Controversy Around Rishi Sunak Over Costly Swimming Pool - Sakshi
Sakshi News home page

ఈ టైంలో అవసరమా? వివాదంలో రిషి సునాక్! నాలుగు కోట్లతో చేస్తున్న పనిపై ప్రజాగ్రహం

Published Mon, Aug 15 2022 10:44 AM | Last Updated on Mon, Aug 15 2022 11:00 AM

Controversy Around Rishi Sunak Over Costly Swimming Pool - Sakshi

లండన్‌: యూకే ప్రధాని ఎన్నికలకు మరో నెలరోజుల టైం కూడా లేదు. మాజీ చాన్స్‌లర్ రిషి సునాక్‌, యూకే ఫారిన్‌ సెక్రెటరీ లిజ్‌ ట్రస్‌ ప్రధాని రేసులో తుదిగా మిగిలారు. లిజ్‌ ట్రస్‌ పైచేయి సాధిస్తూ వెళ్తుండగా..  ఈలోపు భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ చుట్టూ వివాదాలు, విమర్శలు అల్లుకుంటున్నాయి. 

యూకే ప్రధాని రేసులో నిలిచిన రిషి సునాక్‌ని ఇరకాటంలో పడేసేందుకు అక్కడి మీడియా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఆయన లైఫ్‌ స్టైల్‌లోని ప్రతీ అంశాన్ని తెర మీదకు తెస్తోంది. తాజాగా.. ఆయన తన మాన్షన్‌లో ఏర్పాటు చేసుకున్న స్విమ్మింగ్‌పూల్‌ను వివాదానికి కేంద్రంగా మార్చేశాయి అక్కడి మీడియా హౌజ్‌లు. ఇందులో వివాదం ఏముంది అంటారా? ప్రస్తుతం యూకేలో వడగాల్పులు, కరువుతో తీవ్ర నీటిఎద్దడి తాండవిస్తోంది కాబట్టి. 

ది ఇండిపెండెంట్‌ కథనం ప్రకారం.. నార్త్‌ యార్క్‌షైర్‌లో సునాక్‌కు ఓ మాన్షన్‌ ఉంది. వీకెండ్‌లలో ఆయన, భార్య అక్షత మూర్తి, పిల్లలతో కలిసి అక్కడికి వెళ్తుంటారు.  అయితే ఏరియల్‌ ఫుటేజీల ద్వారా అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులకు సంబంధించిన ఫొటోలను ప్రముఖంగా ప్రచురించింది ది ఇండిపెండెంట్‌. అంతేకాదు ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలోనూ విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. ఆ పట్టణంలోని స్విమ్మింగ్‌ పూల్స్‌ను బలవంతంగా అధికారులు మూసేసిన విషయాన్ని సైతం లేవనెత్తుతున్నారు కొందరు. నీటి కొరత ఉన్న సమయంలో.. ఇలా భారీగా ఖర్చు చేపట్టి స్విమ్మింగ్‌ పూల్‌ నిర్మాణం చేపట్టడం పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. 

అయితే ఈ కుటుంబం ఈమధ్యకాలంలో ఇలా వరుసగా వివాదాలు, విమర్శల్లో చిక్కుకుంటోంది. రిషి సునాక్‌ భార్య అక్షత మూర్తి.. తన ఇంటికి వచ్చిన జర్నలిస్టులకు టీ ని స్వయంగా ఇచ్చారు. అయితే అందుకోసం కాస్ట్‌లీ కప్పులు, ట్రేను ఉపయోగించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. పన్నుల పెంపు వల్ల ప్రజా జీవనం భారంగా మారిన ఇలాంటి సమయంలో.. ఇలాంటి కాస్ట్‌లీ చేష్టలు అవసరమా? అంటూ నిందించారు ఆమెను.

ఇదీ చదవండి: భార్యకాని భార్య.. భర్తకానీ భర్త.. ఇదేం పెళ్లి!!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement