KHAIRATABAD Maha Ganapati
-
Khairatabad Ganesh: మహా ట్రైలర్ సిద్ధం
ఖైరతాబాద్: అశేష భక్తజనం పూజలందుకున్న శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి సాగర నిమజ్జనానికి తరలించేందుకు ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్కు చెందిన ట్రైలర్ వాహనం శనివారం ప్రాంగణానికి చేరుకుంది. వెల్డింగ్ పనులు ప్రారంభమయ్యాయి. ట్రైలర్ పొడవు 75 అడుగులు, 11 అడుగుల వెడల్పు. 26 టైర్లు ఉన్న ఈ వాహనం 100 టన్నుల బరువు వరకు కూడా మోయగలదు. ఖైరతాబాద్ మహా గణపతిని నిమజ్జనానికి తరలించే వాహన సారథిగా నాగర్‌కర్నూల్ జిల్లా గౌతంపల్లి గ్రామానికి చెందిన భాస్కర్‌రెడ్డి ఈసారి కూడా వ్యవహరించనున్నారు. ‘మహా గణపతి బరువు 70 టన్నుల వరకు ఉంటుంది. నిమజ్జన సమయంలో ఎలాంటి పగుళ్లు రాకుండా నాలుగు లేయర్లుగా తయారీ చేశాం. 4 గంటల పాటు వర్షం వచ్చినా కరిగిపోదు. నిమజ్జనం పూర్తిచేసిన 7 గంటల్లో నీటిలో కరిగిపోతుంది’ అని శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తెలిపారు. -
ప్రశాంతంగా నిమజ్జనాలు: నాయిని
హైదరాబాద్ : ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం మధ్యాహ్నం లోపే అవడం హర్షించదగ్గ విషయమని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. నగరంలో జరుగుతున్న నిమజ్జన కార్యక్రమాన్ని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, సీపీ మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి మంగళవారం సాయంత్రం ఏరియల్ సర్వే నిర్వహించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఏరియల్ వ్యూ ద్వారా చార్మినార్, ట్యాంక్‌బండ్‌లలో నిమజ్జన కార్యక్రమాలను వీక్షించారు. అనంతరం నాయిని మాట్లాడుతూ... నిమజ్జనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. సహకరించిన గణేష్ ఉత్సవ సమితికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని ఇతర వినాయక విగ్రహాలు రాత్రి లోపే నిమజ్జనం చేయాలని గణేష్ ఉత్సవ కమిటీకి అదేశించామని తెలిపారు. ప్రజలు కూడా స్వచ్చందంగా, వీలైనంత త్వరగా రాత్రి లోపే నిమజ్జనాన్ని ముగించాలని కోరుతున్నామన్నారు. పోలీసులు రాత్రింబవళ్లు నిద్రాహారాలు మాని శ్రమించారన్నారు. పోలీస్ శాఖ పనితీరు చాలా బాగుందని, జీహెచ్ఎంసీ అధికారులు, హెచ్ఎండీఏ, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పని చేశారని ప్రశంసించారు. -
ప్రశాంతంగా నిమజ్జనాలు: నాయిని
-
ఖైరతాబాద్ గణపతికి గవర్నర్ తొలిపూజ
హైదరాబాద్ : ప్రసిద్ధ ఖైరతాబాద్ గణనాథుడిని గవర్నర్ నరసింహన్ దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. శ్రీ చండీకుమార అనంత మహా గణపతి అవతారంలో కొలువదీరిన బొజ్జ గణపయ్యకు వీరు తొలిపూజ నిర్వహించారు. విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి దానం నాగేందర్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. స్వామివారి దర్శనం అనంతరం గవర్నర్ మాట్లాడుతూ....ప్రజలంతా సుఖసంతోషాలతో వర్దిల్లాలని ఆకాంక్షించారు. మరోవైపు భక్తులు పెద్ద సంఖ్యలో మహాగణపతిని దర్శించుకుంటున్నారు. -
2న మహాప్రసాదం పంపిణీ
హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి చేతిలో 11రోజుల పాటు పూజలందుకున్న ఆరువేల కిలోల లడ్డూ ప్రసాద పంపిణీ తేదీ పొడిగించినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. తొలుత ఈ నెల 30న (బుధవారం) ప్రసాదం పంపిణీ చేస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు ప్రకటించారు. పంపిణీ సమయంలో బందోబస్తు తప్పనిసరని... పోలీసులు అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉన్నందున అక్టోబర్-2వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రసాదం పంచిపెడతామని తెలిపారు. బుధవారం ప్రసాదం పంపిణీ చేయడం లేదని... భక్తులు ఇక్కడికి రావద్దని సూచించారు. లడ్డూను కవర్‌తో పూర్తిగా కప్పి ఉంచడం వల్ల గాలి తగలక పాడైపోయే అవకాశముందని దాత మల్లిబాబు తెలిపారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా భక్తులకు పంచిపెట్టేలా పోలీసులు చొరవ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
ఉదయం 9.45 గంటలకు మహా గణపతికి తొలిపూజ
ఖైరతాబాద్ : ఖైరతాబాద్ మహా గణపతికి గవర్నర్ నరసింహన్ దంపతులు గురువారం ఉదయం 9.45 గంటలకు తొలిపూజ నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీఅధ్యక్షుడు సింగరి సుదర్శన్ తెలిపారు. ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో యజ్ఞోపవీతం, కండువా సమర్పిస్తారు. పూజ పూర్తికాగానే సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు ఆధ్వర్యంలో ఆరు వేల కిలోల మహాప్రసాదాన్ని క్రేన్‌తో మహా గణపతి చేతిలో పెడతారు. పటిష్ట భద్రత మహా గణపతి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీసీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. మెటల్ డిటెక్టర్లు, సీసీ కెమెరాలు, బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. స్థానికుల సౌకర్యార్ధం బారికేడ్లు తొలగించడం, తిరిగి మూసివేయడం వంటి పనులు చేయాలని, ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలని సైఫాబాద్ డీఐ ప్రకాశ్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ పూర్ణచందర్లకు డీసీపీ సూచించారు. పోలీసులతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు సింగరి సుదర్శన్, మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నేడు ‘డిక్టేటర్’ పాట విడుదల ఖైరతాబాద్‌లోని త్రిశక్తిమయ మోక్ష గణపతి వద్ద ‘డిక్టేటర్’ చిత్రంలోని ‘గం..గం.. గణేశా..’ పాటను గురువారం రాత్రి 7 గంటలకు విడుదల చేయునున్నారు. ఈ కార్యక్రమానికి హీరో బాలకృష్ణ, హీరోయిన్ అంజలి, దర్శకుడు శ్రీవాస్, గీత రచయిత రావుజోగయ్యు శాస్త్రి తదితరులు హాజరుకానున్నారు. ఖైరతాబాద్ గణేషుడి వద్ద ‘జియోనెట్’ వై-ఫై వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది ప్రజలు వస్తుంటారు. ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐల్), రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (ఆర్జేఐఎల్) ఈ నెల 17 నుంచి 26వ తేదీ వరకు ఖైరతాబాద్ గణేశుడి వద్ద ‘జియోనెట్’ వై-ఫై సేవలను అందించనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. సందర్శకులు తమ స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లపై జియో నుంచి వై-ఫై నెట్వర్క్ ద్వారా హైస్పీడ్ వైర్లెస్ కనెక్టివిటీ ప్రయోజనాలు పొందవచ్చన్నారు.