వృద్దురాలి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్న మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ రాజ్యలక్ష్మి, తదితరులు
తాడితోట (రాజమహేంద్రవరం): వృద్ధులపై జరుగుతున్న హింసను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. చెల్లెలు(పిన్ని కుమార్తె) ప్రగడ మంగాదేవి చేతిలో చిత్రహింసలకు గురై రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామానికి చెందిన పంతం పుష్పవతిని మంగళవారం మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ రాజ్యలక్ష్మి, పీడీ ఎన్.సీతామహాలక్ష్మి, సీడీపీఓ వై.సుశీల కుమారి పరామర్శించారు.
వృద్ధురాలి పరిస్థితిని ఆసుపత్రి సూపరింటెండెంట్ ను అడిగి తెలుసుకున్నారు. వృద్ధాప్యంలో ఉన్నవారు వేధింపులకు గురి కాకుండా చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ టి.రమేష్ కిషోర్, ఆర్‌ఎంఓ లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.
వృద్ధురాలి పరిస్థితి విషమం.. కాకినాడకు తరలింపు
చిత్ర హింసలకు గురైన వృద్ధురాలు పంతం పుష్పవతి పరిస్థితి విషమించడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ కిషోర్ ఆదేశాల మేరకు మంగళవారం ప్రత్యేక అంబులెన్స్‌లో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment