ఇల్లు కూల్చివేతలో హైడ్రామా
- నాలుగు గంటలు ఉత్కంఠ
- బాధితుడు మాజీ మంత్రి బలరాం నాయక్ అనుచరుడు
ములుగు : మాజీ మంత్రి బలరాంనాయక్ అనుచరుడు పోరిక రాజు నాయక్ ఇంటి కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. నాలుగు గంటలు హైడ్రామా నడిచిం ది. స్థానికంగా కో- ఆపరేటివ్ స్థలం( సర్వే నంబరు 1197)లో పోరిక రాజునాయక్ అక్రమంగా ఇల్లు నిర్మించుకున్నాడని శనివారం ఆ ఇంటిని కూల్చేందు కు శాఖ అధికారులు వచ్చారు. రాజునాయక్ భార్య, కుమారులు తీవ్రంగా ప్రతిఘటించారు. హైకోర్టు స్టే ఆర్డర్‌ను చూపించినా ఇల్లు కూల్చేశారు.
ఆత్మహత్యకు యత్నాలు..
కూల్చివేతను నిరసిస్తూ రాజునాయక్ కుమారులు ఇద్దరు బుల్డోజర్ టైర్ల కింద పడుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. రాజు భార్య సొమ్మసిల్లింది. పోరిక రాజునాయక్ ఇంటిపెకైకి ్క కిరోసిన్ పోసుకుని తగటబెట్టుకునేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుని ఆస్పత్రికి తరలించారు. తర్వాత లాయర్ , కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మస్రగాని వినయ్‌కుమార్ వచ్చి కోర్టు స్టే కాపీలను తహసీల్దార్, సబ్ డివిజనల్ కో -ఆపరేటివ్ అధికారికి చూపించారు. గంటపాటు అధికారులు వెనక్కి తగ్గారు. సాయంత్రం రాజునాయక్ ఇంటికి రాగానే అధికారులు మళ్లీ కూల్చివేతకు ఉపక్రమించారు. దీంతో రాజునాయక్ కుటుంబం పురుగుల మందు తాగేందుకు యత్నిం చింది. వీరిని ఠాణాకు తరలించి జేసీబీతో ఇల్లు కూల్చేశారు. కోర్టు స్టే ఉన్నా ఎలా కూల్చుతారని మాజీ ఎంపీపీ నల్లెల్ల కుమారస్వామి మండిపడ్డారు.
కలెక్టర్ నుంచి ఆదేశాలున్నారుు: డీఎల్పీఓ
హైకోర్టు స్టేతో తమకు సంబంధం లేదని, కోర్టు నుం చి తమకెలాంటిఆదేశాలు రాలేదని డీఎల్సీఓ లచ్చ య్య స్పష్టంచేశారు. శాఖ భూమిలో అక్రమంగా ఇల్లు కట్టారని అందిన ఫిర్యాదు మేరకు ఆ ఇంటిని కూల్చేయూలని కలెక్టర్ ఆదేశించారని చెప్పారు. కాగా, 12వ తేదీన జారీ చేసిన నోటీసులను తెచ్చి శనివారం ఉదయం తమతో బలవంతంగా సంతకం తీసుకున్నారని బాధిత కుటుంబం ఆరోపించింది.
ఈ భూమి మాదే
కాగా, ఈ స్థలం తమదేనని సబ్ డివిజనల్ కో-ఆపరేటివ్ అధికారి కరుణాసాగర్ తెలిపారు. సర్వే నంబరు 1197లో సొసైటీకి చెందిన 2. 20 ఎకరాల్లో 1965లో రైస్‌మిల్లు గోదాం ఉండేదని, ఈ భూమి అంతా సొసైటీ పేరుమీద రిజిస్టర్ అయిందని చెప్పారు. పోరిక రాజునాయక్ సర్వే నంబర్ మార్చి అయిదన్నర గుంటల భూమిలో ఇంటి నిర్మాణం చేశాడని ఆరోపించారు. మొదటి నుంచి అతనికి హెచ్చరికలు జారీ చేస్తున్నాం విన్పించుకోలేదని, అందుకే కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఈ మేరకు ఇల్లు కూల్చేందుకు కలెక్టర్ ఆదేశించారని ఆయన వివరించారు.
కక్షతోనే కూల్చివేత
తనపై కక్షతోనే ఇంటి కూల్చివేతకు దిగారని బాధితుడు పోరిక రాజునాయక్ ఆరోపించారు. గిరిజనశాఖ మంత్రి అజ్మీర చందూలాల్‌తో గతంలో తనకు గొడవ జరిగిందని, అది మనసులో పెట్టుకునే ఈ పని చేరుుస్తున్నాడని పేర్కొన్నాడు. ఇల్లు కూల్చివేతతో తాను కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఎండీ అంకూష్ నుంచి ఈ స్థలాన్ని తన తండ్రి కొన్నాడని, పూర్తి పత్రాలు తమ దగ్గర ఉన్నాయని వివరించారు.