హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ దగ్గర బస్సులో చోరీ జరిగింది. భారతమ్మ అనే వృద్ధురాలికి చెందిన 7తులాల బంగారం, 2వేల నగదు గుర్తుతెలియన వ్యక్తులు దొంగిలించారు. దీంతో భారతమ్మ పోలీసులను ఆశ్రయించింది. నల్గొండ జిల్లా పోచంపల్లికి చెందిన భారతమ్మ.. ఓ ఫంక్షన్ కోసం మీర్‌పేట్‌లోని బంధువు ఇంటికి బస్సులో బయల్దేరింది.
బంగారం, నగదు ఉన్న పర్సును కవర్‌లో పెట్టింది. హయత్‌నగర్ వరకు తన దగ్గరే ఉన్న పర్సు... ఎల్బీనగర్ వచ్చేసరికి మాయమైందని బాధితురాలు అంటోంది. అయితే తన పక్కసీట్లో కూర్చున్న మహిళపై అనుమానంగా ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.