House Demolition
-
బుల్డోజర్ న్యాయం రాజ్యాంగ విరుద్ధం
తలదాచుకోవడానికి ఒక సొంత గూడు సమకూర్చుకోవాలని ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం కలలు కంటుంది. ఆ కలను సాకారం చేసుకోవడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడతారు. ఇల్లు అంటే ఒక కుటుంబమంతటి ఆశల కలబోత. ఇల్లు జీవితానికి స్థిరత్వాన్ని, భద్రతను ఇస్తుంది. మనుషులకు సంతృప్తి, ఆత్మవిశ్వాసం, గౌరవాన్ని అందిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21(వ్యక్తిగత స్వేచ్ఛ, జీవితానికి రక్షణ)లో పౌరులు ఒక గూడు కలిగి ఉండే హక్కు కూడా ఒక భాగమే. ఏదైనా కేసులో ఒక వ్యక్తి నిందితుడు లేదా దోషి అయితే.. అతడి కుటుంబం నివసిస్తున్న ఇంటిని ప్రభుత్వ అధికారులు కూల్చివేయవచ్చా? వారికి నిలువ నీడ లేకుండా చేయొచ్చా? ఒక్కరు నేరం చేస్తే అతడి కుటుంబం మొత్తం శిక్ష అనుభవించాలా? అనేది చాలా ముఖ్యమైన విషయం. న్యాయ వ్యవస్థ అధికారాలను కార్యనిర్వాహక వ్యవస్థ తమ చేతుల్లోకి తీసుకోకూడదు. బుల్డోజర్ న్యాయం ఎంతమాత్రం సరైంది కాదు. ఒక వ్యక్తి ఒక కేసులో నిందితుడు లేదా దోషి అయినంత మాత్రాన అతడి ఇంటిని కూల్చివేయడం చట్టబద్ధ పాలనా సూత్రాలకు వ్యతిరేకం. పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. – సుప్రీంకోర్టు సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అనధికారికంగా అమలవుతున్న ‘బుల్డోజర్ న్యాయం’పై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. బుల్డోజర్ చర్యలు చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. నిందితుడు లేదా దోషి ఇంటిని కూల్చే అధికారం ప్రభుత్వ అధికారులకు లేదని, ఒక వ్యక్తి నేరాన్ని నిర్ధారించే బాధ్యత న్యాయవ్యవస్థపైనే ఉందని వెల్లడించింది. ఎవరైనా దుర్వినియోగానికి పాల్పడితే జరిమానా తప్పదని, దుర్మార్గంగా ప్రవర్తించిన వారిని న్యాయస్థానం వదిలిపెట్టబోదని హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో బుల్డోజర్లతో ఇళ్ల కూల్చివేతలను వ్యతిరేకించడంతోపాటు ఇలాంటి కూల్చివేతల విషయంలో మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం.. బుల్డోజర్ న్యాయం చట్టపరంగా ఆమోదయోగ్యం కాదని పేర్కొంటూ అక్టోబర్ 1న తమ తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసుపై బుధవారం జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ కె.వి.విశ్వనాథన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. 95 పేజీల తీర్పు వెలువరించింది. ఒకరు నేరానికి పాల్పడితే అతడి కుటుంబాన్ని శిక్షించడాన్ని రాజ్యాంగం గానీ, నేర న్యాయ వ్యవస్థ గానీ అనుమతించబోవని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వంతోపాటు కొన్ని రాష్ట్రాల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కొన్ని కేసుల్లో స్థానిక మున్సిపల్ చట్టాలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తున్నారని, అయితే, కొన్ని సందర్భాల్లో అవి నిందితులవి అయి ఉంటున్నాయని చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ.. తప్పనిసరిగా కూల్చివేయాల్సి వస్తే అదే చివరి మార్గం తప్ప మరో మార్గం లేదని నిరూపించాలని పేర్కొంది. అనివార్యంగా నేలమట్టం చేయాల్సిన ఇళ్ల విషయంలోనూ ‘రూల్ ఆఫ్ లా’ను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అది ప్రభుత్వ అధికారుల విధి కాదు నిందితుడి నేరం రుజువు కాక ముందే అతడిని శిక్షించే విధానాన్ని న్యాయవ్యవస్థ హర్షించదని, రాత్రిపూట మహిళలను, పిల్లలను వీధుల్లో నిలబడేలా చేయడం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఉద్ఘాటించింది. ఏదైనా కేసులో ఒక వ్యక్తిని దోషిగా తేల్చడం, జరిమానా లేదా శిక్ష కింద అతడికి ఇంటిని కూల్చడం ప్రభుత్వ అధికా రుల విధి కాదని వెల్లడించింది. ముందస్తుగా షోకాజ్ నోటీసు ఇవ్వకుండా ఏ ఒక్క ఇంటినీ కూల్చడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. నోటీసుపై ప్రతిస్పందించడానికి కనీసం 15 రోజుల సమయం ఇవ్వాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇవి దేశం మొత్తానికి వర్తిస్తాయని పేర్కొంది. అయితే.. రహదారులు, నదీ తీరాల్లోని నిర్మాణాలు, అక్రమ భవనాలు లేదా నిర్మాణాలపై తీసుకునే చర్యలకు ఈ మార్గదర్శకాలు వర్తించబోవని సుప్రీంకోర్టు ధర్మాసనం వివరించింది. ఒక్కరు చేసే నేరానికి కుటుంబమంతటికీ శిక్షా? → నిందితుడి నేరం రుజువు కాకముందే అతడిని శిక్షించవద్దు → మహిళలు, పిల్లలను రాత్రిపూట రోడ్డున పడేయొద్దు → ముందస్తు షోకాజ్ నోటీసు ఇవ్వకుండా ఏ ఒక్క ఇంటినీ కూల్చడానికి వీల్లేదు. → నోటీసుపై ప్రతిస్పందించడానికి కనీసం 15 రోజుల సమయం ఇచ్చి తీరాలి→ మార్గదర్శకాలు పాటించకపోతే అధికారులపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తప్పవు→ సుప్రీంకోర్టు కీలక తీర్పు → కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ సుప్రీం కోర్టు మార్గదర్శకాలు → ముందస్తుగా నోటీసు ఇవ్వకుండా ఇళ్ల కూల్చివేతలు ప్రారంభించకూడదు. అధికారులు నోటీసు ఇచ్చాక 15 రోజుల్లోగా లేదా స్థానిక మున్సిపల్ చట్టాలు నిర్దేశించిన సమయంలోగా స్పందించాల్సి ఉంటుంది. నోటీసు అందుకున్న వ్యక్తి వివరణ ఇవ్వాలి. → ఇంటి సొంతదారు/అందులో ఉంటున్న వ్యక్తికి రిజిస్టర్డ్ పోస్టు ద్వారా నోటీసు పంపించాలి. అదనంగా నోటీసు కాపీని ఇంటి బయట స్పష్టంగా కనిపించేలా అతికించాలి. భవనాన్ని ఎందుకు కూల్చుతున్నారో ఆ నోటీసులో వివరించాలి. కూల్చివేత చర్యను నిరోధించడానికి ఏం చేయవచ్చో కూడా అదే నోటీసులో చెప్పాలి. → నోటీసు జారీ చేయడానికి, రిజిస్టర్డ్ పోస్టులో పంపడానికి, ప్రతిస్పందనను స్వీకరించడానికి, షోకాజ్ నోటీసుల వివరాలు, ఇతర ఉత్తర్వుల కోసం పురపాలక సంఘాలు, మున్సిపల్ కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు మూడు నెలల్లోగా ఒక డిజిటల్ పోర్టల్ సిద్ధం చేసుకోవాలి. → ప్రజల వినతులు తెలుసుకోవడానికి, తుది ఉత్తర్వులు జారీ చేయడానికి ఒక అధికార వ్యవస్థను ఏర్పాటు చేయాలి. → అనధికారిక కట్టడాన్ని తొలగించడానికి లేదా పూర్తిగా కూల్చివేయడానికి 15 రోజుల సమయం ఇవ్వాలి. → ఇళ్ల కూల్చివేత వీడియోను చిత్రీకరించాలి. వీడియో రికార్డ్‌ను భద్రపర్చాలి. → సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అధికారులు తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే కోర్టు ధిక్కరణ కింద విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దోషిగా తేలితే జరిమానా లేదా చట్ట ప్రకారం శిక్ష తప్పదు. → కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి ఇంటిని కూల్చివేసినట్లు తేలితే సంబంధిత అధికారులు అందుకు బాధ్యత వహించాలి. ఆ ఇంటిని వారి సొంత ఖర్చులతోనే మళ్లీ నిర్మించాల్సి ఉంటుంది. అదనంగా డ్యామేజీ ఖర్చులు చెల్లించాలి. → ఏదైనా ఆస్తిపై బుల్డోజర్ చర్య తీసుకునే ముందు, వ్యక్తిగతంగా విచారించడానికి ఆ ఆస్తి యజమానికి అవకాశం కలి్పంచాలి. అంతేకాదు.. ఉత్తర్వులపై అధికారులు మౌఖిక సమాచారం ఇవ్వాలి. → బుల్డోజర్ చర్యపై నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? అనేది జిల్లా మేజి్రస్టేట్(డీఎం) చూడాలి. నిబంధనలు పాటించకుండా ఇళ్లు, భవనాలను కూల్చివేసే అధికారులపై చర్యలు తీసుకోవాలి. → చట్టం ప్రకారం పౌరులందరినీ సమానంగా చూడాలి. ఇంటిని కూల్చడమనేది ప్రాథమిక హక్కుకు విరుద్ధం. ఒక నిర్మాణాన్ని కూల్చివేయాలంటే నిందితుడి నేపథ్యాన్ని, అతని సామాజికవర్గాన్ని పట్టించుకోవద్దు. → సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను తెలియజేస్తూ జిల్లా మేజి్రస్టేట్లు, స్థానిక అధికారులకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సర్క్యులర్లు జారీ చేయాలి. Supreme Court says it has dealt with the separation of powers as well as how executive and judicial wings work in their respective spheres. Adjudicatory functions are entrusted to the judiciary and the executive cannot replace the judiciary in performing its core function, says…— ANI (@ANI) November 13, 2024 -
ఇండ్లను ఎందుకు కూల్చుతున్నారు.. మూసీ సుందరీకరణ లక్ష్యం ఏమిటి?
రాజకీయ రంగస్థలంపై మూసీ ప్రక్షాళన, పారదర్శకత లోపించి తీవ్ర వివాదాస్పద మవుతోంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదల ఇండ్ల కూల్చివేతకు సంబంధించి హైడ్రాపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అగ్రహం ప్రకటించింది. ‘రికార్డులు పరిశీలించకుండా కూల్చివేతకు యంత్రాలు ఇవ్వడం ఏమిటని, ఆదివారం కూల్చివేతలు ఎలా చేపడుతారని, రాజకీయ భాష్యాలు చెప్పినట్లు చేస్తే జైళ్లకు పంపు తామ’ని హెచ్చరించింది. పెద్దలను వదిలేసి పేదలను కొడుతున్నారనీ, సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తున్నారనీ. ప్రభుత్వంపై, కమిషనర్ రంగనాథ్‌పై, అమీన్పూర్ తహసిల్దార్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మూసీ ఆక్రమణల కూల్చివేత విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్.టి.ఎల్. నిర్ధారించిన తర్వాతే చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఎఫ్.టి.ఎల్ బయట ఇల్లు నిర్మించుకున్న వారికి నోటీసులు ఎలా జారీ చేస్తారని ప్రశ్నించింది. చట్ట ప్రకారమే ముందుకు వెళ్లాలని ఆదేశించింది.‘అసలు మూసీ నది రివర్ ఫ్రంట్ అభివృద్ధి పేరిట జరుగుతున్న సుందరీకరణ లక్ష్యం ఏమిటి? మూసీ నదిని, ఆ నదిలో కలిసే వాగులను (గృహ, హోటల్, వ్యాపార, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం, మురుగునీటిని) పూర్తి (ఐరోపా ప్రమాణాల) స్థాయిలో ప్రక్షాళన (శుద్ధి) చేసి స్వచ్ఛమైన జలాలు (నది)గా మార్చే లక్ష్యం ఏమైనా ఉందా? ప్రాజెక్టు పూర్తి అయితే, అంటే ఆ మురుగు నీటిని మూసీ నదిలో కలిసే నాటికి పరిశుభ్రమైన తాగునీటిగా మార్చే ప్రక్రియ ఇందులో ఉందా? లేదా హైదరాబాద్ జంట నగరాలలోని మురుగు నీటిని శుద్ధి చేయకుండా మూసీలోకి వదిలేసి ఆ మురుగు నీటి ప్రవాహంపైనే, సుందరీకరణ చేపడతారా? ఈ అనుమానాలను నివృత్తి చేయాలి. సమగ్రమైన ప్రాజెక్టు పూర్తిస్థాయి నివేదిక (డీపీఆర్)ను ప్రజల ముందు ఉంచాలి. ప్రజల నివాసాలకు నష్టం కలిగే ఏ ప్రాజెక్టులో నైనా ముందు పునరావాసం కల్పించే ప్రక్రియ పూర్తయిన తరువాతనే, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వారి నివాసాలను చివరలో ఖాళీ చేయించే కార్యక్రమాన్ని మొదలుపెడతారు. కానీ, అందుకు భిన్నంగా సామాన్య పేద, మధ్యతరగతి ప్రజలు జీవితమంతా కష్టించి నిర్మించుకున్న ఇండ్లను ప్రాజెక్టు ప్రారంభంలోనే ఎందుకు కూల్చుతున్నారు? ఇదేనా కేసీఆర్ విధానాలకు ప్రత్యామ్నాయ ప్రజారాజ్యం?సామాన్య, మధ్యతరగతి వారికి ఒక ఇల్లు అనేది వారి మొత్తం జీవితపు కల. ఆ కల నిజం చేసుకోవడానికి జీవితంలో చాలా మూల్యం చెల్లిస్తారు. పట్టణంలో ఇల్లనే కల సాకారం కోసం సొంత ఊళ్ళలో ఉన్న పొలాలను, ఇతర ఆస్తులను అమ్ముతారు. అప్పులు తెస్తారు. అనేక కష్టాలతో వారి స్తోమతకు తగ్గ ఇల్లు నిర్మించుకుంటారు. ప్రాజెక్టు పేరుతో, పునరావాసం, ఉపాధి కల్పించకుండా ప్రభుత్వం అకస్మాత్తుగా ఆ ఇళ్లను కూల్చివేయడం ప్రజా పరిపాలన అవుతుందా?ప్రభుత్వాల, పెద్దల రియల్ ఎస్టేట్ దందాతో 10, 20 గజాల నేలపై ఇల్లు కట్టుకోవడం సామాన్య మధ్య తరగతికి ఒక గగన కుసుమంగా మారింది. అందుకే వీరు మురికి వాడలకు, దుర్గంధ నదుల పరివాహ ప్రాంతాలకు తరలు తున్నారు. చౌకగా వస్తుందని దుర్గంధపూరిత నది అంచునే స్థలం కొని, భారీ డబ్బుతో క్రమబద్ధీకరణ చేసుకొని, ఇండ్లు నిర్మించుకున్నారు. కూల్చివేతల భయంతో గుండె పోటు చావులకు, ఆత్మహత్యలకు గురవుతున్నారు. 8 నెలల నిండు గర్భిణీ అనే కనికరం లేకుండా ఆమె ఇల్లు కూల్చడం దుర్మార్గం. ఒక బాధిత కుటుంబం 25 ఏళ్లుగా మూసీ పరివాహక ప్రాంతంలోనే ఉంటూ నలుగురు కొడు కులకు పెళ్లి చేసింది. నిర్వాసితులైన వీరందరికీ ఒకే ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లభించింది. ఒక్క ఇంట్లో ఇన్ని కుటుంబాలు ఎలా నివసించాలని వేదనకు గురవుతున్నారు వారు. హైడ్రాతో ప్రభుత్వానికి వచ్చిన కీర్తి, మూసి పేదల ఇళ్ల కూల్చివేతతో పాతాళంలోకి పోయింది.జల వనరులను, ప్రభుత్వ స్థలాలను, పార్కులను రక్షించవలసిందే. కానీ వాటిని ఆక్రమించి భారీ ఆస్తులుగా చేసుకున్నది సామాన్య పౌరులు కాదు. అధికారంలో ఉన్న బడాబాబులు, పెద్దలే. మూసీ నదీ గర్భంలో ఉన్న ఇళ్ల గుర్తింపునకు సంబంధించి మార్కింగ్ ప్రక్రియను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు వెళ్లడానికి ఆసక్తి చూపినా, మరికొందరు ఇండ్లను వదిలిపెట్టడానికి ససేమిరా సిద్ధంగా లేరు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆశించిన స్థానిక ప్రజలు వాటిని తమకే కేటాయించాలని ఆందోళన చేస్తున్నారు. మూసి నిర్వాసితులు, డబుల్ బెడ్ రూమ్ సమీప ప్రజల మధ్య ఉద్రిక్తత నెలకొంది.బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అక్రమ నిర్మాణాలను గుర్తించి దాదాపు 15 వేల కుటుంబ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూములు ఇవ్వాలని 2022లోనే నిర్ణయించింది. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మూసి పరివాహక ప్రాంతంలో పది వేల అక్రమ నిర్మాణాలు ఉన్నాయని తేల్చారు. ఆ నిర్వాసి తులందరికీ వారి నివాసానికి, ఉపాధికి అనువైన చోట అన్ని మౌలిక వసతులతో కూడిన పునరావాస సౌకర్యాలను ప్రభుత్వం నిర్వాసితులకు కల్పించాలి. దౌర్జన్యంతో కాకుండా నిర్వాసితులను అన్ని విధాల ఒప్పించి మెప్పించి పునరావస కాలనీకి తరలించాలి.చదవండి: రిజిస్ట్రేషన్‌కు బద్ధకిస్తున్నారు.. ఆ నిబంధన మార్చాలి!శుద్ధీకరణ అంటే, మురుగు నీటిలో ఉన్న అశుద్ధ మూలకాలను, కాలుష్యాన్ని తొలగించడం. శుద్ధి చేసిన తర్వాత ఆ నీరు త్రాగడానికి అనువైన విధంగా 100% సురక్షితంగా ఉండాలి. మూసీ నది పునరుజ్జీవన ప్రాజె క్టులో నేటి ప్రభుత్వం ఆ నది మురుగు జలాలను అలా స్వచ్ఛమైన తాగునీరుగా మారుస్తుందా? దేశంలోని చాలా నగరాల్లో మురుగు నీటి శుద్ధీకరణ వ్యవస్థలు ఎన్నో ఉన్నప్పటికీ, ఎక్కడా మురుగు నీటిని స్వచ్ఛ జలాలుగా మార్చిన చరిత్ర నేటికీ లేనేలేదు. ఈ విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ తమ ప్రభుత్వ హయాంలో అంగీకరించారు. సీవరేస్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ల ద్వారా మురుగునీటి శుద్ధీకరణ 30–35% కంటే మించదనీ, తెలంగాణలోలోనే కాదు, దేశమంతా ఇదే పరిస్థితని కేటీఆర్ ఒప్పుకున్నారు. ఈ పథకానికి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనీ, మూసీ సుందరీకరణ ప్రాజెక్టనీ, మూసీ ప్యూరిఫికేషన్ ప్రాజెక్ట్ అనీ రకరకాల పేర్లతో మంత్రులు, అధికారులే గందరగోళం చేస్తున్నారు. మూíసీ నదిని పూర్తి స్థాయిలో ఒక ఎకలాజికల్ ప్రాజెక్టు (ఒక స్వచ్ఛమైన నది)గా తీర్చి దిద్దాలనే లక్ష్యం ఏమైనా ప్రభుత్వానికి ఉందా?చదవండి: ఇంకా సుత్తి, శానం వాడుతుండడం బాధాకరం..మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, నేషనల్ రివర్ కన్జర్వేషన్ డైరెక్టరేట్ ఒక మేన్యువల్‌ను 1997లో ప్రకటించింది. ‘డిజైన్ మేన్యువల్ ఫర్ వేస్ట్ స్టెబిలైజేషన్ పాండ్స్ ఇన్ ఇండియా’ (దేశంలోని వ్యర్థాల స్థిరీకరణ చెరువుల కోసం డిజైన్ మాన్యువల్). ఇది ప్రకటించి 27 ఏళ్ల అయింది. దీని అర్థం ఏమిటంటే... మురుగు నీటిని శుద్ధి చేయలేమని చేతులెత్తేసి, ఆ నీటిని తాగునీరులో కలవకుండా మురుగునీటిని కుంటలుగా స్థిరపరుస్తామని చెప్పడం. కోటిమంది హైదరాబాద్ నగర వాసులు వాడిన మురికి నీరు, వ్యాపార సముదాయాల వ్యర్థాలు, పరిశ్ర మలు వెదజల్లే విష పదార్థాలు మూసీ ద్వారా కృష్ణా నదిలో యధేచ్ఛగా కలుస్తున్నాయి. ఆ కలుషిత నీటినే ప్రజలు జీవజలంగా సేవిస్తున్నారు. మురుగు నీటి శుద్ధీకరణ పథ కాలకు ఎంత అందమైన పేర్లు పెట్టినా శుద్ధీకరణ వట్టిదే నని 75 ఏళ్ల దేశ చరిత్ర రుజువు చేస్తోంది. ఇది కఠిన వాస్తవం. మరి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొ రేషన్ లిమిటెడ్ ప్రక్షాళన ఏ రకమైనదో... డీపీఆర్‌ను తెలంగాణ ప్రజల ముందు ఉంచాలి.- నైనాల గోవర్ధన్ తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్ -
ఈ దుఃఖం తీర్చేదెవరు?
(గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్పల్లి) : ‘హైడ్రా’తో చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో వెలిసిన అక్రమ నిర్మాణాల కూల్చివేతపై తొలుత హర్షం వ్యక్తమైంది. కానీ ఆ తర్వాత హైడ్రా వ్యవహరిస్తున్న తీరు మా త్రం కుటుంబాల్లో కన్నీళ్లు నింపేలా ఉందంటూ బాధితులు మండిపడుతున్నారు. ఇళ్లలోనో, దుకాణాల్లోనో, షెడ్లలోనో నివ సిస్తున్న.. వ్యాపారాలు చేసుకుంటున్న వారికి కనీస సమాచారం ఇవ్వకుండా, ఇచ్చినా ఖాళీ చేసేందుకు సమ యం ఇవ్వకుండా కూల్చివేతలు చేపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమదుఃఖం తీర్చేదెవరని.. తమకు జరిగిన నష్టాన్ని పూడ్చేదెవరంటూ కన్నీళ్లుపెడుతున్నారు. చాలా వరకు పేదలు, మధ్యతరగతివారే.. ఇళ్లు కట్టుకున్నవారే కాదు.. స్థలాలు, నిర్మాణాలను లీజుకు తీసుకుని వ్యాపారాలు పెట్టుకున్నవారూ హైడ్రా కూల్చివేతల్లో తీవ్రంగా నష్టపోయారు. ఎక్కడెక్కడి నుంచో బతుకుదెరువు కోసం వచ్చి.. కడుపు కట్టుకుని సంపాదించుకుంటున్న తమ బతుకులు రోడ్డున పడ్డాయని వాపోతున్నారు. వడ్డీలకు అప్పులు తెచ్చి వ్యాపారాలు చేసుకుంటున్న షెడ్లను, భవనాలను ఉన్నట్టుండి కూల్చడంతో.. తీవ్రంగా నష్టపోయామని, ఇక తమ బతుకులు కోలుకునే అవకాశమే కనిపించడం లేదని కన్నీళ్లు పెడుతున్నారు. ఈ నెల 8న సున్నంచెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్లలోని ఒక గోడౌన్, మూడు భవనాలు, 20 గుడిసెలను అధికారులు కూల్చివేశారు. అందులో ఒక గుడిసెలో నివాసం ఉంటున్న బలహీనవర్గాలకు చెందిన ఎన్.నర్సింహ, అంజలి దంపతులు ఇరవయ్యేళ్ల క్రితం మాదాపూర్‌కు వలస వచ్చారు. స్థానిక నేతల సూచనతో అక్కడ గుడిసె వేసుకొని కూలిపనులు చేసుకుంటూ బతుకుతున్నారు. వారి కుమారుడు సాయిచరణ్ (17) కేన్సర్ వ్యాధితో బాధపడుతూ రెండు నెలల క్రితమే మృతిచెందాడు. ఆ దుఃఖం నుంచి కోలుకోకముందే వారి గుడిసె నేలమట్టమైంది. తలదాచుకునేందుకు నర్సింహ సోదరి ఇంటికి వెళ్లారు. కానీ అటు కుమారుడిని, ఇటు గూడును కోల్పోయిన ఆవేదనతో.. అంజలి ఈనెల 21న ఛాతీనొప్పికి గురైంది. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి ఆమె మృతి చెందింది. పాత జ్ఞాపకాలను వెతుక్కుంటూ కూల్చిన గుడిసె వద్దకు వచ్చిన నర్సింహ.. కొడుకు, భార్య ఇద్దరూ మరణించాక, తాను ఎవరి కోసం బతకాలో అర్థం కావడం లేదని వెక్కివెక్కి ఏడ్చారు. రోడ్డున పడ్డ బతుకులు.. కూకట్‌పల్లికి చెందిన విజయ్ప్రతాప్గౌడ్ది మరో కన్నీటి వ్యథ. కేటరింగ్ చేసే ఆయన వద్ద 68 మంది పనిచేస్తున్నారు. వారందరికీ అదే జీవనాధారం. విజయ్‌ప్రతాప్ భూమిని లీజుకు తీసుకొని, రూ.40 లక్షల వ్యయంతో షెడ్లు, సామగ్రి ఏర్పాటు చేసుకున్నారు. నల్లచెరువులో హైడ్రా కూల్చివేతల్లో భాగంగా ఆయన షెడ్లనూ కూల్చేశారు. కనీసం కేటరింగ్ సామగ్రి బయటికి తీసుకువెళ్లే అవకాశం ఇవ్వలేదని ఆయన వాపోయారు. తనతోపాటు పనిచేసేవారంతా ఉపాధి లేక రోడ్డునపడ్డామని ఆందోళన వ్యక్తం చేశారు. కొంత గడువైనా ఇవ్వాల్సింది సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలతో తీవ్రంగా నష్టపోయానని మరో బాధితుడు పునారాం పేర్కొన్నారు. అక్కడ లక్షలు ఖర్చుపెట్టి గోడౌన్ నిర్మాణం చేపట్టానని, శానిటరీ సామాగ్రి కొంత అందులోనే ఉండిపోయిందని వాపోయారు. కొన్నిరోజులు గడువు ఇచ్చి ఉంటే సామగ్రిని పూర్తిగా తరలించే అవకాశం ఉండేదన్నారు. గోడౌన్, సామగ్రి కలిపి రూ.50 లక్షలకుపైగా నష్టపోయి.. రోడ్డునపడ్డానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గర్భవతి అన్నా కనికరించలేదు! కూకట్‌పల్లిలో రవి జిరాక్స్, ప్రింటింగ్ ప్రెస్‌కు సంబంధించిన దుకాణం నిర్వహిస్తున్నాడు. హైడ్రా ఒక్కసారిగా కూల్చివేతలు చేపట్టడంతో తీవ్రంగా నష్టపోయానని వాపోయాడు. తన భార్య గర్భవతి అని, సామగ్రి తీసుకునేందుకు కాస్త గడువు ఇవ్వాలని కోరినా అధికారులు కనికరించలేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాను, మరికొందరు కలసి నాలుగు రోజులు కష్టపడి కొంత సామగ్రిని బయటికి తీసినా.. అది చాలా వరకు పాడైపోయిందని వాపోయారు. తనతో పాటు మరెందరో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇళ్ల కూల్చివేతతో పేరు కోసం తాపత్రయం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రణాళిక లేకుండానే, హడావుడి చేసి నిత్యం వార్తల్లో ఉండే లక్ష్యంతో అక్రమ కట్టడాల పేరిట ఇళ్ల కూల్చివేతలతో పేరు తెచ్చుకోవాలని భావిస్తోందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. అయితే ఈ కూల్చివేతల ప్రక్రియ న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా చేపట్టి ఉంటే బాగుండేదని ప్రజల అభిప్రాయమని సీఎం రేవంత్‌రెడ్డికి గురువారం రాసిన లేఖలో పేర్కొన్నారు. హైడ్రా బాధితులు తన దృష్టికి తీసుకొచ్చిన అంశాలు, మేధావుల ఆలోచనలు, నిత్యం వార్తాపత్రికలు, టీవీ చానళ్ల ద్వారా తెలుసుకుంటున్న అంశాలన్నింటితో ఈ లేఖ రాస్తున్నట్టు తెలిపారు. ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను తాము సమరి్థంచబోమని, అయితే వీటిపై చర్యలు తీసుకునే సమయంలో సహజ న్యాయ సూత్రాలకు (ప్రిన్సిపుల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్) అనుగుణంగా ఉండాలనేదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి విషయంలో వీటి ఆధారంగానే పనిచేయాలనేది అందరి అభిప్రాయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో చాలా కేసుల్లో సహజ న్యాయ సూత్రాలను ప్రభుత్వం పాటించడం లేదన్నారు. ఇవాళ అక్రమమని కూల్చేస్తున్న వాటి గురించి సున్నితంగా ఆలోచించాల్సిన అవసరముందని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం అక్రమ కట్టడాలు అంటున్న ప్రాంతాల్లో వెలసిన ఇళ్లకు ప్రభుత్వ పక్షాన రూ.కోట్లు ఖర్చుచేసి రోడ్లు, డ్రైనేజీ సౌకర్యం, కరెంటు కనెక్షన్లు, కమ్యూనిటీ హాళ్లు, ఇంటి నంబరు కేటాయింపు వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దశాబ్దాలుగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల ద్వారా సేవలు పొందుతూ పన్నులు కడుతుండగా, ఇప్పుడు హఠాత్తుగా అక్రమం అంటే వారు ఎక్కడకు వెళ్లాలి? అందులోనూ పేద, మధ్యతరగతి ప్రజలు ఏమైపోవాలి? అని నిలదీశారు. గతంలో అనేకసార్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు అక్రమ నిర్మాణాలను రెగ్యులరైజ్ కూడా చేశాయన్నారు.మూసీ రివర్ బ్యూటిఫికేషన్లో భాగంగా గ్రేటర్ పరిధిలో ఇళ్లు కోల్పోయే వారితో చర్చించాలని సూచించారు. మూసీతోపాటు, ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న కూల్చివేతల విషయంలోనూ ఎలాంటి దుందుడుకు విధానాలతో ముందుకెళ్లకూడదన్నారు. హైడ్రా పేరుతో ఏర్పాటు చేసిన విభాగంతో ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళుతోందని చెప్పారు. దీనిపై పేద ప్రజలు చేస్తున్న ఆందోళనలను, వారి మనోవేదనను పరిగణనలోకి తీసుకోకుండా హైడ్రాకు మరిన్ని అధికారాలు కల్పించడాన్ని తప్పుబట్టారు. -
ఆగని టీడీపీ విధ్వంసం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నేతలు, కార్యకర్తల విధ్వంసం కొనసాగుతూనే ఉంది. గురు, శుక్రవారాల్లో అధికారుల మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి ఇళ్లు, ఇళ్ల పునాదుల్ని ధ్వంసం చేయించారు. వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను తీయించేశారు. డివైడర్‌ను, బస్ షెల్టర్‌ను, పిల్లర్లను ధ్వంసం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పగులగొట్టారు. » తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో వైఎస్సార్సీపీకి చెందిన నిరుపేద వంకా సుధాకర్ నిర్మిస్తున్న ఇంటిని టీడీపీ ఒత్తిడితో అధికారులు కూల్చేశారు. స్థానిక చెరువులో సుధాకర్ అక్కడ ఇల్లు నిర్మించుకుంటున్నాడు. ఇప్పటికే సుమారు రూ.8 లక్షలు వెచ్చించి గోడలు కట్టుకున్నాడు. కొందరు టీడీపీ నాయకులు, కొంత మీడియా వారు అది కూల్చేయాల్సిందేనని అధికారుల మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. అక్కడున్న మిగిలిన ఇళ్లనుగానీ, పట్టణంలో ఉన్న పలు ఆక్రమణలనుగానీ పట్టించుకోని అధికారులు సుధాకర్ నిర్మించుకుంటున్న ఇంటిని జేసీబీతో కూల్చేశారు. » ఏలూరు జిల్లా నూజివీడు మండలం పల్లెర్లమూడిలో టీడీపీ కార్యకర్తలు పేట్రేగిపోయారు. వైఎస్సార్ïÜపీ ప్రభుత్వ హయాంలో కోనేటి చెరువు వద్ద రోడ్డును వెడల్పు చేసి ఆర్అండ్బీ ఆధ్వర్యంలో డివైడర్ నిర్మించారు. ఈ డివైడర్‌ను టీడీపీ వారు పొక్లెయిన్‌తో ధ్వంసం చేసి తొలగించారు. దీంతోపాటు పాత బస్ షెల్టర్‌ను, నూతనంగా నిర్మిస్తున్న బస్ షెల్టర్ పిల్లర్లను కూల్చేశారు. » శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. జెడ్పీటీసీ సభ్యుడు గోవిందరెడ్డి, మండలంలోని అన్ని గ్రామాల వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు చెన్నేకొత్తపల్లి చేరుకుని వైఎస్సార్ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఐ వెంకటేశ్వర్లు నిరసన తెలుపుతున్న వారివద్దకు చేరుకుని.. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి సీఐ శివాంజనేయులుకు ఫిర్యాదు చేశారు. దుండగులు ధ్వంసం చేసిన వైఎస్సార్ విగ్రహం స్థానంలో ఒకటిరెండు రోజుల్లో నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని నాయకులు తెలిపారు.» శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం తులసిగాం పంచాయతీ జగనన్న కాలనీలో పునాదులను అధికార పార్టీ నాయకులు ధ్వంసం చేయించారు. జగనన్న ఇళ్ల కోసం ఈ సచివాలయం పరిధిలోని కొయ్య మోహిని, త్రివేణీ బడియా, బాకి భవానీ, కొండ మోహిని, నందికి శ్రావణి, లండ చందరమ్మ సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది డిసెంబర్ 30న అప్పటి తహసీల్దార్ పి.మీనాదేవి అనుమతి ఇచ్చారు. వారు ఆ స్థలాల్లో పునాదులు వేసుకున్నారు. దీనిపై స్థానిక టీడీపీ నాయకులు అక్రమ కట్టడాలు అంటూ రెవెన్యూ అధికారులకు అప్పట్లో ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ఇళ్లపై గత నెల 25న ఎమ్మెల్యే బెందాళం అశోక్ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ఆ కట్టడాలను పరిశీలించి రెవెన్యూ సిబ్బందితో మాట్లాడారు. ఈ క్రమంలోనే శుక్రవారం రెవెన్యూ అధికారులు చూడామణిరెడ్డి, వీఆర్వో సాలిన కృష్ణ, మండల సర్వేయర్ తవిటినాయుడు ఆధ్వర్యంలో జేసీబీతో పునాదులను నేలమట్టం చేశారు.విషయం తెలుసుకున్న సర్పంచ్ ప్రతినిధి ఇసురు తులíÜరాం, బాధిత లబ్ధిదారులు అక్కడికి చేరుకుని కూల్చివేతల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ అంశంపై స్థానిక తహసీల్దార్ ఎం.భాస్కర అప్పారావును వివరణ కోరగా.. గతంలో పనిచేసిన తహసీల్దార్ ఇళ్లను మంజూరు చేయడం వాస్తవమేనని చెప్పారు. వారికి వారం రోజుల్లో మరోచోట ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు. -
అర్ధరాత్రి టీడీపీ నాయకుల గూండాగిరి.. ఎదురుతిరిగిన ప్రజలు
సంతబొమ్మాళి: పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లపై టీడీపీ నాయకులు అర్ధరాత్రి సమయంలో ప్రొక్లెయినర్లతో దాడి చేశారు. నిర్దాక్షిణ్యంగా పేదల ఇళ్లను కూల్చివేశారు. లబ్ధిదారులను భయపెట్టి అక్కడి నుంచి తరిమేసి.. స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. వివరాల ప్రకారం.. సంతబొమ్మాళి మండలంలోని దండుగోపాలపురంలో గొనప సునీత, కోత అమ్మోజీ, నౌపడ తవిటమ్మ, బస్వల తులసమ్మ, బస్వల మహాలక్ష్మి, గోరుబండ తులసమ్మకు ప్రభుత్వం జగనన్న కాలనీలో ఇళ్ల పట్టాలు ఇచ్చింది. దీంతో వారు అక్కడ ప్రభుత్వ సాయంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. అయితే ఎప్పటి నుంచో ఈ స్థలంపై స్థానిక టీడీపీ నాయకులు కన్నేశారు. ఇళ్ల నిర్మాణాలు చివరి దశకు చేరుకోవడంతో.. లబ్ధిదారులను భయపెట్టి అక్కడి నుంచి తరిమేసేందుకు ఇదే సరైన సమయమనుకున్నారు. సోమవారం అర్ధరాత్రి ప్రొక్లెయినర్లతో ఆ ఏడుగురి ఇళ్ల నిర్మాణాలపై దాడి చేసి.. వాటిని కూల్చివేశారు. మంగళవారం ఉదయం అక్కడకు చేరుకున్న లబ్ధిదారులు.. నేలమట్టమైన తమ ఇళ్లను చూసి భోరున విలపించారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామస్తులంతా తిరగబడటంతో నిందితులైన టీడీపీ నాయకులు తమ ఇళ్లకు తాళాలు వేసుకుని పారిపోయారు. కాగా, ఇళ్ల కూల్చివేతపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్ ఆరంగి వసంతరావు, బెండి విష్ణు, బెండి సూర్యనారాయణ, రాము, అరుణ్‌కుమార్, కైలాష్, ప్రదీప్, అనిల్, బాలక ప్రసాద్, నారాయణ, పొందల సురేశ్, మధు, ఆరంగి శ్రీధర్, హరిపై కేసు నమోదు చేసినట్లు సంతబొమ్మాళి ఎస్ఐ మధుసూదనరావు తెలిపారు. -
బంగ్లాలో హిందువులపై ఆగని దాడులు
ఢాకా: బంగ్లాదేశ్‌లో దైవదూషణల వార్తల నేపథ్యంలో వారం రోజులుగా హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా, ఆదివారం రాత్రి రంగ్‌పూర్ జిల్లా పీర్‌గంజ్ ప్రాంతంలోని ఓ గ్రామంలో హిందువులకు చెందిన 66 ఇళ్లను దుండగులు ధ్వంసం చేయడంతోపాటు మరో 20 ఇళ్లను అగ్నికి ఆహుతి చేశారు. ఈ సందర్భంగా ఎవరికీ ఎటువంటి అపాయం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించి 52 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం భారీగా గాలింపు చేపట్టినట్లు తెలిపారు. తాజాగా, ఓ యువకుడు ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ దైవదూషణకు ఉద్దేశించిందంటూ ఆగ్రహంతో కొందరు వ్యక్తులు ఆ గ్రామంపై దాడికి పాల్పడ్డారని అధికారులు చెప్పారు. -
‘ఇల్లు కూల్చితే మా చావును చూస్తారు..’
సాక్షి, చంపాపేట(హైదరాబాద్): పక్కింటి యజమాని ఫిర్యాదుతో టౌన్‌ప్లానింగ్ సిబ్బంది ఇంటిని కూల్చివేసేందుకు సమాయత్తం అవుతుండగా కూల్చివేతలు నిలిపివేయాలంటూ కుటుంబ సభ్యులు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని అనడంతో ఆ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సంఘటన గురువారం రాత్రి చంపాపేట డివిజన్లో చోటు చేసుకుంది. టౌన్‌ప్లానింగ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చంపాపేట డివిజన్ దుర్గానగర్‌కాలనీకి చెందిన తేలుకుంట్ల రాజు 35 సంవత్సరాలుగా స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. తన ఇల్లు శిథిలావస్థకు చేరటంతో ఇటీవలే పాత ఇంటిని కూల్చి పునర్నిర్మాణం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన ఇంటి పక్కనే స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న శ్రీనివాస్ ఇంటి పునర్నిర్మాణం చేసేందుకు అభ్యంతరం తెలిపి కోర్టు నుంచి స్టే ఆర్డరు కూడా తెచ్చారు. ఆవేమీ పట్టించుకోని రాజు ఇంటి నిర్మాణ పనులు వేగవంతం చేయటంతో గురువారం శ్రీనివాస్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. టౌన్‌ప్లానింగ్ సిబ్బంది జేసీబీతో సంఘటనా స్థలానికి చేరి ఇంటిని కూల్చివేసేందుకు ప్రయత్నిస్తుండగా రాజు కుటుంబ సభ్యులు కూల్చివేత నిలిపేయాలంటూ కిరోసిన్ డబ్బాలు చేత పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చి రాజుకు నచ్చజెప్పి పరిస్థితిని చక్కదిద్దారు. -
ఇల్లు కూల్చివేత.. సరళాదేవీ విచారం
లక్నో/కాన్పూర్: కరుడుగట్టిన నేరస్తుడు వికాస్ దుబేను ఎన్కౌంటర్ చేయాలని కోరిన అతని తల్లి సరళాదేవీ.. పోలీసులు తమ ఇంటిని కూల్చివేయడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆ ఇంటిని చాలా కాలం క్రితం తాము కష్టపడి నిర్మించుకున్నామని శనివారం మీడియాతో అన్నారు. కాగా, గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేని అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించిన పోలీసులపై అతడి అనుచరులు కాల్పులకు తెగబడి తప్పించుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో డీఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు నేలకొరిగారు. సాధారణ పౌరుడితో సహా ఏడుగురు పోలీసులు గాయపడ్డారు. ఇక నేరగాడు దుబే, అతని గ్యాంగ్‌ను పట్టుకునేందుకు పోలీస్ శాఖ ముమ్మర గాలింపు చర్యలు చేపట్టింది. 25 పోలీసు బృందాలు యూపీతోపాటు ఇతర రాష్ట్రాల్లో గాలిస్తున్నాయి. ఇప్పటి వరకు 30 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇదిలావుంటే.. వికాస్ దుబే ఆచూకీ తెలిపిన వారికి రూ.50వేల నగదు ఇస్తామని కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ ప్రకటించారు. దాంతోపాటు గ్యాంగ్‌స్టర్ దుబేకు సహకరించినట్లు ఆరోపణలు రావడంతో చౌబేపూర్ పోలీస్ ఠాణా స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్‌హెచ్‌వో)ను అధికారులు సస్పెండ్ చేశారు. దుబే స్వగ్రామం భిక్రూలోని అతడి సొంతింటిని సాయుధ పోలీసులు బుల్డోజర్లతో శనివారం నేలమట్టం చేయించారు. ఆవరణలోని ఖరీదైన కార్లను ధ్వంసం చేయించారు. (వికాస్ దూబే తల్లి సంచలన వ్యాఖ్యలు) -
ఇల్లు కూలుస్తుండగా పురాతన విగ్రహాలు, పూజా సామగ్రి లభ్యం
యాదగిరిగుట్ట : మండలంలోని దాతారుపల్లిలో బుధవారం ఓ ఇంటిని కూలుస్తుండగా పురాతన విగ్రహాలు, పూజా సామాగ్రి బయటపడ్డాయి. స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. దాతారుపల్లికి చెందిన జంగం రాములు స్థానిక శివాలయంలో పూజారి. ఆలయాన్ని అభివృద్ధి చేసే క్రమంలో అందులో ఉన్న విగ్రహాలతో పాటు పూజ సామగ్రిని గ్రామస్తులు రాములు ఇంట్లో భద్రపరిచారు. ఆలయం నిర్మిస్తున్న సమయంలోనే రాములు అనారోగ్యంతో మరణించాడు. దీంతో ఆయన భార్య జయమ్మ, పిల్లలు హైదరాబాద్‌కు వెళ్లి అక్కడే ఉంటున్నారు. జయమ్మ అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంది. ఇల్లు శిథిలావస్థకు చేరడంతో వర్షాలకు క్రమక్రమంగా కూలిపోతోంది. బుధవారం జయమ్మ, ఆమె కుమారులు వచ్చి ఇంటిని పూర్తిగా కూల్చివేస్తున్న క్రమంలో భద్రపరిచిన విగ్రహాలు, పూజ సామాగ్రి బయటపడ్డాయి. స్థానికులు, సర్పంచ్ బైరగాని పుల్లయ్యగౌడ్, ఎంపీటీసీ కాల్నె అయిలయ్య, ఉప సర్పంచ్ కాల్నె భాస్కర్లు విగ్రహాలను, పూజ సామాగ్రికి పూజలు నిర్వహించి ఆలయంలోకి తరలించారు. -
కొత్త మలుపు తిరిగిన ఇళ్ల కూల్చివేత
బషీరాబాద్(తాండూరు): బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామంలో ఇళ్ల కూల్చివేత వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఇళ్లు లేకుండా రోడ్డుపాలు చేసిన తనకు న్యాయం చేయాలని బాధితురాలు మ్యాదరి గంగమ్మ గురువారం పోలీసులను ఆశ్రయించింది. నలభై ఏళ్లుగా నివాసముంటున్న తన ఇంటిని సర్పంచ్ భర్త అన్యాయంగా కూల్చివేశారని, అతడిపై చర్య తీసుకోవాలని బషీరాబాద్ ఎస్సై లక్ష్మయ్యకు ఫిర్యాదు చేసింది. అయితే సీసీ రోడ్డు నిర్మాణానికి అడ్డుగా వచ్చిందని కూల్చిన ఇళ్లు గంగమ్మదే అని ఎలాంటి ఆధారాలు చూపలేదని, దీనిపై సమగ్ర విచారణ జరపాల్సి ఉందని ఎస్సై తెలిపారు. మరోవైపు గ్రామంలోని అక్రమ కట్టడాలపై సర్పంచ్ లావణ్య కొరఢా ఝులిపిస్తున్నారు. రోడ్డుపై నిర్మించిన ఇళ్లను గురువారం కూడా కూల్చివేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. -
వృద్ధురాలనే కనికరం లేదా?
బషీరాబాద్(తాండూరు): ఏడు పదులు దాటిన వృద్ధురాలు గం గమ్మ. 40ఏళ్ల కిందట కట్టుకున్న భర్త వదిలేయడంతో నాటి నుంచి పుట్టిన ఊరులోనే నివాసముంటుంది. అయితే రోడ్డు విస్తరణకు ఆ వృ ద్ధురాలి ఇల్లు అడ్డుగా ఉందని గ్రామ సర్పంచ్ భర్త జేసీబీతో ఇంటిని కూల్చేశాడు. దీంతో కట్టుబట్టలతో ఆ వృద్ధురాలు రోడ్డుపాలైంది. ఆ ఇంటి పక్కనే రోడ్డుపై నిర్మించిన ఇళ్ల జోలికి పోలేదు. ఆ వృద్ధురాలికి పలువురు గ్రామ స్తులు బాసటగా నిలిచారు. ఆలస్యంగా వెలు గు చూసిన ఈ సంఘటన బషీరాబాద్ మండ లం ఎక్మాయి గ్రామంలో చోటుచేసుకుంది . సర్పంచ్ భర్తకు అధికారం ఎక్కడిది.. గ్రామానికి చెందిన మ్యాదరి గంగమ్మ(70)కు భర్త, పిల్లలు ఎవరూ లేకపోవడంతో అనాథగా జీవితం కొనసాగిస్తుంది. అయితే ఈ మధ్యే గ్రామానికి ఈజీఎస్ నిధుల ద్వారా సీసీరోడ్డు మంజూరైంది. రోడ్డు నిర్మాణం కోసం గంగమ్మ ఇల్లు అడ్డం వస్తుందని గ్రామ సర్పంచ్ లావణ్య భర్త శ్యామప్ప ఈ నెల 24న జేసీబీతో ఇంటిని నేలమట్టం చేశాడు. కూల్చవద్దంటూ ప్రాధేయపడిన సర్పంచ్ భర్త కనికరించలేదని గంగమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. అసలు సర్పంచ్ భర ్తకు అధికారం ఎక్కడిదని పలువురు గ్రామసు ్తలు ప్రశ్నిస్తున్నారు. చిన్న గల్లీలో అంతర్గత రో డ్డు వేయడానికి ఇల్లు కూల్చడం అవసరం లేద ని చెబుతున్నారు. చివరకు మంగళవారం గ్రా మస్తులే మీడియాకుసమాచారంఅందించారు. -
గూడుకట్టిన వేదన
గూడుగోడు...వినేదెవరు ఆధిపత్య పోరులో నిరాశ్రయులైన నిరుపేదలు శిథిలాల్లోనే భవిష్యత్ వెతుక్కుంటున్న విజయనగర్ కాలనీ వాసులు ఐదు రోజులైనా తొంగిచూడని ప్రజాప్రతినిధులు, అధికారులు న్యాయం జరిగే వరకు కదలబోమంటున్న బాధితులు అనంతపురం న్యూసిటీ: ఐదు రోజుల క్రితం సొంతిల్లుంటే సగం బాధలు పోయినట్లే. అప్పోసొప్పో చేసి, వెనకేసున్న నాలుగు పైసలతో నానా కష్టాలుపడి ఇళ్లు కట్టుకున్నారు. అధికార ప్రజాప్రతినిధుల గ్రూపు రాజకీయాలతో పేదల జీవితాలతో చెలగాటమాడారన్న విమర్శలు వినబడుతున్నాయి. గంటల వ్యవధిలోనే వందల కుటుంబాలు రోడ్డుపాలయ్యాయి. రెవెన్యూ అధికారులు వేకువజామున బలవంతంగా పేదలను నెట్టేసి వారి కళలను చెరిపేశారు. ఇళ్లను కూల్చి ఐదు రోజులు గడుస్తున్నా ఏ ఒక్క ప్రజాప్రతినిధి, అధికారులే అటువైపు వెళ్లలేదు. ఎండనక, వాననక, చిమ్మచీకటిలోనే నిరుపేదలు ఎవరైనా వచ్చి తమను ఆదుకుంటారనని ఎదురుచూస్తున్నారు. శివారు ప్రాంతం కావడంతో విపరీతమైన దోమలు కుట్టడంతో పాటు పురుగుపుట్రా కన్పిస్తున్నాయి. వీరి బాధను చూసిన ఇస్కాన్ వారు రోజూ రెండు పూటల అన్నపానాలు అందిస్తున్నారు. గుడ్డి మబ్బులోనే భోజనం చేస్తున్నారు. ఓరీ దేవుడా నీవేమార్గం చూపాలయ్యాని పేద ప్రజలు వాపోతున్నారు. తమకు న్యాయం జరిగే వరకు కదలమని చెబుతున్నారు.... విజయనగర్ కాలనీ ఎక్స్టెన్షన్లో ఇళ్లు వేసుకుని పాలకులు, అధికార కోపానికి బలైన నిరాశ్రయులు. ఇళ్లు ఏర్పాటు చేసుకునేందుకు వారు పడ్డ తిప్పలు, ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఉన్నారు. వారి మాటల్లోనే... కడుపుమీద కొట్టారు నా కోడలు గాయత్రి ఐదు నెలలు గర్భిణి. ఇళ్ల తొలగించే ముందు అడ్డుపడితే తోపులాటలో సంపులో పడింది. ఓ వైపు కోడలు, మనవరాలు గీతిక ఏడుస్తున్నా బలవంతంగా ఇంటిని పీకేశారు. ఇల్లు కట్టేందుకు రూ. 5 లక్షల వరక ఖర్చైంది. ఇల్లు కట్టుకునేందుకు నాది, నా కోడలు బంగారు(ఏడు తులాలు) తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చాం. నా కొడుకు గోపీ అప్పు చేసి కాస్త డబ్బు తెచ్చాడు. ఇప్పుడేమో ఇటుక పెళ్లలు తప్ప ఏమీ లేదు. ఇంత దారుణం పగవానికి కూడా జరగకూడదు. వీళ్లేం మనుషులయ్యా. కడపుమీద కొట్టారు. – రత్నమ్మ నలుగురు ఆడ పిల్లలు సార్.. కాలు విరగడంతో ఏడాదిగా ఇంట్లోనే ఉంటున్నా. నా భార్య తిరుపాలమ్మే ఆర్డీటీలో పని చేస్తూ కుటుంబాన్ని చూస్తోంది. నాకు నలుగురు పిల్లలు. అనూష, శిరీష, అక్షిత, లిఖిత. ఇక్కడ స్థలమిస్తామంటే రూ 1.80 లక్షలు ఖర్చు చేసి ఇల్లు కట్టుకున్నాను. డ్వాక్రా సంఘంలో రూ. 50 వేలు, వడ్డీకి రూ.60 వేలు అప్పు తెచ్చుకున్నాం. కష్టపడి కట్టుకున్న ఇంటిని ఒక్క రోజులో కూల్చేశారు. ఎవరైనా వచ్చి మాకు న్యాయం చేస్తారానని ఎదురుచూస్తున్నాం. – సుంకన్న, తోపుడుబండిలో కూరగాయలమ్మే వ్యక్తి పిల్లలను చూసేనా దయచూపండి నేను నా తమ్ముడు భరత్ ఇద్దరు కలసి ఇక్కడ ఇళ్లు కట్టుకున్నాం. ఇందుకోసం సంవత్సరాలుగా దాచుకున్న డబ్బుతో పాటు ఫైనాన్స్ తీసుకుని ఇంటికి వెచ్చించా. చూడండి సార్ ఎంత దారుణమో. నాకు ముగ్గురు పిల్లలు, నా తమ్మునికి ఇద్దరు పిల్లలు. మా బాధలు ఎవరితో చెప్పుకోవాలి. రూ. 6 లక్షలతో కట్టిన ఇళ్లును కూల్చేశారు. మేము కోలుకోవాలంటే చాలా ఏళ్లు పడుతుంది. ఈ ఇటుక పెళ్లలమధ్యే పడుకుంటున్నాం. చిన్నపిల్లలను చూసైనా మాపై దయ చూపండి. – జి. హమ్రారావు, టీ కొట్టు నిర్వాహకుడు, రాజస్థానీ ముఖాలు ఎలా చూపించేది? వేణుగోపాల్ నగర్లో నివాసముండే వాళ్లం. నా భర్త వేణుగోపాల్, నేను తోపుడుబండ్లపై స్టీల్ సామాన్ల వ్యాపారం చేసే వాళ్లం. ఇక్కడ ఇళ్లు ఇస్తున్నారని తెలిసి బంధువులు, వడ్డీ వ్యాపారుల నుంచి రూ.4.5 లక్షలు అప్పుగా తెచ్చుకుని ఇళ్లు నిర్మించుకున్నాం. అనంతపురంలోనే సొంతిళ్లు కట్టుకుంటున్నామని ఆనందంపడ్డాం. ఏం చేద్దాం సార్ మా అదృష్టం ఇలా ఏడ్చింది. ఇళ్లను కూల్చేశారు. బంధువులకు ముఖాలు ఏలా చూపించాలి. రాత్రి వేళల్లో పడుకునేందుకు భయమవుతోంది. ముగ్గురు చిన్నపిల్లలున్నారు. ఎవరితో చెప్పుకోవాలి మా బాధ. - పవిత్ర, చిరు వ్యాపారి జెండా మోసినందుకు బాగానే బుద్ధి చెప్పారు పదిహేనేళ్లుగా టీడీపీ కార్యాకర్తగా ఉన్నా. ఇంటికోసం ప్రతిసారి అర్జీలిచ్చి సాలైపోయింది. ఏదో మా ప్రభుత్వం వచ్చిందని ధైర్యంతో రూ 1.70 లక్షల ఖర్చుతో ఇల్లు కట్టుకున్నా. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి జోక్యంతో నా ఇంటిని పీకేశారు. ఇప్పుడు రోడ్డుమీద పడ్డాం. మా పరిస్థితేంటి?టీడీపీ జెండా మోసినందుకు బాగానే బుద్ధి చెప్పారు. –రమణ, టీడీపీ కార్యకర్త ఇంత అన్యాయమా..? నా భర్త జిలాన్ బాషా టీడీపీ కార్యకర్త. ఆటో నడుపుతాడు. నేను టైలర్‌గా గుడ్డలు కుట్టి నాలుగు డబ్బులు సంపాదిస్తున్నా. రూ.లక్ష వరకు అప్పు చేసి ఇళ్లు కట్టుకున్నాం. ఇప్పుడేమో ఉన్నట్లుండి ఇల్లు తొలగించారు. ఇద్దరు పిల్లలు మన్సూర్, నిహాతస్లీం చదువుకుంటున్నారు. అప్పులు కట్టాలా..వారిని చదివించాలా అర్థం కావడం లేదు. రాత్రి వేళల్లో నిరాశ్రయులమైన మా అవస్థలు దేవునికెరుక. ఇక్కడే వేసిన టెంట్ కిందే పడుకుంటున్నాం. ఇంత ఘోరం ఎక్కడా లేదయ్యా. - హబీబా, టైలర్ న్యాయం చేసే వరకు వెళ్లేది లేదు నా భర్త నగేష్ అనారోగ్యంతో ఏడాదిన్నర క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి ఇళ్లలో పని చేసి పిల్లలు అనిల్‌కుమార్, నందకిషోర్‌ను చదివించుకుంటున్నా. కూలి పని చేసి సంపాదించిన సొమ్ముతో పాటు రూ.1.5 లక్షలు అప్పు చేసి ఇళ్లు కట్టించుకున్నా. ఇప్పుడేమో ఇళ్లను కూల్చేశారు. నాకు దిక్కెవరు. పిల్లలను ఏవిధంగా చూసుకోవాలి. అప్పు ఎలా తీర్చాలి. ఇల్లు కూల్చేముందు ‘అయ్యా మీ కాళ్లు పట్టుకుంటా. కూల్చొద్దండి’ అని వేడుకున్నా. పక్కకు నెట్టి కూల్చేశారు. నాకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదు. – భారతి, వితంతువు -
వైఎస్ఆర్ సీపీ నేత ఇల్లు కూల్చివేతపై నోటీసులు
►యథాతథస్థితి కొనసాగించాలని ప్రభుత్వానికి ఆదేశం ►వివరణ ఇవ్వాలని అధికారులకు నోటీసులు ►తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా హైదరాబాద్ : కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వి.సాంబిరెడ్డి ఇంటి కూల్చివేతపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ఈ కూల్చివేత వ్యవహారంలో యథాతథస్థితిని కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సాంబిరెడ్డి చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ ఏపీ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కృష్ణా జిల్లా పంచాయతీ అధికారి, తేలప్రోలు గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఉంగుటూరు తహసీల్దార్లకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ రెండు వారాలు వాయిదా వేశారు. తన ఇల్లు పంచాయతీ స్థలంలో ఉందంటూ తన ఇంటిని కూల్చేసేందుకు గ్రామ పంచాయతీ నోటీసు ఇచ్చిందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కావడంతోనే పంచాయతీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ తేలప్రోలు గ్రామానికి చెందిన సాంబిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గురువారం న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, పిటిషనర్‌ది గ్రామకంఠంలో ఉన్న ఇల్లని తెలిపారు. 50 ఏళ్లుగా ఇంటి పన్ను, కరెంటు బిల్లు చెల్లిస్తున్నారని తెలిపారు. అయితే ఇల్లు గ్రామపంచాయతీ స్థలంలో ఉందని, దానిని ఖాళీ చేయకపోతే ఈ నెల 30న కూల్చేస్తామని ఈ నెల 27న పంచాయతీ కార్యదర్శి నోటీసులు ఇచ్చారన్నారు. పక్కనే ఉన్న మరో ఇంటినిగానీ, గ్రంథాలయం జోలికి పంచాయతీ అధికారులు వెళ్లకుండా ఉద్దేశపూర్వకంగా సాంబిరెడ్డికి మాత్రమే నోటీసు ఇచ్చారని ఆయన హైకోర్టు దృష్టికి తెచ్చారు. సర్పంచ్ కావాలనే ఈ విధంగా కక్షసాధింపు చర్యలు పూనుకుంటున్నారని, ఇంటిని కూల్చాలన్న ఏకైక లక్ష్యంతోనే 30 నుంచి గ్రామంలో 144 సెక్షన్ విధించారని, గ్రామకంఠం అంటే పంచాయతీ భూమి కాదని గతంలో హైకోర్టు తీర్పు కూడా చెప్పిందని పొన్నవోలు వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి సాంబిరెడ్డి ఇల్లు కూల్చివేత వ్యవహారంలో యథాతథస్థితి (స్టేటస్కో) కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలు వాయిదా వేశారు. -
ఎస్ఆర్ నగర్ ఇళ్ల కూల్చివేతపై స్టేటస్ కో
సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఎస్ఆర్ నగర్లో ఇళ్ల కూల్చివేతపై ఉమ్మడి హైకోర్టు యథాతథ స్థితిని (స్టేటస్ కో) కొనసాగించాలని అధికారులను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ ఎస్.వి.భట్ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఆర్ నగర్లో మూడు దశాబ్దాలకు పైగా నివాసం ఉంటున్న తమకు అధికారులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేస్తున్నారంటూ కె.రాజు మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది బూర రమేశ్ వాదనలు వినిపిస్తూ, అధికారులు రెండు పడక గదుల ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నా వారి ఇళ్లను మాత్రమే కూల్చివేస్తామని హామీ ఇచ్చి, ఆకస్మాత్తుగా వచ్చి 40 ఇళ్ల వరకు కూల్చివేశారని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. -
అడ్డగోలు మార్కింగ్లతో ఇళ్ల కూల్చివేత
తుళ్ళూరు : రహదారుల వెంట ఆక్రమణల తొలగింపులో అధికారులు అడ్డగోలుగా మార్కింగ్ చేయడంతో పలువురు నివాసాలు కోల్పోయి వీధిన పడుతున్నారు. నవ్యాంధ్ర రాజధాని ప్రధాన కేంద్రమైన తుళ్ళూరులో ఆక్రమణల తొలగింపునకు సీఆర్డీఏ అధికారులు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు రాజధాని గ్రామాలను సుందరీకరణ చేయాలని అధికారులకు ఇచ్చిన ఆదేశాల మేరకు తుళ్ళూరు మండలంలోని పెదపరిమి, మందడం, వెలగపూడి, రాయపూడి గ్రామాలలో రహదారుల వెంట వున్న ఆక్రమణలను సీఆర్డీఏ అధికారులు తొలగించారు. మండలకేంద్రమైన తుళ్ళూరులో గత వారం రోజులుగా జరుగుతున్న ఆక్రమణల తొలగింపు వివాదాలకు దారి తీసింది. తుళ్ళూరు ఎస్సీ కాలనీలో రెవెన్యూ సర్వేయర్ల తప్పుడు లెక్కలతో నాలుగు అడుగులు ఎక్కువ దూరం మార్కింగ్ ఇవ్వడంతో అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. గత 50 సంవత్సరాలుగా పంచాయితీకి పన్నులు కూడా కడుతున్నామని, అధికారులు వచ్చి ఈ స్థలాలు ప్రభుత్వానివేనంటూ నివాసాలు తొలగించారని కాలనీకి చెందిన వృద్ధురాలు మరియమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. తమకు ఉన్న గూడు పడగొట్టారని, తాను ఎలా బతకాలని ఆమె రోదిస్తోంది. స్థానికులు అధికారులను నిలదీయడంతో సోమవారం మరోసారి సర్వే చేసిన అధికారులు పొరపాటు జరిగిందంటూ పాత మార్కింగ్‌ను కొట్టివేసి, నాలుగు అడుగులు వెనక్కి కొత్తగా మార్కింగ్ ఇచ్చారు. దీంతో తప్పుడు మార్కింగ్‌తో తాము ఇళ్లు కోల్పోయామని పలువురు కన్నీటి పర్యంతమవుతున్నారు. చెండాచెట్టు కూడా తొలగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ప్రత్యామ్నాయం చూపాలని తుళ్ళూరు ముస్లింలు అధికారులను కోరుతున్నారు. దశాబ్దాలుగా నివాసాలు ఉంటున్న పేదలను అర్ధంతరంగా ఖాళీచేయిస్తే వారు ఎలా బతకాలని వైఎస్సార్సీపీ తాడికొండ నియోజకవర్గ నాయకుడు కత్తెర సురేష్‌కుమార్ అధికారులను ప్రశ్నిస్తున్నారు. అధికారులు మానవతా ధర్మంతో బాధితులను ఆదుకోవాలని, లేకుంటే బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు : తహశీల్దార్ దీనిపై తుళ్ళూరు తహశీల్దార్ సుధీర్‌బాబును వివరణ కోరగా సాధ్యమైనంత వరకు అందరికీ ముందస్తు సమాచారం ఇచ్చామని, ఎవ్వరినీ ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదన్నారు. ఎవరికైనా సొంతస్థలాలు, ఆస్తుల నష్టం జరిగితే నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అవసరమైతే రీ సర్వే చేయిస్తామని వివరణ ఇచ్చారు. -
ఇల్లు కూల్చివేతలో హైడ్రామా
- నాలుగు గంటలు ఉత్కంఠ - బాధితుడు మాజీ మంత్రి బలరాం నాయక్ అనుచరుడు ములుగు : మాజీ మంత్రి బలరాంనాయక్ అనుచరుడు పోరిక రాజు నాయక్ ఇంటి కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. నాలుగు గంటలు హైడ్రామా నడిచిం ది. స్థానికంగా కో- ఆపరేటివ్ స్థలం( సర్వే నంబరు 1197)లో పోరిక రాజునాయక్ అక్రమంగా ఇల్లు నిర్మించుకున్నాడని శనివారం ఆ ఇంటిని కూల్చేందు కు శాఖ అధికారులు వచ్చారు. రాజునాయక్ భార్య, కుమారులు తీవ్రంగా ప్రతిఘటించారు. హైకోర్టు స్టే ఆర్డర్‌ను చూపించినా ఇల్లు కూల్చేశారు. ఆత్మహత్యకు యత్నాలు.. కూల్చివేతను నిరసిస్తూ రాజునాయక్ కుమారులు ఇద్దరు బుల్డోజర్ టైర్ల కింద పడుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. రాజు భార్య సొమ్మసిల్లింది. పోరిక రాజునాయక్ ఇంటిపెకైకి ్క కిరోసిన్ పోసుకుని తగటబెట్టుకునేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుని ఆస్పత్రికి తరలించారు. తర్వాత లాయర్ , కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మస్రగాని వినయ్‌కుమార్ వచ్చి కోర్టు స్టే కాపీలను తహసీల్దార్, సబ్ డివిజనల్ కో -ఆపరేటివ్ అధికారికి చూపించారు. గంటపాటు అధికారులు వెనక్కి తగ్గారు. సాయంత్రం రాజునాయక్ ఇంటికి రాగానే అధికారులు మళ్లీ కూల్చివేతకు ఉపక్రమించారు. దీంతో రాజునాయక్ కుటుంబం పురుగుల మందు తాగేందుకు యత్నిం చింది. వీరిని ఠాణాకు తరలించి జేసీబీతో ఇల్లు కూల్చేశారు. కోర్టు స్టే ఉన్నా ఎలా కూల్చుతారని మాజీ ఎంపీపీ నల్లెల్ల కుమారస్వామి మండిపడ్డారు. కలెక్టర్ నుంచి ఆదేశాలున్నారుు: డీఎల్పీఓ హైకోర్టు స్టేతో తమకు సంబంధం లేదని, కోర్టు నుం చి తమకెలాంటిఆదేశాలు రాలేదని డీఎల్సీఓ లచ్చ య్య స్పష్టంచేశారు. శాఖ భూమిలో అక్రమంగా ఇల్లు కట్టారని అందిన ఫిర్యాదు మేరకు ఆ ఇంటిని కూల్చేయూలని కలెక్టర్ ఆదేశించారని చెప్పారు. కాగా, 12వ తేదీన జారీ చేసిన నోటీసులను తెచ్చి శనివారం ఉదయం తమతో బలవంతంగా సంతకం తీసుకున్నారని బాధిత కుటుంబం ఆరోపించింది. ఈ భూమి మాదే కాగా, ఈ స్థలం తమదేనని సబ్ డివిజనల్ కో-ఆపరేటివ్ అధికారి కరుణాసాగర్ తెలిపారు. సర్వే నంబరు 1197లో సొసైటీకి చెందిన 2. 20 ఎకరాల్లో 1965లో రైస్‌మిల్లు గోదాం ఉండేదని, ఈ భూమి అంతా సొసైటీ పేరుమీద రిజిస్టర్ అయిందని చెప్పారు. పోరిక రాజునాయక్ సర్వే నంబర్ మార్చి అయిదన్నర గుంటల భూమిలో ఇంటి నిర్మాణం చేశాడని ఆరోపించారు. మొదటి నుంచి అతనికి హెచ్చరికలు జారీ చేస్తున్నాం విన్పించుకోలేదని, అందుకే కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఈ మేరకు ఇల్లు కూల్చేందుకు కలెక్టర్ ఆదేశించారని ఆయన వివరించారు. కక్షతోనే కూల్చివేత తనపై కక్షతోనే ఇంటి కూల్చివేతకు దిగారని బాధితుడు పోరిక రాజునాయక్ ఆరోపించారు. గిరిజనశాఖ మంత్రి అజ్మీర చందూలాల్‌తో గతంలో తనకు గొడవ జరిగిందని, అది మనసులో పెట్టుకునే ఈ పని చేరుుస్తున్నాడని పేర్కొన్నాడు. ఇల్లు కూల్చివేతతో తాను కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఎండీ అంకూష్ నుంచి ఈ స్థలాన్ని తన తండ్రి కొన్నాడని, పూర్తి పత్రాలు తమ దగ్గర ఉన్నాయని వివరించారు.