
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూతురిగా సితార ఘట్టమనేని పరిచయమే. కానీ తనకంటూ సొంతగుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది. అందుకేనేమో సోషల్‌మీడియాలో తనకు ఫ్యాన్స్ ఎక్కువే. తాజాగా మహేష్‌బాబుకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా షేర్ చేసింది.
(ఇదీ చదవండి: Adipurush: దిల్ రాజు ముందే ఊహించాడా?)
'మా సూపర్ డాడ్, నా బిగ్గెస్ట్ చీర్‌లీడర్‌కి హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా... లవ్ యూ టు ది మూన్ ' అంటూ తెలిపింది. సితార షేర్ చేసిన ఫోటోలు చాలా అందంగా ఉన్నాయి. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. మహేష్ బాబు తన పిల్లల కోసం ఎక్కువగానే సమయం కేటాయిస్తాడు. అందుకే ఆయనకు పిల్లలతో ప్రత్యేకమైన బాండింగ్ ఉంటుంది. దీంతో టాలీవుడ్‌లో మహేష్‌కు ఫ్యామిలీ మ్యాన్‌గా గుర్తింపు ఉంది. సినిమా విషయానికి వస్తే గుంటూరు కారం మూవీతో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
(ఇదీ చదవండి: రాజకీయాల్లో సినిమా గ్లామర్ క్లిక్ అవుతుందా?)
Comments
Please login to add a commentAdd a comment