
‘మేక్ ఎ విష్’ ఫౌండేషన్ మనకు చిరపరిచితమైందే. దాని ద్వారా పిల్లల విషెస్ తెలుసుకుని మన హీరోలు సైతం ఒకటి అరా నిజం చేశారు. కానీ... యూఎస్ ప్రో రెజ్లర్ జాన్ సేనా... 650 మంది విషెస్‌ను నిజం చేసి గిన్నిస్ రికార్డు సృష్టించాడు. 45 ఏళ్ల జాన్... జూలై 19నాటికే ఈ రికార్డును పూర్తి చేసినట్టు గిన్నిస్ ప్రకటించింది. జాన్‌ను ‘హెర్‌క్యులీన్’(అత్యంత బలశాలి)అని ప్రశంసించింది గిన్నిస్.
42 ఏళ్ల మేక్ ఎ విష్ ఫౌండేషన్ చరిత్రలో... 200 మించిన విషెస్‌ను పూర్తి చేసినవారే లేరట. అలాంటిది 650 మంది పిల్లల కోరికలను నిజం చేయడం అంటే మామూలు విషయం కాదు కదా! అయితే... పిల్లలు ఎక్కువగా కోరుకునే సెలబ్రిటీ కూడా అతనేనట. 1999లో రెజ్లింగ్ కెరీర్‌ను మొదలుపెట్టిన 2002 నుంచే మేక్ ఎ విష్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేయడం ప్రారంభించాడు.
(చదవండి: వీడియో: కానిస్టేబుల్ కక్కుర్తి.. అటు ఇటు చూసి మామిడి పండ్ల దొంగతనం.. అడ్డంగా బుక్కయ్యాడు)
Comments
Please login to add a commentAdd a comment