సాక్షి, చెన్నై: నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ నర్సు నిమిషాల వ్యవధిలో రెండుసార్లు కరోనా టీకా వేయడంతో ఓ వృద్ధురాలు స్పృహ తప్పింది. ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వివరాలు.. కడలూరు జిల్లా పెన్నాడం ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ వేసుకునేందుకు అదే ప్రాంతానికి చెందిన సుబ్రమణ్యం భార్య లక్ష్మి (55) సోమవారం వచ్చారు. తొలుత ఆమెకు నర్సు వ్యాక్సిన్ వేశారు.
వెనువెంటనే సహచర నర్సుతో మాట్లాడుతూ మరో టీకా కూడా వేశారు. ఒకే సమయంలో తనకు రెండు సార్లు టీకా ఎందుకు వేస్తున్నారని లక్ష్మి ప్రశ్నించినా ఆ నర్సు ఖాతరు చేయలేదు. దీంతో లక్ష్మి స్పహ తప్పింది. ఆమెకు ప్రథమ చికిత్స చేశారు. ఓ టీకా మాత్రమే వేసినట్టుగా నర్సు వాదించినా, బాధితురాలి చేతి నుంచి రెండు చోట్ల రక్తం వస్తుండడంతో ఉన్నతాధికారులు స్పందించారు. సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో లక్ష్మిని ఉంచారు. ఈఘటనపై ఆరోగ్య శాఖ వర్గాలు దర్యాప్తు చేపట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment