సాక్షి, నిజామాబాద్ : కోడలి దాష్టీకానికి నిరసనగా నిజామాబాద్‌లో స్వంత ఇంటి ముందే ఓ వృద్ధురాలు దీక్ష చేయడం సంచలనం సృష్టించింది. భారతి అనే వృద్ధురాలు తన ఇంట్లో తాను అండే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం మధ్యాహ్నం తన ఇంటిముందే దీక్ష ప్రారంభించింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. భారతి కొడుకు కోడలు అమెరికాలో ఉంటున్నారు. అక్కడికి వెళ్ళిన భారతిని కోడలు ఇంటి నుంచి వెళ్లగొట్టడమేకాక నిజామాబాద్‌లో ఉన్న ఇంటికి తాళం వేయించింది. తనూ, తన భర్త నివసించిన స్వంత ఇంటిని కబ్జాచేసి తన కోడలు తనకు నిలువనీడలేకుండా చేసిందని భారతి కన్నీటి పర్యంతమైంది. దీంతో స్పందించిన కాలనీ వాసులు ఆమెకు అండగా నిలిచారు. ఇంటి తాళం పగులగొట్టి భారతికి ఇల్లు అప్పగించారు. వృద్ధురాలి తరపున తాము పోరాడతామని వారు పేర్కొన్నారు. కాలనీవాసుల జోక్యంతో కథ సుఖాంతమైంది.
Comments
Please login to add a commentAdd a comment