ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం మధ్యాహ్నం లోపే అవడం హర్షించదగ్గ విషయమని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. నగరంలో జరుగుతున్న నిమజ్జన కార్యక్రమాన్ని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, సీపీ మహేందర్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి మంగళవారం సాయంత్రం ఏరియల్ సర్వే నిర్వహించారు.