ఆగని టీడీపీ విధ్వంసం | House of YSRCP fan demolished in Sullurpet | Sakshi
Sakshi News home page

ఆగని టీడీపీ విధ్వంసం

Published Sat, Jul 13 2024 6:00 AM | Last Updated on Sat, Jul 13 2024 6:00 AM

House of YSRCP fan demolished in Sullurpet

తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో వైఎస్సార్‌సీపీ అభిమాని ఇల్లు కూల్చివేత 

శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో వైఎస్సార్‌ విగ్రహం ధ్వంసం 

సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నేతలు, కార్యకర్తల విధ్వంసం కొనసాగుతూనే ఉంది. గురు, శుక్రవారాల్లో అధికారుల మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి ఇళ్లు, ఇళ్ల పునాదుల్ని ధ్వంసం చేయించారు. వైఎ­స్సార్‌సీపీ ఫ్లెక్సీలను తీయించేశారు. డివైడర్‌ను, బస్‌ షెల్టర్‌ను, పిల్లర్లను ధ్వంసం చేశారు. దివంగత ముఖ్య­మంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పగులగొట్టారు. 

»  తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో వైఎస్సార్‌సీపీకి చెందిన నిరుపేద వంకా సుధాకర్‌ నిర్మిస్తున్న ఇంటిని టీడీపీ ఒత్తిడితో అధికారులు కూల్చేశారు. స్థానిక చెరువులో సుధాకర్‌ అక్కడ ఇల్లు నిర్మించుకుంటున్నాడు. ఇప్పటికే సుమారు రూ.8 లక్షలు వెచ్చించి గోడలు కట్టుకున్నాడు. కొందరు టీడీపీ నాయకులు, కొంత మీడియా వారు అది కూల్చే­యా­ల్సిందేనని అధికారుల మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. అక్కడున్న మిగిలిన ఇళ్లనుగానీ, పట్టణంలో ఉన్న పలు ఆక్రమణ­లనుగానీ పట్టించుకోని అధికారులు సుధాకర్‌ నిర్మించుకుంటున్న ఇంటిని జేసీబీతో కూల్చేశారు. 

»   ఏలూరు జిల్లా నూజివీడు మండలం పల్లెర్లమూ­డి­లో టీడీపీ కార్యకర్తలు పేట్రేగిపోయారు. వైఎస్సా­­ర్‌­ï­Üపీ ప్రభుత్వ హయాంలో కోనేటి చెరువు వద్ద రోడ్డును వెడల్పు చేసి ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో డివైడర్‌ నిర్మించారు. ఈ డివైడర్‌ను టీడీపీ వారు పొక్లెయిన్‌తో ధ్వంసం చేసి తొలగించారు. దీంతో­పాటు పాత బస్‌ షెల్టర్‌ను, నూత­నంగా నిర్మిస్తున్న బస్‌ షెల్టర్‌ పిల్లర్లను కూల్చే­శారు. 

»    శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. జెడ్పీటీసీ సభ్యుడు గోవిందరెడ్డి, మండలంలోని అన్ని గ్రామాల వైఎ­స్సార్‌సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్య­కర్తలు, అభిమానులు చెన్నేకొత్తపల్లి చేరుకుని వైఎ­స్సార్‌ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 

ఎస్‌ఐ వెంకటేశ్వర్లు నిరసన తెలుపుతున్న వారివద్దకు చేరుకుని.. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పోలీస్‌­స్టేషన్‌ వరకు ర్యాలీగా వెళ్లి సీఐ శివాంజనేయు­లుకు ఫిర్యాదు చేశారు. దుండగులు ధ్వంసం చేసిన వైఎస్సార్‌ విగ్రహం స్థానంలో ఒకటిరెండు రోజుల్లో నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని నాయకులు తెలిపారు.

» శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం తుల­సిగాం పంచాయతీ జగనన్న కాలనీలో పునా­దులను అధికార పార్టీ నాయకులు ధ్వంసం చేయించారు. జగనన్న ఇళ్ల కోసం ఈ సచివా­లయం పరిధిలోని కొయ్య మోహిని, త్రివేణీ బడియా, బాకి భవానీ, కొండ మోహిని, నందికి శ్రావణి, లండ చందరమ్మ సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నారు.  గత ఏడాది డిసెంబర్‌ 30న అప్పటి తహసీల్దార్‌ పి.మీనాదేవి అనుమతి ఇచ్చారు. వారు ఆ స్థలాల్లో పునాదులు వేసు­కున్నారు. దీనిపై స్థానిక టీడీపీ నాయకులు అక్రమ కట్టడాలు అంటూ రెవెన్యూ అధికారులకు అప్పట్లో ఫిర్యాదు చేశారు. 

కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ఇళ్లపై గత నెల 25న ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ఆ కట్టడాలను పరిశీలించి రెవెన్యూ సిబ్బందితో మాట్లాడారు. ఈ క్రమంలోనే శుక్రవారం రెవెన్యూ అధికారులు చూడా­మణిరెడ్డి, వీఆర్వో సాలిన కృష్ణ, మండల సర్వే­యర్‌ తవి­టినాయుడు ఆధ్వర్యంలో జేసీబీతో పునాదులను నేలమట్టం చేశారు.

విషయం తెలు­సుకున్న సర్పంచ్‌ ప్రతినిధి ఇసురు తులí­Üరాం, బాధిత లబ్ధిదారులు అక్కడికి చేరుకుని కూల్చి­వేతల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ అంశంపై స్థానిక తహసీల్దార్‌ ఎం.భాస్కర అప్పారావును వివరణ కోరగా.. గతంలో పనిచేసిన తహసీల్దార్‌ ఇళ్లను మంజూరు చేయడం వాస్తవమేనని చెప్పారు. వారికి వారం రోజుల్లో మరోచోట ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement