
ఖైరతాబాద్ గణపతికి గవర్నర్ తొలిపూజ
ప్రసిద్ధ ఖైరతాబాద్ గణనాథుడిని గవర్నర్ నరసింహన్ దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు.
హైదరాబాద్ : ప్రసిద్ధ ఖైరతాబాద్ గణనాథుడిని గవర్నర్ నరసింహన్ దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. శ్రీ చండీకుమార అనంత మహా గణపతి అవతారంలో కొలువదీరిన బొజ్జ గణపయ్యకు వీరు తొలిపూజ నిర్వహించారు. విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి దానం నాగేందర్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. స్వామివారి దర్శనం అనంతరం గవర్నర్ మాట్లాడుతూ....ప్రజలంతా సుఖసంతోషాలతో వర్దిల్లాలని ఆకాంక్షించారు. మరోవైపు భక్తులు పెద్ద సంఖ్యలో మహాగణపతిని దర్శించుకుంటున్నారు.