కూల్చేసిన ఇంటివద్ద గంగమ్మ
బషీరాబాద్(తాండూరు): ఏడు పదులు దాటిన వృద్ధురాలు గం గమ్మ. 40ఏళ్ల కిందట కట్టుకున్న భర్త వదిలేయడంతో నాటి నుంచి పుట్టిన ఊరులోనే నివాసముంటుంది. అయితే రోడ్డు విస్తరణకు ఆ వృ ద్ధురాలి ఇల్లు అడ్డుగా ఉందని గ్రామ సర్పంచ్ భర్త జేసీబీతో ఇంటిని కూల్చేశాడు. దీంతో కట్టుబట్టలతో ఆ వృద్ధురాలు రోడ్డుపాలైంది. ఆ ఇంటి పక్కనే రోడ్డుపై నిర్మించిన ఇళ్ల జోలికి పోలేదు. ఆ వృద్ధురాలికి పలువురు గ్రామ స్తులు బాసటగా నిలిచారు. ఆలస్యంగా వెలు గు చూసిన ఈ సంఘటన బషీరాబాద్ మండ లం ఎక్మాయి గ్రామంలో చోటుచేసుకుంది
. సర్పంచ్ భర్తకు అధికారం ఎక్కడిది.. గ్రామానికి చెందిన మ్యాదరి గంగమ్మ(70)కు భర్త, పిల్లలు ఎవరూ లేకపోవడంతో అనాథగా జీవితం కొనసాగిస్తుంది. అయితే ఈ మధ్యే గ్రామానికి ఈజీఎస్ నిధుల ద్వారా సీసీరోడ్డు మంజూరైంది. రోడ్డు నిర్మాణం కోసం గంగమ్మ ఇల్లు అడ్డం వస్తుందని గ్రామ సర్పంచ్ లావణ్య భర్త శ్యామప్ప ఈ నెల 24న జేసీబీతో ఇంటిని నేలమట్టం చేశాడు. కూల్చవద్దంటూ ప్రాధేయపడిన సర్పంచ్ భర్త కనికరించలేదని గంగమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. అసలు సర్పంచ్ భర ్తకు అధికారం ఎక్కడిదని పలువురు గ్రామసు ్తలు ప్రశ్నిస్తున్నారు. చిన్న గల్లీలో అంతర్గత రో డ్డు వేయడానికి ఇల్లు కూల్చడం అవసరం లేద ని చెబుతున్నారు. చివరకు మంగళవారం గ్రా మస్తులే మీడియాకుసమాచారంఅందించారు.
Comments
Please login to add a commentAdd a comment