
వారికి మాత్రం హ్యాపీ దీపావళి!
దీపావళి పండుగను ఎవరైతే సెలబ్రేట్ చేసుకోవడం లేదో వారికి మాత్రం హ్యాపీ దీపావళి అంటున్నాడు దర్శకుడు రామ్గోపాల్ వర్
ముంబై: దీపావళి పండుగను ఎవరైతే సెలబ్రేట్ చేసుకోవడం లేదో వారికి మాత్రం హ్యాపీ దీపావళి అంటున్నాడు దర్శకుడు రామ్గోపాల్ వర్మ. ఎందుకంటే తనకు ప్రతిరోజూ దీపావళినే అని, దానిని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చేశాడు.
అంతేకాదు.. భారీ శబ్దాలు చేసే బాంబులు కాలుస్తూ.. ఆనారోగ్యంతో ఉన్న ముసలివారు, చిన్నపిల్లలకు ఇబ్బంది కలిగించేవారికి అన్‌హ్యాపీ దీపావళి అంటూ రామ్‌గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎప్పటిలాగే పండుగవేళ సందడి చేశాడు. భారీ శబ్దాలు, కాంతులు వెదజిమ్మే బాణాసంచాతో పక్షులు, జంతువులను ఇబ్బంది పెట్టేవారికి ఈ 'నా ఇష్టం' రైటర్ ట్వట్టర్ ద్వారా అన్‌హ్యాపీ దీపావళి విషెస్ తెలిపాడు. అలాగే.. క్రాకర్స్ వెలిగించడం ద్వారా గాలిలోకి జింక్, మెగ్నీషియం, పొటాషియం లాంటి విషవాయువులను రిలీజ్ చేసేవారికి, నరకాసురుడు ఏం చేశాడో కూడా తెలియకుండా దీపావళి జరుపుకునే వారికి సైతం రాము తన అన్హ్యాపీ విషెస్ చెప్పాడు.