బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అధికారిక పత్రాలపై ఎరేజబుల్ (చెరిపివేయదగిన) ఇంక్ పెన్నులను వాడుతారని గార్డియన్ పత్రిక తెలిపింది. దీంతో అధికారిక పత్రాల భద్రత అంశాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఛాన్సలర్‌గా పనిచేసినప్పుడు కూడా అవే పెన్నులను రిషి సునాక్ ఉపయోగించినట్లు గార్డియన్ తన నివేదికలో వెల్లడించింది. చెరిపివేయదగిన ఇంక్ పెన్నులను వాడితే.. అధికారిక పత్రాలపై రాతలను తారుమారు చేసే అవకాశం ఉండకపోదని నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు. చరిత్ర గుర్తుంచుకోవాల్సిన పత్రాలపై అలాంటి పెన్నుల వాడకాన్ని విమర్శిస్తున్నారు.
రిషి సునాక్ ఉపయోగించే పెన్నులు యూకేలో ఒక్కోటి రూ.495 ఖరీదు ఉంటాయి. వాటిపై ఎరేజబుల్ అనే లోగో కూడా ఉంటుందని గార్డియన్ వెల్లడించింది. ఇంక్‌తో రాయడం నేర్చుకునేవారికి ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే తప్పు రాస్తే ఎరాడికేటర్లతో వెంటనే చెరిపివేసుకోవచ్చు. ఈ ఉద్దేశంతోనే ఆ సంస్థ కూడా మార్కెటింగ్ చేస్తుందని గార్డియన్ పేర్కొంది.
రిషి సునాక్ అధికారిక కార్యదర్శి మాత్రం ఈ విషయాన్ని ఖండించారు. సునాక్ వాడుతున్న పెన్నులు బ్రిటన్‌లో సివిల్ సర్వీస్ ఉద్యోగులు వాడుతున్నట్లు చెప్పారు. ఉద్యోగులకు ఆ పెన్నులనే పంపిస్తున్నామని అన్నారు. చెరిగిపోయే పనులను ప్రధాని రిషి సునాక్ ఎన్నటికీ చేయరని స్పష్టం చేశారు.
అయితే.. గతంలో క్యాబినెట్‌లో రిషి సునాక్ ఎరేజబుల్ పెన్నులను ఉపయోగిస్తున్న ఫొటోలు కూడా బయటకు ప్రచారం అయ్యాయి. పలు అధికారిక సమావేశంలోనూ ఆ పెన్నులను ఉపయోగిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై అన్‌లాక్ డెమోక్రసీ గ్రూప్ అధ్యక్షుడు టామ్ బ్రేక్ ప్రజల నమ్మకాలను తుడిచేయడమే ఆ పెన్నుల వాడకానికి ఉద్దేశమని విమర్శించారు. రాజకీయ నాయకుల మాటలకు నమ్మకం తక్కువ. ఎరేజబుల్ ఇంక్ పెన్నుల వాడకంతో ఆ నమ్మకం ఇక పాతాళానికి చేరుతుందని అన్నారు.
ఇదీ చదవండి: 'కరోనా వైరస్ అక్కడి నుంచే..' వుహాన్ ల్యాబ్ పరిశోధకుడు సంచలన వ్యాఖ్యలు..
Comments
Please login to add a commentAdd a comment