హైదరాబాద్: నిమజ్జన శోభాయాత్రలో పోలీసుల కన్ను గప్పి ఏదైనా చేయాలనుకుంటే నిఘా నేత్రం పట్టేస్తుంది జాగ్రత్త. జంట పోలీసు కమిషనరేట్ల పరిధిలో నేడు (సోమవారం) జరిగే నిమజ్జన కార్యక్రమాన్ని ప్రతిక్షణం కనిపెట్టేందుకు 900 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నుంచి అందుతున్న ఫుటేజ్‌ని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఐపీఎస్ స్థాయి అధికారిని నియమించారు. అంతేకాకుండా ఆరుగురు ఏసీపీలు, 10 మంది ఇన్‌స్పెక్టర్లు, 15 మంది ఎస్‌ఐలతో పాటు సుమారు 50 మంది సిబ్బంది శోభాయాత్రతో పాటు నిమజ్జన ప్రాంతాలను సీసీ టీవీ ద్వారా ప్రతిక్షణం వీక్షిస్తుంటారు.
వీరికి పది రోజులుగా ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. వీరంతా కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ లో ఉంటారు. 24 గంటలు విధుల్లో ఉంటారు. ఊరేగింపుగా వస్తున్న గణేష్ లారీల వద్దగాని అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, వాహనాలు కనిపిస్తే బందోబస్తులో ఉన్న అధికారిని మ్యాన్‌పాక్, సెల్‌ఫోన్, ఎస్‌ఎంఎస్ ద్వారా అప్రమత్తం చేస్తారు. నిరంతరం కంట్రోల్‌రూమ్ అధికారులతో సంప్రదింపులు జరుపుతూనే ఉంటారు. బందోబస్తులో ఉన్న అధికారులు, సిబ్బంది సెల్ నంబర్లు సీసీ టీవీలను వీక్షించే అధికారుల వద్ద ఉంటాయి.
మూడో కన్ను పట్టేస్తుంది.....
Published Mon, Sep 8 2014 8:36 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement