమనించి బయటకు తీసే ప్రయత్నం చేశారు. అప్పటికే సుబ్బారెడ్డి ప్రాణాలు విడిచాడు. చదువులో ప్రతిభ చూపుతూ ఉన్నత విద్యకు వెళ్లడంతో తల్లిదండ్రులు బ్రహ్మారెడ్డి, వెంకటరత్నం సంతోషించారు. ఇంతలో ఏకైక కుమారుడు అకాల మరణం చెందడంతో వారి ఆవేదనకు అంతులేకుండా పోయింది. సుబ్బారెడ్డి మృతదేహంపై పడి ఇక తమకు దిక్కెవరంటూ తల్లి వెంకటరత్నం భోరున విలపించడం చూపరులను కంటితడి పెట్టించింది. నిమజ్జనోత్సవంలో ప్రమాదం చోటుచేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చండ్రపాలెంలో మరొకరు సంతనూతలపాడు, న్యూస్‌లైన్ : వినాయక నిమజ్జనం సందర్భంగా సుడిగుండంలో చిక్కుకున్న యువకుడిని రక్షించబోయిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన చండ్రపాలెం ఎన్ఎస్పీ కెనాల్ వద్ద బుధవారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఎనికపాడు శివాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం నిమజ్జనం చేసేందుకు యువకులంతా చండ్రపాలెం ఎన్ఎస్పీ కెనాల్ వద్దకు వెళ్లారు. యువకులు నీటిలో దూకి ఈదుతున్నారు. ఈ క్రమంలో గుళ్లాపల్లి కోటేశ్వరరావు (బుల్లబ్బాయి) అనే వ్యక్తి సుడి గుండంలో చిక్కుకున్నాడు. కోటేశ్వరరావును రక్షించేందుకు ఏనుగంటి రమణయ్య, బొమ్మినేని శ్రీనివాసరావు (37)లు నీటిలో దూకారు. కోటేశ్వరరావు, రమణయ్యలు సుడిగుండం నుంచి బయట పడగా రక్షించేందుకు వెళ్లిన దిగిన బొమ్మినేని శ్రీనివాసరావు మరణించాడు. నీటి నుంచి బయట పడిన ఇద్దరిని ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. -
సిద్ధి గణపతికి రూ.15.87 లక్షల ఆదాయం
అయినవిల్లి,న్యూస్‌లైన్ : అయినవిల్లి సిద్ధివినాయకుని ఆలయంలో నవరాత్రి మహోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిసాయి. స్వామివారి ఉత్సవ పందిరిలో ఏర్పాటుచేసిన మట్టి గణపతి ప్రతిమను రాత్రి సమీపంలోని పంటకాలువలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. నవరాత్రుల సందర్భంగా పూజాటికెట్లు , ప్రసాద విక్రయాలు, అన్నదానపథకానికి విరాళాల రూపేణా స్వామివారికి రూ.15 లక్షల 87వేల 325 అదాయం లభించినట్టు ఆలయ ఈఓ మూదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. రాజమండ్రికి చెందిన మలబార్ గోల్డ్ సంస్ధ యాజమాన్యం స్వామివారి ఆలయంలో ఉచిత ప్రసాద వితరణ నిర్వహించారు. నవరాత్రులలో అయినవిల్లి వచ్చే భక్తుల సంఖ్య సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో గణనీయంగా తగ్గింది. ఏటా నవరాత్రులలో స్వామివారిని సుమారు లక్ష ఏభైవేల మంది భక్తులు దర్శించేవారని, ఈసారి 70వేల మంది మాత్రమే వచ్చారని ఆలయ అధికారులు పేర్కోన్నారు. వినాయకునికి పుష్పాలంకరణ నవరాత్రుల ముగింపు సందర్భంగా మంగళవారం అయినవిల్లి సిద్ధి వినాయకుడ్ని ప్రత్యేకంగా అలంకరించారు. నెమలి పింఛాలు, వివిధ పుష్పాలతో స్వామిని అద్వితీయంగా అలంకరించడంతో భక్తులు పరవశించారు. ఆలయ అర్చకులు మాచరి వినాయకరావు, రాజేశ్వరరావు ఈ అలంకరణ నిర్వహించారు. -
నిమజ్జనానికెళ్లి.. నీటమునిగి..
ధర్మారం, న్యూస్‌లైన్ : విద్యార్థులు, ప్రిన్సిపాల్ కథనం ప్రకారం.. నంది మేడారం ఎస్సీ బాలుర గురుకుల విద్యాలయంలో ఐదు రోజుల క్రితం రెండు వినాయక ప్రతిమలు నెలకొల్పారు. శనివారం నిమజ్జనం చేసేందుకు 50 మంది విద్యార్థులు, సిబ్బంది చెరువుకు వెళ్లారు. ముందుగా మట్టి విగ్రహాన్ని చెరువులో వేసేందుకు ఉపాధ్యాయుడు జయప్రకాశ్ ఆరుగురు విద్యార్థులను వెళ్లాలని సూచించారు. కానీ ఆరుగురితోపాటు 17 మంది విద్యార్థులు చెరువులోకి దిగారు. లోపలికి వెళ్తున్న క్రమంలో పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఇటికాల సాయికుమార్, జీడి నవీన్, ఎన్.రాజు చెరువులో మునిగిపోయారు. అప్రమత్తమైన ఉపాధ్యాయులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇటికాల సాయికుమార్, జీడి నవీన్‌ను వాచ్‌మన్ నర్సయ్య చెరువులోంచి బయటకు తీసుకువచ్చారు. పీఈటీ ప్రథమచికిత్స చేయడంతో వారు స్పృహలోకి వచ్చారు. ఆ తర్వాత అందరూ కలిసి హాస్టల్‌కు వెళ్లారు. రాజు గల్లంతైన విషయం మరిచారు. అక్కడికి వెళ్లాక విషయం తెలిసి సిబ్బంది చెరువు దగ్గరకు వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయం బయటకు పొక్కకుండా ప్రిన్సిపాల్ వేణుగోపాల్‌రెడ్డి జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ, రాత్రి ఏడు గంటల సమయంలో గజ ఈతగాళ్ల కోసం గ్రామస్తులను సంప్రదించగా బయటకు తెలిసింది. సమాచారం అందుకున్న ఎస్సై ప్రవీణ్‌కుమార్ వెం టనే సంఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. రా త్రి వరకు రాజు ఆచూకీ దొరకలేదు. పెద్దపల్లి ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి, తహశీల్దార్ భాస్కర్‌రావు, రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాజు నీటిలో గల్లంతయ్యాడా? భయంతో ఎక్కడికైనా పారిపోయాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్‌తోపాటు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు సంతోష్, మహేందర్ డిమాండ్ చేశారు.