
చైత్రమ్మ(ఫైల్)
కోహీర్: మండలంలోని బిలాల్‌పూర్ గ్రామంలో శతాధిక వృద్ధురాలు గూళ్ల చైత్రమ్మ(117) (ఆధార్ కార్డు ప్రకారం) శుక్రవారం రాత్రి మృతి చెందింది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చైత్రమ్మ స్వగ్రామమైన బిలాల్‌పూర్‌లో తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు శనివారం గ్రామ శివారులోని బీసీ శ్మశానవాటికలో నిర్వహించారు. చైత్రమ్మ 80వ ఏట భర్త లాలప్ప చనిపోయాడు.
అప్పటి నుంచి చైత్రమ్మ కుటుంబ భారాన్ని మోశారు. నిత్య శ్రామికురాలైన చైత్రమ్మ పురుషులతో సమానంగా వ్యవసాయ పనులు చేసేవారు. ఆమెకు నలుగురు సంతానం. వారి పిల్లలు, పిల్లలకు పిల్లలు ఇలా 52 మంది కుటుంబ సభ్యులను ఆమె జీవితం కాలంలో చూశారు. మునిమనవలను ఎత్తుకొని ఆడించే సౌభాగ్యాన్ని పొందారు. గ్రామంలో 117 సంవత్సరాలు జీవించిన వ్యక్తులు ఇంత వరకు ఎవరూ లేరని సర్పంచ్ అశోక్ తెలిపారు.