
సౌదీ అరేబియాలోని జిద్దా నగరంలోని భారత రాయబార కార్యాలయ ఆవరణలో కాన్సులేట్ ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా దీపావళ వేడుకలు జరగనున్నాయి. ఈ మేరకు సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా) వ్యవస్థాపక అధ్యక్షులు మల్లేష్ నవంబర్ 10న శుక్రవారం సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు దీపావళి సంబరాలు నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
దీపావళి వేడుకలలో జిద్దా భారత రాయబార కార్యాలయం కాన్సుల్ జనరల్ మహ్మద్ షాహిద్ ఆలం ముఖ్య అతిథిగా పాల్గొంటారు. సౌదీ అరేబియాలోని సుమారు వెయ్యి మంది ప్రవాస భారతీయులు పెద్దలు, పిల్లలు పాల్గొంటారని 'సాటా' వెస్ట్రన్ రీజియన్ ప్రధాన కార్యదర్శి కుద్రత్ మీర్జా తెలిపారు. సభా ప్రాంగణంలో దీపావళి నేపథ్య అలంకరణ చేస్తామని భరత నాట్యం, కూచిపూడి, కథాకళి లాంటి సంప్రదాయ నృత్యాల తోపాటు దాండియా, పాటలు, ప్రత్యక్ష్య సంగీతం ఉంటాయని 'సాటా' వెస్ట్రన్ రీజియన్ సాంస్కృతిక ఉపాధ్యక్షురాలు లక్ష్మీ నాగరాజ్ తెలిపారు.
భారతీయ కుటుంబాలు సాంప్రదాయ వస్త్రధారణతో వచ్చి దీపావళి పండుగను జరుపుకోనున్నారని 'సాటా' వెస్ట్రన్ రీజియన్ అధ్యక్షుడు నరేష్ తెలిపారు. సంఘసేవ వాలంటీర్లకు సన్మానం, రాత్రి 9 గంటలకు భోజనాలతో కార్యక్రమం ముగుస్తుందని ఆయన తెలిపారు.
(చదవండి: భారత సంతతి విద్యార్థికి.. ఒకేరోజు ఏకంగా ఆరుసార్లు గుండె ఆగిపోడమా!..)
Comments
Please login to add a commentAdd a comment