పోలీసులను ఆశ్రయించిన గంగమ్మ
బషీరాబాద్(తాండూరు): బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామంలో ఇళ్ల కూల్చివేత వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఇళ్లు లేకుండా రోడ్డుపాలు చేసిన తనకు న్యాయం చేయాలని బాధితురాలు మ్యాదరి గంగమ్మ గురువారం పోలీసులను ఆశ్రయించింది. నలభై ఏళ్లుగా నివాసముంటున్న తన ఇంటిని సర్పంచ్ భర్త అన్యాయంగా కూల్చివేశారని, అతడిపై చర్య తీసుకోవాలని బషీరాబాద్ ఎస్సై లక్ష్మయ్యకు ఫిర్యాదు చేసింది. అయితే సీసీ రోడ్డు నిర్మాణానికి అడ్డుగా వచ్చిందని కూల్చిన ఇళ్లు గంగమ్మదే అని ఎలాంటి ఆధారాలు చూపలేదని, దీనిపై సమగ్ర విచారణ జరపాల్సి ఉందని ఎస్సై తెలిపారు.
మరోవైపు గ్రామంలోని అక్రమ కట్టడాలపై సర్పంచ్ లావణ్య కొరఢా ఝులిపిస్తున్నారు. రోడ్డుపై నిర్మించిన ఇళ్లను గురువారం కూడా కూల్చివేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment