పెర్కిట్(ఆర్మూర్) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బందు పథకంలో భాగంగా పెట్టుబడి సాయాన్ని అధికారులు నిబద్ధతతో అమలు చేస్తున్నారు. మండలంలోని అమ్ధాపూర్‌లో గురువారం రాత్రి 102 సంవత్సరాల శతాధిక వృద్ధురాలైన తలారి ముత్తెమ్మకు, అలాగే మంథనికి చెందిన శుక్రవారం బూస ముత్తెన్న అనే వికలాంగునికి పెట్టుబడి సాయం చెక్కును ఇంటి వద్దకు వెళ్లి అందజేశారు. దీంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. చెక్కును అందజేసిన వారిలో ఉద్యాన శాఖ అధికారి రోహిత్, సర్వేయర్ సూర్య ప్రకాశ్, జూనియర్ అసిస్టెంట్ సురిత్ రెడ్డి తదితరులున్నారు. మంథనిలో 102 ఏళ్ల వృద్ధురాలు ముత్తెమ్మకు చెక్కు అందజేస్తున్న అధికారులు
Comments
Please login to add a commentAdd a comment